దాడిలో గాయపడిన వ్యక్తి
సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ఆరెంపులలో ఇరు వర్గాలు బుధవారం అర్ధరాత్రి ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండి జగదీష్, కె జశ్వంత్, దాసరి ఉపేందర్, కందుల భాస్కర్, గుండె సాయిరాం, సాలంకి మహేష్, ఎస్‌కె సోందు, సాలంకి నాగేంద్రబాబు,అభిషేక్ జిన్నెక సాయిక్రిష్ణ,సాలంకి కళ్యాణ్‌లు కలిసి మోహన్‌రావు, విజయ్, చింతమళ్ల పద్మలపై రాళ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు ఖమ్మం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వచ్చి గేటు మూయడానికి వెళ్లగా అప్పటికే అక్కడ కాపుకాసిన పైవారు ఇనుపరాడ్లతో, రాళ్లతో దాడి చేశారు. పక్కనే ఉన్న మోహన్‌రావు సోదరులు చింతమళ్ల రవికుమార్, విజయ్, చింతమళ్ల పద్మలు ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా వారిపై కూడా దాడి చేశారు. దీంతో మోహన్‌రావు చేతికి, విజయ్ తలకు, పద్మ చేతికి గాయాలయ్యాయి. అదే విధంగా సర్పంచ్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి శాంతింప చేశారు. కులం పేరుతో దూషించినందుకు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు , మిగతా 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలి పారు. దాసరి లక్ష్మి ఇచ్చి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు, సందీప్, మనోహర్, రవికుమార్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం
దళితులపై ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరైనా దాడులు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతానని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఆరెంపుల గ్రామసర్పంచ్ పద్మ ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి గ్రామంలో జరిగిన సంఘటన గురించి వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఆరోజు రాత్రి ఏంజరిగింది అనే వివరాలను సర్పంచ్‌ను అడిగారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రోజు రోజుకూ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో దళితులను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ఇప్పటికైనా గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎస్సైపై దాడికి యత్నం: యువకుడిపై కేసు
చర్ల: భద్రాచలం పట్టణ ఎస్సైపై దాడికి యత్నించిన ఘటనపై గురువారం కేసు నమోదయింది. ఎస్సై వరుణ్‌ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పట్టణంలోని చర్ల రోడ్‌లో తన కారుతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ప్రశ్నించిన బైక్ యజమాని మోహన్‌పై దాడి చేసి బూతులు తిట్టాడు. తాను కొండిశెటి నాగేశ్వరావు కుమారుడిని, తన పేరు వీరాంజనేయులు అంటూ హంగామా చేశాడు. బాధితుడి సమాచారం తో ఎస్సై అక్కడికి చేరుకోగా.. ఎస్‌ఐ పైకి కూడా దాడికి యత్నించి నెట్టివేశాడు. దీంతో వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బాధితుడు మోహన్, ఎస్సై వరుణ్‌ప్రసాద్‌ల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు.
ఖమ్మం నుంచి ఇంటికి వచ్చిన. అంతకు ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు. అయితే ద్విచక్రవాహనాన్ని ఇంట్లో నిలిపి గేటు వేయడానికి బయటకు వచ్చిన. అప్పటికే బయట ఉన్న వారు రాడ్లతో, రాళ్లతో నాపై దాడి చేశారు. దీంతో ఏంచేయాలో తెలియక ఇంట్లోకి వెళుతున్నా. ఈలోపు మాసోదరులు ఎందుకు కొడుతున్నారని అడిగారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరేంది చెప్పేది అంటూ వారిపై కూడా దాడి చేశారు. నాపై, మాసోదరులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
– చింతమళ్ల మోహన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment