mudunuri prasad raju
-
‘ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే ప్రభుత్వం మొద్దునిద్ర’
పశ్చిమగోదావరి జిల్లా : రాష్ట్రంలో ఆక్వారంగం సంక్షోభంలో ఉంటే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. మత్యం ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీలో ఆక్వారంగం సంక్షోభంలో ఉందన్నారు. దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతుందంటూ మండిపడ్డారు.‘అమెరికా సుంకాల పెంపు సాకుతో కొన్ని కంపెనీలు సిండికేట్ గా మారి దోపిడీకి పాల్పడుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే కౌంట్ కి20 నుండి 40 రూపాయలు తగ్గించేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. రాష్ట్రంలో 75 శాతం ఆక్వా రంగంలోనే ఆదాయం వస్తుంది. హయాంలో ఒక సాధికారత కమిటీ వేశారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ హయాంలో రూపాయిన్నరకే పవర్ సబ్సిడీ ఇచ్చి రైతుకు అండగా నిలిచారు. ఫీడ్ కంపెనీలు ఎక్స్ పోటర్ సిండికేట్ గా మారిపోయారు. కూటమి ప్రభుత్వంలో నాయకులే ఎగుమతిదారులుగా చాలా మందే ఉన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను సాకగా చూపి.. ఇక్కడ రొయ్య ధరలు తగ్గించడం దుర్మార్గం.కేవలం రూ. 20, రూ. 30, రూ. 40 కౌంటర్ రొయ్య మాత్రమే అమెరికాకు ఎక్స్ పోర్ట్ అవుతాయి. 70 కౌంట్ గానీ, 100 కౌంట్ గానీ అమెరికా లాంటి ఎక్స్ పోర్ట్ చేసుకోదు. గతంలో ఫీడ్ రేట్లు పెరిగితే అప్సడా(Andhra Pradesh State Aquaculture Development Authority) ద్వారా రేట్లు నియంత్రించారు. అప్పుడు సోయా కేజీ 85 రూపాయలు ఉంది. ఇప్పుడు కేజీ 25 రూపాయలు ఉన్నా ఫీడ్ రేటు తగ్గించడం లేదు. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు.జగన్ హయాంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వాలాబ్ లో పెట్టి.. రైతులకు అండగా నిలిచారు. ఫీడ్ గానీ, సీడ్ కానీ కల్తీ లేకుండా చట్టాలను తీసుకొచ్చారు. జగన్ చైర్మన్ గా ఉండి అప్సడా ద్వారా మానిటరింగ్ చేసేవారు.’ అని పేర్కొన్నారు. ముడిసరుకులు తగ్గించినప్పుడు ఫీడ్ రేటు తగ్గించాలి కదా.. ప్రభుత్వ పెద్దల సహకారంతో రైతులు నడ్డివిరుస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులకు జగన్ అండగా నిలిచారు. ఎగుమతుదారులతో కో ఆర్డినేషన్ చేసి రైతులను ఆదుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన ఉండాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఆక్వా రైతులలో ఉన్న ఆందోళన తొలగించాలి’ అని ఆయన పేర్కొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఏపీ క్షత్రియ ఫెడరేషన్ బృందం
సాక్షి, అమరావతి: ఏపీ క్షత్రియ ఫెడరేషన్ సభ్యులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టడంపై సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాక క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి పేద క్షత్రియులను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు సేవాసమితి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ను ఏర్పాటుచేసి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వారు సీఎం జగన్‌కు వివరించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏపీ క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటపతి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, క్షత్రియ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ టీవీఎస్ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు
సాక్షి, తణుకు: తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను జంతువులతో పోల్చారని ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా తణుకు, నరసాపురం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. (ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు) ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లుతున్నారంటూ ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘రూ. 80 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు’
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ప్రశంసించారు. సుమారు రూ. 80 కోట్లతో నరసాపురం నియెజకవర్గం అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ చిరకాల వాంఛ అయిన నర్సాపురం వశిష్ఠ వారధి.. అలాగే బియ్యపుతిప్పలోని మినీ హార్బర్, విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు మంచినీటి పైపులైన్లకు జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఇల్లులేని 7841 మందిని గుర్తించామని, ఉగాది నాటికి వారందరికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇసుక విషయంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వరదల వల్ల ఇసుక తవ్వడం ఆలస్యమైందే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకం లేదని వివరణ ఇచ్చారు. -
చంద్రబాబు నన్ను మోసం చేశాడు..
సాక్షి, నర్సాపురం : పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని పరిణామం. మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం ఆయన రాజీనామా పత్రాలపై తన అభిమానులు, కార్యకర్తల సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు నన్ను, నా ప్రజలను నమ్మించి మోసం చేశాడు. కనీసం నన్ను సంప్రదించకుండా నర్సాపురం సీటు కేటాయించడం చాలా బాధాకరం. నాకు టికెట్ ఇవ్వకపోయినా బాధలేదు. కానీ నమ్మకద్రోహం చేయడం నా ప్రజలు ఆవేదన చెందారు. నాతో పాటు పదిమంది కౌన్సిలర్లు, వేలాదిమంది కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేస్తున్నాం. చదవండి...(వైఎస్ జగన్‌ను కలిసిన కొత్తపల్లి సుబ్బారాయుడు) వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతాం. మా సత్తా ఏంటో చూపిస్తాం. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. నర్సాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. నా ప్రతాపం పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో చూపిస్తాను. రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలవడానికి నేను ప్రచారం చేస్తా.’ అని స్పష్టం చేశారు. కాగా కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్న (ఆదివారం) వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం విదితమే. -
ప్రజలు వైఎస్ జగన్‌ని కోరుకుంటున్నారు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వంపై విసిగి, మోసపోయి ప్రజలు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు వ్యాఖ్యానించారు. గురువారం నరసాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ముదునూరి ప్రసాద్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కావురు శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. తాము పూర్తిగా, సంపూర్ణంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తామిద్దరూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పూర్తి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అవతల అభ్యర్థి ఎవరనేది చూడకుండానే 5వ సారి పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అసెంబ్లీ స్థానానికి నెంబర్ వన్‌గా నామినేషన్ ఎలాగైతే వేశారో.. అదే విధంగా నెంబర్ వన్ స్థానంలో ప్రసాద్ రాజు గెలుస్తారని జోష్యం చెప్పారు. -
‘ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా?’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మెహన్ రెడ్డికి నీచ రాజకీయాలు చేయడం రాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ విషయమై చర్చించేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్ జగన్‌తో భేటీ అవడం హర్షించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు కూడా తమలాగే ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకునేది మీరు.. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, ఒక సిద్ధాంతమంటూ లేకుండా రోజుకో పార్టీతో కలిసేది చంద్రబాబు నాయుడు కాదా ప్రసాదరాజు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏకైక పార్టీ తమదేనని, చంద్రబాబులా లాలూచీ రాజకీయాలు తమ నాయకుడికి చేతకావని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్న చంద్రబాబు మాటలు ప్రజలకు గుర్తున్నాయని, వారు అన్ని విషయాలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
రైతులను మభ్యపెట్టేందుకే ఏరువాక
► ఒట్టి దుబారా కార్యక్రమం ► జిల్లాకు 29 సార్లు వచ్చిన సీఎం ఏంచేశారు ► చంద్రబాబు మోసాలను గడపగడపకూ వివరిస్తాం ► మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నరసాపురం: రైతుల కోసం ఏమీ చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని మభ్యపెట్టేందుకే ఏరువాక కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉంటే పండగ చేసుకుంటారని, చంద్రబాబు రెండేళ్ల పాలనలో వారికి ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదని, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడంకోసం పనుల వ్యయాన్ని మాత్రం ప్రభుత్వం రెట్టింపు చేస్తోందని విమర్శించారు. జిల్లాలో శివారు ప్రాతాలకు ఎక్కడా సాగునీరు అందే పరిస్థితి లేదని, కాలువలను ఈనెల 10న విడుదల చేసినా, ఇంకా 80శాతం ప్రాంతాల్లో చిన్న కాలువలకు నీరు చేరలేదని, నీటిని కూడా అందించలేని ప్రభుత్వం సిగ్గుపడటం మాని, ఏరువాక అంటూ రూ.కోట్లు దండగ చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇది ఒట్టి దుబారా కార్యక్రమమని అభివర్ణించారు. రెండేళ్లలో ఒరిగిందేమిటీ? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు ఒరిగిందేమీ లేదని, ఈ కాలంలో మూడు తుపాన్లు వచ్చాయని, రైతులు దారుణంగా నష్టపోయారని, అయినా వారికి పరిహారంగానీ, సాయం గానీ అందించలేదని విమర్శించారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను బాబు దగా చేశారని మండిపడ్డారు. డెల్టా ఆధునికీకరణ పనులు సాగక, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏరువాక పండగ అంటూ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. అసలు వ్యవసాయం దండగ అన్న బాబు, ఇప్పుడు రైతులకు రిక్తహస్తం చూపి పండగ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 30వ సారి జిల్లాకు వస్తున్న సీఎం, అసలు ఈ జిల్లాకు ఈ రెండేళ్లలో ఏం మేలు చేశారో చెప్పాలని ముదునూరి డిమాండ్ చేశారు. చంద్రబాబు మోసాలను రాష్ట్రంలోని ప్రతి గడపగడపకూ తిరిగి వివరిస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబును ప్రజలు బహిరంగంగా నిలదీసే రోజును వైఎస్సార్ సీపీ తీసుకొస్తుందని స్పష్టం చేశారు.