పెరిగిన గ్యాస్ ధర.. తగ్గిన విమాన ఇంధనం
నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచారు. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ మీద ధరను రూ. 61.50 వంతున పెంచారు. ఒక కనెక్షన్‌కు ఏడాదికి 12 సిలిండర్లను మాత్రమే సబ్సిడీ మీద ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోటా దాటిన తర్వాత నాన్ సబ్సిడీ ధరకు వాటిని కొనాల్సి ఉంటుంది. వాటి ధర మాత్రమే ఇప్పుడు పెరిగింది. అయితే, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను మాత్రం 1.2 శాతం చొప్పున కొద్దిగా తగ్గించారు.
పెట్రోలు, డీజిల్ ధరలను సోమవారం స్వల్పంగా తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోలు ధరను లీటరుకు 58 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 25 పైసల వంతున తగ్గిస్తూ ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.