చిన్నారి మృత దేహం లభించిన ప్రాంతం
హైదరాబాద్: పంజగుట్టలో చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు.. చిన్నారి మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.
పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో నవంబరు 4న దీపావళిరోజు సుమారు నాలుగేళ్ల బాలిక మృతదేహం.. ద్వారకా పూరి కాలనీ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 వెళ్లే మార్గంలో వాడుకలోలేని హస్తకళ ఎంబ్రైడర్స్ దుకాణం ముందు ఉండటం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment