న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర ఆరు నెలల్లో ఏడోసారి పెరిగింది. తాజాగా ఎల్పీజీ ధర సిలిండర్‌కు 2.07 రూపాయలు పెరిగింది. కాగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 3.7 శాతం తగ్గింది. గురువారం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది.
సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం 432.71 రూపాయలు. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రతి నెలా దాదాపు 2 రూపాయలు పెరుగుతోంది. నవంబర్ 1న ఎల్పీజీ ధరను సిలిండర్‌కు 2.05 రూపాయలు పెంచారు.
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
Published Thu, Dec 1 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
Advertisement