rised
-
ఎన్ని కోట్లయినా సరే.. తగ్గేదేలే!సూపర్ రిచ్ ఇక్కడ!
సాక్షి, ముంబై: సూపర్-లగ్జరీ కార్ల విక్రయాలు సూపర్ వేగంతో దూసుకుపోతున్నాయి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న బిలియనీర్ల కారణంగా కరోనా సంక్షోభంలో కూడా రూ. 2 కోట్లకు పైగా విలువున్న కార్లను హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత దేశీయ కుబేరులు లగ్జరీ కార్లను ఎగరేసుకుపోతున్నారట. రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనాకి ముందున్న గరిష్ట స్థాయిలను అధిగమించే అవకాశం ఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2018లో భారతదేశంలోని అత్యంత సంపన్నులు రూ. 2 కోట్లకు పైగా ధర కలిగిన 325 లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. అయితే కోవిడ్-19 మహమ్మారి దెబ్బకు 2020లో వాటి సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లగ్జరీ కార్ మార్కెట్లో పదివేల యూనిట్లకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎకనామిక్స్ టైమ్స్ ఒక రిపోర్టులో తెలిపింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇటాలియన్ సూపర్-లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని, ఆర్థిక అనిశ్చితి పరిస్థితిల్లో కూడా కార్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. 2022 మొదటి ఐదు నెలల్లో ఊహించిన దానికంటే ట్రెండ్ బాగా పుంజుకుందని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్‌ని పేర్కొన్నారు. ఈ నెంబర్లు సూపర్-లగ్జరీ కార్ల మార్కెట్ సామర్థ్యం కంటే ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్యను ప్రతిబింబిస్తోందన్నారు. ఇంతకుముందు మూడో/ నాల్గవ తరం వ్యాపారులకు మాత్రమే లగ్జరీ కార్లను విక్రయించాం కానీ ఇపుడు మొదటి తరం వ్యాపారవేత్తలు, మహిళలు, ఇతరులతో తమ కస్టమర్ బేస్ మరింత విస్తరించిందని అగర్వాల్ వెల్లడించారు. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న మెర్సిడెస్ బెంజ్ హై-ఎండ్ లగ్జరీ కార్ల వాటా 2018లో 12 శాతంతో పోలిస్తే 2022లో 29 శాతానికి రెండింతలు పెరిగింది. దాదాపు 5వేల మందిలో మూడింట ఒక వంతు మంది తమ లగ్జరీ కారు వినియోగిస్తున్నారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. 2021లో 2వేల లగ్జరీ కార్లను విక్రయించిన బెంజ్ చేతిలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయిట. కాగా ఇటీవల లంబోర్ఘిని అవెంటడోర్ అవెంటోని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని అంచనా ధర సుమారు 8-10 కోట్లు. లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రపంచవ్యాప్తంగా 600 కార్లను రిలీజ్ చేయగా ఇప్పటికే అన్ని కార్లు బుక్ అయిపోయాయి. ఇందులో ఇండియా నుంచి ఒకరు ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: Lamborghini Aventador Ultimae: వావ్..లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్‌కార్: హాట్ సేల్ -
LPG Cylinder Price: వినియోగదారులపై మరో ‘బండ’
సాక్షి, ముంబై: ఒక పక్క పెట్రో ధరల మంట మరో పక్క వంట గ్యాస్ సిలిండర్ ధరల భారం సగటు జీవిని ఊపిరి పీల్చుకోనివ్వడంలేదు. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి 100 రూపాయల దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ధరలు వినియోగదారుడిని బెంబేలెత్తిస్తుండగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో బాంబు పేల్చాయి. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో 834.50 రూపాయలుగా ఉంది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను 84 రూపాయలు పెంచాయి. సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగతూనే ఉన్నాయి. ముంబైలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 834.50 ఉండగా, కోల్‌కతాలో రూ. 861, చెన్నైలో రూ. 850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్‌కు రూ. 25 పెంచగా, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ .25 పెంచారు. ఏప్రిల్‌లో రూ .10 తగ్గినప్పటికీ, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా గత ఆరు నెలల్లో ఎల్పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌కు 140 రూపాయలు పెరగడం గమనార్హం. -
భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ పసిడి డిమాండ్ పటిష్టంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 34.6 బిలియన్ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.23 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2 లక్షల కోట్లు). ఇక వెండి దిగుమతుల విలువ ఇదే కాలంలో ఏకంగా 71 శాతం పెరిగి 791 మిలియన్ డాలర్లకు చేరింది. పసిడి దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) పడుతోంది. ఇది కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పసిడి దిగుమతులు పెరగడానికి దేశీయ డిమాండ్ ప్రధాన కారణమని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంటుంది. వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో యల్లో మెటల్‌పై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇందులో 7.5 శాతం కస్టమ్స్ సుంకం కాగా, 2.5 శాతం వ్యవసాయ మౌలిక వనరులు, అభివృద్ధి సెస్‌కు ఉద్దేశించినది. -
వరుసగా 12 వ రోజూ పెట్రో సెగ
సాక్షి,న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా భగ్గుమంటున్నాయి. జు ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 20) కూడా ఇంధన ధరలు నింగిని చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా డీజిల్‌పై 35-40 పైసలు, పెట్రోలు పై లీటరుకు మరో 30-40 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో వివిధనగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డును తాకుతున్నాయి. దీంతో ధరల పరుగుకు ఎప్పటికి అడ్డుకట్టపడుతుందో తెలియని గందరగోళంలోవాహనదారులు పడిపోయారు. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీ లో పెట్రోల్ రూ. 90.58, డీజిల్ రూ. 80.97 ముంబైలో పెట్రోల్ రూ. 97. కు, డీజిల్ రూ. 88.05 చెన్నై పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98 బెంగళూరు పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84 హైదరాబాద్ పెట్రోల్ రూ. 94.18, డీజిల్ రూ. 88.31 అమరావతి పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33 -
పెరగనున్న పెద్ద టీవీల ధరలు
న్యూఢిల్లీ: పెద్ద స్క్రీన్ టీవీల ధరలు వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. 32 అంగుళాలు, అంతకంటే ఎక్కువ స్క్రీన్ సైజు ఉన్న వాటి ధరల్ని పెంచాలని టీవీల కంపెనీలు యోచిస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంతో కంపెనీలపై ప్రకటనల ఖర్చు పెరిగింది. అలాగే ప్యానళ్ల ధరలు కూడా పెరిగాయి. ఈ భారం తగ్గించుకునేందుకు కంపెనీలు విక్రయ ధరల్ని పెంచాలనుకుంటున్నాయి. హైయర్ కంపెనీ 5% వరకు పెంచనుంది. ఆగస్ట్ మూడో వారం నుంచి పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ‘‘ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచనున్నాం. ఇది దాదాపు ఆగస్ట్ మూడో వారం నుంచి ఉండొచ్చు’’ అని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. డాలర్ బలపడడం, టీవీ ప్యానళ్ల ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ధరల్ని పెంచక తప్పడం లేదన్నారు. ‘‘టీవీ ప్యానళ్ల ధరలు పెరగడం, మారకం రేటు ప్రభావం నేపథ్యంలో 32 అంగుళాలు ఆపై సైజున్న టీవీలీ ధరల పెంపు ఉంటుంది. ఇందుకోసం మార్కెట్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం’’అని ప్యానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ తెలిపారు. -
పెరుగుతున్న బాల నేరస్థులు
ముంబై: చేతిలో పుస్తకాలు, ఆడుకోవల్సిన వయసులో పిల్లలు నేరాలకు పాల్పడడం రాష్ట్ర పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. వాటిని అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా నేరాల సంఖ్య మరింత పెరగడం కలవరానికి గురి చేస్తోంది. 2015లో నమోదైన వివిధ నేరాల్లో 186 మంది పిల్లలను హత్య నేరం కింద, 269 మంది పిల్లలను హత్య యత్నం కింద అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నేరాల్లో పిల్లల ద్వారా జరిగిన నేరాలు రెండు శాతం పెరిగినట్లు నేర నివేదికలో తేలింది. అంతేకాకుండా తీవ్రంగా గాయపర్చడం, ఇళ్లలో దోపిడి, అత్యాచారం, అల్లర్లు, అసభ్యకరంగా ప్రవర్తించడం లాంటి నేరాల్లో 18 ఏళ్ల లోపు పిల్లలు అధికంగా ఉన్నట్లు రాష్ట్ర నేర నివేదికలో బయటపడింది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు వ్యతిరేకంగా 5,175 నేరాలు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో పోలిస్తే 2015లో 5.93 శాతం నేరాలు పెరిగాయి. అత్యధికంగా నేరాలు ముంబైలో 873 జరిగాయి. పుణే(640 నేరాలు), థానే (363), నాగపూర్ (266), సాతారా(192)లు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. పుణే నగరంలో 16 హత్యా కేసుల్లో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నమోదుచేసిన నేరాల్లో దర్యాప్తు చేపట్టి ముంబైలో అత్యధికంగా 1,123, పుణేలో 889 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 16-18 ఏళ్లలోపు పిల్లలు 97 శాతం, 12 ఏళ్లలోపు 1.7 శాతం పిల్లలు ఉన్నారు.