న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పీజీ ధరల్ని పెంచాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.71 పెంచినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) శనివారం తెలిపింది. ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.55.50 పెంచింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన ఎల్పీజీ(సబ్సిడీలేని) ధరలపై జీఎస్టీ విధించడంతోనే తాజాగా గ్యాస్ ధరలు పెరిగాయని ఐవోసీ తెలిపింది. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం.
Comments
Please login to add a commentAdd a comment