సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అధిరన్’. తెలుగులో ‘అనుకోని అతిధి’. ఈ మూవీలో సాయిపల్లవి ఇప్పటివరకు పోషించనట్టువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్, సాయి పల్లవి లుక్ తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా దీపావళి శుభాకంక్షలు తెలుపుతూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. టీజర్‌ను పరిశీలిస్తే సాయి పల్లవి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. వివేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుంది.