
ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్న సోనియా ఆకుల నిశ్చితార్థం చేసుకుంది.

నవంబర్ 21నే ఈ వేడుక జరిగింది కానీ శనివారం రాత్రి పోస్ట్ పెట్టింది.

తనకు కాబోయే భర్త యష్ వీరగోని అని అందరికీ పరిచయం చేసింది.

ఎంగేజ్‌మెంట్ ఫొటోలని సోనియా, యష్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ఎన్ కౌంటర్, జార్జ్ రెడ్డి, కరోనా వైరస్ తదితర సినిమాలతో సోనియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

యష్ వీరగోని విషయానికొస్తే.. ఇతడిది వరంగల్. అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చారు.

ఇక్కడ 'ఫ్లయ్ హై' అనే కన్సల్టెన్సీతో పాటు అమెరికాలో 'దావత్' పేరుతో రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాడు.

యష్ ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడని, సోనియాతో రెండో పెళ్లి అని తెలుస్తోంది.

డిసెంబరు రెండో వారంలో సోనియా ఆకుల పెళ్లి ఉండొచ్చని సమాచారం.

