LPG cylinders
-
పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు!
దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు శుభవార్త చెప్పింది. భారత్ గ్యాస్ (Bharatgas), ఇండేన్ (Indane), హెచ్‌పీ( HP) సంస్థల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది పేటీఎం. వినియోగదారులు మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్, అదే Paytm వాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్ చేస్తే రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వీటితో పాటు అదనంగా, యూజర్లు తమ బుకింగ్‌ను ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ ఆఫర్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ వర్తిస్తుందని ప్రకటించింది. కొత్త వినియోగదారులు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందడానికి "FIRSTGAS" కోడ్, పేటీఎం వాలెట్‌ని ఉపయోగించి సిలిండర్ల బుకింగ్ చేసే యూజర్లు "WALLET50GAS" కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత, యాప్ బుకింగ్ వివరాలను కూడా సేవ్ చేస్తుంది, తద్వారా తదుపరి బుకింగ్ కోసం యూజర్లు 17-అంకెల ఎల్పీజీ ఐడీ(LPG ID) తదితర వివరాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ బుకింగ్ ప్రక్రియ పూర్తవగానే మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ చేస్తుంది. చదవండి: బంపర్ ఆఫర్..ఆ క్రెడిట్ కార్డ్ ఉంటే 68 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఫ్రీ! -
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు
ప్రకాశం జిల్లా కోమరోలు మండలం దద్దవాడ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. ఈ భారీ శబ్దాలకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. కర్నూలు నుండి ప్రకాశం జిల్లా ఉలవపాడుకి వెళ్తున్న ఈ లారీలో మొత్తం 300 సిలిండర్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. మంటలు రావడం గమనించి లారీ నుంచి దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చదవండి: మార్గదర్శి కేసులో హైకోర్టు స్టే -
అసమర్థ ఆర్థిక విధానాలతో వంట గదిలో మంట..
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో గ్యాస్ ధరలు పెరిగి వంట గదుల్లో మంట పుడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడియకోమారు పెరుగుతున్న గ్యాస్ ధరలతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని, ఎనిమిదేళ్లలో వంట గ్యాస్ సిలిండర్ ధర 170 శాతం పెరిగి రూ.1,100 దాటిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ రేటుకు సిలిండర్‌ను అమ్ముతున్న రికార్డును మోదీ ప్రభుత్వం సాధించిందని ఎద్దేవాచేశారు. రాయితీని కూడా ఎత్తివేసి మోదీ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘ఓ వైపు రూపాయి విలువ తగ్గుతూ, మరోవైపు పెట్రో ధరలు పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు పెరిగి భారతీయులకు కుటుంబ బడ్జెట్ భారంగా మారింది. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయం పడిపోయినా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం కనికరం లేకుండా ధరల పెంపుతో పీల్చి పిప్పిచేస్తోంది. అధికారంలోకి రాకమునుపు వంట గ్యాస్ ధరలపై గొంతు చించుకున్న మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని మోదీ పన్నులు పెంచడాన్ని సుపరిపాలనగా భావిస్తున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ కుటిలనీతిని గమనిస్తున్నారు ‘గ్యాస్ ధరల పెంపునకు అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోదీ ప్రభుత్వ కుటిలనీతిని దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఉజ్వల పథకం పేరిట తమకు అంటగట్టిన గ్యాస్ సిలిండర్లకు బదులు లబ్ధిదారులు మళ్లీ కట్టెల పొయ్యి వైపు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ జుమ్లా జాబితాలో ఉజ్వల పథకం కూడా చేరింది. ఎన్నికల సమయంలో మాత్రమే ధరలను నియంత్రించినట్లు దొంగ నాటకాలు ఆడే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేదల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాలు, ధరల పెంపుపై టీఆర్ఎస్ నిరంతరం వివిధ రూపాల్లో ఒత్తిడి కొనసాగిస్తుంది’ అని కేటీఆర్ చెప్పారు. ధరల పెంపుపై టీఆర్ఎస్ నిరసన కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్శ్రేణులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. అన్ని మండల, పట్టణ, డివిజన్ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాయి. పలుచోట్ల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఫ్లకార్డులతో నిర్వహించిన నిరసనకు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వం వహించారు. రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలతో మానవహారం నిర్వహించారు. -
మరికొద్ది గంటల్లో తెల్లారుతుందనంగా... తెల్లారిన బతుకులు
శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏం జరిగిందంటే.. ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్ సెంటర్లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్ సాహెబ్ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్ సాహెబ్ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్ ఇంట్లో లైట్లు ఆన్ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్ సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉలిక్కిపడిన గ్రామం.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అంత్యక్రియలకు వెళ్లివచ్చి... దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి దిగ్భ్రాంతి.. ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్ నాగరాజు, మన్సూర్ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ నాగరాజు, ఎస్ఐ యువరాజ్ సమక్షంలో వైఎస్సార్ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజు, వ్యవసాయ మిషన్ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. – అబ్దుల్ రహమాన్, ములకలేడు (చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్ చేశారు) -
ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంతు..భారీగా పెరిగిన ధరలు...!
LPG Gas Price Hike: గత పది రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులకు కంటికునుకు లేకుండా పోయింది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పెంచాయి. కాగా డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిలిండర్‌పై ఏకంగా రూ. 250 పెంపు..! 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా రూ. 250 పెంచేశాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. పెరిగిన ధరలు నేటి(ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి రానున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లపై ధరల పెంపు లేకపోవడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. 19 కేజీల సిలిండర్ కొత్త ధరలు ఇలా ఉన్నాయి... ఢిల్లీలో కొత్త ధర రూ. 2253, పాత ధర రూ.2003 కోల్‌కత్తాలో కొత్త ధర రూ. 2351 , పాత ధర రూ.2087 ముంబైలో కొత్త ధర రూ. 2205, పాత ధర రూ.1955 చెన్నైలో కొత్త ధర రూ. 2406, పాత ధర రూ.2138 హైదరాబాద్‌లో కొత్త ధర రూ. 2460, పాత ధర రూ. 2186 చదవండి: దేశవ్యాప్తంగా ఒకలా..హైదరాబాద్‌లో వేరేలా..విచిత్రమైన పరిస్థితులు..! -
రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన
ఢిల్లీ: రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. చదవండి:రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు -
గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..! ఇంధన ధరలతో పాటుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకున్న వారికి గరిష్టంగా ఈ సబ్సిడీ లభించనుంది. ఇతరులకు రూ.291.48 వరకు సబ్సిడీ రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీని పొందాలంటే గ్యాస్ వినియోగదారులు కచ్చితంగా బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ పొందాలంటే మీ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో ఇలా లింక్ చేయండి ఇండనే గ్యాస్ సిలిండర్ కస్టమర్లు ‘cx.indianoil.in’ వెబ్‌సైట్‌ను సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ - ‘ebharatgas.com’సందర్శించి ఆదార్‌కార్డును లింక్ చేయాలి. సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా కూడా ఆదార్ కార్డును లింక్ చేయవచ్చును. చదవండి: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త..!..త్వరలోనే..!
Small Cylinders in Ration Shops:చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. త్వరలో రేషన్ షాపుల్లో చిరు వ్యాపారులకోసం అందుబాటులోకి తెచ్చిన ముద్రాలోన్ సేవల్ని రేషన్ షాపుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోనుంది. బుధవారం అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే రేషన్ షాపుల్లో ముద్రాలోన్లతో పాటు ఇతర ఆర్ధిక సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు రేషన్ షాపుల్లో 5 కేజీల ఎఫ్టీఎల్(Free trade LPG) గ్యాస్ అమ్మకాల్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. 5.32 లక్షల రేషన్ షాపులు దేశ వ్యాప్తంగా 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అయితే త్వరలో కేంద్రం సిలిండర్ల రిటైల్ విక్రయాలతో పాటు రుణాలు,ఇతర ఆర్థిక సేవలను ప్రవేశపెట్టడం ద్వారా రేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. కేంద్రం నిర్వహించిన అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్‌లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖతో పాటు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతినిధులు హాజరయ్యారు. రేషన్ వ్యవస్థను మరింత పట్టిష్టంగా మార్చే దిశగా కేంద్ర తెచ్చిన ప్రతిపాదనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. తనఖా లేకుండా 10లక్షల వరకు రుణాలు సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు కేంద్రం 2015 ఏప్రిల్ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : అదుపులేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. తాజాపెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.819కు పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర మరో రూ .95 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1614కు చేరింది. దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం. హైదరాబాదులో ఇప్పటిదాకా రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుత బాదుడుతో రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. చివరగా గత నెల 25న కూడా 25 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మండుతున్న పెట్రోలు డీజిల ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. -
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్‌కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. అలాగే మనకు ఆన్లైన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తో బుక్ చేయడం ద్వారా ఒక్కో సారి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు పేటీమ్ లో కూడా ఆఫర్ ఒకటి నడుస్తుంది. మీరు మీ గ్యాస్ సిలిండర్‌ను పేటీమ్ యాప్ లో బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.(చదవండి: మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్) ఈ ఆఫర్‌ను పేటీమ్ యాప్‌లో భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు పేటీమ్ లో మొదటి సారి బుక్ చేసుకున్న వినియోగదారులకు లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పేటీమ్ యాప్ లో "బుక్ ఏ సిలిండర్" క్లిక్ చేసి తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు, ఎల్పీజీ ఐడీ, కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ కింద FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించి మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ వర్తిస్తుంది. -
చైనాతో తాడోపేడో: సిలిండర్లు నిల్వ చేసుకోండి
శ్రీనగర్: సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాతో తాడోపేడో తేల్చుకోవాలని ఇండియా భావిస్తోందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? తాజాగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఇలాంటి అనుమానాలే తలెత్తుతున్నాయి. కశ్మీర్ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ చేసి పెట్టుకోవాలని చమురు మార్కెటింగ్ కంపెనీలకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల విభాగం డైరెక్టర్ జూన్ 27న ఆదేశాలు జారీ చేశారు. వీటిని అత్యవసరమైన ఆదేశాలుగా పేర్కొన్నారు. (పథకం ప్రకారమే డ్రాగన్ దాడి!) చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇవ్వడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ లోయలో కొండ చరియలు విరిగిపడుతుండడంతో జాతీయ రహదారులను మూసివేయాల్సి ఉంటుందని, అందుకే గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వర్షా కాలంలో ఇలాంటి ఆదేశాలు సాధారణమేనంటున్నాయి. కాగా, చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తాజాగా వెల్లడైంది. జూన్ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని చైనా జాతీయ మీడియానే స్వయంగా తెలిపింది. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి: ప్రధాని మోదీ) -
‘ఉజ్వల’ ఫలాలు అందట్లేదు
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంత పేద ప్రజలను ఎల్పీజీ సిలిండర్ల వాడకం వైపు మొగ్గేలా చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎమ్‌యూవై) కార్యక్రమ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉజ్వల పథకం కింద ప్రజలను సిలిండర్లను కొనేలా చేయగలిగినా.. వాటిని పూర్తిగా వినియోగించేలా చేయడంలో యంత్రాంగం విఫలమైనట్లు తేలింది. పథకం కింద కేంద్రం పేద మహిళలకు సబ్సిడీతో ఎల్పీజీ సిలిండర్లిస్తో్తంది. పథకం ప్రారంభమైన తొలి 40 నెలల్లో 8 కోట్ల మందికి పైగా ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నట్లు అధ్యయ నం పేర్కొంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంచేశారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కట్టె పొయ్యిలనే వాడుతున్నారనీ, వంటకు ఎల్పీజీని మాత్రమే వాడితేనే సత్ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
గ్యాస్ సిలిండర్ల రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు హోలీ కానుక అందించాయి. ఎల్పీజీ లేదా వంట గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. సబ్సిడీ, నాన్ సబ్సిడీ, కమర్షియల్ సిలిండర్ల ధరపై తగ్గింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన రేట్లు మార్చి 1నుంచి అమల్లోకి వచ్చాయి. ఈమేరకు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్ సైట్ లో గ్యాస్ సిలిండర్ ధరలు పట్టిక కూడా వెల్లడించింది. నాలుగు మెట్రో నగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై తగ్గిన సిలిండర్ల ధరలు ఇలా ఉండనున్నాయి. నాన్ సబ్సిడీ డొమెస్టిక్ సిలిండర్ రూ. 47 ధర తగ్గింపు ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం, 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్ రూ.45.50 నుండి 47 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర రూ.47 తగ్గి రూ. 689కి దిగివచ్చింది. కోలకతాలో రూ.45.50 తగ్గి రూ.711.50కు గా ఉండనుంది. ముంబైలో రూ.47 తగ్గి రూ.661కు చేరుకుంది. చెన్నైలో రూ. 46.50 తగ్గింపు అనంతరం ప్రస్తుతధర రూ. 699.50కుగా ఉంటుంది. సబ్సిడీ సిలిండర్ల ధర సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల ధరలను ఇండియన్ ఆయిల్ రెండున్నర రూపాయలకు పైగా తగ్గించింది. మార్చి 1 నుంచి సబ్సిడీ సిలిండర్లకు ఢిల్లీలో రూ.493.09 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు రూ.495.63 చెల్లించాల్సి ఉండేది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.2.53 తగ్గి రూ.496.60కు, చెన్నైలో సిలిండర్ ధర రూ.2.48 తగ్గి రూ.481.21కు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ల ధర 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు 77 నుంచి 80 రూపాయలవరకు తగ్గించింది. ఢిల్లీలో 78.50 రూపాయలు తగ్గి రూ.1230 గాను, కోల్‌కతాలో 77 రూపాయలు తగ్గి రూ. 1270.50 , ముంబైలో రూ.79 తగ్గి రూ.1181కు , చెన్నైలో రూ.80 తగ్గి రూ.1307కు గా ఉంటుంది. -
14 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తిరూరల్ : రానున్న నాలుగేళ్లలో పాలమూరు జిల్లాలోని 14లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం రాజపేటలో ఆయన మహిళలకు వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గ్రామాల్లోని చెరువులను మరమ్మతు చే సేందుకు ప్రభుత్వం పూనుకుందన్నా రు. వచ్చే ఖరీఫ్ నాటికి ప్రస్తుతం టెండర్లు పూర్తయిన చెరువులకు మరమ్మతులు చేసి 3లక్షల ఎకరాలకు నీరందిం చేందుకు మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రభత్వం ఆదేశాలు జారీ చేసిం దన్నారు. అలాగే మరో సంవత్సర కా లంలో మరిన్ని చెరువులను మరమ్మతు చేసి మరో 4లక్షల ఎకరాలకు నీరిచ్చే వి ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందన్నారు. నాలుగో సంవత్సరంలో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి 7 లక్షల ఎకరాలకు నీరందిస్తామని, 2019 ఎన్నికల నాటికి పాలమూరు జిల్లాలో 14లక్షల ఎకరాలకు సాగునీరందించి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బి. లక్ష్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ లోకారెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, మండల టీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, మాణిక్యం, కురుమూర్తి, బీచుపల్లి యాదవ్, తిలక్ పాల్గొన్నారు. -
బడుగుల గూళ్లు బుగ్గి
అమలాపురం రూరల్ :చెమటోడిస్తే తప్ప సాపాటుకు నోచని కష్టజీవుల బతుకుల్లో చిచ్చు రగిలింది. వారి కళ్ల నుంచి నీరు ధారలు కట్టినా కనికరించని అగ్నికీలలు.. వారి కష్టార్జితాన్ని బుగ్గి చేసి గానీ శాంతించలేదు. ఎండలో, వానలో, చలిలో తమను అక్కున చేర్చుకున్న ఇళ్లు.. కళ్లెదుటే తగలబడి, మొండిగోడలతో మిగలడాన్ని చూసిన వారి గుండెల్లో ఆరని దుఃఖాగ్ని జ్వలించింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు శివారు అంబేద్కర్‌నగర్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 44 ఇళ్లు దగ్ధమయ్యాయి. వీటిలో 37 పూరిళ్లు కాగా, మిగిలినవి పక్కా ఇళ్లు. ఈ ప్రమాదంలో 44 కుటుంబాలు వీధిపాలయ్యాయి. రూ.70 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఇళ్లు అంటుకున్న సమయంలో వేడిగాలులు వీచడం, రెండిళ్లలోని వంటగ్యాస్ సిలిండర్లు పేలటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ముత్తామత్తుల భేతాళస్వామి ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం అసలే వాతావరణం రగులుతుండగా.. ఈ అగ్నిప్రమాదంతో పేరూరు, పరిసర గ్రామాల్లో గాలి నిప్పులకొలిమి నుంచి వచ్చినట్టు మరింత వేడెక్కింది. పేలిన వంటగ్యాస్ సిలిండర్లు కొబ్బరి తోటల మధ్యనున్న అంబేద్కర్ నగర్లో దాదాపు 300 కుటుంబాలు జీవిస్తుండగా అందరూ రోజు కూలీలే. ఉదయమే దాదాపు 100 కుటుంబాలకు చెందిన వారు కూలి పనులకు వెళ్లిపోయారు. మరికొందరు కాలనీకి కొంచెం దూరంలోని ఓ ఇంట జరుగుతున్న పెళ్లి విందుకు వెళ్లారు. కాలనీ అంతా దాదాపు ఖాళీగా ఉన్న 11 గంటల సమయంలో భేతాళస్వామి ఇంటి నుంచి పొగలు, మంటలు వచ్చాయి. విందు జరుగుతున్న చోటి నుంచే వాటిని గమనించిన కాలనీవాసులు గుండెలు బాదుకుంటూ పరుగులు తీశారు. అప్పటికే అగ్నికీలలు అనేక ఇళ్లను చుట్టుముట్టాయి. పొలాల్లో పనులకు వెళ్లిన వారూ దూరం నుంచే అగ్నికీలలను గమనించి పరుగుపరుగున ఇళ్లకు వచ్చారు. కొందరు తమ ఇళ్లలోని కొన్ని వస్తువులను చేరువలోని కొబ్బరి తోటల్లోకి విసిరేశారు. ఇదే సమయంలో కాలిపోతున్న రెండిళ్లలో వంట గ్యాస్ సిలిండర్లు పెనుశబ్దంతో పేలటంతో భీతిల్లి చెల్లాచెదురయ్యారు. కొందరు తెగించి తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చి కొబ్బరితోటలోకి చేర్చారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ప్రమాద తీవ్రతను పెంచిన పడమటి గాలి అసలే వడగాలులతో భగ్గుమంటున్న వాతావరణం అగ్నిప్రమాదంతో మరింత ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో పడమటిగాలి జోరు కావడంతో అగ్నికీలలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వేగంగా వ్యాపించాయి. ప్రమాదాన్ని కళ్లారా చూసిన బాధితుల్లో కొందరు దిగ్భ్రాంతితో స్థాణువులయ్యారు. కొందరు వృద్ధులు, మహిళలు తీవ్రవేదనతో సొమ్మసిల్లిపోయారు. దక్కించుకున్న వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్న కొబ్బరి తోటల్లో.. నిస్సహాయంగా విలపిస్తున్న బాధితులను చూస్తే యుద్ధభూమిలా కనిపించింది. నీరు లేక పెరిగిన నష్టం ఇళ్లు అంటుకోగానే కొందరు సమాచారం అందించడంతో ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డి అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేటల నుంచి, చమురు సంస్థలైన కెయిర్న్ ఎనర్జీ, గుజరాత్ పెట్రోలియం, ఓఎన్జీసీల నుంచి అగ్ని మాపక శకటాలను రప్పించారు. ఈ ఆరు శకటాల్లో ఉన్న నీటిని విరజిమ్మినా మంటలు అదుపులోకి రాలేదు. వాటిలో మళ్లీ నీరు నింపుదామంటే అక్కడ నీరు అందుబాటులో లేదు. దాంతో శకటాలను కొంతదూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకువెళ్లి నీటిని నింపుకొని వచ్చారు. ఈ వ్యవధిలో మంటలు విజృంభించి, నష్టం మరికొంత పెరిగింది. జిల్లా అగ్నిమాపకాధికారి ఉదయ్‌కుమార్, సహాయ అగ్నిమాపకాధికారి ప్రశాంతికుమార్ పరిస్థితిని సమీక్షించారు. అమలాపురం తహశీల్దారు నక్కా చిట్టిబాబు, డీఎల్పీఓ జె.వి.ఎస్.ఎస్.శర్మ, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ కె.జానకిరామయ్య, పేరూరు సర్పంచ్ పెచ్చెట్టి చంద్రమౌళి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితులను ఆదుకుంటాం : ఉప ముఖ్యమంత్రి రాజప్ప పేరూరు అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. ఆయన, ఎంపీ పండుల రవీంద్రబాబు ఫోన్లో బాధితులతో మాట్లాడారు. కేబినెట్ సమావేశంలో ఉన్న రాజప్ప ప్రమాదవార్త తెలుసుకుని ఆర్డీఓ ప్రియాంక, డీఎస్పీ వీరారెడ్డిలతో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాకు వచ్చిన వెంటనే బాధితులను పరామర్శిస్తామని ఎంపీపీ అభ్యర్థి బొర్రా ఈశ్వరరావు, సర్పంచ్ చంద్రమౌళిలకు చెప్పారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు బాధితులను ఫోన్,లో పరామర్శించారు. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు. -
‘బండ’డు కష్టాలు!
బుక్ చేసి 20 రోజులైనా సరఫరాకాని సిలిండర్లు పలు గ్యాస్ ఏజెన్సీల్లో ఇదే పరిస్థితి సాఫ్ట్వేర్ మార్పిడికి బుకింగ్‌ల రద్దు సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానం లంకె తెగిపోయినా వినియోగదారులకు మాత్రం ఇంకా కష్టాలు తొలగలేదు. రాష్ట్రవ్యాప్తంగా రీఫిల్లింగ్ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల్లో బుకింగ్‌ల జాబితా కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. 20 రోజుల క్రితం బుక్ చేసిన వారికి కూడా సిలిండర్లు సరఫరా కాకపోవటంతో వినియోగదారులు గ్యాస్ కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. సాఫ్ట్వేర్ మార్పిడి కోసం గత నెల 26వ తేదీ నుంచి ఈనెల పదో తేదీ వరకూ ఆన్లైన్ బుకింగ్‌లన్నీ రద్దు చేయడంతో పెండింగ్ పెరిగిపోయింది. చమురు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే పది రోజులపాటు సాఫ్ట్వేర్ మార్పిడి పేరుతో బుకింగ్‌లను రద్దు చేసి వినియోగదారులకు ఒక సబ్సిడీ సిలిండర్ కోత పడేలా చేశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయితీపై ఇచ్చే ఒక సిలిండర్‌కు కోత: ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో సిలిండర్ల సరఫరాలో జాప్యం వల్ల చాలామంది రాయితీపై లభించే ఒక సిలిండర్ కోల్పోతున్నారు. రాయితీపై ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి బుక్ చేసుకునే వ్యవధి లేకపోవటమే కారణం. సిలిండర్ సరఫరా పరిస్థితి తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే ‘ఈనెల ఒకటో తేదీ నుంచి 15 వరకూ బుక్ చేసిన వారికి సిలిండర్లు సరఫరా అవుతున్నాయి’ అనే రికార్డెడ్ సమాచారం రావటంపై వినియోగదారులు మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు కోసం వచ్చిన వినియోగదారులతో హైదరాబాద్ శాంతినగర్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ గత నాలుగైదు రోజులుగా కిటకిటలాడుతోంది. గతనెల 17 నుంచి 25వ తేదీల మధ్య బుక్ చేసిన చాలామందికి గ్యాస్ ఇంకా సరఫరా కాని విషయం వాస్తవమేనని ఆ ఏజెన్సీ తెలిపింది. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్ జాబితా పెద్దదే ఉంది. ఇదీ సమస్య: మార్చి నెల ఒకటో తేదీ నుంచి వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసి వినియోగదారులకు నేరుగా సబ్సిడీతో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో రాయితీ సిలిండర్లు అందించేందుకు గ్యాస్ ఏజన్సీలు సాఫ్ట్వేర్ మార్పిడికి ఈనెల 10 వరకూ సమయం తీసుకున్నాయి. గత నెలలో బుక్ చేసుకున్నా ఈనెల ఒకటో తేదీ నుంచి రూ. 441 ధరతో సబ్సిడీ సిలిండర్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే రాయితీ సిలిండర్ల సరఫరా బిల్లుల జారీ సాఫ్ట్వేర్ ఈనెల 10 వరకూ అందుబాటులోకి రాలేదు. దీంతో గత నెలలో బుక్ చేసుకున్నా నెలాఖరులోగా సిలిండర్ సరఫరాకాని వారితోపాటు ఈనెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకూ చేసుకున్న బుకింగ్‌లన్నింటినీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(డీలర్లు) రద్దు చేసి మళ్లీ బుక్ చేశాయి. వీటికి అదనంగా పదో తేదీ నుంచి జరిగిన బుకింగ్‌లతో పెండెన్సీ విపరీతంగా పెరిగింది. పదో తేదీ తర్వాత సబ్సిడీ ధరకే సిలిండర్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో చాలామంది ఆధార్‌లేని వినియోగదారులు బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. కొందరు బుక్ చేసుకున్నా సిలిండర్ ఇంటికి వచ్చాక తీసుకోకుండా వెనక్కు పంపారు. వీరంతా ఈనెల పదో తేదీ తర్వాత మళ్లీ బుక్ చేసుకున్నారు. దీంతో డిమాండ్ పెరిగి గ్యాస్ సరఫరా ఆమేరకు లేక కొరత ఏర్పడింది. ‘రాయితీపై ఏటా 12 సిలిండర్లని ప్రకటించినా ఈ సంవత్సరానికి కంపెనీలు 11కే పరిమితం చేశాయి. ఇప్పుడు ఇలా మరో సిలిండర్‌కు కోత పెట్టాయి’ అని వినియోగదారులు విమర్శిస్తున్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాయితీ సిలిండర్ రాదు. ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 21 రోజుల గ్యాప్ తర్వాత బుక్ చేసుకోవాలనే నిబంధనే కారణం. దీంతో చాలామంది వినియోగదారులు సబ్సిడీ సిలిండర్ కోల్పోవాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
-
ఏడాదికి ఇక 12 సబ్సిడీ సిలిండర్లు
గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 17వ తేదీన జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో సబ్సిడీ సిలెండర్ల సంఖ్య విషయంలో సర్కారు ఆఘమేఘాల మీద స్పందించింది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. అదే నిర్ణయం ఇప్పుడు వెల్లడైంది. -
7జిల్లాల్లో నగదు బదలీ పధకం
-
రాహుల్ ఎఫెక్ట్.. సిలిండర్ల సంఖ్య 12కు పెంపు?
గృహ వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానుండటం, ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఎలాగైనా ప్రజల్లో సానుకూలత తెచ్చుకోడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంపుపై కేంద్ర మంత్రివర్గం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఆఘమేఘాల మీద సబ్సిడీ సిలెండర్ల సంఖ్యను పెంచాలని సర్కారు భావిస్తోంది. ''ప్రధానమంత్రి గారూ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏడాదికి 9 సిలిండర్లు చాలవు. దేశ మహిళలు తమకు కనీసం 12 సిలిండర్లు కావాలని అడుగుతున్నారు'' అంటూ రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సమావేశం ముగియగానే వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర కేబినెట్ త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకోనుందని చెప్పారు. దటీజ్ రాహుల్ ఎఫెక్ట్!! అయితే, ఎన్నికలు దగ్గర పడగానే సిలిండర్లు గుర్తుకొచ్చాయా అని బీజేపీ నేతలు కాంగ్రెస్ మంత్రులను ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఎన్నాళ్లనుంచో చెబుతున్నా, ప్రజలందరూ అడుగుతున్నా ఏమాత్రం స్పందించని మంత్రివర్గం.. ఇప్పుడు రాహుల్ పేరుచెప్పి, ఎన్నికల బూచి చూసి సిలిండర్ల సంఖ్య పెంచుతోందా అని నిలదీశారు. -
సబ్సిడీ సిలిండర్లు పెంచే ప్రతిపాదనలేదు
కొచ్చి: సబ్సిడీపై ఇస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్య పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కేరళలోని పుతేవ్యపె వద్ద నెలకొల్పిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఇక్కడికి వచ్చిన మొయిలీ ఈ విషయం చెప్పారు. దేశంలో 90 శాతం మంది సబ్సిడీ సిలిండర్లను వినియోగించుకుంటున్నారని, కేవలం పది శాతం మందికి మాత్రమే ఆ పథకం వర్తించడం లేదన్నారు. కాగా, గురువారం ఆర్థిక మంత్రి చిదంబరం ఢిల్లీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం సబ్సిడీపై ఏడాదికి ఇస్తున్న 9 సిలిండర్లను 12 పెంచాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.