
సాక్షి, తణుకు: తమ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాద్‌రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను జంతువులతో పోల్చారని ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా తణుకు, నరసాపురం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. (ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి ఫిర్యాదు)
ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై బురద చల్లుతున్నారంటూ ఆచంట నియోజకవర్గంలోని పోడూరు మండలం పోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment