
సాక్షి, న్యూఢిల్లీ : అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్‌ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.819కు పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర మరో రూ .95 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది. దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం.
హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మండుతున్న పెట్రోలు డీజిల ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment