
ఢిల్లీ: రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు.
రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment