సాక్షి, ముంబై: ఒక పక్క పెట్రో ధరల మంట మరో పక్క వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సగటు జీవిని ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి 100 రూపాయల దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తుండగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో బాంబు పేల్చాయి.
దేశీయంగా సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయలుగా ఉంది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను 84 రూపాయలు పెంచాయి. సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగతూనే ఉన్నాయి.
ముంబైలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50 ఉండగా, కోల్‌కతాలో రూ. 861, చెన్నైలో రూ. 850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్‌కు రూ. 25 పెంచగా, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ .25 పెంచారు. ఏప్రిల్‌లో రూ .10 తగ్గినప్పటికీ, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా గత ఆరు నెలల్లో ఎల్‌పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌కు 140 రూపాయలు పెరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment