వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నెతన్యాహు గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని కమలా హారీస్ కోరారు. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు మృతిచెందుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఇజ్రాయెల్ ప్రధాని నిన్న అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి క్యాపిటల్ హౌస్‌లో ప్రసంగించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్, అమెరికా మధ్య పరస్పర సహకారం ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో కమలా హారీస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ దాడుల్లో భాగంగా గాజాలో జరిగిన ప్రాణనష్టంపై తనకు తీవ్ర ఆందోళన కలుగుతోందన్నారు. ఇదే సమయంలో గాజాతో శాంతి ఒప్పందాన్ని కుదర్చుకోవాలని కోరారు.
గత తొమ్మిది నెలలుగా గాజాలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది చిన్న పిల్లలు సైతం మృతిచెందారు. సాధారణ పౌరులు ఆకలితో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలపై దాడులను తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. దారుణాలకు చూస్తూ సైలెంట్‌గా ఉండబోమని హెచ్చరించారు. ఇక, గాజాకు మానవతాసాయం అందించేందుకు అనుమతించాలని నెతన్యాహును కోరారు.
ఇక, అంతుకుముందు.. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడిన నెతన్యాహు.. హమాస్‌పై పోరు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. తుది విజయం లభించే వరకు పోరు తప్పదంటూ ఆవేశంతో ప్రసంగించారు. ఈ తరుణంలో తాజా కమలా హారిస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Today, I had a frank and constructive meeting with Prime Minister Netanyahu about a wide range of issues, including my commitment to Israel’s security, the importance of addressing the humanitarian crisis in Gaza, and the urgent need to get the ceasefire and hostage deal done. pic.twitter.com/tgiSTPQJdL
— Vice President Kamala Harris (@VP) July 26, 2024
అయితే, నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా పాలస్తీనా మద్దతుదారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. క్యాపిటల్ హౌస్ వద్ద ధర్నాలు చేశారు. క్రిమినల్ నెతన్యాహు అంటూ నినాదాలు చేశారు. గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. దీంతో, క్యాపిటల్ హౌస్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment