Dolly Jain
-
ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!
పండుగ టైంలో కూడా ఎప్పుడు కట్టుకునే విధంగానే డ్రెస్ లేదా చీరని కట్టుకుంటే కలర్ఫుల్నెస్ ఏముంటుంది..?. జోష్ ఏం వస్తుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదా..! పండగ మొత్తం మన నుంచే జరుగుతుందేమో..! అనేలా కనిపించాలి ఆహార్యం. అందుకు తగట్టు మన కట్టు, బొట్టు తీరు అదరహో అనే రేంజ్లో ఉండాలి. అందులోనూ ఇంకొద్ది రోజుల్లోనే దీపావళి వస్తోంది. మిరమిట్లుగొలిపే దీపాల కాంతిలో మనం ధరించే డ్రెస్ లేదా చీర అత్యంత శోభాయమానంగా కనిపించాలి. అందుకోసం ఈసారి చీరను ఇలా ఇన్ని రకాలుగా కట్టుకుని సందడి చేసేందుకు ప్రయత్నిద్దామా..!.సెలబ్రిటీలకు చీరలు కట్టే డాలీ జైన్ డ్రేపింగ్ టెక్నీక్లతో ఈసారి పండగకు చీర కట్టుకుని అసలైన సందడిని, జోష్ని తెద్దామా..!. డాలీ రాధికా మర్చంట్ నుంచి నీతా వరకు ఎంతో మంది ప్రముఖులకు స్టైలిష్‌గా చీరలు కట్టేస్తుంది. ఒక్క చీరతోనే లెహంగా స్టైల్, వెస్ట్రన్, గుజరాతీ స్టైల్లో చీరలు కట్టేస్తుంది. ఆమె చీర కట్టు తీరుకు సంబంధించిన ఓ ఐదు టెక్నీక్లు ఈసారి ట్రై చేసి చూద్దాం.మెర్మైడ్ తరహా చీరఈ శైలిలో కట్టే చీరను ముందుగా నడుమ చుట్టు చక్కగా దోపి ఒకవైపుకే చీరను కుచ్చిళ్లలా మడతపెట్టి కడతారు. ఇది ఫిష్‌టైల్ లెహెంగా రూపాన్ని సృష్టిస్తుంది. దీని పేరుకు తగ్గట్టు సాగర కన్య మాదిరిగా ఉంటుంది ఈ చీర కట్టు తీరు. ఈ స్టైల్ కోసం సన్నటి బార్డర్, ఫ్లీ ఫ్యాబిక్ ఉన్న చీరలకే బాగుంటుంది. ఈ చీర లుక్ కోసం సరైన బ్రాస్లెట్, చెవిపోగులు ధరిస్తే హైలెట్‌గా ఉంటుంది. లెహంగా చీరలెహంగాపై అందంగా చీరను చుట్టి ఓ కొత్త లుక్‌ని తీసుకొస్తారు. ఇందుకోసం విశాలమైన అంచుతో ఉన్న బనారసి లేదా కంజీవర చీర అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. జస్ట్ స్కర్ట్పైనే చీరను అందంగా కడతారు. ఇండో-వెస్ట్రన్ శైలి..ఆధునికత ఉట్టిపడేలా చీర కట్టుకోవాలనుకుంటే..చీరను వదులుగా ఉండే కుర్తా లేదా కేప్‌తో జత చేయాలి. ఈ ఇండో వెస్ట్రన్ చీర ఆధునికతకు కేరాఫ్‌గా ఉంటుంది. పైగా ఈతరహా స్టైల్ సౌలభ్యంగా కూడా ఉంటుంది. జలపాతం శైలి చీరసంప్రదాయ శైలిలో చీరను ధరించి.. అతిథులందరి కంటే భిన్నంగా ఉండాలంటే ఈ శైలి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కొద్దిపాటి బార్డర్‌తో కూడిన చీర ఈ స్టైల్‌కి సరిపోతుంది. సిద్ధ పల్లు తరహా చీరఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ శైలి సంప్రదాయబద్ధమైన లుక్‌ని తీసుకొస్తుంది. క్లాసిక్ గుజరాతీ శైలీ చీరలు ఈ తరహా కట్టుకి సరిపోతాయి. దీనికి మంచి బెల్ట్ ధరిస్తే చీర లుక్‌ని బాగా హైలెట్ చేస్తుంది. (చదవండి: ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!) -
సెలబ్రిటీలకు చీరలు కట్టేది ఈమే.. ఎంత సంపాదిస్తోందో తెలుసా?
భారతీయ సంప్రదాయంలో చీరకు ఉన్న ప్రత్యేకతే వేరు. మగువ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది చీర. సినిమా హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు పలు ఈవెంట్లలో చీరలో మెరుస్తుంటారు. అయితే వారి చీరకట్టు వెనుక ఉన్నది మాత్రం డాలీ జైన్. పెళ్లి వేడుకలైనా లేదా ఏదైనా ఈవెంట్ అయినా సరే చీర కట్టడం లేదా దుపట్టా కట్టడం విషయంలో డాలీ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆమె కేవలం 18 సెకన్లలో చీర కట్టగలదు. అది నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. అయితే ఆమె సంపాదన చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! డాలీ జైన్ చీరకట్టుతో మెరిసిన కొంతమంది సెలిబ్రిటీల గురించి ఇటీవల రెడ్డిట్‌లో షేర్ చేశారు. తనకు 325 రకాల డ్రేపింగ్ స్టైల్స్ తెలుసని డాలీ చెబుతుంటారు. దీపికా పదుకొణె రిసెప్షన్ చీర, సోనమ్ మెహందీ, అలియా భట్, నయనతారల పెళ్లి చీరలు కట్టింది ఆమె. కాగా డాలీ జైన్ చీర కట్టడానికి ఒక్కొక్కరితో తీసుకుంటున్న మొత్తం గురించి తెలిసి నెటిజెన్లు నోరెల్లబెడుతున్నారు. పలు నివేదికల ప్రకారం, చీర కట్టడానికి డాలీ ఒక్కో సెలబ్రిటీ నుంచి రూ. 35,000 నుంచి రూ.2 లక్షల వరకూ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆమె అద్భుతమైన ప్రతిభను చూసి కొంతమంది ప్రశింసించగా మరికొంత మంది ఆమె సంపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో అంతర్జాతీయ సెలెబ్రిటీ జిగి హడిద్కు డాలీ అందంగా చీర కట్టి ప్రశంసలు అందుకుంది. ఇది మాత్రమే కాదు, మెట్ గాలా 2022 ఈవెంట్లో నటాషా పూనావాలా ధరించిన బంగారు చీరను కూడా కట్టింది డాలీనే. డాలీ జైన్ డ్రేపింగ్ (చీరలు, లెహంగాలు కట్టడం) వృత్తిగా తీసుకోవడానికి వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇంత అందంగా చీరలు కట్టే డాలీకి మొదట్లో చీరలు కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ తన అత్త ఆమెను చీర తప్పా మరో డ్రెస్‌ను ధరించనిచ్చేది కాదు. దీంతో చీరకట్టును అలవాటు చేసుకున్న డాలీ జైన్ దాంట్లోనే ప్రావీణ్యం సంపాందించి దాన్ని వృత్తిగా స్వీకరించారు. ఇండియన్ ఐడల్ 13 అనే రియాలిటీ షో పాల్గొన్న ఆమె ఆమె తన ప్రయాణం గురించి వివరించారు. ఏదో ఒకటి సాధించాలని కలలు కనే గృహిణులందరికీ డాలీ జైన్ నిజమైన స్ఫూర్తి. ఇదీ చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా -
డాలీతో చీర కట్టించుకోవాలంటే రూ.35 వేలు ఫీజు
వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. డాలీ చేత చీర కట్టించుకోవాలంటే కనీసం 35 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సిందే. 15 ఏళ్ల క్రితం చీర కట్టుకోవడాన్ని కష్టంగా మొదలుపెట్టి దానినే అభిరుచిగా మార్చుకొని ఇప్పుడు రికార్డులు కొట్టేస్తున్న బెంగళూరు మహిళ డాలీ జైన్ గురించి తెలుసుకోవాల్సిందే! నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అంటే పెద్ద కష్టం. నిన్నటి తరం అమ్మలు సౌకర్యం కోసం ఎప్పుడో కుర్తాలోకి మారిపోయారు. బెంగళూరుకు చెందిన డాలీ అనే మహిళ మాత్రం 15 ఏళ్లుగా వందల రకాల సై్టల్స్లో చీర కట్టడం అనే కాన్సెప్ట్‌ను సాధన చేస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్‌తోనే సక్సెస్‌నూ సాధిస్తోంది. బాలీవుడ్ తారలకు డాలీ కట్టు సందర్భానికి తగ్గట్టు రకరకాల స్టైల్లో చీరలు ధరించడం కూడా ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యమే ప్రత్యేకతగా కలిగిన డాలీ జైన్ బాలీవుడ్ నటిమణులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల సతీమణులకూ ఇష్టమైన సై్టలిస్ట్‌గా మారిపోయింది. డాలీ జైన్ ఖాతాదారులలో నీతా అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సోనమ్ కపూర్లు, ప్రియాంకాచోప్రా, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులకు కూడా డాలీ చీర కట్టింది. సబ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతాదారులకు డాలీ చీరలు కడుతుంది. అత్తమామల ఒత్తిడి పెళ్లికి ముందు డాలీ జీన్స్, టాప్స్ ధరించేది. పెళ్లయిన తర్వాత అత్తారింట్లో చీరకట్టుకోవాల్సిందే అన్నారు. ఆ నిర్బంధంలో డాలీ చీర కట్టుకోవడం నేర్చుకుంది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ – ‘మొదట్లో మా ఇంట్లో వాళ్ల మీద చాలా కోపంగా ఉండేది. కానీ, చీర కట్టుకోవడం నేర్చుకున్నాక దానిని స్టైల్‌గా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు విభిన్న రకాల చీరకట్టు పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రెడిట్ అంతా మా అత్తమామలకే. పెళ్లి తర్వాత వాళ్లు జీన్స్, టాప్స్ వేసుకోవడం ఒప్పుకునుంటే ఎప్పటికీ చీరకట్టులో నైపుణ్యం సాధించేదాన్ని కాదు’ అని నవ్వుతూ చెబుతుంది డాలీ. రికార్డుల డ్రేపింగ్ ఒక చీరను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో డాలీ పేరు నమోదయ్యింది. రెండవసారి ఒక చీరను 325 విధాలుగా కట్టి తన రికార్డును తనే బద్దలు కొట్టింది. అంతేకాదు, ఒకటిన్నర సెకన్లలో చీరను కట్టి రికార్డు సృష్టించింది. 2015లో ‘స్ట్రాంగ్ వుమన్ ఆఫ్ ఆనర్‘ను కూడా అందుకుంది. మనలోని చిన్న ప్రతిభ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. కష్టపడటం, అంకితభావంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అనే పెట్టుబడి మాత్రమే మనం పెట్టాల్సింది అని డాలీ నిరూపిస్తోంది. -
అందమంతా చీరలో కాదు..
చెంగావి రంగు చీర కట్టుకున్నా చూసేవాళ్ల దిమ్మదిరగాలంటే, అందమంతా చీరలో కాదు.. అది కట్టుకున్న తీరులో ఉండాలి. కంచి పట్టయినా, ధర్మవరం నేత చీరైనా.. రోజువారీ కట్టునే అనుసరిస్తూ ఒంటికి చుట్టుకుంటే సాదాసీదాగా ఉంటుంది. అదే కొంగును ముందుకు వచ్చేలాగానో.. కుచ్చిళ్లకు, కొంగుకు ముడి వేసి చూపిస్తేనో కొత్తగా ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా చీరలు చుట్టడంలో డాలీ జైన్ ఎక్స్పర్ట్. ఎంతలా అంటే రకరకాల చీరలను.. విధవిధాలుగా.. కడుతూ అతివలకు అదనపు సొబగులు అద్దుతున్నారు. డాలీ జైన్ పుట్టింది, పెరిగింది బెంగళూరులో. పెళ్లయ్యే వరకు ఆమెకు చీరంటే ఏంటో తెలియదు. వెస్ట్రన్ డిజైనింగ్స్ ఫాలో అయ్యే డాలీ.. యూనిక్ కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనేది. పెళ్లి డాలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె మెట్టినింట్లో చీర తప్ప మరో కాస్ట్యూమ్‌కు అవకాశం లేదు. గత్యంతరం లేక చీర కట్టడం మొదలుపెట్టింది. అందరు కట్టేలా తనూ కడితే మజా ఏముంటుందని తన మార్క్ చూపించాలనుకుంది. డిఫరెంట్‌గా చీరలు కట్టుకోవడం సాధన చేసింది. ఓ రోజు ఫ్రంట్ పల్లుతో దర్శనమిస్తే.. మరో రోజు గుజరాతీ కట్టులో కనిపించేది.. ఇంకో రోజు కేరళ కుట్టీలా చీర చుట్టుకునేది. ఇలా రోజుకో చీరావతారంలో కనిపించి అత్తింటి వాళ్లను, వారి బంధువుల మనసులు గెలుచుకోవడమే కాదు, వారికీ చీరలు కట్టేది. 6 గజాల చీరలే కాదు, బామ్మల జమానా నాటి 9 గజాల చీరలతో కూడా ప్రయోగాలు చేసేది. తనలో ఉన్న క్వాలిటీని గ్రహించిన డాలీ.. చీర కట్టడాన్నే ప్రొఫెషన్‌గా మలచుకుని శారీ డ్రేపర్ అవతారం ఎత్తింది. చీరతో కనికట్టు.. శారీ డ్రేపర్‌గా మారాక డాలీ దూకుడు పెంచిం ది. దేశంలోని అన్ని సంప్రదాయాలను ఫాలో అవుతూ.. వాటన్నింటినీ చీరకట్టులో చూపిం చేది. బెంగాలీ, రాజస్థానీ చీరకట్టును మిక్స్ చేసి చూపింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో చీరలు చుట్టిన డాలీ తర్వాతి కాలంలో, సెలబ్రిటీల ఇళ్లలో ఈవెంట్లకు శారీ డ్రేపర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది. యుక్తాముఖి, దియా మీర్జా, తనుశ్రీ దత్తా, కంగనా రనౌత్ వీళ్లందరినీ చీరకట్టి సింగారించింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ పెళ్లికి ఉపాసనకు చీర చుట్టింది ఈవిడే. హిప్ హాప్, టైట్ ఫిట్, ఫిష్ స్టయిల్, హాఫ్ ముంతాజ్ ఇలా శారీ వేరింగ్ ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఒళ్లున్న వారిని లావుగా కనిపించకుండా, పొట్టి వారిని.. ఆ లోపం కనిపించకుండా చీరకట్టుతో కనికట్టు చేస్తుంది. రికార్డులు చుట్టి.. శారీ డ్రేపింగ్‌లో ఎప్పటికప్పుడూ కొత్తదనం చూపిస్తున్న డాలీ అందులో రికార్డులు కూడా సొంతం చేసుకుంది. 80 డిఫరెంట్ స్టయిల్స్‌లో చీరలు చుట్టి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒక్కో చీరను 19 సెకండ్లలో చుట్టి వహ్వా అనిపించుకుంది. తర్వాత ఒక్కో చీరను 18.5 సెకండ్లలో కడుతూ 125 డిఫరెంట్ స్టయిల్స్‌ను చూపించి తన రికార్డును తనే చుట్టేసింది. తాజాగా 225 చీరకట్టుల ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. ‘తరతరాల నుంచి వస్తున్నా చీరలు ఎప్పటికప్పుడూ నయా ట్రెండ్గానే కనిపిస్తాయి. అది చీర గొప్పదనమే. అందులో వస్తున్న కొత్త కొత్త స్టయిల్స్ శారీని నిత్య నూతనంగా ఉంచుతున్నాయి’ అని చెబుతున్న డాలీ శనివారం తాజ్‌బంజారాలో శారీ డ్రేపింగ్ వర్క్‌షాప్ నిర్వహించింది.