జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ నేతలను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు జరుపుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక కమాండర్, స్నిపర్ అహ్మద్ అల్ సౌర్కాను అంతమొందించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. హమాస్‌పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరోసారి పైచేయి సాధించింది. హమాస్ నుఖ్బా ఫోర్సెస్‌లో సీనియర్ నాయకుడు, కమాండర్ అహ్మద్ అల్ సౌర్కా టార్గెట్‌గా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో అల్ సౌర్కా మరిణించాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, అతడిపై దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. ఇక, ఐడీఎఫ్‌కు ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఐఎస్‌ఏ) నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆ ఆపరేషన్ జరిపినట్టు వెల్లడించింది.
ఇక, ఈ ఆపరేషన్ సమయంలో పౌరులకు హాని కలుగకుండా ఇజ్రాయెల్ సైన్యం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో పాలస్తీనా పౌరులు ఎవరూ మృతిచెందకుండా దాడులు చేసినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడంలో అహ్మద్ అల్ సౌర్కాదే కీలక పాత్ర అని తెలుస్తోంది. దాడులకు అహ్మదే ప్లాన్ చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది.
Eliminated: Ahmed Hassan Salame Al-Sauarka, a #Hamas terrorist, in the area of Beit Hanoun in northern #Gaza. Alsauarka, a squad commander in the Nukhba Forces, infiltrated Israeli communities and participated in attacks during the #October7Massacre. He led sniper activity in… https://t.co/CUIkhTJQg0 pic.twitter.com/kojwx9uZGW
— (((🇺🇸Zemmel🇮🇱))) (@jshayevitz) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment