చిరు వ్యాపారులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. గ్యాస్‌ ధర ఏకంగా.. | Diwali shock for common man commercial cylinder price up by Rs 265 | Sakshi
Sakshi News home page

కేంద్రం మరోషాక్‌ ! భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

Published Mon, Nov 1 2021 10:29 AM | Last Updated on Mon, Nov 1 2021 3:21 PM

Diwali shock for common man commercial cylinder price up by Rs 265 - Sakshi

అనుకున్నట్టే అయ్యింది. అంతా భయపడ్డట్టే‍ జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. పెట్రోలు, డీజిల్‌ రేట్ల పెంపుతోనే సతమతం అవుతున్న ప్రజానీకంపై ఈసారి ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపుతో విరుచుకుపడింది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా పెంచేసేంది. 

రూ.266
రకరకాల కారణాలు చెప్పి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారినట్టుంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్‌ సిలిండర్‌ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1905.32కి చేరుకుంది.

చిరువ్యాపారులకు ఇక్కట్లే
ఆగస్టు 17న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్‌ గ్యాస​ సిలిండర్‌ ధరతో చిరువ్యాపారులు, స్ల్రీట్‌ఫుడ్‌ వెండర్ల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్‌ ధరలు హరించివేస్తున్నాయి. 

దీపావళికి ముందే
గత వారం రోజులుగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం.

రెండు నెలల్లో
గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లపై  సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 952లుగా ఉంది.

చదవండి: బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్‌ !

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement