సాక్షి,న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా భగ్గుమంటున్నాయి. జు ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 20) కూడా ఇంధన ధరలు నింగిని చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా డీజిల్‌పై 35-40 పైసలు, పెట్రోలు పై లీటరుకు మరో 30-40 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపుతో వివిధనగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డును తాకుతున్నాయి. దీంతో ధరల పరుగుకు ఎప్పటికి అడ్డుకట్టపడుతుందో తెలియని గందరగోళంలోవాహనదారులు పడిపోయారు. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత)
పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీ లో పెట్రోల్ రూ. 90.58, డీజిల్ రూ. 80.97
ముంబైలో పెట్రోల్ రూ. 97. కు, డీజిల్ రూ. 88.05
చెన్నై పెట్రోల్ రూ. 92.59, డీజిల్ రూ. 85.98
బెంగళూరు పెట్రోల్ రూ. 93.61, డీజిల్ రూ. 85.84
హైదరాబాద్ పెట్రోల్ రూ. 94.18, డీజిల్ రూ. 88.31
అమరావతి పెట్రోల్ రూ. 96.73, డీజిల్ రూ. 90.33
Comments
Please login to add a commentAdd a comment