సిలిండర్‌ ధర తగ్గింపు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇదే.. | BRS MLC Kavitha Political Counter To BJP Government Over LPG Cylinder Price - Sakshi
Sakshi News home page

సిలిండర్‌ ధర తగ్గింపు.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌ ఇదే..

Published Tue, Aug 29 2023 7:55 PM | Last Updated on Tue, Aug 29 2023 7:59 PM

MLC Kavitha Political Counter To BJP Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పిన విషయం తెలిసిందే. వంటింటి గ్యాస్‌ సిలిండర్ల ధరను రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ.200 తగ్గించడంపై విమర్శలు చేస్తున్నారు. 

ఇక, కేంద్రం నిర్ణయంపై తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కవిత ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ఇది కానుక కాదు.. జేబులను గుల్ల చేసి దగా చేయడం. ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. గత పది ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఒక ఎల్పీజీ సిలిండర్‌పై రూ.800 పెంచి తాజాగా కేవలం రూ.200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల్లో పోటీపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. నల్గొండ సీటు ఎవరికి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement