LPG Cylinder Prices
-
సిలిండర్ ధర తగ్గింపు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వంటింటి గ్యాస్ సిలిండర్ల ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ.200 తగ్గించడంపై విమర్శలు చేస్తున్నారు. ఇక, కేంద్రం నిర్ణయంపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కవిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కానుక కాదు.. జేబులను గుల్ల చేసి దగా చేయడం. ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. గత పది ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్‌పై రూ.800 పెంచి తాజాగా కేవలం రూ.200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు. First Increase the LPG cylinder price by ₹800/- And then decrease it by ₹200/- It’s not a gift, but absolute gaslighting of people’s emotions and pockets.#gascylinder — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 29, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. నల్గొండ సీటు ఎవరికి? -
వినియోగదారులకు ఊరట: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
న్యూడిల్లీ: వంట గ్యాస్ సిలిండర్ రేటును తగ్గిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయాన్ని ప్రకటించాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలో రూ.91.50 తగ్గింది. ఈ రోజు (సెప్టెంబర్ 1, 2022) నుంచి ఈ ధర అమల్లోకి వచ్చింది. దీంతో వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. (Zomato: నోరూరించే వార్త చెప్పిన జొమాటో.. బంపర్ ఆఫర్) తాజా సవరణతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1976.07 నుంచి రూ. 1885కు దిగి వచ్చింది. హైదరాబాద్‌లో రూ. 1798.5గా ఉంటుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1885కు, ముంబైలో రూ.1844కు లభించనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర ఈ ఏడాది మేలో రూ.2,354 వద్ద ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకోగా, ప్రస్తుతం వరుసగా ఐదు నెలలో ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల్లో మార్పుల ఆధారంగా ముడి చమురు ధరలు నిర్ణయం ఉంటుందనేది తెలిసిన సంగతే. (పెప్సీ, కోకా-కోలాకు రిలయన్స్ షాక్: కాంపా కోలా రీఎంట్రీ) National Oil Marketing companies have reduced commercial 19-kg LPG cylinder cost by Rs 91.50 effective from today, 1st February. 19 kg commercial cylinder will cost Rs 1907 in Delhi from today: Sources — ANI (@ANI) February 1, 2022 -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధర! ఎంతంటే!
పెరిగిన,పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు గ్యాస్ కంపెనీలు ఊరట నిచ్చాయి.కమర్షియల్ గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయించాయి. తగ్గిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీల నిర్ణయంతో దేశంలోని ప్రాంతాల వారీగా కమర్షియల్ గ్యాస్ ధరలు అదుపులోకి వచ్చాయి.ఢిల్లీలో 19కేజీల కమర్షియల్ గ్యాస్ ధర రూ.198తగ్గింది. కోల్‌కతాలో రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గాయి. గతంలో ఎంత తగ్గిందంటే చమురు కంపెనీలు వ్యాపారానికి వినియోగించే గ్యాస్ ధరల్ని వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో జూన్ 1న అదే గ్యాస్ ధరను రూ.135 తగ్గించాయి. కానీ 14.2 కిలోల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి తగ్గుముఖం కనిపించగా పోగా..వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క మే నెలలో వంటింట్లో వాడే వంట గ్యాస్ ధరను రెండు సార్లు పెంచాయి. తొలిసారిగా మే 7న లీటరుకు రూ.50 పెంచగా.. మే 19న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.3.50పెరిగాయి. -
ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీ తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వరుస చార్జీల బాదుడుతో విలవిల్లాడిన కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.135 తగ్గించినట్లు బుధవారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గింపు ధరలు నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చినట్టు ఒక నోటిఫికేషన్లో తెలిపాయి. గత రెండు నెలలుగా వాణిజ్య సిలిండర్ ధరలను వరుసగా రెండుసార్లు పెంచిన తర్వాత తాజాగా ధర తగ్గించడం విశేషం. అయితే, గృహోపకరణాల గ్యాస్ సిలిండర్లలో ధరల సవరణను ప్రకటించలేదు. తాజా సవరణతో హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 2,355.50 నుండి రూ. 2219కి తగ్గింది. ముంబైలో 2,307 నుండి 2171.50 రూపాయలకు దిగి వచ్చింది. కోల్‌కతాలో రూ.2,455 ధరకు బదులుగా రూ.2,322 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.2,508 నుంచి రూ.2,373కి తగ్గింది. అయితే 14.2 కిలోల గృహోపకరణాల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. మరి భవిష్యత్తులో వంట గ్యాస్ ధర కూడా తగ్గించనున్నారా? అనేది వేచి చూడాలి. -
మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారుతోంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గ్యాస్ బండ ధరను రూ. 3.50 పెంచాయి చమురు సంస్థలు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను రూ. 8 వంతున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి దాటింది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టపై రోకలిపోటులా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోంది కేంద్రం. ఈ ఏడాది మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 50 పెంచాయి. ఆ తర్వాత మే 7 మరోసారి రూ. 50వంతున ధరను పెంచాయి. ఈసారి కొంచెం కనికరించి ఈ పెంపు కేవలం రూ.3.50లకు పరిమితం చేశాయి. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. చదవండి: ‘మోదీగారు.. వంటగ్యాస్ ధర తగ్గించండి’ -
LPG cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలతో సామాన్యుడు ఆందోళనకు గురవుతుంటే గ్యాస్ బండ రూపంలో మరోసారి షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే (May 1st) మే ఒకటవ తేదీన కూడా సిలిండర్ ధరలను సవరించాయి. ఈ క్రమంలో సామాన్యులకు, వ్యాపారులకు మరోసారి షాకిచ్చాయి. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర (19 కేజీలు) రూ.102.5 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2355.5కి చేరింది. అంతకు మందు రూ. 2,253 ఉంది. కాగా, ఏప్రిల్ 1వ తేదీన 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.250 పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా కొనసాగుతోంది. కాగా, చిన్న గ్యాస్ సిలిండర్ (5కేజీలు) ధర రూ. 655గా కొనసాగుతోంది. ఇక పెరిగిన ధరల ప్రకారం.. - హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,563 - విశాఖపట్టణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2, 413. - విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,501కి చేరుకుంది. The price of a 19-kg commercial LPG cylinder has been hiked to Rs 2355.50 from Rs 2253; a 5kg LPG cylinder is priced at Rs 655 now. — ANI (@ANI) May 1, 2022 ఇది కూడా చదవండి: కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ -
ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంతు..భారీగా పెరిగిన ధరలు...!
LPG Gas Price Hike: గత పది రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులకు కంటికునుకు లేకుండా పోయింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచాయి. కాగా డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిలిండర్‌పై ఏకంగా రూ. 250 పెంపు..! 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా రూ. 250 పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన ధరలు నేటి(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లపై ధరల పెంపు లేకపోవడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. 19 కేజీల సిలిండర్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి... ఢిల్లీలో కొత్త ధర రూ. 2253, పాత ధర రూ.2003 కోల్‌కత్తాలో కొత్త ధర రూ. 2351 , పాత ధర రూ.2087 ముంబైలో కొత్త ధర రూ. 2205, పాత ధర రూ.1955 చెన్నైలో కొత్త ధర రూ. 2406, పాత ధర రూ.2138 హైదరాబాద్‌లో కొత్త ధర రూ. 2460, పాత ధర రూ. 2186 చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో వేరేలా..విచిత్రమైన పరిస్థితులు..! -
అనుకున్నట్టే అయ్యింది .. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు..
Oil Companies Hike LPG Price: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతా భయపడుతున్నట్టే జరిగింది. ధరల పెంపు నిర్ణయాన్ని ముందుగా చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్ సిలిండర్లకు ధరల వాత తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఎఫెక్ట్‌తో కొట్టుమిట్టాడుతున్న చిరు వ్యాపారులకు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్స్‌కి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు అశనిపాతంగా మారింది. కోవిడ్ కారణంగా వచ్చిన నష్టాల భర్తీకి గతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. దీంతో తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆవేదన చిరు వ్యాపారుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి ఒక్కో సిలిండర్‌పై రూ. 105 వంతున ధరల పెంచాయి చమురు కంపెనీలు -
గుడ్‌న్యూస్: సిలిండర్ ధరలపై ఊరట!
బడ్జెట్ ముందర గ్యాస్ సిలిండర్ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం. ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే. అక్టోబర్ నుంచి డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు అక్టోబర్ నుంచి తగ్గలేదు. నవంబర్ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఎల్పీజీ సిలిండర్ ధరలను కొన్ని ప్రాంతాల్లో తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్సిలిండర్ల ధరల్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా ఊరట ఇచ్చాయి. మరోవైపు ఆయిల్ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి. క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇది ప్రత్యేకమనే చెప్పాలి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఓఎంసీ కమర్షియల్ సిలిండర్ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్ సిలిండర్‌పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,907రూ.గా ఉంది. -
గుడ్‌న్యూస్! గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
నూతన సంవత్సరం తొలి రోజున రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు సంతోషం కలిగించే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది మేలో బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసింది మొదలు వరుసగా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోయింది కేంద్రం. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. ఆరు నెలల వ్యవధిలో దాదాపు రూ. 400లకు వరకు ధరను పెంచింది. చివరి సారిగా 2021 డిసెంబరు 1న రూ.100 వంతున సిలిండర్ ధర పెంచింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు పట్ల నలువైపుల నుంచి విమర్శలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఆయిల కంపెనీలకు ధరల తగ్గింపుపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ కీలకమైన యూపీ ఎన్నికలు సమీపించడంతో తొలిసారిగా గ్యాస్ ధరల నుంచి ఉపశమనం కలిగించే దిశగా ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 వంతున తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2004కి చేరుకోగా కోల్‌కతాలో రూ.2,074, చెన్నైలో రూ.2134, ముంబైలో రూ.1951కి చేరుకుంది. -
వ్యాపారులకు షాక్! ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ఓవైపు పెట్రోలు ధరలపై తగ్గింపు ప్రకటించిన చమురు సంస్థలు మరో వైపు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయి. సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచేశాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.100 వంతున చమురు కంపెనీలు ధర పెంచాయి. బుధవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తున్నట్టు ఏఎన్ఐలో కథనం ప్రచురితమైంది. దీనిపై చమురు కంపెనీలు ఇంకా నోరు విప్పలేదు. ఇంతకు ముందు నవంబరు 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.2000లకు అటుఇటుగా నమోదు అవుతోంది. సరిగ్గా నెల రోజుల వ్యవధి ఇచ్చి ఈసారి సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా సగటున సిలిండర్ ధర రూ.2100కి చేరుకుంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు చిరు వ్యాపారులు, హోటళ్లు, స్ట్రీట్‌ఫుడ్ వెండర్లకు భారంగా మారింది. ఇప్పుడిప్పుడు ఆర్థిక పరిస్థితి కుదురుకుంటుందని భావించేలోగా వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. వ్యాపారంపై వస్తున్న అరకొర సంపాదన పెరుగుతున్న ధరలకే సరిపోతుందంటూ వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905 ఉండగా పెరిగిన ధరలతో రూ.2005కి చేరుకుంది. చదవండి:భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు -
చిరు వ్యాపారులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. గ్యాస్ ధర ఏకంగా..
అనుకున్నట్టే అయ్యింది. అంతా భయపడ్డట్టే జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుతోనే సతమతం అవుతున్న ప్రజానీకంపై ఈసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో విరుచుకుపడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసేంది. రూ.266 రకరకాల కారణాలు చెప్పి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారినట్టుంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరుకుంది. చిరువ్యాపారులకు ఇక్కట్లే ఆగస్టు 17న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస సిలిండర్ ధరతో చిరువ్యాపారులు, స్ల్రీట్ఫుడ్ వెండర్ల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్ ధరలు హరించివేస్తున్నాయి. దీపావళికి ముందే గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం. రెండు నెలల్లో గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 952లుగా ఉంది. చదవండి: బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! -
నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
Major Changes That Will Set In From November 1: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే మనం వెంటనే అప్రమత్తమైపోతాం. ఇంటి అద్దె బిల్లులు , చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున పూర్తి చేస్తాం. అంతేందుకు ప్రభుత్వాలు కూడా ఒకటో తేదీనే పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపడుతాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు కొత్త నిబంధనలను కూడా అమలులోకి తెస్తాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల నవంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.ఇక నవంబర్ 1 నుంచి సామాన్యులపై గ్యాస్ బండ మోత కూడా మోగనుంది. చదవండి: దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్..! ఎల్పీజీ డెలివరీ సిస్టమ్ వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే నెల నుంచి ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ కోసం వినియోగదారులు కచ్చితంగా వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని అందించాల్సి ఉంటుంది.డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC)లో భాగంగా ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది. డిపాజిట్లు, ఉపసంహరణలపై ఛార్జీలను సవరించనున్న పలు బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిర్దేశిత పరిమితిని మించి డిపాజిట్, డబ్బును విత్‌డ్రా చేయడం కోసం నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఛార్జీలు సేవింగ్స్ ఖాతాదారులతో పాటు వేతన ఖాతాదారులకు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యాక్సిస్ , సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా విషయంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే టైమ్ టేబుల్ దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వే పలు రైళ్ల టైమ్ టేబుల్లో మార్పులు చేయబోతోంది. నవంబరు 1 నుంచి పలు రైళ్లకు కొత్త టైమ్‌టేబుల్ ప్రకటించనుంది. భారతీయ రైల్వేస్ ప్రకారం... 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ ధరలు గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కారణంగా..చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తారీఖు నుంచి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ధరలు పెరిగితే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు రానున్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై కీలక వ్యాఖ్యలు చేసిన పేటీఎమ్..! -
LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’
సాక్షి, ముంబై: ఒక పక్క పెట్రో ధరల మంట మరో పక్క వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సగటు జీవిని ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి 100 రూపాయల దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తుండగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో బాంబు పేల్చాయి. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయలుగా ఉంది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను 84 రూపాయలు పెంచాయి. సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగతూనే ఉన్నాయి. ముంబైలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50 ఉండగా, కోల్‌కతాలో రూ. 861, చెన్నైలో రూ. 850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్‌కు రూ. 25 పెంచగా, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ .25 పెంచారు. ఏప్రిల్‌లో రూ .10 తగ్గినప్పటికీ, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా గత ఆరు నెలల్లో ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌కు 140 రూపాయలు పెరగడం గమనార్హం. -
పెరిగిన వంటగ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర రూ.2.08లు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను రూ.42.50 చొప్పున పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ప్రకటించింది.అంతర్జాతీయంగా చమురు ధరలు, డాలరు మారకంలో రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయంగా కూడా గ్యాస్ ధరలు ప్రభావితమైనట్టు పేర్కొంది. నేటి (మార్చి 1) నుంచి ఈ సవరించిన రేట్లు అమలు కానున్నాయి. -
ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట
న్యూఢిల్లీ : ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. సబ్సిడీ ఎల్పీజీ సిలెండరుపై రూ.6.52 మేర తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) శుక్రవారం ప్రకటించింది. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం 14.2కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.507.42గా ఉంది. 7 రూపాయలు తగ్గడంతో సిలెండరు ధర రూ.500.90కి లభించనుందని ఐఓసీ వెల్లడించింది. రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో ఎల్పీజీ ధరలు భారీగా తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది. ఇక సబ్సిడీయేతర సిలెండరు ధరపై రూ.133 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు సబ్సిడీయేతర సిలెండరు ధర రూ.942.50గా ఉంది. ఇక మీదట ఢిల్లీలో సబ్సిడీయేతర ఎల్పీజీ సిలెండరు ధర రూ.809.50కి లభించనుంది. ఈ ఏడాది జూన్ నెల నుంచి ఎల్పీజీ ధర పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు ఆరుసార్లు వంట గ్యాస్ ధరను పెంచారు. ఈ ఆరు నెలల కాలంలో గ్యాస్ ధర రూ.14.13 మేర పెరిగింది. గృహ వినియోగదారులకు సబ్సిడీ కింద ఏటా 12 సిలెండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సబ్సిడీ నగదును వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. నవంబరు నెలలో చివరి సారిగా వంట గ్యాస్ సిలెండరు ధర పెంచారు. -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్(ఎల్పీజీ)సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94లు మేర పెరిగింది. అలాగే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగింది. ఈ ఏడాది జూన్ నుంచి గ్యాస్ సిలిండర్ రేట్లు వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పెంపుతో సబ్సిడీ సిలిండర్ మొత్తం ఆరు నెలలో రూ.14.13 పెరిగింది. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 505.34కి చేరగా, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 880గా ఉంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతోపాటు విదేశీమారకం రేటులో ఒడిదుడుకుల వల్ల ధరలు పెరుగుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అధికారులు తెలిపారు. పెరిగిన ఇంధన ధరల ప్రకారం వినియోగదారులపై భారం పడకుండా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్నదని, అయితే జీఎస్టీ భారం మాత్రమే వినియోగదారులపై పడుతుందని పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో రాయితీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాలో రూ.376.60 జమకాగా, నవంబర్‌లో రాయితీ రూ.433.66కు పెరగనున్నదని అధికారులు తెలిపారు. -
ఎల్పీజీ ధరలకు మళ్లీ రెక్కలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఎల్పీజీ ధరల్ని పెంచాయి. ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.71 పెంచినట్లు ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) శనివారం తెలిపింది. ఒక్కో సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.55.50 పెంచింది. తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.55కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. సవరించిన ఎల్పీజీ(సబ్సిడీలేని) ధరలపై జీఎస్టీ విధించడంతోనే తాజాగా గ్యాస్ ధరలు పెరిగాయని ఐవోసీ తెలిపింది. అంతర్జాతీయంగా సహజవాయువు ధరల పెంపు, డాలర్‌తో రూపాయి విలువ బలహీనపడటం ఇందుకు మరో కారణం. -
రెండింతలు పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతినెలా రెండింతలు పెరుగుతున్నాయి. ఇలా వచ్చే ఏడాది మార్చి వరకు అంటే సబ్సిడీలను ముగించేవరకు సిలిండర్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్‌పై ఇస్తున్న రూ.87 సబ్సిడీని ప్రభుత్వం పూర్తిగా తీసివేయాలని చూస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా ఇంధనాలపై ఉన్న ధరల నియంత్రణను తొలగించింది. దీంతో ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వంటగ్యాస్ విషయంలో ప్రభుత్వం అంతకముందే 'గివ్ ఇట్ అప్' క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. అంతేకాక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు ప్రతి నెలా సబ్సిడీ సిలిండర్‌పై నెలకు 2 రూపాయలను పెంచుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ పెంపు రెండింతలు అయింది. మరోసారి అధికారిక ఓఎంసీలకు సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీంతో జూన్ 1 నుంచి ప్రతినెలా నెలకు ఒక్కో సిలిండర్‌పై 4 రూపాయలు పెరుగనున్నట్టు ఇంధన మంత్రి ధర్మేంద్రప్రధాన్ తెలిపారు. ఈ పెంపు ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా నిర్మూలించేవరకు లేదా 2018 మార్చి వరకు లేదా మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని చెప్పారు. జూలై 1 వరకు భారత్‌లో 18.12 కోట్ల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ కస్టమర్లున్నారు. దానిలో 2.5 కోట్ల మంది పేదరిక మహిళలే. గతేడాది నుంచి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద వీరు కనెక్షన్ పొందారు. నాన్-సబ్సిడీ కస్టమర్లు 2.66 కోట్ల మంది ఉన్నారు. ఎల్పీజీ ధరలను నెలవారీ పద్దతిన సవరిస్తున్నామని ఇంధన మంత్రి చెప్పారు. ఎల్పీజీపై ఇచ్చే సబ్సిడీని కూడా రిటైల్ సెల్లింగ్ ధరపై మార్కెట్ టూ మార్కెట్ ఆధారితంగా నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు. 2017 జూలై వరకు 14.2 కేజీల సిలిండర్‌పై సబ్సిడీ ఢిల్లీలో రూ.86.54గా ఉంది. ప్రతినెలా సబ్సిడీ ధరలపై 4 రూపాయలను పెంచితే, మార్చి వరకు మొత్తం సబ్సిడీలను నిర్మూలించవచ్చని ప్రభుత్వ రంగ ఓఎంసీకి చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. -
ఎల్ పీజీ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా?
న్యూఢిల్లీ : రాయితీ లేని కుకింగ్ గ్యాస్(ఎల్ పీజీ) సిలిండర్ ధర తగ్గిందట. అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కో సిడిండర్ పై రూ.11 కోత పడిందని తెలిసింది. రూ.548.50 లభ్యమయ్యే సిలిండర్, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.537.50 లకే అందుబాటులో ఉంటుందట. ఇంధన రిటైలర్లు జరిపిన జెట్ ఇంధన, రాయితీ లేని ఎల్ పీజీ ధరల సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. రాయితీకి లభించే ఎల్ పీజీ ధర ఢిల్లీలో రూ. 421.16గా ఉంది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు మాత్రం 5.5శాతం పెరిగాయని ఆయిల్ కంపెనీ శుక్రవారం వెల్లడించాయి. జెట్ ఫ్యూయల్ ధర ఢిల్లీలో కిలో లీటర్ కు రూ.2,557.7 పెరిగి, రూ.49,287.18గా నమోదైందని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వరుసగా ఐదో నెల ఈ ధరలు పెరిగినట్టు వెల్లడించాయి. ఈ ఐదు సార్ల పెరుగుదలతో ఏటీఎఫ్ రేట్లు 25 శాతం లేదా రూ.9,985.87 ఎగబాకాయని తెలిపాయి. కానీ విమానాల్లో వాడే ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ కంటే తక్కువగానే లభ్యమవుతుందని పేర్కొన్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.64.76గా, లీటర్ ఢీజిల్ ధర రూ.54.70గా ఉన్నట్టు... అయితే ఈ ధరలు లీటర్ ఏటీఎఫ్ ధర(రూ.49.28) తక్కువేనని వెల్లడించాయి. ఆటో ఇంధనాలపై కేంద్రప్రభుత్వం పెంచుతూ వస్తున్న ఎక్సేంజ్ డ్యూటీల ప్రభావంతో ఈ ధరలు ఎగబాకినట్టు తెలిపాయి. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పడిపోయినా... భారత్ లో ఈ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏటీఎఫ్ ధరల్లో పెరుగుదల, ప్యాసెంజర్ టిక్కెట్ ధరలపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో అనేదానిపై మాత్రం విమాన కంపెనీలు వెంటనే స్పందించలేదు. మూడు ఇంధన రిటైలర్లు.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతి నెలా మొదటిరోజు జెట్ ఇంధనం, రాయితీ లేని ఎల్ పీజీ ధరలపై సమీక్ష నిర్వహిస్తాయి. ఈ సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.