సాక్షి, అమరావతి: ఏపీ క్షత్రియ ఫెడరేషన్ సభ్యులు సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టడంపై సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు.
అంతేకాక క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి పేద క్షత్రియులను ఆదుకుంటున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు సేవాసమితి పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాము ఏపీ క్షత్రియ ఫెడరేషన్‌ను ఏర్పాటుచేసి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు వారు సీఎం జగన్‌కు వివరించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏపీ క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటపతి రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, క్షత్రియ ఫెడరేషన్ వైస్ ఛైర్మన్ టీవీఎస్ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు తదితరులు సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment