జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: కమిషనర్‌ను కలిసేందుకు ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీకి వచ్చే వారు, పోయే వారు స్క్రీన్‌లపైనా కనబడేలా కొత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం.. పరిసరాల్లో దాదాపు 40 వరకు సీసీటీవీ కెమెరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వస్తున్నారో దృశ్యాలు వాటిల్లో నిక్షిప్తమవుతున్నాయి.
ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిల్లో నమోదయ్యే దృశ్యాలు స్క్రీన్‌లపై అందరికీ కనిపించేలా కూడా మేయర్ ఎంట్రెన్స్, కమిషనర్ ఎంట్రెన్స్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న స్క్రీన్‌పై నగరంలోని ఆయా ప్రాంతాల్లోని దృశ్యాల్ని కూడా వీక్షించే ఏర్పాట్లున్నాయి. వరదలు, గణే శ్ నిమజ్జనం వంటి సందర్బాల్లో మేయర్, అధికారులు నగర పరిస్థితుల్ని పరిశీలించేందుకు సదరు ఏర్పాట్లు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment