సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ మరింత లాభాలు గడించడంతో పాటు అభివృద్ధి పథంలో పయనించాలంటే నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ముందుకు పోవాలని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు కింద రూ.310 కోట్ల దీపావళి బోనస్‌ను సింగరేణి ఉద్యోగులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బుధవారం నగరంలోని సింగరేణి భవనంలో ప్రారంభించారు. సింగరేణి భవన్‌లోని కొందరు ఉద్యోగులకు బోనస్ పే స్లిప్‌లను పంపిణీ చేశారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల వద్ద దీపావళి బోనస్ పంపిణీ చేస్తున్నామన్నామని ఆయన తెలిపారు. గతేడాది రూ.48,500 బోనస్ చెల్లిస్తే ఈ ఏడాది రూ.54 వేలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు మనోహరరావు, పవిత్రన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.