lpg price hiked
-
పెరిగిన గ్యాస్ ధర.. వరుసగా నాలుగోసారి..
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్పీజీ ధరలు పెరిగాయి.ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది. -
దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!
ఇప్పటికే పెరిగి పోతున్న పెట్రోల్, డీజిల్, వంటనూనె, ఉల్లిపాయ ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. వచ్చేవారం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సారి అంతా.. ఇంతా కాదు ఏకంగా రూ.100 వరకు పెరగొచ్చని కొన్ని వర్గాలు సామాన్య ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. కేంద్రం అనుమతిస్తే ధరల పెంపు ఉండే అవకాశం ఉంది అని సమాచారం. అదే జరిగితే అన్ని కేటగిరీల్లో వంట గ్యాస్ రేట్లు పెరగడం ఇది ఐదవ సారి. అక్టోబర్ 6న 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ఎల్పీజీ ధర రూ.950కి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది. కేవలం జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.90కి పెరిగింది. ఎల్పీజీపై గత ఏడాది నుంచి కేంద్రం రాయితీలను ఎత్తివేసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, ధరలు పెరుగుదలకు అమ్మకాలకు మధ్య ఉన్న అంతరాన్ని భరించేందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. (చదవండి: మార్కెట్లోకి శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో.. ధర ఎంతో తెలుసా?) అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్టా స్థాయికి పెరగడంతో ఎల్పీజీ అమ్మకాలపై నష్టాలు సిలిండర్‌కు రూ.100కు పైగా పెరిగినట్లు వారు తెలిపారు. సౌదీ ఎల్పీజీ రేట్లు ఈ నెలలో టన్నుకు 60 శాతం పెరిగి 800 డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 85.42 అమెరికన్ డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాయితీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో చమరు కంపెనీలు ఆ భారాన్ని మేయలని పేర్కొంటున్నాయి. లేకపోతే, ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దం అవుతున్నాయి. గతంలో సిలిండర్‌పై కేంద్రం మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ సరిపెడుతోంది. దాంతో, ఇంట్లో గ్యాస్ ముట్టించాలంటేనే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మళ్లీ షాక్!
పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25పైగా పెంచడంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5కు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.834.50గా ఉండేది. అంతకు ముందు జూలై 1న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 గా ఉంది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.861 నుంచి రూ.886కు పెరిగింది. ఈ రోజు నుంచి చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.850.50 నుంచి రూ.875.50కు పెరిగింది. హైదరాబాద్‌లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్పీజీ ధర) ధరలను మారుస్తాయి. 2021 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో దేశీయ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.859.5కు పెరిగింది. అంటే ఏడాదిలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.165.50 పెరిగాయి. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.819కు పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర మరో రూ .95 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది. దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం. హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మండుతున్న పెట్రోలు డీజిల ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. -
సామాన్యుడి నడ్డి విరిచేలా.. ఒక నెలలోనే ‘వంద’
సాక్షి, అమరావతి: సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్ సిలిండర్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచాయి. దీంతో వంటింట్లో గ్యాస్ బండ సామాన్యులకు మోయలేని భారంగా మారుతోంది. ఒక్కో సిలిండర్‌పై ఈ నెల 4వ తేదీన రూ.25, 15న రూ.50 పెంచగా ప్రస్తుతం మరో రూ.25 ధర పెంచాయి. ఒకే నెలలో సుమారు రూ.100 వరకు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గృహ వినియోగ సిలిండర్ (14.2 కేజీల) ధర ప్రస్తుతం విజయవాడలో రూ.816.50, ఒంగోలులో రూ.839.50, కందుకూరులో రూ.841.50కు (రవాణా చార్జీల వల్ల వ్యత్యాసం) పెరిగింది. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సబ్సిడీలోనూ భారీ కోత వినియోగదారులకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలోనూ భారీగా కోత విధించారు. ఒక్కో సిలిండర్‌పై గత ఏడాది రూ.220 చొప్పున సబ్సిడీ మొత్తం వినియోగదారుల బ్యాంకు అకౌంట్‌కు జమ అయ్యేది. ప్రస్తుతం సబ్సిడీ మొత్తం కేవలం రూ.15.38 మాత్రమే జమ చేస్తున్నారు. రాష్ట్రంలో వినియోగదారులకు ప్రతి రోజూ సగటున రెండు లక్షలకు పైగా సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. గతంలో రోజూ సబ్సిడీ మొత్తం రూ.4.50 కోట్లు వినియోగదారులకు అందుతుండేది. ప్రస్తుతం ఆ మొత్తం కేవలం రూ.30.76 లక్షలకు మాత్రమే పరిమితమైంది. మున్ముందు సబ్సిడీ పూర్తిగా ఎత్తేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా, గ్యాస్ ధర పెంపుపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు -
రూ. 2.94 పెరిగిన సబ్సిడీ ఎల్పీజీ ధర
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.2.94 పెరిగింది. దీంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.505.34కు చేరుకుంది. సబ్సిడీయేతర ఎల్పీజీ ధర సిలిండర్‌కు రూ.60 పెరిగి రూ. 880కు చేరింది. జూన్ నుంచి సబ్సిడీ సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా ఆరో నెల కావడం గమనార్హం. మార్కెట్లో ఇంధన ధరల ఆధారంగా ఎల్పీజీపై జీఎస్టీని గణిస్తారు. ధరపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా పన్నును మాత్రం మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించాలి. దీని వల్లే తాజాగా ఎల్పీజీ ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఎల్పీజీ ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పీజీ ధరల్ని పెంచాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.71 పెంచినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) శనివారం తెలిపింది. ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.55.50 పెంచింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన ఎల్పీజీ(సబ్సిడీలేని) ధరలపై జీఎస్టీ విధించడంతోనే తాజాగా గ్యాస్ ధరలు పెరిగాయని ఐవోసీ తెలిపింది. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర ఆరు నెలల్లో ఏడోసారి పెరిగింది. తాజాగా ఎల్పీజీ ధర సిలిండర్‌కు 2.07 రూపాయలు పెరిగింది. కాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 3.7 శాతం తగ్గింది. గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం 432.71 రూపాయలు. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రతి నెలా దాదాపు 2 రూపాయలు పెరుగుతోంది. నవంబర్ 1న ఎల్పీజీ ధరను సిలిండర్‌కు 2.05 రూపాయలు పెంచారు. -
పెరిగిన గ్యాస్ ధర.. తగ్గిన విమాన ఇంధనం
నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచారు. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ మీద ధరను రూ. 61.50 వంతున పెంచారు. ఒక కనెక్షన్‌కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడీ మీద ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోటా దాటిన తర్వాత నాన్ సబ్సిడీ ధరకు వాటిని కొనాల్సి ఉంటుంది. వాటి ధర మాత్రమే ఇప్పుడు పెరిగింది. అయితే, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను మాత్రం 1.2 శాతం చొప్పున కొద్దిగా తగ్గించారు. పెట్రోలు, డీజిల్ ధరలను సోమవారం స్వల్పంగా తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోలు ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25 పైసల వంతున తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.