Deepavali Festival
-
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
ఈసారి దీపావళికి చీరను వెరైటీగా కట్టుకోండిలా..!
పండుగ టైంలో కూడా ఎప్పుడు కట్టుకునే విధంగానే డ్రెస్ లేదా చీరని కట్టుకుంటే కలర్ఫుల్నెస్ ఏముంటుంది..?. జోష్ ఏం వస్తుంది. ఏదైనా వెరైటీగా చేస్తేనే కదా..! పండగ మొత్తం మన నుంచే జరుగుతుందేమో..! అనేలా కనిపించాలి ఆహార్యం. అందుకు తగట్టు మన కట్టు, బొట్టు తీరు అదరహో అనే రేంజ్లో ఉండాలి. అందులోనూ ఇంకొద్ది రోజుల్లోనే దీపావళి వస్తోంది. మిరమిట్లుగొలిపే దీపాల కాంతిలో మనం ధరించే డ్రెస్ లేదా చీర అత్యంత శోభాయమానంగా కనిపించాలి. అందుకోసం ఈసారి చీరను ఇలా ఇన్ని రకాలుగా కట్టుకుని సందడి చేసేందుకు ప్రయత్నిద్దామా..!.సెలబ్రిటీలకు చీరలు కట్టే డాలీ జైన్ డ్రేపింగ్ టెక్నీక్లతో ఈసారి పండగకు చీర కట్టుకుని అసలైన సందడిని, జోష్ని తెద్దామా..!. డాలీ రాధికా మర్చంట్ నుంచి నీతా వరకు ఎంతో మంది ప్రముఖులకు స్టైలిష్‌గా చీరలు కట్టేస్తుంది. ఒక్క చీరతోనే లెహంగా స్టైల్, వెస్ట్రన్, గుజరాతీ స్టైల్లో చీరలు కట్టేస్తుంది. ఆమె చీర కట్టు తీరుకు సంబంధించిన ఓ ఐదు టెక్నీక్లు ఈసారి ట్రై చేసి చూద్దాం.మెర్మైడ్ తరహా చీరఈ శైలిలో కట్టే చీరను ముందుగా నడుమ చుట్టు చక్కగా దోపి ఒకవైపుకే చీరను కుచ్చిళ్లలా మడతపెట్టి కడతారు. ఇది ఫిష్‌టైల్ లెహెంగా రూపాన్ని సృష్టిస్తుంది. దీని పేరుకు తగ్గట్టు సాగర కన్య మాదిరిగా ఉంటుంది ఈ చీర కట్టు తీరు. ఈ స్టైల్ కోసం సన్నటి బార్డర్, ఫ్లీ ఫ్యాబిక్ ఉన్న చీరలకే బాగుంటుంది. ఈ చీర లుక్ కోసం సరైన బ్రాస్లెట్, చెవిపోగులు ధరిస్తే హైలెట్‌గా ఉంటుంది. లెహంగా చీరలెహంగాపై అందంగా చీరను చుట్టి ఓ కొత్త లుక్‌ని తీసుకొస్తారు. ఇందుకోసం విశాలమైన అంచుతో ఉన్న బనారసి లేదా కంజీవర చీర అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. జస్ట్ స్కర్ట్పైనే చీరను అందంగా కడతారు. ఇండో-వెస్ట్రన్ శైలి..ఆధునికత ఉట్టిపడేలా చీర కట్టుకోవాలనుకుంటే..చీరను వదులుగా ఉండే కుర్తా లేదా కేప్‌తో జత చేయాలి. ఈ ఇండో వెస్ట్రన్ చీర ఆధునికతకు కేరాఫ్‌గా ఉంటుంది. పైగా ఈతరహా స్టైల్ సౌలభ్యంగా కూడా ఉంటుంది. జలపాతం శైలి చీరసంప్రదాయ శైలిలో చీరను ధరించి.. అతిథులందరి కంటే భిన్నంగా ఉండాలంటే ఈ శైలి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. కొద్దిపాటి బార్డర్‌తో కూడిన చీర ఈ స్టైల్‌కి సరిపోతుంది. సిద్ధ పల్లు తరహా చీరఇది చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ శైలి సంప్రదాయబద్ధమైన లుక్‌ని తీసుకొస్తుంది. క్లాసిక్ గుజరాతీ శైలీ చీరలు ఈ తరహా కట్టుకి సరిపోతాయి. దీనికి మంచి బెల్ట్ ధరిస్తే చీర లుక్‌ని బాగా హైలెట్ చేస్తుంది. (చదవండి: ఊహకే అందని రైడ్..ఐతే అక్కడ మాత్రమే..!) -
తిరుమలలో వైభవంగా దీపావళి ఆస్థానం
-
విశాఖపట్నంలో ఘనంగా దీపావళి సంబరాలు
-
తిరుపతి, విజయవాడలో దీపావళి సంబరాలు
-
ప్రజలకు సీఎం వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
-
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఇప్పటికే పలువురు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు వడ్డీని పొందారు. ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న నిల్వలపై 8.15 శాతం వడ్డీ చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈపీఎఓ ఖాతాలో వడ్డీ జమైందో లేదో అని తెలుసుకునేందుకు ఖాతాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా వారి పాస్‌బుక్‌ను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలంటే? ♦ https://www.epfindia.gov.in/ site_en/For_Employees.php ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి ♦ హోమ్‌పేజీలో 'సర్వీస్' పై క్లిక్ చేసి, 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ని ఎంచుకోండి ♦ ఆపై 'మెంబర్ పాస్‌బుక్' లింక్‌పై క్లిక్ చేయండి. మీకు అక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ♦ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి అకౌంట్లో లాగిన్ అవ్వండి. ♦ అనంతరం మీరు మీ ఖాతా వివరాలను ఎంటర్ చేసి ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే ♦ ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఇందుకోసం ఓటీపీ లేదా ఎంపీఐఎన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ♦ లాగిన్ చేసిన తర్వాత ఈపీఎఫ్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ♦ కాన్ వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. ♦ ఆ తర్వాత మీ యూఏఎన్‌ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి ♦ ఓటీపీని ఎంటర్ చేయండి ♦ ఇప్పుడు మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతా వివరాలను చూడవచ్చు. మెంబర్ ఐడిని సెలక్ట్ చేసుకుని ఇ-పాస్‌బుక్‌ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేయండి మీరు మీ యూఏఎన్‌ని ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఖాతా బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "EPFOHO UAN ENG"ని 7738299899కి పంపండి. వెంటనే మీకు మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ మొబైల్ నెంబర్‌కి మెసేజ్ వస్తుంది. 40ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీరేట్లు ఈపీఎఫ్ వడ్డీరేట్లను ఖాతాదారుల అకౌంట్లలోకి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) జమ చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కోసం సీబీటీ ప్రతి ఏడాది ఆదాయం, నిర్వహణ ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఓ బడ్జెట్‌ను తయారు చేస్తుంది. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ♦తాజా సమాచారం ప్రకారం, కోవిడ్ కారణంగా ఈపీఎఫ్ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.1శాతానికి తగ్గించింది. 40ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. అయితే నాలుగు దశాబ్దాల తర్వాత కోవిడ్ కారణంగా వడ్డీని తగ్గిస్తూ వచ్చింది. ♦గత ఆర్థిక సంవత్సరం 2021-22తో పోలిస్తే 13.22శాతం పెరుగుదలతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకి 1.39 కోట్ల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. -
దీపావళి - ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?
-
స్విట్జర్లాండ్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
స్విట్జర్లాండ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి గారు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
గ్రహణాలు వీడాలి!
దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. ‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది. దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు. ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు. సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు. హైదరాబాద్ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు. ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం. ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి. ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. -
స్వీట్లు, టపాసుల దుకాణాల వద్ధ కొనుగోలుదారుల సందడి
-
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్‌మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో అనిశ్చిత కాలంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్‌మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్‌మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్‌మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్‌ను వివరించే చార్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లలో మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
కొనకుండానే పేలుతున్న టపాకాయలు..!
-
Diwali 2022: నరక చతుర్ధశి.. అనేక పేర్లు... అనేక ఆచారాలు.. ఈ విషయాలు తెలుసా?
నరక చతుర్ధశి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నరకం నుంచి విముక్తి కోసం చేసే యమ ధర్మరాజు ప్రీత్యర్థం జరుపుకొనే పండుగగా ‘నరక చతుర్దశి’ మొదలైందట. కానీ, ఆ తరువాతి కాలంలో నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన సందర్భాన్ని పురస్కరించుకొని.. ‘నరక చతుర్దశి’ జరుపుకోవడం ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక పేర్లు... అనేక ఆచారాలు నిజానికి నరక చతుర్దశికి అనేక పేర్లున్నాయి. ‘ప్రేత చతుర్దశి’, ‘కాళ చతుర్దశి’ అని కూడా అంటారు. ‘కాళ’ అంటే అంధకారం అని అర్థం! అలా ఇది ‘అంధకారపు చతుర్దశి’. గుజరాతీయులు ‘కాల చౌదశ్’ అంటారు. ఆ రోజుకూ, కాళీ మాతకూ సంబంధం ఉందనేవారూ ఉన్నారు. దీన్ని ‘కాళీ చౌదశ్’గా పేర్కొంటూ, అంధకారాన్ని రూపుమాపే కాళీ దేవతను ఆ రోజు పూజిస్తారు. నరకాసుర కథ పురాణాల ప్రకారం నరకాసురుడు దేవతల్నీ, మానవుల్నీ హింసించేవాడు. అనేక రాజ్యాలను జయించి, 16 వేల మంది రాకుమార్తెల్ని చెరపట్టాడు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు దేవతల, మానవుల ప్రార్థన మేరకు నరకాసురునితో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని భార్య సత్యభామ యుద్ధక్షేత్రంలో భర్తకు సహకరించింది. కృష్ణుడు నరకాసురుణ్ణి వధించి, రాకుమార్తెలను చెర నుంచి విడిపించాడు. ‘ఈ తిథి నాడు ఎవరైతే మంగళస్నానం చేస్తారో, వారికి నరకలోక భయం లేకుండా ఉండేలా అనుగ్రహించాల్సింది’ అంటూ నరకుడు, శ్రీకృష్ణుణ్ణి వరం కోరాడు. ఆయన అనుగ్రహించాడు. అందుకే ‘నరక చతుర్దశి’ నాడు ప్రధాన కర్తవ్యం తెల్లవారగట్టే లేచి తలంటి స్నానం చేయడం! నరకాసుర దహనం మహారాష్ట్రీయులకు ఇది ముఖ్యమైన పండుగ. పశ్చిమ బెంగాల్లో పందిళ్ళు వేసి, దేవతా విగ్రహాలను పెట్టి, పూజలు జరుపుతారు. గోవా లాంటి చోట్ల ఈ పండుగను ‘దసరా’ లానే జరుపుకొంటారు. దసరాకు రావణాసురుడి దిష్టిబొమ్మలు చేసి, దహనం చేస్తారు. నరక చతుర్దశికేమో నరకాసురుడి బొమ్మ దహనం చేస్తారు. వేకువనే బొమ్మ దహనం చేసి, టపాకాయలు కాల్చి, ఇంటికి వచ్చి తలంటు స్నానం చేస్తారు. తలంటు స్నానం... యమతర్పణం... దీపదానం తెల్లవారే తలంటు పోసుకొని, పాపక్షయం కోసం ప్రార్థించాలి. యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. దీపం వెలిగించాలి. అలాగే, ఆ రోజున నరకం నుంచి ముక్తి కోసం సాయంకాలం ప్రదోషకాలంలో యమ ధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని ‘వ్రతచూడామణి’ చెబుతోంది. దేవాలయాల్లో, మఠాల్లో దీపాలను వరుసగా ఉంచాలి. అందుకే, నరక చతుర్దశినే ‘యమ దీపదాన్’ అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి సంప్రీతి కోసం ఇలా నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి - వరుసగా మూడు రోజులూ దీపప్రదానం చేయాలి. ఈ పండుగ 14వ తిథి నాడు జరుగుతుంది కాబట్టి, 14 రకాల కూరగాయలతో వంటకాలు చేస్తారు. దేవుడి సంప్రీతి కోసం ఒక సద్బ్రాహ్మణుణ్ణి దేవుడిగా భావించి, అతనికి భోజనం పెడతారు. ఆ తరువాత అందరూ భోజనం చేస్తారు. నాలుగు వత్తుల దీపంతో... సాయంత్రమయ్యాక ప్రదోషకాలంలో పూజ చేస్తారు. నరకం పాలు కాకుండా ఉండేందుకూ, పాపాలన్నీ పోగొట్టుకొనేందుకూ ఆ సమయంలో నాలుగు వత్తులతో సంప్రదాయబద్ధంగా ఒక దీపం వెలిగిస్తారు. ‘దత్తో దీప శ్చతుర్దశ్యామ్ నరక ప్రీతయే మయా, చతుర్వర్తి సమాయుక్తః సర్వపాపాపనుత్తయే’ అంటూ ‘లింగ పురాణం’లోని శ్లోకం చదువుతారు. ఈ చతుర్దశికి నరకాధిపతి ప్రీతి కోసం, పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ నాలుగువత్తుల దీపం వెలిగిస్తున్నానని అర్థం. అలాగే శివపూజ చేస్తారు. కాళీపూజ దీపావళి అనగానే ఎక్కువగా లక్ష్మీపూజ గుర్తొస్తుంది. కానీ, బెంగాల్ ప్రాంతంలో నరక చతుర్దశి రోజు రాత్రి అంతా కాళీపూజ చేస్తారు. అందుకే, అక్కడ ఆ రోజును ‘కాళీపూజా దినం’గా పిలుస్తారు. మొత్తం మీద నరకం అంటే, అజ్ఞానమనీ, అంధకారమనీ, పాపాల కూపమనీ కూడా అర్థం చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుంచి విముక్తి కోరుకొనే పండుగ కాబట్టే, దీనికి ఇంత విశిష్టత. - రెంటాల జయదేవ చదవండి: Narak Chaturdashi: తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోక కంటకుడై! చివరికి Walnut Halwa: వాల్నట్ రుచి లేదని పక్కనపెడుతున్నారా? ఇలా హల్వా ట్రై చేయండి! -
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
Diwali 2022: ఈ ఏడాది దీపావళిపై సందిగ్దత.. ఎప్పుడు జరుపుకోవాలి?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి వెనక రెండు కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసున్ని సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో లంకలో రావణుడిని హతమార్చి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత అయోమయం తలెత్తింది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే మరికొంతమంది నవంబర్ 25న ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించారని కాబట్టి ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు.. దీంతో కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమావాస్య రాత్రి తిథి ఉండగా దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్ 24వ తేదీన దీపావళి వేడక నిర్వహించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సాయంత్రం 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. రాత్రి సమయాల్లో అమావాస్య తిథి 24వ తేదీనే ఉండటం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. -
Panjagutta: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ..
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: పంజాగుట్టలో దారుణం.. పాపం.. పసిపాప! చదవండి: యువతులకు డబ్బును ఎరగా చూపి వ్యభిచారం.. -
దీపావళి వేడుకల్లో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ దంపతులు
డల్లాస్, టెక్సాస్: ప్రవాస భారతీయులతో కలిసి టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన సతీమణి సిస్లియాతో కలసి టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ లోని తన నివాస గృహంలో త్సాహంగా పండుగ జరుపుకున్నారు. దీపావళి సంకేతంగా పలు దీపాలను గవర్నర్ దంపతులు వెలిగించార. అందరికీ విందుభోజనం తో పాటు మిటాయిలు పంచారు. మరిచిపోలేని అనుభూతి ఈ సందర్భంగా గవర్నర్ అబ్బాట్ మాట్లాడుతూ.. అమెరికా దేశ ప్రగతిలో ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్ర పురోభివృద్ధికి వివిధ రంగాలలో ప్రవాస భారతీయులు చూపుతున్న ప్రతిభ అనన్య సామాన్యం అన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం తనకొక ఒక ప్రత్యేక అనుభూతి పంచిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. భారత దేశం టెక్సాస్ రాష్ట్రాల మధ్య ఇప్పటికే గణనీయమైన వాణిజ్య సంభందాలున్నాయని, భవిష్యత్తులో అవి ఇంకా పెరుగుతాయనే నమ్మకం ఉందన్నారు. కృతజ్ఞతలు భారత్, టెక్సాస్ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక, వాణిజ్య సంబంధాలు మెరుగు పరిచేందుకు గవర్నర్ చేస్తున్న కృషి అమోఘమని ప్రముఖ పారిశ్రామికవేత్త అరుణ్ అగర్వాల్ అన్నారు. అధికారిక నివాస గృహంలో ప్రవాస భారతీయల మధ్య దీపావళి పండుగ జరుపుకున్న గవర్నర్ అబ్బాట్ దంపతులకు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మురళి వెన్నం, సుధాకర్ పేరం, వినోద్ ఉప్పు, సంజయ్ సింఘానియా, డాక్టర్ గూడూరు రమణా రెడ్డి, గొట్టిపాటి వెంకట్, సునీల్ రెడ్డి, వెంకట్ మేడిచెర్ల, బంగారు రెడ్డి, సునీల్ మైని, ఏకే మాగో, పియూష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా'
న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'నేను ప్రధానిగా రాలేదు.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా. సైన్యం కోసం 130 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకొచ్చా. ప్రతీ దీపావళి సైనికులతో జరుపుకుంటున్నా. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉంది. సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారు. సర్జికల్ స్ట్రైయిక్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణం. దేశానికి సైన్యం సురక్షా కవచం' అని అన్నారు. दीपावली के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि यह प्रकाश पर्व आप सभी के जीवन में सुख, संपन्नता और सौभाग्य लेकर आए। Wishing everyone a very Happy Diwali. — Narendra Modi (@narendramodi) November 4, 2021 -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు
-
వాట్సాప్‌లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!
దీపావళి పండుగ వచ్చిందంటేనే మన అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి అంటేనే మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజున మన సంతోషాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో శుభాకాంక్షలు తెలపడం ద్వారా పంచుకోవాలని భావిస్తూ ఉంటాం. మరి ఎప్పటిలాగానే దీపావళి శుభాకాంక్షలు టైపు చేసి తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్‌లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ స్టిక్కర్ మీ మిత్రులకు, బందువులకు శుభాకాంక్షలు తెలపండి. ఎలా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ పంపించాలని ఆలోచిస్తున్నారా?. ఈ కింద చెప్పిన విధంగా చేయండి. దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా! మొదట ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చాట్ బార్ లోని స్మైలీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎమోజీ బోర్డు దిగువ నుంచి స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోండి. తర్వాత 'ప్లస్' ఐకాన్ మీద నొక్కండి. హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ కోసం సర్చ్ చేయండి. మీకు కనబడకపోతే ఈ లింకు ద్వారా హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు మీ స్టిక్కర్ బోర్డులో చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీకు నచ్చినవారికి "హ్యాపీ దీపావళి" స్టిక్కర్ పంపించవచ్చు. (చదవండి: జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు) -
చూస్తే చాలు కళ్లు చెమరుస్తాయి.. దీపావళి వేళ.. మనసును హత్తుకునేలా
దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్మార్కెట్లో ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి. వీటి తీరే వేరు సాధారణంగా అన్ని యాడ్స్ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్, ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఇండియన్ ఆయిల్ యాడ్‌లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్ షాప్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్ చూడమంటూ కలాకాన్ అందిస్తుంటాడు. ఈ షాప్‌లోని సేల్స్‌మేన్ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్ మిగిలి ఉందా అని సేల్స్‌మేన్ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్‌మ్యాన్ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. Sometimes, the smallest gesture can light up someone's world. This festive season, let's celebrate all such moments and spread good cheer and warmth.#IndianOil #Indane #XTRATEJ #HappyDiwali pic.twitter.com/s7Xkei8vhF — Indian Oil Corp Ltd (@IndianOilcl) November 2, 2021 మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌తో యాడ్ మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. దీపావళి యాడ్స్‌కి స్పెషల్ ట్రెండ్‌ని క్రియేట్‌ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్‌పీ ప్రింటర్స్ యాడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్ అడ్వెర్టైజ్మెంట్కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్‌పీ సంస్థ యాడ్‌ను రెడీ చేసింది. కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్ రూపొందించిన యాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్ అండ్ టీ యాడ్ ఎండింగ్లో ఇచ్చే ట్విస్ట్‌తో మరో లెవల్‌కి చేరుకుంటుంది. వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్ రూపొందించిన యాడ్ కూడా ఆకట్టుకుంటుంది. -
చిరు వ్యాపారులకు భారీ షాకిచ్చిన కేంద్రం.. గ్యాస్ ధర ఏకంగా..
అనుకున్నట్టే అయ్యింది. అంతా భయపడ్డట్టే జరిగింది. తనకు కనిరకరం లేదని మరోసారి కేంద్రం చాటుకుంది. పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపుతోనే సతమతం అవుతున్న ప్రజానీకంపై ఈసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో విరుచుకుపడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేసేంది. రూ.266 రకరకాల కారణాలు చెప్పి ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మారినట్టుంది. దాదాపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్లు సరిపోవన్నట్టు తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకాఎకిన రూ. 266లు పెంచింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధర రెండు వేల రూపాయలకు అటుఇటుగా నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1905.32కి చేరుకుంది. చిరువ్యాపారులకు ఇక్కట్లే ఆగస్టు 17న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం పెంచింది. ఆ తర్వాత రెండు నెలల విరామం ఇచ్చింది. అయితే రెండు నెలల విరామం ఉపశమనం పొందామనే భావన రానీయకుండా ఈసారి ఒకేసారి రూ.266 వంతున ధరను పెంచేసింది. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస సిలిండర్ ధరతో చిరువ్యాపారులు, స్ల్రీట్ఫుడ్ వెండర్ల కష్టాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతోంది. కరోనాతో పోయిన ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంటే.. ఆ ఆనందం క్షణకాలం కూడా నిలవకుండా పెరుగుతున్న గ్యాస్ ధరలు హరించివేస్తున్నాయి. దీపావళికి ముందే గత వారం రోజులుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయనే ఫీలర్లను ప్రభుత్వం వదులుతూ వస్తోంది. దీపావళి తర్వాత పెంపు ఉండవచ్చని భావించారు. కానీ అంతకు ముందే ధరను కేంద్రం పెంచింది. అది కూడా రికార్డు స్థాయిలో రూ.266గా ఉండటం గమనార్హం. రెండు నెలల్లో గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీలను క్రమంగా ఎత్తివేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గడిచిన రెండు నెలల కాలంలోనే గృహ, వాణిజ్యపరమైన సిలిండర్ల ధరలు నాలుగు సార్లు పెరిగాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై సెప్టెంబరులో రూ. 15 వంతున, అక్టోబరులో రూ. 25వంతున ధర పెంచింది. ఈ ఏడాది మొత్తంగా పరిశీలిస్తే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.205 వంతున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 952లుగా ఉంది. చదవండి: బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ ! -
హమ్మయ్య.. ఊపిరాడింది!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజన్లకు ఇది శుభవార్త. దీపావళికి కాల్చిన బాణసంచాతో వెలువడే కాలుష్యం గతేడాది దీపావళితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈసారి మహానగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరగడం, లాక్డౌన్, కోవిడ్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేక బాణసంచా కొనుగోళ్లు 40 శాతం మేర తగ్గాయి. దీంతో కాలుష్యం తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రధానంగా వాయుకాలుష్యంలోని సూక్ష్మ, స్థూల ధూళికణాల కాలుష్యం గతేడాది కంటే తగ్గుముఖం పట్టగా..సల్ఫర్‌డయాక్సైడ్ కాలుష్యం స్వల్పంగా పెరగడం గమనార్హం. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ల కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ తాజానివేదికలో వెల్లడైంది. శబ్దకాలుష్యం సైతం గతేడాది కంటే స్వల్పంగా తక్కువ నమోదుకావడంతో సిటీజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతేడాది దీపావళి, ప్రస్తుత దీపావళి రోజున నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన శబ్ద, వాయు కాలుష్యం డేటాను సోమవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసింది. చదవండి: ఎట్టకేలకు తల్లి చెంతకు.. తగ్గిన వాయు కాలుష్యం.. గ్రేటర్ పరిధిలో గతేడాది దీపావళి పర్వదినంతో పోలిస్తే ఈ సారి వాయుకాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉదాహరణకు సూక్ష్మ ధూళికణాల మోతాదు గతేడాది పండగరోజున ఘనపు మీటరుగాలిలో 72 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి పర్వదినం రోజున కేవలం 64 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. ఇక స్థూల ధూళికణాల మోతాదు గతేడాది దీపావళి రోజున 163.4 మైక్రోగ్రాములు నమోదుకాగా..ఈ సారి కేవలం 128 మైక్రోగ్రాములు మాత్రమే నమోదైంది. కాగా ఈ సారి సల్ఫర్‌డయాక్సైడ్ కాలుష్య కారకం మోతాదు స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. చదవండి: ముంబైలో తగ్గిన దీపావళి సప్పుడు స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం.. నగరంలో పలు పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో పీసీబీ శబ్ద కాలుష్యాన్ని నమోదు చేసింది. గతేడాది నివాస ప్రాంతాల్లో పగలు 69 డెసిబుల్స్..రాత్రివేళ 64 డెసిబుల్స్ కాలుష్యం నమోదుకాగా..ఈ సారి(2020 దీపావళి) పగలు 59 డెసిబుల్స్..రాత్రి 63 డెసిబుల్స్ మేర శబ్దకాలుష్యం నమోదైనట్లు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. కాలుష్యం తగ్గడానికి కారణాలివే.. ♦ సిటీజన్లలో పర్యావరణ స్పృహ పెరగడం ♦ కోవిడ్ రోగులు, కోవిడ్ నుంచి ఇటీవలే కోలుకున్నవారు, శ్వాసకోశ సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు స్వేచ్ఛగా శ్వాసించేందుకు అసౌకర్యం కలుగుతుందన్న భావన. ♦ కోవిడ్, లాక్డౌన్ కష్టాల నేపథ్యంలో చేతిలో నగదు నిల్వలు లేకపోవడం. ♦ క్రాకర్స్‌పై నిషేధం విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు నిషేధం ఉత్తర్వులు జారీచేయడంతో వినియోగదారులు అయోమయానికి గురవడం. -
తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్