దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న కోటగిరి శ్రీధర్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: నీతిమాలిన రాజకీయాలు చేస్తూ.. డ్రామాలు ఆడుతున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ విమర్శించారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లి గోద్రెజ్ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు చేపట్టిన రైతు దీక్ష రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ఆయిల్‌పామ్ రైతుల నుంచి విశేష స్పందన లభించింది.
తలారి వెంకట్రావుకు కోటగిరి శ్రీధర్, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెలికాని రాజబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. రైతుల కోసం పోరాడుతున్న తలారిని అభినందించారు. శ్రీధర్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర రైతులకు ఎలాంటి మేలూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌తో చేతులు కలిపి, ఇరు పార్టీల నేతలకు, కార్యకర్తలకు బాబు ద్రోహం చేశారన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు పనిచేయరని తిట్టిన బాబు ఇప్పుడు ఆయనతో చేతులు కలపడం దారుణమన్నారు. బీజేపీని విడిచిన బాబుకు అధికారం దక్కదన్న భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్‌తో జతకట్టి రాష్ట్ర ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారని విమర్శించారు.
బాబుకు రైతుల కష్టాలు పట్టవా..: ఆయిల్‌పామ్ రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నా చంద్రబాబుకు అవేమీ పట్టడం లేదని కవురు శ్రీనివాస్ విమర్శించారు. రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఒకశాతం రికవరీ శాతాన్ని వెంటనే ఖాతాల్లో జమచేయాలన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ తలారి రాష్ట్ర రైతుల తరఫున పోరాడుతున్నారన్నారు. ఆయన చేపట్టిన దీక్షకు రైతుల నుంచి విశేష స్పందన రావడం గొప్పవిషయమన్నారు. చంద్రబాబు ఒక్క ఆయిల్‌పామ్ రైతులనే కాకుండా అందరినీ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల కష్టాలు తీరాలంటే జగనన్న సీఎం కావాలని పేర్కొన్నారు. చెలికాని రాజబాబు మాట్లాడుతూ రైతు బాగుండాలి అంటే.. జగన్ సీఎం కావాల్సిందేనన్నారు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తే రైతనే వాడు లేకుండా చేస్తారని అన్నారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు.
నీరసించిన తలారి
పచ్చి మంచినీళ్తూ ముట్టకుండా దీక్ష చేస్తున్న తలారి వెంకట్రావు నీరసించారు. రైతులకు మద్దతుగా, వారికి అండగా నిలిచి ఆయన చేపట్టిన దీక్ష 24 గంటలు పూర్తవడంతో బాగా నీరసించారు. అయినా సంఘీభావం తెలిపేందుకు వచ్చే రైతులను, పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. పలువురు మహిళా రైతులు తలారికి సంఘీభావం తెలిపి, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల, గోపాలపురం, నల్లజర్ల మండలాల కన్వీనర్లు ప్రతాపనేని వాసు, పడమట సుభాష్ చంద్రబోస్, గగ్గర శ్రీనివాస్, గోపాలపురం మాజీ ఏఎంసీ ఛైర్మన్ కుప్పాల దుర్గారావు, నరహరిశెట్టి రాజేంద్రబాబు, ఇళ్ల భాస్కరరావు, దాకారపు అగ్గియ్య, గన్నమని జనార్ధనరావు, కారుమంచి రమేష్, వెల్లంకి సుబ్రహ్మణ్యం, కుసులూరి సతీష్, కాసంశెట్టి రాంబాబు, కాండ్రు రామకృష్ణ, తొమ్మ ండ్రు రమేష్, తొమ్మండ్రు రవి, కరుటూరి గణేశ్వరరావు, కలం సత్యన్నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment