kotagiri sridhar
-
ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ కల్పిస్తాం..!
అనంతపురం: రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు అత్యంత ఆదరణ కల్పిస్తామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్‌బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనుంచి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది. -
రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రమంత్రి ప్రకటన
ఢిల్లీ: రేషన్ దుకాణాల ద్వారా మినీ-ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి వెసులుబాటు కల్పించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రేషన్ షాపుల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచామని అందులో భాగంగా మినీ ఎల్పీజీ సిలిండర్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు. రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్ల విక్రయానికి సంబంధించి ఇప్పటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో చర్చించామని మంత్రి తెలిపారు. అయితే రేషన్ షాపుల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో ఉందన్నారు. ఆసక్తి ఉన్న రాష్ట్రాలు రేషన్ షాపుల్లో మినీ-ఎల్పీజీ అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. రేషన్ షాపుల్లో ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, ఎన్. రెడ్డెప్పలు అడిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. చదవండి:రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు -
ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా
సాక్షి, తిరుపతి : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి మరోసారి కరోనా సోకింది. బుధవారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో గురువారం ఆయనకు రుయా ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. (కరోనా కష్టంతో 9.6% క్షీణత) ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ ఏలూరు టౌన్: ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. గత వారం రోజుల్లో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. -
‘40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు’
సాక్షి, న్యూఢిల్లీ : అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. ఆ కుంభకోణంపై వెంటనే సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నాయి. గతంలో వైఎస్సార్ సీపీ ఎంపీలను ముగ్గుర్ని తీసుకుంటే ఇప్పుడు టీడీపీకి ముగ్గురే మిగిలారు. ( ‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’) రఘురామకృష్ణం రాజును తీసుకున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా మాకు మంచి మర్యాద ఉంది. వచ్చే ఎన్నికల్లో 151 మించి సీట్లు గెలుచుకుంటాం. ప్రతి మతం, కులం కోసం మేము పోరాడుతాం’’ అన్నారు. -
ఏపీని అన్ని విధాలా ఆదుకోండి
-
‘మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం’
సాక్షి, నరసాపురం: మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, జనవరి 20న అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పడినా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మండలం కొప్పర్రు గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించే డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. స్వాగతిస్తున్నా: కోటగిరి శ్రీధర్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాకూడదని అన్నారు. రూ.300 కోట్లతో కొల్లేరు ప్రాంతంలో రెగ్యులేటర్స్, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్టు చెప్పారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. -
ఎన్ని విజ్ఞాపనలు పంపినా స్పందన లేదు : అవినాష్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : యురేనియం టెయిల్ పాండ్ నిర్మాణ లోపాల కారణంగా కడప నియోజకవర్గంలోని 7 గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లోక్‌సభలో లేవనెత్తారు. మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతో.. యురేనియం టెయిల్ పాండ్ నిర్మాణ లోపాల వల్ల పంటలకు, పశుసంపదకు తీవ్రనష్టం ఏర్పడుతోందని వివరించారు. రసాయన వ్యర్థాలు కలవడం వల్ల భూమి, నీరు కలుషితం అవుతున్నాయని తెలిపారు. దీనిపై యూసీఐఎల్ సీఎండీకి ఎన్నిసార్లు వినతి పత్రాలు పంపినా స్పందన లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమస్యపై తక్షణమే స్పందించి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పామాయిల్ మద్దతు ధర పరిశీలనలో ఉంది : కేంద్రం పామాయిల్ మద్దతు ధర అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో లేవనెత్తింది. పామాయిల్‌కు మద్దతు ధర ప్రకటించాలని సీఏసీపీ కూడా సిఫార్సు చేసిందని ఆ పార్టీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల.. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పామాయిల్ ధరల నిర్ణయం జరుగుతోందని తెలిపారు. అయితే పామాయిల్‌కు మద్దతు ధర అంశం పరిశీలనలో ఉందన్నారు. -
కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి
కైకలూరు: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటు హక్కును కొల్లేరు గ్రామాల్లో కట్టుబాట్లు చిదిమేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో గురువారం జరిగిన కొల్లేరు గ్రామాల ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)తో కలసి ఆయన పాల్గొన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన 110 మంది కొల్లేరు గ్రామాల పెద్దలు ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. మరో 15 గ్రామాల ప్రజలు పార్టీలో చేరాలని తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో కుల కట్టుబాట్ల కారణంగా ఒకే పార్టీకి చెందిన వ్యక్తికి ఓట్లు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనైనా కొల్లేరు ప్రజలు కట్టుబాట్లు కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని భూములు రీ సర్వే జరుగుతుందని, కొల్లేరు భూములు ఇందులో ఉంటాయని తెలిపారు. వైఎస్సార్ సీసీ నాయకులు ముంగర నరసింహారావు, కొండలరావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, పంజా రామారావు, కొల్లేరు పెద్దలు సైత సత్యనారాయణ, ఘంటసాల వెంకటేశ్వరరావు, నబిగారి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
లీడర్‌తో కోటగిరి శ్రీధర్
-
ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్ధిగా కోటగిరి శ్రీధర్ నామినేషన్
-
పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం
-
‘ఆయన సీఎం అయితేనే ఏపీకి మళ్లీ స్వాతంత్ర్యం’
సాక్షి, జంగారెడ్డి గూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ఏపీకి మళ్లీ స్వాతంత్ర్యం వస్తుందని ఆ పార్టీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్సీ అళ్ల నాని, చింతలపూడి కన్వీనర్ విఆర్ ఎలిజా, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి జంగారెడ్డి గూడెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయ ప్రారంభోత్సవంలో అయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఏపీలో నారా రూపంలో ఉన్న రాక్షసుడిపై అందరం కలసికట్టుగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అరాచకపాలనకి ముగింపు జంగారెడ్డి గూడెం నుంచే ప్రారంభం కావాలన్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అనుభవజ్ఞుడని చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లుగా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. పోలవరం పేరిట కోట్ల రూపాయలను దిగమింగేశారని ఆరోపించారు. పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో కుమ్మక్కై రైతుల నోట్లో మట్టికొట్టి కోట్లు తినేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో రైతులు నష్టపోతున్నా ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పేకాటలలో మునిగిపోయారని శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని తరిమికొట్టాలి: ఆళ్ల నాని నిర్వాసితులకు న్యాయం చేయకుండా.. పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తిచేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ జగన్ పూర్తి చేస్తారనే భరోసా ప్రజల్లో కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను ఇంటింటికి చెప్పాలన్నారు. పోలవరం అక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ సహా అధికార పార్టీకి చెందిన వారందరి పాత్ర ఉందని విమర్శించారు. పోలవరం అక్రమాలపై కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులందరికి ఫిర్యాదు చేసినప్పట్టికి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. ఏపీలో టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. హోదా జగన్‌తోనే సాధ్యం: విఆర్ ఎలీజా రాష్ట్రాన్నిఅన్యాయంగా విడగొట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం ఏపీని మరోసారి మోసం చేయడమేనని చింతలపూడి కన్వీనర్ విఆర్ ఎలీజా అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్సించని కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్ తీసుకరావడం ఖాయమని స్పష్టంచేశారు. రాజన్న రాజ్యం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమవుతుందన్నారు. -
బాబువి నీతిమాలిన రాజకీయాలు
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: నీతిమాలిన రాజకీయాలు చేస్తూ.. డ్రామాలు ఆడుతున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి గోద్రెజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు చేపట్టిన రైతు దీక్ష రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ఆయిల్‌పామ్ రైతుల నుంచి విశేష స్పందన లభించింది. తలారి వెంకట్రావుకు కోటగిరి శ్రీధర్, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెలికాని రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. రైతుల కోసం పోరాడుతున్న తలారిని అభినందించారు. శ్రీధర్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర రైతులకు ఎలాంటి మేలూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌తో చేతులు కలిపి, ఇరు పార్టీల నేతలకు, కార్యకర్తలకు బాబు ద్రోహం చేశారన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు పనిచేయరని తిట్టిన బాబు ఇప్పుడు ఆయనతో చేతులు కలపడం దారుణమన్నారు. బీజేపీని విడిచిన బాబుకు అధికారం దక్కదన్న భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్‌తో జతకట్టి రాష్ట్ర ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారని విమర్శించారు. బాబుకు రైతుల కష్టాలు పట్టవా..: ఆయిల్‌పామ్ రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నా చంద్రబాబుకు అవేమీ పట్టడం లేదని కవురు శ్రీనివాస్ విమర్శించారు. రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఒకశాతం రికవరీ శాతాన్ని వెంటనే ఖాతాల్లో జమచేయాలన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ తలారి రాష్ట్ర రైతుల తరఫున పోరాడుతున్నారన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు రైతుల నుంచి విశేష స్పందన రావడం గొప్పవిషయమన్నారు. చంద్రబాబు ఒక్క ఆయిల్‌పామ్ రైతులనే కాకుండా అందరినీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టాలు తీరాలంటే జగనన్న సీఎం కావాలని పేర్కొన్నారు. చెలికాని రాజబాబు మాట్లాడుతూ రైతు బాగుండాలి అంటే.. జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే రైతనే వాడు లేకుండా చేస్తారని అన్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. నీరసించిన తలారి పచ్చి మంచినీళ్తూ ముట్టకుండా దీక్ష చేస్తున్న తలారి వెంకట్రావు నీరసించారు. రైతులకు మద్దతుగా, వారికి అండగా నిలిచి ఆయన చేపట్టిన దీక్ష 24 గంటలు పూర్తవడంతో బాగా నీరసించారు. అయినా సంఘీభావం తెలిపేందుకు వచ్చే రైతులను, పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. పలువురు మహిళా రైతులు తలారికి సంఘీభావం తెలిపి, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల, గోపాలపురం, నల్లజర్ల మండలాల కన్వీనర్లు ప్రతాపనేని వాసు, పడమట సుభాష్ చంద్రబోస్, గగ్గర శ్రీనివాస్, గోపాలపురం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుప్పాల దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, ఇళ్ల భాస్కరరావు, దాకారపు అగ్గియ్య, గన్నమని జనార్ధనరావు, కారుమంచి రమేష్, వెల్లంకి సుబ్రహ్మణ్యం, కుసులూరి సతీష్, కాసంశెట్టి రాంబాబు, కాండ్రు రామకృష్ణ, తొమ్మ ండ్రు రమేష్, తొమ్మండ్రు రవి, కరుటూరి గణేశ్వరరావు, కలం సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
అన్నొచ్చాడు.. రాబోయేది రాజన్న రాజ్యం...
-
హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్
-
‘జగన్‌ని సీఎం చేసే వరకు కృషి చేస్తాం’
సాక్షి, కృష్ణా(నూజివీడు): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో జనసంద్రమైంది. సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు. 150 సీట్లకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడుకి ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. పోలవరం, రాజధానులు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. -
నమ్మించి నిండా ముంచిన చంద్రబాబు
గణపవరం (నిడమర్రు) : నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలను చంద్రబాబు నిండా ముంచారని, ఇంకెప్పుడూ ఇలాంటి కల్లబొల్లి కబుర్లు నమ్మవద్దని మంచి గుణపాఠం చెప్పారని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం రాత్రి నిడమర్రు మండలం అడవికొలనులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అంటూ గొంతులు చించుకుంటున్న టీడీపీ నాయకులు పల్లెలకు వచ్చి చూస్తే వారు చేసిన అభివృద్ధి ఎంతగొప్పగా ఉందో తెలుస్తుందన్నారు. కేవలం మాయమాటలు, గారడీలతోనే ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ మాటమార్చడం ఈ దేశంలో చంద్రబాబుకే సాధ్యమైందని విమర్శించారు. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తయారు చేస్తామని డాంబికాలు పలుకుతున్నారన్నారు. సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులే పంచుకుంటూ, ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పార్టీ జిల్లా నాయకులు నడింపల్లి సోమరాజు, మాదేటి సురేష్, పుప్పాల గోపి, ముళ్లగిరి జాన్సన్, తెనాలి సునీల్, బేతు రాజశేఖర్, నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, భీమడోలు మండలాల కన్వీనర్లు సంకు సత్యకుమార్, దండు రాము, మరడ వెంకట మంగారావు, రాయపాటి సత్య శ్రీనివాస్, పార్టీ నాయకులు కోడూరి రాంబాబు, నిమ్మల బాబూరావు, బత్తి సాయి, గొట్టుముక్కల విశ్వనాథరాజు, గోలి శేఖర్, బుద్దారపు పుల్లయ్య పాల్గొన్నారు. -
రహదారుల మరమ్మతుల పేరుతో రూ.కోట్ల దోపిడీ
జీలుగుమిల్లి/జంగారెడ్డిగూడెం రూరల్ : జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి మరమ్మతుల పేరుతో అధికారులు, నాయకులు రూ.కోట్లు దోపిడీ చేశారని ఏలూరు పార్లీమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త కోటగిరి శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన జాతీయ రహదారి దుస్థితిపై జీలుగుమిల్లి నుంచి జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వరకు పాదయాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజల ద్వారా మ్యానిఫెస్టోను రూపొందించేందుకు వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని నేరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలు వినడానికి జనం సిద్ధంగా లేరని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రోడ్ల నిర్మాణం ప్రజల కోసం కాకుండా కొందరు జేబులు నింపుకునేందుకు వేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లుగా ఈ రహదారులపై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. జాతీయ రహదారుల చైర్మన్ గాని, జిల్లా మంత్రులుగాని ప్రజల కష్టాలకు స్పందించడం లేదని అన్నారు. పాలకుల తీరుకు నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కొల్లూరి రాంబాబు, మండవల్లి సోంబాబు, పోల్నాటి బాబ్జీ, బీవీఆర్ చౌదర్, ఆది విష్టు, మేడవరపు అశోక్, వందనపు సాయిబాలపద్మ, గంజి మాలదేవి, కరాటం క్రిష్ణ స్వరూప్, జగ్గవరపు జానకీరెడ్డి, బోదా శ్రీనివాసరెడ్డి, చిర్రి బాలరాజు‡ తదితరులు పాల్గొన్నారు. రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చనమాల శ్రీనివాస్, పార్టీ నాయకులు కేమిశెట్టి మల్లిబాబు, కొప్పుల రవిచంద్రారెడ్డి, నులకాని వీరాస్వామి నాయుడు, కనికళ్ల ప్రసాద్, పల్లా గంగాధరరావు, చీదిరాల నాగేశ్వరరావు, మల్నీడి బాబి, రాజులపాటి అన్నవరం, దల్లి తుకారాంరెడ్డి, కొయ్య రాజారావు రెడ్డి, కొయ్య లీలాధరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మద్దిలో లక్ష్మీ గణపతి హోమం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలంటూ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన లక్ష్మీ గణపతి హోమం, మోటారు సైకిల్ ర్యాలీలో కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం మద్ది క్షేత్రం నుంచి భారీ మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీలో కోటగిరి శ్రీధర్‌తో పాటు వైఎస్సార్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. గుర్వాయిగూడెం అయ్యప్ప ఆలయాన్ని శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. పార్టీ యూత్ నాయకులు కఠారి వాసు తన ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో గుర్వాయిగూడెం అయ్యప్ప ఆలయానికి చేరుకున్నారు. జంగారెడ్డి గూడెం మీదుగా జీలుగుమిల్లి వరకు భారీ మోటార్‌సైకిల్ ర్యాలీ జరిగింది. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నాయకులు, మండల అధ్యక్షలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కదిలిన యంత్రాంగం జీలుగుమిల్లి: రహదారి దుస్థితిపై వైఎస్సార్ సీపీ నాయకులు చేసిన పాదయాత్రతో అవినీతి అధికారులలో కలవరం మొదలైంది. శనివారం సాయంత్రం హుటాహుటీన నిఘా వర్గాలు రోడ్డును పరిశీలించాయి. పాదయాత్రపై ప్రజా స్పందన గురించి నివేదికను సేకరించారు. జీలుగుమిల్లి–జంగారెడ్డిగూడెం జాతీయ రహదారి మరమ్మతులకు గత మూడేళ్లుగా ఖర్చు చేసిన నిధుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికను పంపాయి. మరమ్మత్తులకు సంబంధించిన ఫొటోలు సేకరించారు. అలాగే ఆరోపణలపై కూడా వివరాలు సేకరించాయి. -
వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్తగా శ్రీధర్
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత కోటగిరి శ్రీధర్ శుక్రవారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరికి చెందిన శ్రీధర్‌ను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు పేర్కొంది. -
టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు
ద్వారకా తిరుమల: ఏ పార్టీలో అయినా చేరుకానీ, టీడీపీలో మాత్రం చేరవద్దని తన తండ్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు చెప్పారని కోటగిరి శ్రీధర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ఆర్తో తన తండ్రికి మంచి సంబంధాలున్నాయని, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి ఆయన నాయకత్వంలో పనిచేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏం చెప్పారంటే.. ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి కారణమేంటంటే.. తమ కుటుంబంలో ప్రతి శుభకార్యక్రమం ఇక్కడి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది వెంకటేశ్వర స్వామి ముందు ఈ కార్యక్రమం పెట్టాలని వైఎస్ జగన్‌ను కోరాం ఇక్కడకు వచ్చిన వైఎస్ జగన్‌కు, వైఎస్ఆర్ సీపీ నాయకులకు, కార్యకర్తలకు, కోటగరి విద్యాధర రావు అభిమానులకు కృతజ్ఞతలు కోటగిరి విద్యాధర రావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా, ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు 2004లో కోటగిరి ఓడిపోయినా వైఎస్ఆర్ గెలిచారని సంతోషించారు గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని సంతోషించారు వైఎస్ఆర్తో ఆయనకు మంచి సంబంధాలున్నాయి నాన్న చివరి రోజుల్లో నా తర్వాత నువ్వు రాజకీయ వారసుడిగా కొనసాగాలని చెప్పారు ఏ పార్టీలో చేరినా ఫర్వాలేదు కానీ టీడీపీలో మాత్రం చేరవద్దన్నారు నాన్న గారు మరో సలహా ఇచ్చారు. వైఎస్ జగన్‌తో చేరాలని చెప్పారు చిన్న వయసులో పార్టీ పెట్టి సమర్థవంతంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు ఇక చంద్రబాబు గురించి కొంచెం మాట్లాడుకోవాలి ఆయన, ఆయన జీవితానుభవంలో ప్రతి ఎన్నికల్లో మనల్ని ఎలా మభ్యపెట్టాలో ఆలోచిస్తున్నారు ఎవర్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లాలి.. ఎలా మభ్య పెట్టాలా అని ఆలోచిస్తారు ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పారు. ఈ రోజు ఎన్నెన్నో కబుర్లు చెబుతున్నారు మనం ఢిల్లీ నాయకులను ముక్కు పిండి పనిచేయించుకోవాలంటే అందుకు బలమైన నాయకుడు కావాలి అందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రావాలి రాష్ట్ర విభజన జరిగినపుడు మనం ఎంతో బాధపడ్డాం మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశాం వచ్చే ఎన్నికల్లో రెండో ముద్దాయి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం వైఎస్ జగన్ రాజకీయ అనుభవం సాధించారు. ఆయన సీఎం అవడానికి సిద్ధం 12 ఏళ్లు నాన్నగారికి రాజకీయాల్లో సాయం చేశాను. మూడు ఎన్నికల్లో పనిచేశాను. చాలా మందితో పరిచయం ఏర్పడింది. నాకు కోపం లేదు, ఓర్పు ఉంది, సహనం ఉంది, హంగూ ఆర్భాటం లేదు మీరు ఏ సమయంలోనైనా నా దగ్గరకు రావచ్చు మీరు మేనిఫెస్టోలను చూసి మోసపోవద్దు మనమందరం వైఎస్ జగన్ ను గెలిపిద్దాం -
అవినీతి పాలనే చంద్రబాబు ఘనత
-
'మోదీ మొట్టికాయలేస్తారని బాబుకు భయం'
ద్వారకా తిరుమల: రైతుల సమస్యలు తీర్చడం కోసం కాకుండా రైతుల భూములు ఎలా లాక్కోవాలో చర్చించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ మీటింగులు పెడతాడరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రులు, కేబినెట్ స్థాయిలో ఏకంగా ముఖ్యమంత్రి దొంగగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టారు. చంద్రబాబు ఆలోచన తీరును, ఆయన మంత్రుల పనితీరును తూర్పరాబట్టారు. సాధారణంగా ఒక ఇంటి నిర్మాణానికి అడుగుకు రూ.1500 చెల్లిస్తే చంద్రబాబు మాత్రం రాజధానిలో తాత్కాలిక భవనాలు, సెక్రటేరియట్ల పేరుతో అడుగుకు 10వేలు ఇస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. సైబర్ గ్రిడ్, ఎర్రచందనం అంటూ అవినీతిమయం చేస్తారని అన్నారు. నేడు ఏ వీధిలో చూసినా, ఏ వాడలో వెతికినా ఇసుక, మట్టి దొంగలు తయారయ్యారని, కాంట్రాక్టు పనులు వారి వాళ్లకే ఇచ్చి మొత్తం దొంగల వ్యాపారానికి తెరతీశాడని చెప్పారు. రాజధానికి ఒక్క రోజు భూమి పూజకు రూ.400 కోట్లు, గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ.మూడు వేల కోట్లు, మూడు రోజుల సైన్స్ ఫెస్టివల్ రూ.300 కోట్లు నామినేషన్ల వారీగా ఇచ్చి దొంగదారిన కమీషన్లు తీసుకుంటారని, గత మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న పని ఇదే అని స్పష్టం చేశారు. ఇక్కడ వాళ్లతో అక్రమ లావాదేవీలు చేస్తే అందరికీ తెలిసిపోతుందని తెల్లచర్మం, తెల్లజుట్టు ముద్దంటూ మాములు విమానాల్లో కాకుండా ప్రైవేటు విమానాల్లో చంద్రబాబు ప్రయాణం చేసి విదేశాలకు వెళతాడని అన్నారు. సింగపూర్, జపాన్, దుబాయ్, స్విట్జర్లాండ్‌కు వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా డాలర్లలో డబ్బు పోగేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మొట్టికాయలు వేస్తారని చంద్రబాబుకు భయం ఉందని, అందుకే అన్ని పనులు విదేశాల్లో చక్కబెట్టుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థ, అవినీతిపాలనపై.. ఖరీఫ్‌కు బ్యాంకులు రూ.48వేల కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే కేవలం రూ.28 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. రబీ పంటకు బ్యాంకర్లు మొత్తం 35 వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే రూ.5వేల కోట్లిచ్చి చేతులు దులుపుకున్నారు. అయినా, బ్యాంకర్లను ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదు రబీలో 24లక్షల హెక్టార్లలో పంట వేయాల్సి ఉంటే 13 లక్షల్లో కూడా వేయలేదు. రైతులు దారుణ పరిస్థితుల మధ్య ఉన్నా ఒక్క మాట మాట్లాడరు. కేబినెట్ మీటింగ్ పెడితే రైతుల భూములు ఎలా లాక్కోవాలనే ఆలోచన చేస్తాడు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్‌కు దొరికిపోయి ఆయనను ప్రశ్నించలేక గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణకు వెళుతున్నా చూస్తూ కూర్చున్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుంటే కనీసం అడిగే దమ్మూధైర్యం చంద్రబాబుకు లేదు మోదీని గట్టిగా అడిగితే సీబీఐతో విచారణ చేయించి జైలులో పెట్టిస్తారని చంద్రబాబుకు భయం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇస్తామని చెప్పిన ఏ ఒక్కటీ ఇవ్వలేదు ఏమీ ఇవ్వకపోయినా ఇస్తున్నట్లుగా మోసం చేస్తూ ప్రజల చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టే పనులు చేస్తున్నాడు చంద్రబాబు హయాంలో ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఓ ఎమ్మార్వో జుట్టుపట్టుకున్నా ఏం చేయలేకపోయారు ఇదే జిల్లాలో టీడీపీ నేతల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిపై యాక్షన్ తీసుకునే దమ్ములేదు గతంలో ఆరోగ్యశ్రీ అంటే గొప్పగా ఉండేది. 108 నెంబర్ కొడితే అంబులెన్స్ వచ్చి ఎలాంటి ఆపరేషన్ అయినా కార్పొరేట్ ఆస్పత్రిలో చేసి చిరునవ్వుతో ఇంటికి పంపేవారు ఇప్పుడు అంబులెన్స్‌లు ఎప్పుడొస్తాయో తెలియదు.. 104 కొడితే గ్రామాల్లో పరీక్ష చేసేవారు. ఇప్పుడు వారికి ఫోన్ చేస్తే జీతాలు ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని నడపలేని అసమర్థపాలన చంద్రబాబుది ఫీజు రీయింబర్స్మెంట్ నడపలేని అసమర్థపాలన చంద్రబాబునాయుడిది బీసీల మీద ప్రేముందని చంద్రబాబు చెప్తాడు. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు ఇచ్చి ప్రేమంటాడు పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలంటే అందులో నుంచి బయటకు రావాలంటే అతడి పిల్లలు చదువుకోవాలని వైఎస్ఆర్ కలలు కన్నారు. చదివించే కార్యక్రమం పెట్టారు. నేడు ఇంజినీరింగ్ విద్యార్థులకు ముష్టి రూ.30వేలు వేస్తున్నారు. ఫీజులు రూ.లక్ష20వేలకు పెరిగాయి. మిగితా ఫీజుకట్టేందుకు ఇళ్లు పొలం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. 80శాతం ప్రాజెక్టుల పనులు నాన్నగారు రాజశేఖర్ రెడ్డిగారు పూర్తి చేశారు. 20శాతం పనులు కూడా చంద్రబాబు చేయలేదు. పాలన మూడేళ్లు పూర్తవుతుంది.. ఒక్క ఇల్లు కూడా చంద్రబాబు కట్టించలేకపోయారు వైఎస్ హయాంలో 48లక్షల ఇళ్లు నిర్మించారు. అసత్యాల, అబద్ధాల పాలనపై.. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు రైతు రుణాలు పోవాలంటే, జాబు రావాలంటే, డ్వాక్రా రుణాలు పోవాలంటే చంద్రబాబు రావాలన్నారు. వచ్చి మూడేళ్లయినా ఎవరి పరిస్థితి మారలేదు. ఎన్నికలప్పుడు రైతులను వదల్లేదు. అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. చంద్రబాబు పాలన అయ్యి 32 నెలలు అయింది.. నాకు చంద్రబాబు 68 వేలు బాకీ ఉన్నాడని ఓ యువకుడు అన్నాడు. అతడికి చంద్రబాబు ఏ సమాధానం చెబుతాడు? కేంద్ర ప్రభుత్వం హోదాను ఎగరగొట్టింది. ప్యాకేజీ అంటూ కేంద్రం తరుపునా వకల్తా పుచ్చుకొని కొత్త అబద్ధాలు చెప్పడం బాబు మొదలుపెట్టాడు. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే అది ప్యాకేజీ. అసలే ఇవ్వకుండా ఇస్తే అది ప్యాకేజీనా? ఈ రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.. అవెక్కడ ఉన్నాయి మరీ? రిజర్వ్ బ్యాంక్ ఇండియా సప్లిమెంటరీ విడుదల చేసింది. కేపీఎంజీ అనే సంస్థ ఆ నివేదిక ప్రకటించింది. రాష్ట్రంలో పాలన మొదలయ్యాక లక్షా ఆరువేల పరిశ్రమలు ఉంటే చంద్రబాబు పాలనలో 20 వేల పరిశ్రమలు మూతపడ్డట్టు అందులో పేర్కొంది. కరెంట్ లేక, పరిశ్రమల్లో డబ్బులు వసూళ్లు చేయడం మూలంగా అవి మూతపడినట్లు వివరించింది. పోలవరం కుడికాలువ 170 కిలోమీటర్లుంటే దాదాపు 140 కిలోమీటర్లు నాన్నగారు వైఎస్ పూర్తి చేశారు. మిగిలింది 30 కిలోమీటర్లు. అది కూడా పూర్తిచేయకుండా లస్కర్ మాదిరిగా గేట్లు ఎత్తి బొంకులు బొంకాడు చంద్రబాబు. ఇక చంద్రబాబు అప్రజాస్వామిక పాలన గురించి చెప్పనక్కర్లేదు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్‌లకు విలువ లేకుండా చేశారు -
బాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1
ద్వారకా తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనంతా అవినీతి, అసమర్థత, అసత్యం, అప్రజాస్వామికంతో కూడుకున్నదని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ 1గా ఉందని అన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్.. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. వైఎస్ఆర్ సీపీలోకి కోటగిరి శ్రీధర్‌ను ఆహ్వానిస్తున్నాను యువకుడు, ఉత్సాహవంతుడు అయిన శ్రీధర్ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాడు మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది రాష్ట్రం వైపు ఓ సారి తిరిగి చూస్తే చంద్రబాబు పరిపాలన కనిపిస్తుంది మనం ఎవరికైనా ఎందుకు ఓటు వేస్తాం అభివృద్ధి కోసం. నిన్నటి కన్నా ఈ వాళ, ఈ రోజు కన్నా రేపు బాగుంటే అభివృద్ధి జరుగుతోందని చెబుతాం చంద్రబాబు పాలనలో అవినీతి, అసమర్థ పాలన జరుగుతోంది ఇవాళ అసత్యాల, అప్రజాస్వామిక పాలన జరుగుతోంది దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే.. చంద్రబాబు పాలనలో ఏపీ అవినీతిలో నెంబర్ 1గా ఉంది. చంద్రబాబు వ్యవస్థలను, మనుషుల్ని, మీడియాను మేనేజ్ చేసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు దేశంలో చాలా మంది సీఎంలు ఉన్నారు. రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు. ఇలాంటి సీఎంను ఎప్పుడైనా చూశారా? సూట్ కేసుల్లో బ్లాక్ మనీ తీసుకువెళ్లి ఎమ్మెల్యేలను కొంటున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా సీఎం రాజీనామా చేయకపోవడం, జైలుకు వెళ్లకపోవడం ఎక్కడైనా చూశామా..? ఒక్క చంద్రబాబు విషయంలోనే జరుగుతోంది రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందని తెలిసినా ఎక్కడో వస్తుందని చెప్పారు రాజధాని ప్రాంతంలో మంత్రులు, చంద్రబాబు బినామీలు భూములు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేశాక రాజధాని అక్కడ కాదు ఇక్కడే అంటారు దీనివల్ల రైతులు నష్టపోతారు, చంద్రబాబు ఆయన బినామీలు లాభపడతారు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు గుంజుకుని, తనకు ఇష్టమైన వారికి కమీషన్లు తీసుకుని ఇస్తున్నారు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీళ్లు రావడం లేదు, చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది కాంట్రాక్టర్లతో కమీషన్లు మాట్లాడుకుని నచ్చినవారికి చెక్‌లు ఇచ్చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంచేశారు అవినీతి జరిగిందని తెలిసినా కాంట్రాక్టర్లను కొనసాగిస్తున్నారు మద్యం షాపులు, బొగ్గు కొనుగోళ్లు అన్నింటా అవినీతి కనిపిస్తోంది చివరకు దేవుడి భూములను కూడా వదిలిపెట్టడం లేదు రెండున్నరేళ్ల పాలనలో ఎక్కడ చూసినా అవినీతిమయం రెండున్నరేళ్లు కావస్తున్నా చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయలేదు ఇందులో గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్ సీపీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కమిటీ వేస్తే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఉంటారని వేయలేదు. పేదలకు అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా చేస్తున్నాడు, పంచాయతీ సర్పంచ్‌లకు విలువ లేదు పేద ప్రజల నుంచి భూములు ఎలా లాక్కోవాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు చింతలపూడి ప్రాజెక్టును చూస్తే ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో గ్రామానికి ఒక్కో ధర ఇస్తున్నారు గిరిజనులం కాబట్టి అడగలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు వేరే పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి చేర్చుకుంటున్నారు వాళ్లతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు గాంధేయ పద్ధతిలో రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ప్రదర్శన చేయకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు అప్రజాస్వామిక పాలన పోవాలి. మేధావులు, యువకులు కదలాలి. గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రావాలి -
టీడీపీలో మాత్రం చేరవద్దు అన్నారు
-
వైఎస్ఆర్ సీపీలో చేరిన కోటగిరి శ్రీధర్
ద్వారకా తిరుమల: మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ రోజు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లి అక్కడి నుంచి ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ద్వారకా తిరుమలలో చినవెంకన్న దర్శనం చేసుకున్న తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కోటగిరి శ్రీధర్
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కోటగిరి శ్రీధర్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మాజీమంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ కలిశారు. ఆయన ఆదివారం లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. కోటగిరి శ్రీధర్ ఈ నెల 28న వైఎస్ఆర్ సీపీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగ సభలో ఆయన అధికారికంగా పార్టీలో చేరతారు. శ్రీధర్‌తో పాటు పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని కూడా వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు. కాగా ఇటీవలే మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే.