జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఈ క్రమంలో వారెంట్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది యూదుల వ్యతిరేక నిర్ణయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై నెతన్యాహు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు నిర్ణయం ఇజ్రాయెల్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది. నేను ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన వ్యక్తిని. నేను, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టు తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇజ్రాయెల్ దేశ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు మా శక్తి మేరకు మేము పనిచేశాం. కోర్టు తీర్పు యూదులకు వ్యతిరేకంగా ఉంది’ అంటూ విమర్శలు చేశారు.
అంతకుముందు.. నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.
The antisemitic decision of the international court in The Hague is a modern Dreyfus trial, and it will end the same way. pic.twitter.com/e1l8PMghrB
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 21, 2024
ఒంటరైన నెతన్యాహు?
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, రక్షణ శాఖ మాజీ మంత్రిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో ఇప్పుడేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో నెతన్యాహు, గల్లాంట్ ఇప్పుడు అంతర్జాతీయంగా వాంటెడ్ నిందితులుగా మారారు. ప్రపంచ దేశాల అధినేతలు వారికి మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. అదే జరిగితే అంతర్జాతీయంగా నెతన్యాహు, గల్లాంట్ ఒంటరవుతారు. చివరకు గాజాలో కాల్పుల విరమణ ప్రక్రియ ప్రారంభించే ప్రయత్నాలు మరింత సంక్లిష్టంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment