గ్యాస్ సిలిండర్ సామాన్యులకు గుదిబండలా మారుతోంది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. గ్యాస్ బండ ధరను రూ. 3.50 పెంచాయి చమురు సంస్థలు. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను రూ. 8 వంతున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి దాటింది. పెరిగిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా గోరుచుట్టపై రోకలిపోటులా వరుసగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతోంది కేంద్రం. ఈ ఏడాది మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్‌పై రూ. 50 పెంచాయి. ఆ తర్వాత మే 7 మరోసారి రూ. 50వంతున ధరను పెంచాయి. ఈసారి కొంచెం కనికరించి ఈ పెంపు కేవలం రూ.3.50లకు పరిమితం చేశాయి. ఇక ఏడాది కాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలయితే అడ్డు అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment