attracity case
-
ఎంపీ రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పశ్చిమ గోదావరి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్ మల్లేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన గొంది రాజు, ఎయిమ్ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంబేడ్కర్ మిషన్ నాయకులు మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న రఘురామ నిజాయితీపరుడైన అధికారిని దూషించడాన్ని ఖండించారు. -
నాపై అకారణంగా దాడి చేశారు..
సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ఆరెంపులలో ఇరు వర్గాలు బుధవారం అర్ధరాత్రి ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండి జగదీష్, కె జశ్వంత్, దాసరి ఉపేందర్, కందుల భాస్కర్, గుండె సాయిరాం, సాలంకి మహేష్, ఎస్కె సోందు, సాలంకి నాగేంద్రబాబు,అభిషేక్ జిన్నెక సాయిక్రిష్ణ,సాలంకి కళ్యాణ్‌లు కలిసి మోహన్‌రావు, విజయ్, చింతమళ్ల పద్మలపై రాళ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు ఖమ్మం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వచ్చి గేటు మూయడానికి వెళ్లగా అప్పటికే అక్కడ కాపుకాసిన పైవారు ఇనుపరాడ్లతో, రాళ్లతో దాడి చేశారు. పక్కనే ఉన్న మోహన్‌రావు సోదరులు చింతమళ్ల రవికుమార్, విజయ్, చింతమళ్ల పద్మలు ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా వారిపై కూడా దాడి చేశారు. దీంతో మోహన్‌రావు చేతికి, విజయ్ తలకు, పద్మ చేతికి గాయాలయ్యాయి. అదే విధంగా సర్పంచ్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి శాంతింప చేశారు. కులం పేరుతో దూషించినందుకు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు , మిగతా 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలి పారు. దాసరి లక్ష్మి ఇచ్చి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు, సందీప్, మనోహర్, రవికుమార్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం దళితులపై ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరైనా దాడులు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఆరెంపుల గ్రామసర్పంచ్ పద్మ ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి గ్రామంలో జరిగిన సంఘటన గురించి వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఆరోజు రాత్రి ఏంజరిగింది అనే వివరాలను సర్పంచ్‌ను అడిగారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రోజు రోజుకూ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో దళితులను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ఇప్పటికైనా గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సైపై దాడికి యత్నం: యువకుడిపై కేసు చర్ల: భద్రాచలం పట్టణ ఎస్సైపై దాడికి యత్నించిన ఘటనపై గురువారం కేసు నమోదయింది. ఎస్సై వరుణ్‌ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పట్టణంలోని చర్ల రోడ్లో తన కారుతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ప్రశ్నించిన బైక్ యజమాని మోహన్‌పై దాడి చేసి బూతులు తిట్టాడు. తాను కొండిశెటి నాగేశ్వరావు కుమారుడిని, తన పేరు వీరాంజనేయులు అంటూ హంగామా చేశాడు. బాధితుడి సమాచారం తో ఎస్సై అక్కడికి చేరుకోగా.. ఎస్ఐ పైకి కూడా దాడికి యత్నించి నెట్టివేశాడు. దీంతో వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బాధితుడు మోహన్, ఎస్సై వరుణ్ప్రసాద్ల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. ఖమ్మం నుంచి ఇంటికి వచ్చిన. అంతకు ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు. అయితే ద్విచక్రవాహనాన్ని ఇంట్లో నిలిపి గేటు వేయడానికి బయటకు వచ్చిన. అప్పటికే బయట ఉన్న వారు రాడ్లతో, రాళ్లతో నాపై దాడి చేశారు. దీంతో ఏంచేయాలో తెలియక ఇంట్లోకి వెళుతున్నా. ఈలోపు మాసోదరులు ఎందుకు కొడుతున్నారని అడిగారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరేంది చెప్పేది అంటూ వారిపై కూడా దాడి చేశారు. నాపై, మాసోదరులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. – చింతమళ్ల మోహన్‌రావు -
దళితులనూ వదలని కే ట్యాక్స్
కష్టాల్లో తోడుండాల్సిన సొంత బంధువులే తోడేళ్లుగా మారి ఉన్న స్థలంపై కన్నేశారు. టీడీపీ నేతల అండదండలతో అక్రమంగా అమ్మేసుకున్నారు. పోలీసు స్టేషన్ మెట్లెక్కితే.. కోడెల కుటుంబంవైపు దారి చూపారు. అన్యాయం చేశారయ్యా.. మీరే ఆలకించండయ్యా అని కోడెల శివరామ్ వద్ద కాళ్లావేళ్లా పడితే కాదు పొమ్మన్నారు. కాసులిచ్చిన వారి వైపే త్రాసు తూచారు. దళితులను కులం పేరుతో దూషించారు. ఊళ్లో ఉంటే ఊపిరి కూడా ఉండదని బెదిరించారు. చట్టాలు అధికారపు మోచేతి కింద మోకరిల్లగా.. ఇక చేసేది లేక కన్న ఊరు, సొంత గూడు వదిలి కన్నీటితో కదిలిపోయారు ఆ దళితులు.. ప్రభుత్వం మారడంతో తమ వేదన ఆలకిస్తారనే ఆశతో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇలా రోజురోజుకు కోడెల కుటుంబం అక్రమాలు, అన్యాయాలకు బలైన అనేక మంది పోలీసు గడప తొక్కుతున్నారు. నరసరావుపేట టౌన్: విలువైన స్థలాన్ని టీడీపీ నాయకుల సహాయంతో బంధువులు ఆక్రమించి అమ్ముకున్నారు.. న్యాయం చేయాలని కోడెల కుటుంబ సభ్యుల వద్దకు వెళితే బెదిరించి కులం పేరుతో దూషించారు.. ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోగా తిరిగి తమపైనే కేసులు పెడతామన్నారు.. భయంతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లి ఇతర ప్రాంతంలో బతుకుతున్నాం... ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చానని ఓ దళిత మహిళ శుక్రవారం పోలీసుల ఎదుట వాపోయింది. వివరాలు.. కందుకూరి బుజ్జి వెంకాయమ్మ కుమారుడు రాజేష్వర్మకు అతని తాత షాలెంనగర్ ప్రాంతంలో 2.5 సెంట్ల భూమిని సుమారు 17 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే, వాస్తవాన్ని దాచి స్థలంలో సగ భాగం తనకు హక్కు ఉందని 2006లో వెంకాయమ్మ మరిది చంద్రశేఖర్ ఇతరులకు 1.25 సెంట్ల భూమిని విక్రయించాడు. మిగిలిన స్థలంలో ఉన్న ఇంటిపై పెద్ద బావ శ్రీనివాసరావు కన్నేసి తనదిగా చూపి అతని కుమారుడికి 2014లో రాసిచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకాయమ్మ ఇదేమిటని ప్రశ్నించించడంతో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వెంకాయమ్మ వ్యతిరేక వర్గం టీడీపీ నాయకులు కుంపటి రవి, గుండాల రవీంద్రల్ని సంప్రదించగా వారి అనుచరులతో ఇంటి వద్దకు వెళ్లి ఖాళీ చేసి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడ్డారు. న్యాయం కోసం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి వద్దకు వెంకాయమ్మ వెళ్లింది. అయితే, కుంపటి రవి చెప్పినట్లు విని ఇళ్లు ఖాళీ చేసి ఊళ్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించడంతో పాటు కులం పేరుతో దూషించారు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన అన్యాయం వివరించి ఫిర్యాదు చేసింది. అయితే. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోగా కోడెల శివరామ్ చెప్పినట్లుగా ఊరు విడిచి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. అలా కాదని అక్కడే ఉంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆస్తుల్ని వదిలేసి వెంకాయమ్మ కుటుంబంతో సహా ఊరు విడిచి చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి వెళ్లి గత మూడేళ్లుగా అక్కడే జీవిస్తోంది. తెలుగుదేశం నాయకుల అవినీతి, అక్రమాలపై వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో బాధితురాలు ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందన్నా ఆశతో శుక్రవారం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అట్రాసిటీ కేసు నమోదు కులం పేరుతో దూషించి తమ ఆస్తిని అక్రమంగా కాజేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల శివరామ్, పూనాటి విజయలక్ష్మి, వారి అనుచరులు అరుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ.వి. బ్రహ్మం శుక్రవారం తెలిపారు. కాగా ఇప్పటికే కోడెల కుటుంబ సభ్యులపై 13 క్రిమినల్ కేసులు నమోదవ్వగా శుక్రవారం మరో అట్రాసిటీ కేసు నమోదైంది. ఇప్పటికే కోడెల శివరామ్ వేధింపులతో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేసే దివ్యాంగుడు కృష్ణారావు ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతిని కోరగా.. దళిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిన సంఘటన ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వచ్చాయి. -
కన్నోళ్లపై కాఠిన్యం
కర్నూలు(హాస్పిటల్): పిల్లలను కనడమే కాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ విద్యాబుద్ధులు చెప్పించి, గొప్పవారిగా చూడాలని తల్లిదండ్రులు కలలుగంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. అయితే ఆధునిక కాలంలో అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లో ఉన్నా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా మాట్లాడటం, తిట్టడం, తిండి పెట్టకపోవడం, అవమానించడం, కొట్టడం చేస్తున్నారు. మరికొందరు ఆస్తి కోసం కన్నవారని చూడకుండా కర్కశంగా చంపేస్తున్నారు. తిరుపతిలో మంగళవారం జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆస్తి కోసం ఓ వృద్ధున్ని కొడుకు, కోడలు దారుణంగా కారం చల్లి మరీ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో పలుచోట్ల జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లు అనాథ వృద్ధులకు ఆశ్రయంగా మిగులుతున్నాయి. వీరికి ఎవరూ ఉండరా అంటే అందరూ ఉంటున్నారు. కానీ వారి ఆలనా పాలనా చూసే వారు మాత్రం కరువవుతున్నారు. ఫలితంగా చేతనైనంత కాలం బతుకీడ్చి తర్వాత తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అధికమవుతున్నాయి. కర్నూలులోనే ప్రతి వారంలో ఒకరిద్దరు అనాథ వృద్ధుల మృతదేహాలు వెలుగులోకి వస్తున్నాయి. కనీసం వీరి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు సైతం ఎవరూ రావడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టం ఏం చెబుతోంది? సీనియర్ సిటిజన్ యాక్ట్(తల్లిదండ్రుల భృతి, సంరక్షణ)ను 2007లో ప్రవేశపెట్టారు. 2011లో దీనికి కొన్ని సవరణలు చేశారు. ఈ చట్టం ప్రకారం వృద్ధులకు భృతి, పోషణ, రక్షణ వంటి పరిహారాలు సులువుగా కల్పించనున్నారు. కుమారులకే కాకుండా కుమార్తెలకు కూడా ఇది వర్తించేలా వీలు కల్పించారు. వృద్ధాప్యంలో దుస్తులు, ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాలను కొడు కు, కుమార్తె, మనుమలు, మనవరా లి నుంచి కూడా పొందేందుకు ఈ చట్టం అవకాశం ఇచ్చింది. ఇలా దరఖాస్తు చేసుకోదలచిన వ్యక్తి 60 ఏళ్లకు పైబడి ఉండాలి. దత్తత పొందిన పిల్లల విషయంలోనూ ఈ చట్టం వర్తిస్తుంది. విచారణ చేసేదెవరు? సబ్ డివిజనల్ అధికారి హోదాకు తక్కువ కాని అధికారి సారథ్యం వహించే ట్రిబ్యునల్ ఈ చట్టం పరిధిలోని కేసులను విచారణ చేస్తుంది. సుమోటోగా కూడా విచారణ చేపట్టవచ్చు. నోటీసు ద్వారా పిలిపించి అనుసంధాన కర్త ద్వారా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తారు. జిల్లా మెజిస్ట్రేట్ హోదా కలిగిన అప్పిలేట్ అధికారి ట్రిబ్యునల్ తీర్పులపై న్యాయ సమీక్ష చేస్తారు. సీనియర్ సిటిజన్లను నిర్లక్ష్యం చేసిన వారికి 3 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. జిల్లాలో ఇటీవలిగుర్తుతెలియని వృద్ధుల మరణాలు ♦ గత నెల 9న నంద్యాలలోని బంగారుపుట్ల వద్ద చిన్న చెరువులో 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో మృతిచెందింది. ♦ గత నెల 20న కర్నూలు సమీప జొహరాపురం ఇందిరమ్మ కాలనీలో గడ్డపార చిన్న ఆంజనేయులు(50) అనారోగ్యంతో మృతిచెందాడు. ♦ గత నెల 26న కర్నూలు కేవీఆర్ మహిళా కళాశాలసమీపంలో 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందాడు. ♦ జూన్ 4న కర్నూలు టూటౌన్ పరిధిలో 65 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మృతిచెందాడు. తిరుపతి ఘటన దారుణం తిరుపతిలో ఆస్తి కోసం ఓ వృద్ధున్ని కొడుకు, కోడలు కొట్టిన ఉదంతం సభ్యసమాజం సిగ్గుపడేలా ఉంది. ఇలాంటి కొడుకులను కఠినంగా శిక్షించాలి. వృద్ధుల సంక్షేమ చట్టం–2007 ప్రకారం తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు శిక్షార్హులు. ఈ చట్టం మేరకు తల్లిదండ్రులకు ప్రతి నెలా రూ.10వేల భృతి ఇవ్వాలి. చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వమే వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి పోషించాలి. – కృపావరం, జిల్లా వృద్ధుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు లోక్అదాలత్లోదరఖాస్తు చేసుకోవాలి వృద్ధ తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ హక్కుల కోసం లోక్ అదాలత్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే వారి పిల్లలకు లోక్‌అదాలత్ నోటీసులు జారీ చేస్తుంది. ప్రభుత్వం కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏర్పాటు చేస్తుంది. వృద్ధ తల్లిదండ్రులకు జీతం అటాచ్మెంట్, ఆరోగ్య, శారీరక, మానసిక భద్రత కల్పిస్తుంది. – ఎల్.హేమలతా లింగారెడ్డి,న్యాయవాది, కర్నూలు -
బ్యాంకర్లపై అట్రాసిటీ కేసులు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేదలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల గ్రౌండింగ్‌లో బ్యాంకర్లు అవలంబిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశ మందిరంలో డీఎల్ఆర్సీ, డీసీసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుండి 2018 వరకు ప్రభుత్వం నుండి వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలు, గ్రౌండింగ్, సబ్సిడీలు విడుదలపై బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు, వాటి గ్రౌండింగ్, అమలులో సమస్యలపై ఆరా తీశారు. బ్యాంకర్లు రుణాల మంజూరుపై అవలంభిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని, ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నదర్పల్లిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే సమావేశం లో ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ బ్యాంకర్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లపై కేసులను చిన్నదర్పల్లి నుండే ప్రారంభించాలని సూచించారు. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. యూనిట్లు లేకున్నా ఉన్నట్లు బ్యాంకర్లు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేస్తుందని, జిల్లాలో 70 శాతం యూనిట్లు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, బ్యాంకర్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను ధ్రువీకరించాలని కలెక్టర్ సూచించారు. కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్సు బిజినెస్ వద్దు ‘ప్రభుత్వం మంజూరు చేసి యూనిట్లకు కాన్సెంట్ అవసరమే లేదు.. కాన్సెంట్ ఎందుకు అడుగుతున్నారు.. మండల స్థాయిలోని ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మద్దతు పథకాలకు సంబందించిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఉండి ఈ విషయం తెలియకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల గ్రౌండింగ్‌కు డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారముందని, అంతేకాకుండా రుణాలు విడుదల చేస్తూ ఇన్సూరెన్సు కోత విధిస్తున్నట్లు తెలిసిందని. ఇకనైనా కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్స్‌ల పేరుతో బిజినెస్‌లు చేయొద్దని హెచ్చరించారు. లక్ష్యం మేరకు పంట రుణాలు జిల్లాలో రబీ కంటే ఖరీఫ్ సాగు ఎక్కువగా వేస్తారని, వర్షాలు కురుస్తున్నందున పంట రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. టార్గెట్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు భూ ప్రక్షాళన కార్యక్రమం తప్పొప్పుల సవరణ పూర్తి కానుందని, త్వరలో ధరణి లింక్‌ను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వనుందని తెలిపారు. ఆన్లైన్లో భూ రికార్డులు పక్కాగా అందుబాటులోకి రానున్నాయని, అప్పటివరకు తాము ఇచ్చే బ్యాంకు వారీగా రైతులు, ఖాతాలు, భూ వివరాల నివేదిక ఆధారంగా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్, పరిగి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, ఎల్డీఎం ప్రభాకర్ శెట్టి, నాబార్డు ఏజీఎం అమితాబ్ భార్గవ్, ఆర్బీఐ అధికారులు, కార్పొరేషన్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్‌పై అత్యాచారం
మల్యాల(చొప్పదండి): తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై ఎస్సీ అట్రాసిటీ కేసుతోపాటు పోస్కో(ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అఫెన్స్) కేసును పోలీసులు నమోదు చేశారు. మల్యాల ఎస్సై నీలం రవి వివరాల ప్రకారం మల్యాల అడ్డరోడ్డులో నివాసముంటున్న విద్యార్థిని మండల కేంద్రంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తరచూ ఆటోలో పాఠశాలకు వెళ్లడంతో లంబాడిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కల్లెడ రాజేశ్ పరిచయం చేసుకున్నాడు. విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి ఫిబ్రవరి 28న బలవంతంగా లక్షెట్టిపేటలోని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చి 1న జగిత్యాలలో బాలికను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు ఇంటికిచేరి, తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
అట్రాసిటీ కేసుపై ఏఎస్పీ విచారణ
ములగపూడి: ఓ గిరిజన సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు అడ్డుకోవడమే కాకుండా అతనిని కులంపేరుతో దూషించిన మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు అంకంరెడ్డి సతీష్‌కుమార్‌పై నమోదైన అట్రాసిటీ కేసును ఏఎస్పీ అద్నాన్ నయీమ్ గురువారం విచారించారు. ములగపూడిలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో ఎంపిటీసీ సభ్యుడు, ఎస్సీపేటలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ గుమ్మడి అశోక్ కుమార్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయాలంటూ అధికారులు సర్కు్యలర్ జారీ చేశారు. ఆమేరకు సర్పంచ్ అశోక్‌కుమార్ ఎస్సీపేటలోని పాఠశాల వద్దకు పాలకవర్గ సభ్యులు, తన అనుచరులతో వెళ్లారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఆ పాఠశాల హెచ్ఎం సర్పంచ్ అశోక్‌కుమార్‌ను ఆహ్వానించగా పక్కనే ఉన్న ఎంపీటీసీ సభ్యుడు సతీష్‌కుమార్ తనను నెట్టేశారని ఏఎస్పీకి ఆయన తెలిపారు. ‘నువ్వెవడవురా కొండనాకొడకా’ అంటూ తనను అగౌరవపరచి మనస్తాపానికి గురిచేశాడని వాపోయారు. తన చెక్ పవర్ రద్దు చేయిస్తానని సతీష్‌కుమార్ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.lఅనంతరం ఎస్సీపేటలోని ప్రాథమిక పాఠశాలను ఏఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట తుని సీఐ జి.చెన్నకేశవరావు, కోటనందూరు కానిస్టేబుల్ బాలరాజు ఉన్నారు. -
టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలో టీడీపీ నాయకుడు, కార్పొరేటర్ భర్త జయరాంనాయుడుపై ఆదివారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. నాయుడు ఇంటి ముందు చేపట్టిన మురుగు కాలువ పనుల్లో భాగంగా అడ్డు గా ఉన్న వేపచెట్టును కూలీలు తాతయ్య, మరో ఇద్దరు తొలగిం చారు. దీంతో వారిపై నాయుడు దాడి చేయడమే గాక కులం పేరు తో తమను దూషించి అవమానించినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
'దళితులపై దాడులు అరికట్టాలి'
సంగారెడ్డి(మెదక్ జిల్లా): దళితులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఫ్లెక్సీకి శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీని దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ దళితులపై దాడులు చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలని, అట్రాసిటి కేసులను నీరుగారుస్తున్న సంగారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలని, సంగారెడ్డి జడ్పీటీసీ మనోహర్‌గౌడ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.