సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసిన సీజే ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు కొట్టేసింది. అనంతరం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదని ధర్మాసనం తెలిపింది. పదో షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించింది.
ఇక హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లినట్టు అయ్యింది. పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయం తొందరగా తీసుకోవాలని బీఆర్‌ఎస్ పిటిషన్లు వేసింది. ఒకవేళ అనర్హత విధిస్తే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ ఆశించింది. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్‌ఎస్ నేతలు కూడా ప్రస్తావించారు. కానీ, అనూహ్యంగా హైకోర్టు.. తుది నిర్ణయాన్ని(పరిమిత సమయం లేకుండా) స్పీకర్‌కే వదిలేయడంతో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది.
ఇదిలా ఉండగా.. అంతకుముందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో సెప్టెంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, జంధాల రవిశంకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున జె. ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ నెల 12న వాదనలు ముగియడంతో సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్లు దాఖ లు వేశారు. దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదుకు ప్రయతి్నంచినా.. స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ మహేశ్వర్‌రెడ్డి మరో పిటి షన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్‌ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉ త్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment