
పశ్చిమ గోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంబేడ్కర్ మిషన్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment