సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు బుధవారం రూ.310 కోట్ల దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ ఎం.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్‌గా రూ.54 వేలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. 2015–16లో అండర్ గ్రౌండ్ ఉద్యోగులు 190 మస్టర్లు, సర్ఫేస్ ఉద్యోగులు 240 మస్టర్లు కలిగి ఉంటేనే చెల్లింపులు జరుపుతామని, అంతకు తక్కువైతే మస్టర్ల ప్రాతిపదికన చెల్లిస్తామని, 30 కంటే తక్కువ మస్టర్లు ఉంటే బోనస్‌కు అనర్హులని పేర్కొన్నారు. సంస్థ ఆర్జించిన లాభాల్లో 23% (రూ.245.21 కోట్లు) సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దసరా సందర్భంగా ఈ నెల 7న ఉద్యోగులకు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు.