‘ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా?’ | YSRCP Leader Mudunuri Prasad Raju Fires On Chandrababu Naidu Over YS Jagan KTR Meeting | Sakshi
Sakshi News home page

‘ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా?’

Published Thu, Jan 17 2019 6:31 PM | Last Updated on Thu, Jan 17 2019 6:34 PM

YSRCP Leader Mudunuri Prasad Raju Fires On Chandrababu Naidu Over YS Jagan KTR Meeting - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డికి నీచ రాజకీయాలు చేయడం రాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వైఎస్‌ జగన్‌తో భేటీ అవడం హర్షించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు కూడా తమలాగే ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్‌ విసిరారు.

రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకునేది మీరు..
రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, ఒక సిద్ధాంతమంటూ లేకుండా రోజుకో పార్టీతో కలిసేది చంద్రబాబు నాయుడు కాదా ప్రసాదరాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏకైక పార్టీ తమదేనని,   చంద్రబాబులా లాలూచీ రాజకీయాలు తమ నాయకుడికి చేతకావని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు మాటలు ప్రజలకు గుర్తున్నాయని, వారు అన్ని విషయాలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement