పండుగ టైంలో కూడా ఎప్పుడు కట్టుకునే విధంగానే డ్రెస్ లేదా చీరని కట్టుకుంటే కలర్‌ఫుల్‌నెస్ ఏముంటుంది..?. జోష్ ఏం వస్తుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదా..! పండగ మొత్తం మన నుంచే జరుగుతుందేమో..! అనేలా కనిపించాలి ఆహార్యం. అందుకు తగట్టు మన కట్టు, బొట్టు తీరు అదరహో అనే రేంజ్‌లో ఉండాలి. అందులోనూ ఇంకొద్ది రోజుల్లోనే దీపావళి వస్తోంది. మిరమిట్లుగొలిపే దీపాల కాంతిలో మనం ధరించే డ్రెస్ లేదా చీర అత్యంత శోభాయమానంగా కనిపించాలి. అందుకోసం ఈసారి చీరను ఇలా ఇన్ని రకాలుగా కట్టుకుని సందడి చేసేందుకు ప్రయత్నిద్దామా..!.
సెలబ్రిటీలకు చీరలు కట్టే డాలీ జైన్ డ్రేపింగ్ టెక్నీక్‌లతో ఈసారి పండగకు చీర కట్టుకుని అసలైన సందడిని, జోష్‌ని తెద్దామా..!. డాలీ రాధికా మర్చంట్ నుంచి నీతా వరకు ఎంతో మంది ప్రముఖులకు స్టైలిష్‌గా చీరలు కట్టేస్తుంది. ఒక్క చీరతోనే లెహంగా స్టైల్, వెస్ట్రన్, గుజరాతీ స్టైల్లో చీరలు కట్టేస్తుంది. ఆమె చీర కట్టు తీరుకు సంబంధించిన ఓ ఐదు టెక్నీక్‌లు ఈసారి ట్రై చేసి చూద్దాం.
మెర్మైడ్ తరహా చీర
ఈ శైలిలో కట్టే చీరను ముందుగా నడుమ చుట్టు చక్కగా దోపి ఒకవైపుకే చీరను కుచ్చిళ్లలా మడతపెట్టి కడతారు. ఇది ఫిష్‌టైల్ లెహెంగా రూపాన్ని సృష్టిస్తుంది. దీని పేరుకు తగ్గట్టు సాగర కన్య మాదిరిగా ఉంటుంది ఈ చీర కట్టు తీరు. ఈ స్టైల్ కోసం సన్నటి బార్డర్, ఫ్లీ ఫ్యాబిక్ ఉన్న చీరలకే బాగుంటుంది. ఈ చీర లుక్ కోసం సరైన బ్రాస్‌లెట్, చెవిపోగులు ధరిస్తే హైలెట్‌గా ఉంటుంది.
లెహంగా చీర
లెహంగాపై అందంగా చీరను చుట్టి ఓ కొత్త లుక్‌ని తీసుకొస్తారు. ఇందుకోసం విశాలమైన అంచుతో ఉన్న బనారసి లేదా కంజీవర చీర అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. జస్ట్ స్కర్ట్‌పైనే చీరను అందంగా కడతారు.
ఇండో-వెస్ట్రన్ శైలి..
ఆధునికత ఉట్టిపడేలా చీర కట్టుకోవాలనుకుంటే..చీరను వదులుగా ఉండే కుర్తా లేదా కేప్‌తో జత చేయాలి. ఈ ఇండో వెస్ట్రన్ చీర ఆధునికతకు కేరాఫ్‌గా ఉంటుంది. పైగా ఈతరహా స్టైల్ సౌలభ్యంగా కూడా ఉంటుంది.
జలపాతం శైలి చీర
సంప్రదాయ శైలిలో చీరను ధరించి.. అతిథులందరి కంటే భిన్నంగా ఉండాలంటే ఈ శైలి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కొద్దిపాటి బార్డర్‌తో కూడిన చీర ఈ స్టైల్‌కి సరిపోతుంది.
సిద్ధ పల్లు తరహా చీర
ఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ శైలి సంప్రదాయబద్ధమైన లుక్‌ని తీసుకొస్తుంది. క్లాసిక్ గుజరాతీ శైలీ చీరలు ఈ తరహా కట్టుకి సరిపోతాయి. దీనికి మంచి బెల్ట్ ధరిస్తే చీర లుక్‌ని బాగా హైలెట్ చేస్తుంది.
(చదవండి: ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!)
Comments
Please login to add a commentAdd a comment