Khammam Crime News
-
ప్రేమ వివాహం.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై
సాక్షి, ఖమ్మం క్రైం: వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంరూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఖమ్మంలో చికెన్ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొణిజర్ల మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన ఖమ్మం రోటరీనగర్‌లో నివాసముంటున్నాడు. అయితే, కొంతకాలం కిందట ఆమెకు భర్తతో కలిసి పనిచేసే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించడంలో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. దీంతో ఆమె ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతి భర్తకు ఈనెల 1న ఫోన్ చేసి పిలిపించి మద్యం తాగించాక శ్రీనివాస్‌నగర్–అగ్రహారం ప్రాంతంలో హత్య చేయడమే కాక చికెన్ వ్యర్థాల వాహనంలో తీసుకెళ్లి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని చెరువులో పడవేసినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు యువతి ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయడం బయటపడినట్లు తెలిసింది. అయితే, సదరు వ్యక్తి మృతదేహం ఇంకా లభ్యం కాకపోవటంతో కృష్ణా జిల్లా పోలీసుల సాయంతో అక్కడి చేపల చెరువుల్లో గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఒకటిరెండు రోజుల్లో కేసు వివరాలను వెల్లడించే అవకాశముందని చెబుతున్నారు. చదవండి: (కూతురు ప్రేమపెళ్లి.. హాజరుకాని భార్య.. తిరిగి ఇంటికి రావడంతో...) -
లిఫ్ట్ పేరుతో టీచర్‌ను కారులో ఎక్కించుకుని.. ఆ తర్వాత..
సాక్షి, ఖమ్మం : పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాలిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 17వ తేదీన ఘటన జరగగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ఖమ్మం అర్బన్(ఖానాపురం హవేలీ) పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో ఖమ్మంకు చెందిన బి.కిషోర్, ఆయన భార్య ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు ప్రతిరోజు కారులో వెళ్లి వస్తుండే వారు. ఇదే మండలంలోని మరో పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు ఖమ్మం నుంచి రైలులో వెళ్లి వచ్చేది. ఒకటిరెండు సార్లు భార్యాభర్తలతో పాటు కారులో ఆమెను తీసుకెళ్లారు. ఈక్రమంలో సదరు మహిళపై కన్నేసిన కిషోర్ ఈనెల 17న సాయంత్రం గార్ల రైల్వేస్టేషన్లో ఉన్న మహిళ వద్దకు వెళ్లి ఖమ్మంలో దింపుతామని నమ్మబలికాడు. తన భార్య కూడా తర్వాత స్టేజీలో కారు ఎక్కుతుందని చెప్పగా మహిళ నమ్మి బయలుదేరింది. చదవండి: టీసీ ఇవ్వలేదని నిద్రమాత్రలు మింగిన విద్యార్థిని ఆ తర్వాత ఓ స్టేజీ, అనంతరం ఇంకో స్టేజీ అని నమ్మిస్తూ ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆమెను తీసుకెళ్లి కిషోర్ బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడిగా ఉన్నందున విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడు. అయితే, సదరు మహిళ విషయాన్ని తన భర్తకు తెలపగా, వారు ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
12 ఏళ్ల బాలికకు మాయమాటలు .. 7 నెలల గర్భవతి
సాక్షి, సత్తుపల్లిరూరల్: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ రమాకాంత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. బాలిక ఏడు నెలల గర్భిణి అని తెలియడంతో సీఐ ప్రత్యేక చొరవతో వైద్య పరీక్షలు చేయించి ఆమెకు మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు, దుస్తులు, డ్రైఫ్రూట్స్ అందించారు. -
మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి
సాక్షి, ఖమ్మం : బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన ఘటన శుక్రవారం కేటీఆర్ పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద భూపాలపల్లి జిల్లాకు చెందిన డీఎస్పీ సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ కార్యాలయం చేరుకొనే సమయంలో పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహాంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. మహిళా కానిస్టేబుల్ జ్యోత్స్నపై పుష్పగుచ్ఛంతో దాడి చేశాడు. దీంతో పుష్పగుచ్ఛం వెనుకవైపు ఉన్న కర్ర కానిస్టేబుల్ తలకు బలంగా తగలడంతో బిగ్గరగా రోదించింది. అక్కడే ఉన్న డీఎస్పీ సంపత్‌కుమార్ వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీచేయటంతో టూటౌన్ సీఐ గోపి అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (చదవండి: మహిళతో పరిచయం నిండు ప్రాణాన్ని బలితీసింది.) -
రేపే పెళ్లి.. పెళ్లికూతురితో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. రేపు పెళ్లి ఉందనగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని మూడో పట్టణ ప్రాంతానికి చెందిన గోవిందమ్మ(48), ఆమె కూతుళ్లు రాధిక(30), రమ్య(28) బుధవారం అర్థరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గోవిందమ్మ కుటుంబం నిరు పేదరికంలో ఉండంటంతోపాటు ఇంటి పెద్దగా ఉన్న భర్త ఏ పనిచేయకపోవడంతో ఆమెను కష్టాల్లోకి నెట్టివేశాయి. అంతేగాక ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు రాధికకు డిసెంబర్ 11న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి దగ్గరపడుతున్న సమయంలో డబ్బులు సర్దుబాటు కాకవడంతో మనస్తాపం చెందిన తల్లి, కూతుళ్లతో కలిసి తానువు చాలించారు. చదవండి: ప్రియుడి పెళ్లి రోజే ప్రేయసి మరణం.. -
కార్పొరేటర్‌పై దాడికి యత్నం.. కారు దహనం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్‌పై రఘునాథపాలెం మండలం కైకొండాయిగూడెం గ్రామంలో మంగళవారం దాడి యత్నం జరగడం, అతడి ఫార్చునర్ కారును తగలబెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 18వ తేదీన కైకొండాయిగూడెంకు చెందిన తేజావత్ ఆనంద్(23) అనే యువకుడు బైపాస్ రోడ్డు వెంట గల కార్పొరేటర్ రామ్మూర్తి ఫంక్షన్హాల్లో వెల్డింగ్ పనులకు వెళ్లి..అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కార్పొరేటర్‌కు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య చర్చలు జరగ్గా విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తన డివిజన్ పరిధిలోని కైకొండాయిగూడెం హైస్కూల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి..ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అడ్డగించగా..కోపోద్రిక్తుడైన కార్పొరేటర్ అసభ్యపదజాలంతో దూషించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు కార్పొరేటర్‌పై దాడికి ప్రయత్నించగా ప్రాణభయంతో..పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. స్థానికులు బయటి నుంచి తాళం వేసేశారు. అక్కడ ఏం జరుగుతుందోననే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కుమారుడి మృతికి కారణాలు తెలపాలని తల్లి తేజావత్ విజయ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కార్పొరేటర్ రామ్మూర్తి సైతం తనపై దాడి యత్నం, కారు దహనంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు ధ్వంసం, దహనం ఇలా.. పోలీసులు అక్కడికి చేరుకుని రామ్మూర్తి నాయక్‌ను, స్థానిక గ్రామ పెద్ద గుర్రం వెంకటరామయ్యతో కలిసి బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత టూ టౌన్ సీఐ గోపి ఆందోళనకారులను సముదాయించి కార్పొరేటర్ కారును డ్రైవర్ ద్వారా పంపిస్తుండగా..ఆందోళనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. భయాందోళన చెందిన డ్రైవర్ దిగి పారిపోగా..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల సమాచారంతో ఫైరింజన్ అక్కడికి చేరుకోగా..అప్పటికే దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. ఒక ఏసీపీ, ముగ్గురు సీఐలు, పోలీసు బలగాలతో ఉన్న సమయంలోనే కారును తగలబెట్టడం చూస్తే గ్రామస్తుల ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. గది నుంచి రామ్మూర్తినాయక్‌ను తరలిస్తున్న పోలీసులు (వృత్తంలో వ్యక్తి) 3గంటలు భయం..భయం: బడిలో హడలిన ఉపాధ్యాయులు గొడవతో కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కైకొండాయిగూడెం ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిలోకి వెళ్లి తల దాచుకున్నారు. గ్రామస్తులు వందల సంఖ్యలో అక్కడ గుమికూడడడంతో ఆన్లైన్ క్లాసుల కోసం వచ్చిన ఉపాధ్యాయులు కూడా భయంతో మరో గదిలోకి వెళ్లగా..అందులోకే రామ్మూర్తి నాయక్ వెంట వచ్చిన గుర్రం వెంకట్రామయ్య కూడా వెళ్లి దాక్కున్నాడు. పరిస్థితిని హెచ్ఎం డీఈఓకు ఫోన్లో వివరించారు. ఆ తర్వాత డయల్ 100కు చేస్తే అది గుంటూరుకు కలిసింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నాక వీరంతా బయటకు వచ్చారు. కార్పొరేటర్‌ను ప్రశ్నించడం, దాడికి యత్నం, దాక్కోవడం, గ్రామంలో కారు ధ్వసం ఇలా..ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం 2వరకు ఉద్రిక్తత నెలకొంది. -
ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ: వేర్వేరుచోట్ల ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పురుగుల మందు తాగి, ఒకరు ఉరి వేసుకుని మృతి చెందారు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి తన ఇంటికి రాకపోవడంతో భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన జజ్జెర ప్రసాద్(30) మద్యానికి అలవాటు పడి కుటుంబ పోషణను పట్టించుకోవడంలేదు. దీంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ప్రసాద్, భార్య సంధ్య పిల్లలతో కలిసి గొందిగూడెంలోని అత్తగారింటికి వెళ్లారు. (హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్రయల్స్‌పై నిషేధం) కరోనా లాక్‌డౌన్‌తో రెండు నెలలపాటు అక్కడే ఉన్నారు. ఇటీవల ప్రసాద్ ఒక్కడే పాల్వంచ వచ్చాడు. భార్యను ఇంటికి రమ్మని పలుమార్లు కోరగా, నువ్వే వచ్చి తీసుకెళ్లాలని చెబుతూ వస్తోంది. దీంతో మనస్తాపంతో ఉన్న ప్రసాద్ మద్యం మత్తులో ఆదివారం పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లి కమలమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు జజ్జెర రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అంతులేని వ్యథ.. లక్సెట్టిపేట వాసి విషాదగాథ ) చర్లలో పురుగుల మందు తాగి.. చర్ల: పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని కలివేరులో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కలివేరు గ్రామానికి చెందిన పూనెం సతీష్ (22) భార్య, పిల్లలు దుమ్ముగూడెం మండలంలోని తన అత్తగారింటి వద్ద ఉన్నారు. సతీష్ ఆదివారం మద్యం చిత్తుగా తాగి తనకు బైక్ ఇవ్వాలని, తాను వెళ్లి భార్యాపిల్లలను చూసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పారు. మద్యం మత్తులో ఉన్నావని, రేపు వెళ్లవచ్చని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంటి వెనుకకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్యనారాయణపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి భద్రాచలం ఏరియావైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం ) పండుగ వేళ విషాదం ఇల్లెందు: రంజాన్ పర్వదినం రోజు ఓ ముస్లిం కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఎల్బీఎస్ నగర్లో నివాసం ఉంటున్న బాసిత్(35) ఎలక్ట్రీషియన్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాసిత్, భార్య కరీమాల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. రంజాన్ పర్వదినం సందర్భంగా భార్య ఇంట్లో లేదని మనస్తాపం చెంది, ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ ఆత్మహత్య
సాక్షి, తల్లాడ(ఖమ్మం) : బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక శ్రీకృష్ణ కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ వేముగంటి శివకుమార్(27) ఏప్రిల్ 29వ తేదీ నుంచి కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన శివకుమార్ సొంత గ్రామానికి వెళ్లాడనే అనుమానంతో ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. అయితే తల్లాడ మండలం తెలగవరం సమీపంలో ఫోన్ సిగ్నల్స్ వచ్చాయి. దీంతో కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ అనిల్.. సూపర్వైజర్ అదృశ్యంపై మూడు రోజుల క్రితం తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చావులో ఒక్కటయ్యారు..) అయితే ఆదివారం తల్లాడ సమీపంలోని డంపింగ్ యార్డ్‌కు దగ్గర్లో ఉన్న బావిలో శివకుమార్ శవమై తేలుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ బి.తిరుపతిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ రమ్మీలో కొంత నగదును పోగొట్టుకోవడం వల్ల మానసికంగా ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. (జీడి తోటకు వెళ్లిన మహిళపై.. ) -
పూడ్చిన శవానికి పోస్టుమార్టం
సాక్షి, కామారెడ్డి : అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వివాహిత రెండ్రోజుల క్రితం మృతి చెందగా, కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తన కూ తుర్ని భర్తే కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదు చేయడంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (కే)లో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిమి భూపాల్‌కు, మేన మరదళ్లు శ్రీలత, మౌనిక(25)తో 2017లో వివాహం జరిగింది. దివ్యాంగురాలైన (మూగ) శ్రీలతకు ఇద్దరు పిల్లలు కాగా, అందరూ కలిసే ఉంటున్నారు. అయితే, ఇటీవల కుటుంబ కలహాలు మొదలమయ్యాయి. ఈ క్రమంలో అనారోగ్యమని ఈ నెల 15న మౌనికను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మౌనిక 20వ తేదీన మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. (మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ ) తన కూతురు అనారోగ్యంతో మృతి చెందలేదని, అల్లుడు తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయిందని మృతురాలి తండ్రి సాయిలు దేవునిపల్లి ఠాణాలో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అమీన్‌సింగ్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులను విచారించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని బ యటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. మృతురాలి భర్త భూపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. పూడ్చి్టన శవాన్ని తీయించి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ ) -
దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు!
సాక్షి, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణ పరిధిలోని అయ్యగారిపేటలో బుధవారం ఓ వివాహిత హత్య సంఘటన వెలుగుచూసింది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన పంతంగి వాణి(24) సత్తుపల్లిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దుకాణంలో పని ముగించుకుని ఆటోలో సత్తుపల్లికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ సందీప్‌తో కలిసి వెళ్లినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయింది. ఆటోలో అయ్యగారిపేటలోని పామాయిల్ తోట వరకు వెళ్లారు. మళ్లీ ఫోన్ చేసినప్పుడు రావాలని ఆటో డ్రైవర్‌కు చెప్పి పంపించారు. బుధవారం ఉదయం మహిళ మృతి చెందిపడి ఉన్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. పంతంగి వాణిగా గుర్తించారు. చున్నీతో మెడకు చుట్టి హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనా స్థలంలో పెనుగులాట జరిగినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. చేతి గాజులు పగిలి, దుస్తులు చిరిగి కన్పించాయి. (అత్తయ్యతో కలిసి నటి టిక్‌టాక్ ఛాలెంజ్ ) ఆటో డ్రైవర్ గంట తర్వాత సందీప్‌కు ఫోన్ చేసి ఆటో తీసుకురావాలా? అని అడిగాడు. ‘దాన్ని చంపేశాను.. నువ్వు రావాల్సిన అవసరం లేదు.. నీ డబ్బులు మళ్లీ కలిసినప్పుడు ఇస్తా’అని సందీప్ చెప్పినట్టు సమాచారం. దీంతో భయభ్రాంతులకు గురైన సత్తుపల్లి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జరిగిన విషయాలను బంధువులకు వివరించటంతో పాటు సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. అప్పటివరకు అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు.. సందీప్ హత్య చేసినట్టు అనుమానించి ఇంటికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్‌డేటా ఆధారంగా సందీప్ కదలికలను గుర్తించినట్టు సమాచారం. మహిళను హత్య చేసి ఏమీ తెలియనట్టు విధులకు కూడా హాజరైనట్టు తెలిసింది. భార్యను వేధించటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు సందీప్‌పై ఇప్పటికే ఓ కేసు ఉంది. (ఆర్థిక లావాదేవీలతోనే ఆనంద్‌రెడ్డి హత్య) ఇద్దరు పిల్లల మూగరోదన పంతంగి వాణి, శ్రీనివాసరావులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త చెవిటి, మూగవాడు. కూలి పనులకు వెళ్తుంటాడు. మృతురాలు పంతంగి వాణిది పశ్చిమగోదావరిజిల్లా లింగపాలెం మండలం ముచ్చర్ల గ్రామం. వీరికి ఆరేళ్ల పాప, ఐదేళ్ల బాబు ఉన్నారు. పంతంగి వాణి విగతజీవిగా పడి ఉండటంతో పిల్లలకు ఏమీ అర్థంకాగా బిత్తరపోయి చూస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నాలుగు నెలల క్రితం నుంచే సత్తుపల్లిలోని దుకాణంలో పని చేస్తోంది. మృతదేహానికి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్ తెలిపారు. -
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుమానంతో హతమార్చాడు. ఈ సంఘటన అశ్వారావుపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక దొంతికుంటకు చెందిన పచ్చనీల మంగారావు, స్వరూప(25) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు. ఏడేళ్ల నందిని, ఐదేళ్ల మనోజ్ఞి, నాలుగేళ్ల హని ఉన్నారు. కాగా గడిచిన కొద్ది నెలలుగా మంగారావు భార్యను అనుమానించడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా ఇంట్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. దీంతో కోప్రోదిక్తుడైన మంగారావు ఆమెను తలపై కొట్టాడు. గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థానిక సీఐ ఎం. అబ్బయ్య, ఎస్ఐ మధుప్రసాద్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోందనే అనుమానంతో.. వారం రోజుల క్రితం మంగారావు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతని అశ్వారావుపేటలో ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. ఆ అనుమానమే ఆదివారం కూడా గొడవకు దారితీసి హత్యకు పురికొల్పింది. -
దారుణం: సొంత చెల్లెలిపై అన్న అకృత్యం
సాక్షి, కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత అన్నయ్యే తనపై లైంగిక దాడికి పాల్పడటంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని పిప్పిడి వెంకటి-రాధమ్మ దంపతుల చిన్న కూతురు భూమికగా గుర్తించారు. ఆమెకు ఇటీవల నిశ్చితార్థం కూడా జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా తమ బంధువుల వివాహ వేడుకకు వెళ్తూ.. కూతురు భూమికను పాత పాల్వంచలోని తన అన్నయ్య రాంబాబు ఇంటిలో వదిలి వెళ్లారు. కాగా రాంబాబు చెల్లెలిని రాత్రి జ్యోతినగర్‌లోని తన తల్లిదండ్రులు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకుని వెళ్లాడు. తండ్రి తర్వాత తండ్రిలా రక్షణగా ఉంటాడనుకున్న అన్నయ్యే కామాంధుడిగా మారి చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆవేదన చెందిన ఆ యువతి అవమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో రోడ్డుపైకి వచ్చిన భూమికను స్థానికులు గమనించి పాల్వంచ ఆసుపత్రికి తరలిచించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వం ఆసుపత్రికి బాధితురాలిని తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా బాధితురాలిపై సొంత అన్నతో పాటు అతడి స్నేహితుడు కూడా బలత్కారం చేశాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ఇటీవల ఖమ్మం జిల్లాలో తండ్రి కూతురిపై అత్యాచారం చేసిన ఘటన మరువకముందే.. సొంత అన్నయ్య చెల్లెలిపై అత్యాచారం చేయడం స్థానికులను కలిచివేస్తుంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాకపోవడం.. పైగా రక్తసంబంధాలు, వావి వరసలు మరిచిన అఘాత్యాలకు పాల్పడుతున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కూతురి మరణం: తండ్రి ఆత్మహత్య, తల్లి..!
సాక్షి, కొణిజర్ల(ఖమ్మం): బిడ్డ మరణం తట్టుకోలేక.. పురుగుల మందు తాగిన తల్లి.. పరిస్థితి విషమం.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. కూతురు ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. ఆనాటి నుంచి చిన్నారిపై బెంగతో తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ లేనిదే ఉండలేనంటూ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉది. కూతురు లేదనే బాధ, చావు బతుకుల మధ్య ఉన్న భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆమె భర్త మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన కొణిజర్ల మండలం తనికెళ్లలో చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కూతురు ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. ఆనాటి నుంచి చిన్నారిపై బెంగతో తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డ లేనిదే ఉండలేనంటూ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కూతురు లేదనే బాధ, చావు బతుకుల మధ్య ఉన్న భార్య పరిస్థితిని చూసి తట్టుకోలేక భర్త మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో చోటుచేసుకుంది. వివరాలు.. తుప్పతి చంద్రశేఖర్(32), నాగమణి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. 6వ తరగతి చదువుతున్న కూతురు నవ్యశ్రీ(11) ఆరు నెలల క్రితం విషజ్వరంతో మృతిచెందింది. అప్పటి నుంచి నాగమణి బిడ్డ చనిపోయిన బాధతో మనోవేదనకు గురవుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కూతురి మరణం, చావుబతుకుల మధ్య ఉన్న భార్య కూడా దక్కదనే భయంతో భర్త చంద్రశేఖర్ మంగళవారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఇక ఉండకపోవచ్చని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గ్రామంలో వెతకగా ఊరికి సమీపంలోని వ్యవసాయ భూమిలో చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. ప్రస్తుతం ఆ దంపతుల కుమారుడు నవదీప్ ఒంటరి వాడయ్యాడు. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు ఎస్ఐ మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే దొంగల హల్చల్
భద్రాద్రి కొత్తగూడెం,జూలూరుపాడు: ఓ ఇంట్లోకి ముగ్గురు దొంగలు పట్టపగలే చొరబడి నగదు, నగలు అపహరించారు. గ్రామస్తులు గమనించి వెంటపడి పట్టుకుని చితకబాదారు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాలో సోమవారం చోటుసుకుంది. మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ జేత్యాతండాకు చెందిన గుగులోత్ కీర్యా, లక్ష్మి దంపతులు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి పొలానికి పనుల నిమిత్తం వెళ్లారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దొంగలు కీర్యా ఇంటి తాళం పగుల గొట్టారు. మొదట ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించగా, మరొకరు బయట కాపలాగా ఉన్నాడు. అనంతరం అతను కూడా ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారు నగలు, లక్ష రూపాయల నగదు తీసుకున్నారు. అదే సమయంలో పొలానికి వెళ్లిన గుగులోత్ కీర్యా నీళ్ల పైపుల కోసం ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి ఆందోళనతో లోపలికి వెళుతుండగా.. ఇంట్లో ఉన్న దొంగలు బయటకు కీర్యాను నెట్టివేసి పారిపోయారు. దీంతో ఆయన పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి దొంగల వెంటపడ్డారు. ముగ్గురిని పట్టుకుని తాళ్లతో కట్టి వేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరుపాడు ఎస్సై పి.శ్రీకాంత్ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు దొంగలను పోలీసులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పులి నరేష్, తిరుమల యువరాజ్‌లని, మరొకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురువెళ్లి మల్లేశ్వరరావు అని పోలీసులు తెలిపారు. వీరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి, హైదారాబాద్ చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదౖలైనట్లు తెలుస్తోంది. దొంగలు వేసుకుని వచ్చిన బైక్ సైతం ఖమ్మంలో చోరీ చేసినట్లు తెలిసింది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమించి మోసం చేశాడు: యువతి నిరసన
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): వెంటపడి ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి యువతిని మోసం చేసి.. మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. భాగ్యనగర్ తండాకు చెందిన వాంకుడోత్ సోనియా ఖమ్మంలో డిగ్రీ చదువుతోంది. తల్లిదండ్రులు వాంకుడోత్ లక్ష్మి, లాలు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. దీంతో సోనియాను తమ పెద్దకూతురు వద్ద ఉంచారు. అదే గ్రామానికి చెందిన అజ్మీరా సంపత్ పీజీ పూర్తి చేశాడు. డిగ్రీ చదువుతున్న సోనియా వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి విషయం ఎత్తగానే అక్కాచెల్లెళ్ల వివాహాల తర్వాత చేసుకుంటానంటూ నాలుగేళ్లుగా వాయిదా వేస్తున్నాడు. ఈ క్రమంలో మరో యువతితో పెళ్లి ఖరారు చేసుకున్నారని తెలియడంతో సోనియా బుధవారం సంపత్ ఇంటికి వచ్చి నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది. ‘నిన్ను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనని, మీ అమ్మనాన్నలను పిలిపించాలని’మళ్లీ నమ్మబలికాడు. పెద్దలు జోక్యం చేసుకోని గురువారం పంచాయితీ చేద్దామని, అప్పటివరకు ఎవరి ఇంటికి వారు వెళ్లాలని తెలిపారు. తీరా గురువారం సంపత్ ఇంటికి రాగా బుధవారం రాత్రే అతను పెళ్లి చేసుకున్నాడు. తనకు ప్రియుడితోనే వివాహం జరిపించాలని, అతనితోనే చావైనా, బతుకైనా అంటూ సంపత్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తన తల్లిదండ్రులతో కలిసి కారేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
సాక్షి, పాల్వంచ(ఖమ్మం) : ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా పనిచేస్తున్న విద్యార్థిని ప్రేమ పేరుతో వేధింపులకు గురై, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామానికి చెందిన పూనెం వాసవి(17) అనే విద్యార్థిని పాల్వంచలోని సిద్ధార్థ ఒకేషనల్ నర్సింగ్ కళాశాలలో చదువుతుంది. టీచర్స్ కాలనీలో వరుసకు అన్న అయిన మాచర్ల గోపి ఇంట్లో రెండు నెలలుగా అద్దెకు ఉంటూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ట్రైనీ నర్సుగా చేరింది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన బంధువులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందింది. అయితే కోయగూడెంకు చెందిన వరుసకు బంధువైన గీతారత్నం అనే యువకుడు ప్రేమ పేరుతో కొన్ని రోజులుగా వేధింపులకు దిగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం గీతారత్నం, అతని స్నేహితుడితో కలిసి వాసవి ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగడంతో మనస్థాపం చెందిందని, ఈ విషయాన్ని తనకు ఫోన్లో కూడా చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాసవి మృతితో కోయగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్పతి వద్ద విద్యార్థిని స్నేహితులు విలపించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. -
నాపై అకారణంగా దాడి చేశారు..
సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ఆరెంపులలో ఇరు వర్గాలు బుధవారం అర్ధరాత్రి ఘర్షణకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండి జగదీష్, కె జశ్వంత్, దాసరి ఉపేందర్, కందుల భాస్కర్, గుండె సాయిరాం, సాలంకి మహేష్, ఎస్కె సోందు, సాలంకి నాగేంద్రబాబు,అభిషేక్ జిన్నెక సాయిక్రిష్ణ,సాలంకి కళ్యాణ్‌లు కలిసి మోహన్‌రావు, విజయ్, చింతమళ్ల పద్మలపై రాళ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు ఖమ్మం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వచ్చి గేటు మూయడానికి వెళ్లగా అప్పటికే అక్కడ కాపుకాసిన పైవారు ఇనుపరాడ్లతో, రాళ్లతో దాడి చేశారు. పక్కనే ఉన్న మోహన్‌రావు సోదరులు చింతమళ్ల రవికుమార్, విజయ్, చింతమళ్ల పద్మలు ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించగా వారిపై కూడా దాడి చేశారు. దీంతో మోహన్‌రావు చేతికి, విజయ్ తలకు, పద్మ చేతికి గాయాలయ్యాయి. అదే విధంగా సర్పంచ్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి శాంతింప చేశారు. కులం పేరుతో దూషించినందుకు ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు , మిగతా 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలి పారు. దాసరి లక్ష్మి ఇచ్చి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన చింతమళ్ల మోహన్‌రావు, సందీప్, మనోహర్, రవికుమార్‌లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతాం దళితులపై ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరైనా దాడులు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఆరెంపుల గ్రామసర్పంచ్ పద్మ ఇంటికి వెళ్లి బుధవారం రాత్రి గ్రామంలో జరిగిన సంఘటన గురించి వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఆరోజు రాత్రి ఏంజరిగింది అనే వివరాలను సర్పంచ్‌ను అడిగారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రోజు రోజుకూ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో దళితులను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ఇప్పటికైనా గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సైపై దాడికి యత్నం: యువకుడిపై కేసు చర్ల: భద్రాచలం పట్టణ ఎస్సైపై దాడికి యత్నించిన ఘటనపై గురువారం కేసు నమోదయింది. ఎస్సై వరుణ్‌ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పట్టణంలోని చర్ల రోడ్లో తన కారుతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ప్రశ్నించిన బైక్ యజమాని మోహన్‌పై దాడి చేసి బూతులు తిట్టాడు. తాను కొండిశెటి నాగేశ్వరావు కుమారుడిని, తన పేరు వీరాంజనేయులు అంటూ హంగామా చేశాడు. బాధితుడి సమాచారం తో ఎస్సై అక్కడికి చేరుకోగా.. ఎస్ఐ పైకి కూడా దాడికి యత్నించి నెట్టివేశాడు. దీంతో వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బాధితుడు మోహన్, ఎస్సై వరుణ్ప్రసాద్ల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. ఖమ్మం నుంచి ఇంటికి వచ్చిన. అంతకు ముందు ఏం జరిగిందో ఏమో తెలియదు. అయితే ద్విచక్రవాహనాన్ని ఇంట్లో నిలిపి గేటు వేయడానికి బయటకు వచ్చిన. అప్పటికే బయట ఉన్న వారు రాడ్లతో, రాళ్లతో నాపై దాడి చేశారు. దీంతో ఏంచేయాలో తెలియక ఇంట్లోకి వెళుతున్నా. ఈలోపు మాసోదరులు ఎందుకు కొడుతున్నారని అడిగారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరేంది చెప్పేది అంటూ వారిపై కూడా దాడి చేశారు. నాపై, మాసోదరులపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. – చింతమళ్ల మోహన్‌రావు -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, ఖమ్మం: వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన దారా అఖిల గత నెల 18న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో 19న ఎన్నెస్టీ రోడ్‌లోని జనని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పాపకు వైద్య సేవలు అందించారు. 18 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రెండు రోజుల కే శిశువుకు జ్వరం రావటంతో మంగళవారం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మందులు రాసిచ్చి పంపారు. బుధవారం శిశువు ఆరోగ్యం మరింత దిగజారటంతో మళ్లీ శిశువును జనని ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన వైద్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటంతో.. నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్‌కు తీసుకెళ్లి చూపించారు. వైద్య సేవలు పొందుతూ అక్కడే శిశువు మృతి చెందింది. శిశువు మృతికి జనని ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. పాప పరిస్థితి గురించి రోజూ వైద్యుడిని వివరాలు అడుగుతున్నప్పటికీ ఏమీ చెప్పకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తామని అడిగినా వినకుండా ఇక్కడే ఉంచి ప్రాణాన్ని బలిగొన్నారని కన్నీరుమున్నీరై విలపించారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం, శిశువు బంధువులతో చర్చలు జరిపింది. -
‘హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు’
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): పాతి పెట్టిన మృతదేహాన్ని 20 రోజుల తర్వాత వెలికితీసి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన ఘటన కారేపల్లి మండలం బోటితండా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బోటితండా గ్రామానికి చెందిన పీజీ విద్యార్థి ధర్మసోత్ కిరణ్ కుమార్ (25) ఈ నెల 1వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. కారేపల్లి పోలీసులకు తెలిసినా కేసు నమోదు చేయకపోవటంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిచి్చంది. ఈ క్రమంలోనే కారేపల్లి ఎస్ఐ వెంకన్నను సైతం ‘సాక్షి’వివరణ కోరగా.. ‘బాధితుడి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆత్మహత్యపై ఫిర్యాదు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని’ తెలిపారు. ఇదే విషయంపై ఈ నెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. బాధితుల కథనం ప్రకారం.. బోటితండాకు చెందిన ధర్మసోత్ కిరణ్ కుమార్ (25) ఖమ్మంలో పీజీ చదువుతున్నాడు. సమీప చీమలపాడు గ్రామానికి చెందిన అతని మిత్రుడు, చింతలతండాకు చెందిన ఓ యువతి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరిరువురు బోటితండాలోని కిరణ్ కుమార్ బంధువుల ఇంట్లో ఉండగా..అక్కడే కిరణ్ కుమార్ సైతం ఉన్నాడు. ఈ క్రమంలో యువతి బంధువులు వచ్చి కిరణ్ కుమార్‌ను, తన స్నేహితుడిని దూషించారు. అదే రోజు రాత్రి కిరణ్ కుమార్ అదే ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం మృతుడి తల్లిదండ్రులు రేలకాయలపల్లి వీఆర్వో ప్రకాశ్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరేణి తహసీల్దార్ డి పుల్లయ్య, íసీఐ బి శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్నల సమక్షంలో 20 రోజుల క్రితం పాతిపెట్టిన శవాన్ని బయటికి తీశారు. ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కిషోర్, హర్షిణి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. బోటితండాలో ఉద్రిక్తత నెలకొనగా, కామేపల్లి, కారేపల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు.పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. హత్య చేసి.. ఆత్మహత్యగా.. నా కొడుకు కిరణ్ కుమార్‌ను ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తల్లిదండ్రులు భద్రు, కాంతి విలేకరుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు నచ్చజెప్పటంతో అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషులు సుమారు రూ.80వేలు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యార్థి ఉసురు తీసిన హెచ్ఎం
సాక్షి, టేకులపల్లి(ఖమ్మం): హెచ్ఎం తిట్టి అవమానించడంతో ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఆశ్రమపాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆళ్ళపల్లి మండలం కిచ్చెనపల్లికి చెందిన పాయం విజయ కుమారుడు సాయికిరణ్(15) కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మేనమామ సురేష్ ఇదే పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌ను తీసుకుని సురేష్ శనివారం మేడారంలో బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి తిరిగి సంపత్‌నగర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సంతోష్‌కుమార్ తన సోదరుడు సాయికిరణ్(15)ను పాఠశాలలో వదిలి వెళ్లాడు. వాచ్మెన్ గదిలోకి వెళ్తున్న విద్యార్థిని హెచ్ఎం బాదావత్ దేవాసింగ్ పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగారు. శుభకార్యానికి వెళ్లొస్తున్నట్లు విద్యార్థి తెలిపాడు. అంతటితో ఆగని హెచ్ఎం పదో తరగతి చదువుతున్నావ్.. క్లాసులు ఎగ్గొట్టి ఊర్లు తిరుగుతావా... అంటూ మేనమామను, తల్లిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. దీంతో మనస్తాపం చెందిన సాయికిరణ్ పాఠశాల ఆవరణలోనే ఉన్న తన మావయ్య(వాచ్మెన్) గదిలోకి వెళ్ళి తలుపునకు గడి పెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు వెళ్ళి తలుపు కొడితే తీయలేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వాచ్మెన్ బంధువు హాస్టల్‌కి వచ్చింది. సాయికిరణ్‌ను కలిసేందుకు గదికి వెళ్ళి తలుపు కొడితే మళ్ళీ అదే పరిస్థితి. అనుమానం వచ్చి వార్డెన్ విద్యార్థుల సహాయంతో వెంటిలేటర్ ద్వారా లోపలికి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దింపారు. సీఐ బాణోతు రాజు, ఎస్ఐ ఇమ్మడి రాజ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి రాకముందే విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. కాగా సాయికిరణ్ తండ్రి రాంచందర్ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. సోదరు డు సంతోష్‌కుమార్ పాకాల కొత్తగూడెంలో ఇంటర్ చదువుతున్నాడు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మృతదేహాన్ని సందర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ పూనెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా హెచ్ఎం దేవాసింగ్ వివాదాస్పద వ్యక్తి అని, గతంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారని పలువురు పేర్కొంటున్నారు. -
ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని వేంసూరు మండలంలో పోలీసులు నిర్వహించిన సోదాలో ఓ ఇంట్లో భారీగా పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాలు.. వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నడిపల్లి దామెదర్ ఇంటిని కొన్ని రోజల క్రితం ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇంట్లో రూ.12లక్షల పాత కరెన్సీని రూ.500, రూ.1000 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి భారీగా నిల్వచేశాడు. వీటిని కంటెయినర్లో అమర్చే విధంగా పెద్ద బాక్స్‌లాగా అమర్చాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందగా బుధవారం సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అధిక మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దున మర్లపాడు గ్రామం ఉండటంతో దొంగనోట్ల మార్పిడికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు రూ. 100 కోట్ల మేర ఇలాంటి కరెన్సీ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యక్తిపై సత్తుపల్లిలో దొంగనోట్ల ముఠాలోని కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పాత కరెన్సీ నిల్వ చేసిన ఇంటిని కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వేంసూరు ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. -
కుటుంబ కలహాలు; పంట చేనులో శవమై...
సాక్షి, టేకులపల్లి(ఖమ్మం) : కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. ఈ ఘటన సోమవారం టేకులపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భూక్య శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. టేకులపల్లి మండలం బర్లగూడెం పంచాయతీ జంగాలపల్లికి చెందిన ఈసం రాంబాబు(35)కు పదేళ్ల క్రితం ఆళ్ళపల్లి మండలం రాయిపాడుకు చెందిన రాంబాయితో వివాహమైంది. భార్య రాయిపాడులో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. పెళ్లి అయిన రెండేళ్ల తరువాత రాంబాబు భార్య, కుమారుడితో కలిసి రాయిపాడులో కాపురం పెట్టాడు. కొన్ని రోజులకు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన భర్త రాంబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం జంగాలపల్లిలోని పంట చేనులో కాలి పోయి శవమై కనిపించాడు. చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో టేకులపల్లి సీఐ రాజు, బోడు ఎస్ఐ భూక్య శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ ను పిలిపించారు. మృతదేహం సమీపంలోనే మృతుడి ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు. ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే మృతుడి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నందు వలనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, ఆమె తన సోదరుడిని హత్య చేసిందని మృతుడి సోదరుడు ఈసం శాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. పలు అనుమానాలు.. రాంబాబు మృతదేహం వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. మృతదేహం పూర్తిగా కాలిపోయింది. కాని, తల వెంట్రుకలు కాలకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలంలో మహిళకు సంబంధించిన చెప్పు, చీరకు పెట్టుకునే క్లిప్పు, ఓ టవల్ ఉన్నాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
కానిస్టేబుల్ చేతి వేలును కొరికేశాడు..
సాక్షి, ఖమ్మం : తాగిన మైకంలో ఓ వికలాంగుడు నగరంలోని వన్‌టౌన్ స్టేషన్లో వాచర్ డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ చేతి వేలును కొరికేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేవతి థియేటర్ ప్రాంతానికి చెందిన వికలాంగుడు డుంగ్రోతు మస్తాన్ ఘర్షణపడి మరో ఇద్దరితో కలిసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అరుస్తుండగా వాచర్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మన్సూర్ అలీ, ఇన్చార్జ్గా ఉన్న సత్యనారాయణ మందలించారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను దూషిస్తుండగా వారు పక్కకు వెళ్లిపోయారు. అయితే ఒక్కసారిగా మస్తాన్.. మన్సూర్ అలీపైకి వచ్చి మొదట అతడి తొడ భాగంలో కొరికాడు. దీనిని అడ్డుకోవడంతో చేతి వేలును బలవంతంగా కొరకడంతో ఊడి కిందపడిపోయింది. దీంతో మన్సూర్ అలీ విలవిలలాడుతుండగా.. మస్తాన్ అక్కడి నుంచి పారిపోయాడు. హెచ్‌సీ సత్యానారాయణ సీఐ రమేష్‌కు సమాచారం అందించగా.. వారు మన్సూర్ అలీని ఆస్పత్రికి తరలించారు. కాగా.. మస్తాన్ సైకో మాదిరిగా ప్రవర్తిస్తాడని, గతంలో అతడిపై వన్‌టౌన్ స్టేషన్లో కేసు కూడా ఉందని సీఐ తెలిపారు. అతడిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా.. ఘటనపై సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏసీపీ వెంకట్రావు ఆరా తీశారు. -
నీటితొట్టిలో పడి బాలుడి మృతి
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం) : నీటి తొట్టిలో పడి 18 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. సాయిరాంతండాకు చెందిన జాటోత్ రమేష్, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి సంతానం తేజస్వీని కాగా రెండవ సంతానం∙జాటోత్ లోక్షిత్ నాయక్. తల్లి నాగమణి ఇంటి పనిలో నిమగ్నౖమైంది, తండ్రి రమేష్ పని మీద బయటకు వెళ్లాడు. ఈ సమయంలో బాలుడు ఆడుకుంటూ ఇంటి ఆవరణంలో ఉన్న నీటి తొట్టిలో పడి పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న పిల్లవాడు కన్పించకపోవడంతో తల్లిదండ్రులు రమేష్, నాగమణిలు కంగారు పడి ఇంటి పరిసరాల్లో వెతకగా బాలుడు నీటి తొట్టిలో పడిపోయి ఉన్నాడు. బాలుడిని హుటాహుటిన జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)కి తరలించారు. వైద్యులు సలహామేరకు మెరుగైన వైద్యం కోసం చిన్నారి లోక్షిత్ నాయక్‌ను కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ప్రేమ పేరుతో విద్యార్థినిని మోసం చేసిన అధ్యాపకుడు
సాక్షి, అశ్వారావుపేట: కొద్ది రోజుల క్రితం ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెంది, చెరువులో శవమై కనిపించిన ఘటనకు సంబంధించిన కేసు మిస్టరీ శుక్రవారం వీడింది. స్థానిక ఎస్ఐ మధు కథనం ప్రకారం.. దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామానికి చెందిన నూతి రాఘవులు, రత్నమాల దంపతుల కుమార్తె నూతి హేమనాగశ్రీ(21) కొంతకాలంగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గల అమ్మమ్మ వీరంకి పద్మ ఇంట్లో ఉండి, అశ్వారావుపేటలో గల ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఈ నెల 6న తిరుమలకుంటలో గల అమ్మమ్మ ఇంటి నుంచి వినాయకపురం వెళ్లి వస్తానని చెప్పి బయటకు వచ్చిన హేమనాగశ్రీ మండలంలోని ఊట్లపల్లి వద్ద గల వెంకమ్మ చెరువులో శవమై కనిపించింది. దాంతో ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రియుడి మోసంతోనే.. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు విద్యార్థినిని ప్రేమ పేరుతో వలలో వేసుకుని, పెళ్లికి నిరాకరించడంతోనే సదరు యువతి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి హరికృష్ణ స్థానిక వీకేడీవీ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హరికృష్ణ గ్రామానికి చెందిన అదే కళాశాలలో డిగ్రీ చదువుతున్న హేమనాగశ్రీని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడు. కాగా హరికృష్ణకు 2017 ఫిబ్రవరిలో వేరే యువతితో పెళ్లి కాగా, ఆ తర్వా త కుడా హేమనాగశ్రీకు మాయ మాటలు చెబుతూ ప్రేమ పేరుతో సంబంధాన్ని సాగించాడు. ఈ క్రమంలోనే హేమనాగశ్రీకు కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండగా, ఈ నెల 5న హరికృష్ణకు ఈ విషయం చెప్పి, పెళ్లి చేసుకోవాలని కోరింది. దానికి హరికృష్ణ నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హరికృష్ణను శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5,6 దశల చీఫ్ ఇంజ నీర్ కె.ఆనందం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యా హ్నం 12.45 నిమిషాలకు ఏసీబీ డీఎస్పీ ప్రతా ప్ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో రూ.3లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సీఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఉండే జెన్కో గెస్ట్‌హౌస్‌లోనూ సోదాలు చేశారు. డీఎ స్పీ ప్రతాప్ కథనం ప్రకారం.. కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్æ(మిషనరీ స్పేర్ పార్ట్స్) సప్లయ్ కాంట్రాక్ట్‌ను పాల్వంచకు చెందిన వాహిని ఇంజనీరింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్ లలిత్ మోహన్ నిర్వహిస్తున్నాడు. గత జూ లైలో టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అదే నెల చివరి వారంలో 21 రకాల పనులను రూ.71లక్షలకు దక్కించుకున్నాడు. మెటీరియల్ సప్లయ్ చేసినందుకు 7 పనులకు రూ.28లక్షల బిల్లులు ఇచ్చారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులు చేయా ల్సిఉంది. ఈక్రమంలో ఈనెల 1న సీఈ ఆనం దం కాంట్రాక్టర్ లలిత్ మోహన్‌ను పిలిపించి టెండర్ల బిల్లులు చేసినందుకు తనకు రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసేలా చూస్తానని బెదిరించాడు. దీంతో లలిత్ మోహన్ రూ.2లక్షల లంచం ఇచ్చాడు. మరో రూ.3లక్షలు 10వ తేదీన ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్.. మెటీరియల్ సప్లయ్ పనుల్లో తనకు వచ్చే లాభం డబ్బును సీఈ అడగడంతో లలిత్ మోహన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ సూచనల మేరకు రూ.3లక్షలు తీసుకుని సీఈ కె.ఆనందంకు గురువారం అందించాడు. కాగా, ముందస్తు పధకం ప్రకారం అక్కడికి వచ్చిన డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవి, రమణమూర్తి, పీఆర్ ఏఈ ఇర్ఫాన్, సీనియర్ అసిస్టెంట్ కె.వి.రాఘవేందర్, మరో పది మంది సిబ్బంది కలిసి ఆనందం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఈని అదుపులోకి తీసుకుని, శుక్రవారం హైదరాబాద్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏకకాలంలో సోదాలు.. సీఈ కార్యాలయంలో అతడిని పట్టుకోవడంతో పాటు జెన్కో కాలనీలో సీఈ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కంప్యూటర్లో ఉన్న వివరాలను సైతం పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఉద్యోగుల్లో కలకలం రేపింది. ప్రజాహిత బ్రహ్మకుమారీస్ సంస్థ కీలక బాధ్యుడిగా, కర్మాగారంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సీఈ లంచావతారంలో దొరకడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్మాగారంలో కార్మికులకు సైతం ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేయడం, వారికి దైవ సూక్తులు బోధించడం వంటి పనులు చేసే వ్యక్తి ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇబ్బంది వల్లే ఏసీబీని ఆశ్రయించా కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్ సప్లయ్ చేసేందుకు రూ.71లక్షల పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్నాం. 7 పనులకు రూ.28లక్షల బిల్లులు చేశారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులకు సీఈ రూ.10లక్షలు లంచం అడిగాడు. లేదంటే మిగితా బిల్లులు ఆపేస్తానని, భూపాలపల్లిలో కూడా బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఈ పనులన్నీ గత సీఈ టీఎస్ఎన్ మూర్తి హయాంలోనే నాకు దక్కాయి. 15 సంవత్సరాలుగా నేను పనులు చేస్తున్నా.. ఏనాడూ ఏ అధికారీ డబ్బులు అడగలేదు. ఇప్పుడు సీఈ ఆనందం పెద్ద మొత్తంలో అడగడం ఇబ్బంది కలిగించింది. అందుకే ఏసీబీ వారిని ఆశ్రయించా. – లలిత్ మోహన్, కాంట్రాక్టర్ లంచం అడిగితే 1064కు కాల్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసిన బాధితులకు తప్పక సహకరిస్తాం. అవసరమైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. – ప్రతాప్, ఏసీబీ డీఎస్పీ -
మృత్యువులోనూ వీడని స్నేహం
ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతుంటారు. నూతన వస్త్రాలు ధరించి పండగ రోజు కూడా కలుసుకున్నారు. మరికొందరితో కలిసి కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం కొందరు ఇంటికి వెళ్లారు. నలుగురు మాత్రం సమీపంలోని ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకున్నారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. అందులో ఒకరు కొద్ది దూరంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. మూత్ర విసర్జనకు వెళ్లిన యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషాదకర∙సంఘటన ముదిగొండలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాక్షి, ముదిగొండ: ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన బలంతు ప్రవీణ్(20), ఇరుకు శ్రీను(20), గుద్దేటి నవీన్(19) ముగ్గురు ప్రాణ స్నేహితులు. సూర్యాపేటలో బీఎస్సీ ఎంఎల్టీ చదువుతున్న బలంతు ప్రవీణ్ పండగకు మూడు రోజుల ముందే ఇంటికి వచ్చాడు. ఇరుకు శ్రీను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నాడు. గుద్దేటి నవీన్ ముదిగొండలోనే ఇంటర్ సెంకడియర్ చదువుతున్నాడు. వీరు వేర్వేరుగా చదువుకుంటున్నా, పండగ, శుభకార్యాలలో, సెలవు దినాలలో కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విజయదశమి పండగ రోజు కూడా ముగ్గురు కలుసుకున్నారు. వీరితోపాటు మరో యువకుడు ఉసికల గోపి, మరికొందరు స్నేహితులు కలిసి సరదాగా తమ కాలనీ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం పక్కనే ఉన్న ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు ప్రవీణ్, శ్రీను, నవీన్ అక్కడికక్కడే మృతి చెందారు. మూత్ర విసర్జనకు కొద్ది దూరం వెళ్లిన మరో యువకుడు ఉసికల గోపి స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్నేహితులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికే ముగ్గురు యువకులు విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు బలంతు ప్రవీణ్ మృతదేహం; గుద్దేటి నవీన్ మృతదేహం; ఇరుకు శ్రీను మృతదేహం గ్రామంలో ఒకేసారి ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణస్నేహితులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుల తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూపరులను కంటతడి పెట్టించింది. దసరా పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు రెక్కాడితే కాని డొక్కాడనవి. మూడూ దళిత కుటుంబాలే. చదువుకుని ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తున్నారు. బలంతు ప్రవీణ్ తల్లిదండ్రులు బాబు, వెంకటమ్మ నిరుపేదలు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు చందు పదో తరగతి చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్న కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఇరుకు శ్రీను తల్లిదండ్రులు ఏసు, అలివేలు. సోదరికి వివాహమయింది. వీరిదీ పేద కుటుంబమే. డిగ్రీ చదువుతున్న కుమారుడు తమకు ఆసరా అవతాడనుకుంటున్న సమయంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గుద్దేటి నవీన్ తల్లిదండ్రులు గాలయ్య, విజయమ్మలు కూడా పేదలే. తమ్ముడు కార్తీక్ పదో తరగతి చదువుతున్నాడు. ఇంటర్ చదువుతున్న కుమారుడు పండగపూట మృతవాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పలువురి పరామర్శ మృతదేహాలను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ముదిగొండ సర్పంచ్ మందరపు లక్ష్మి, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, టీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్‌యాదవ్, కొమ్మినేని రమేష్ బాబు, మాజీ జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరా వులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు ఇన్చార్జి తహసీల్దా ర్ కరుణాకర్‌రెడ్డి బుధవారం మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున నగదు అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ సంఘటనా స్థలాన్ని బుధవారం ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజు రమేష్ సందర్శించారు. వివరాలను ఎస్ఐ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎస్ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు ఒకేసారి ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో క్రికెట్ ఆడిన మిత్రులు ఇక లేరనే విషయాన్ని మిగతా స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉంటారని, ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, బంధువులతోపాటు గ్రామస్తులందరూ కదిలివచ్చి యువకులకు కన్నీటి వీడ్కోలు పలికారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు. -
గ్యాస్ సిలిండర్ లీకేజీతో ఐదుగురికి తీవ్రగాయాలు
ఆనందంగా పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులందరూ సిద్ధమయ్యారు. రోజూలాగే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ భయానికి చుట్టు పక్కలవారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే ఆ ఇంటి నుంచి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు శబ్దం వచ్చిన ప్రదేశానికి చేరుకునేసరికి ఇల్లు కూలిపోయి ఉంది. ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తున్నారు. ఈ సంఘటన కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురంలో ఆదివారం తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య చోటుచేసుకుంది. సాక్షి, కామేపల్లి: గ్యాస్ సిలిండర్ లీకై ఐదుగురు తీవ్రంగా గాయపడడంతోపాటు ఇల్లు కూలిపోయింది. గ్రామస్తుల కథనం మేరకు.. బోయినపల్లి ఉపేంద్రమ్మ తన కూతురు వంగా నాగమణి, మనుమళ్లు పల్లె నగేష్‌బాబు, మందా శ్రీనాథ్, మందా వినయ్‌కుమార్ ఇంట్లో నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున ఉపేంద్రమ్మ మనుమడు లేచి కరెంట్ స్విచ్ ఆన్‌చేశాడు. అప్పటికే గ్యాస్ సిలిండర్ లీకవుతుండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని భారీ శబ్దాలు వచ్చాయి. ఈ ఘటనలో ఇల్లు కూలిపోయింది. శబ్దానికి ఇరుగుపొరుగు వారు కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురయ్యారు. తేరుకునేసరికి ఉపేంద్రమ్మ ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లి చూడగా ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. శరీరం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. వెంటనే వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బోయినపల్లి ఉపేంద్రమ్మ 65 శాతం, వంగా నాగమణి 43 శాతం, పల్లె నగేష్‌బాబు 90 శాతం, మందా వినయ్‌కుమార్ 65 శాతం, మందా శ్రీనాథ్ 70 శాతం వరకు శరీరం కాలిపోయింది. ఉపేంద్రమ్మ కుమార్తె వంగా నాగమణి ప్రస్తుతం 6 నెలల గర్భవతి. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పొందుతున్న క్షతగాత్రులను ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాది జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల మల్లిబాబుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య పరామర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీంతో వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు రిఫర్ చేయమని చెప్పడంతో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. క్షతగాత్రులను ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడాది కాలంలో నలుగురిని మింగిన 'ఆ' జలపాతం!
సాక్షి, ఇల్లెందు: ఏడు బావుల జలపాతం మృత్యు కుహురంగా మారుతోంది. రెండో రోజుల క్రితం ఇల్లెందు మండలంలోని రాఘబోయినగూడేనికి ఇద్దరు యువకులు విహారానికి వెళ్లగా.. ఒకరు మృతి చెందిన విషయం విదితమే. అప్పటి నుంచి మరో యువకుడి ఆచూకీ తెలియకుండాపోయింది. గురువారం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరోసారి జలపాతం వద్దకు వెళ్లి వెతకగా మృతదేహం లభించింది. ఏడాది కాలంలో ఇక్కడ నలుగురు యువకులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం సరిహద్దుల్లో ఉన్న ఏడు బావుల జలపాతం ప్రమాదభరితంగా మారుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. ఇల్లెందు మండలం రాఘబోయినగూడేనికి చెందిన పొగాకు నాగేశ్వరరావు, లలిత దంపతుల కుమారుడు సురేష్ (22), తన స్నేహితుడు దొడ్డా మహేష్(16)తో కలిసి గత మంగళవారం సాయంత్రం సరదాగా ఏడుబావుల జలపాతానికి వెళ్లారు. జలపాతం తిలకిస్తున్న క్రమంలో పైనుంచి జారి బావిలో పడిపోయారు. ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. మరుసటి రోజు అటు వైపునకు వెళ్లిన కొందరు సురేష్ మృతదేహాన్ని గమనించి ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారు. అప్పటికే రాఘబోయినగూడేనికి చెందిన ఇద్దరు యువకులు కనిపించటం లేదని కుటుంబ సభ్యులు వెతకసాగారు. వాట్సాప్‌లో ఫొటోలు చూసి సురేష్ వేసుకున్న దుస్తులు, ద్విచక్ర వాహనం గమనించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటికే గంగారం పోలీసులు మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. జారి పడి.. సొరికేలో ఇరుక్కుపోయి.. తన స్నేహితుడు సురేష్ గుట్ట పైనుంచి జారి పడి చనిపోయిన సంఘటనను చూసిన మహేష్ భయానికి పారిపోయి ఉంటాడని అంతా భావించారు. కానీ ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో గురువారం మరోసారి సంఘటన స్థలానికి వెళ్లి బావుల్లో వెతికారు. బావి లోపల పడిపోయి ఓ సొరికేలో ఇరుక్కుని ఉండటాన్ని గమనించి బయటకు లాగారు. ఆ మృతదేహం మహేష్దిగా గుర్తించారు. గంగారం పోలీసులకు సమాచారం అందించగా, వారు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పాఖాల కొత్తగూడ తరలించారు. మహేష్ చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి నాగమణితో కలిసి అమ్మమ్మ దేవనబోయిన మంగమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. నాగమణికి ఇద్దరు కుమారులు కాగా మహేష్ పెద్ద కుమారుడు. రాఘబోయినగూడెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఏడు బావుల అందాలను తిలకించేందుకు వెళ్లి మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలానికి పురుగు మందులు తీసుకొస్తామని వెళ్లి.. పొలానికి పురుగు మందుల తీసుకొస్తామని చెప్పి సురేష్, మహేష్‌లు రాఘబోయినగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల వరకు రాఘబోయినగూడెం వారికి ఇల్లెందులో కనిపించారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారికి ఏడు బావుల జలపాతం తిలకించాలని ఆలోచన ఎందుకు వచ్చిందో కాని అక్కడి వెళ్లారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో వర్షం కురిసినట్లు ఆ ఏరియా వాసులు, చేన్ల వద్ద పనులు చేసే వారు పేర్కొంటున్నారు. గుట్ట పైకి వెళ్లిన తర్వాత, వర్షం కురుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలై ఉండటం, బావుల్లో పడిపోవటం వల్ల మృతి చెంది ఉంటారని సంఘటన స్థలాన్ని చూసిన వారు చెబుతున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఏడు బావుల జలపాతాన్ని నిషేధిత స్థలంగా ప్రకటించాలని, గుట్టపైకి వెళ్లేందుకు రక్షణ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్..
సాక్షి, తిరుమలాయపాలెం: మండల పరిధిలోని బచ్చోడు నుంచి ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఇదే అదునుగా బియ్యం తరలిస్తున్న ముఠాలోని వ్యక్తే, మరికొందరు కలిసి నకిలీ పోలీసుల అవతారమెత్తాడు. బియ్యం వ్యాపారిని రూ. 80 వేలు డిమాండ్ చేశారు. చివరకు ఖమ్మం టాస్క్‌ఫోర్స్(ఒరిజినల్)కు పట్టుబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... బచ్చోడు కేంద్రంగా ఓ ముఠా కొద్ది రోజులుగా రేషన్ బియాన్ని అక్రమంగా తరలిస్తోంది. వైరా ప్రాంతానికి చెందిన ఎక్కిరాల కృష్ణ అనే వ్యాపారి ఇక్కడ కొందరు ఏజెంట్లను నియమించుకుని ఈ దందాకు పాల్పడుతున్నాడు. బంధంపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్ వ్యాపారికి సహకరిస్తుంటాడు. కొంతకాలం నుంచి నమ్మకంగా పనిచేస్తున్న నరేష్‌కు.. వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూళ్లు చేయాలనే తలంపు వచ్చింది. ఆదివారం రాత్రి బచ్చోడులో 11 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్‌లో లోడ్ చేసుకుని వస్తున్నారు. నరేష్ కూడా అదే వ్యాన్లోనే ఉన్నాడు. ఇదే అదనుగా భావించి తన గ్రామానికే చెందిన నాగరాజు అనే వ్యక్తి సమాచారం ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులమని చెప్పి వ్యాన్ని నిలిపివేసి డబ్బులు డిమాండ్ చేయాలని చెప్పాడు. దీంతో నాగరాజు, బీరోలు గ్రామానికి చెందిన చిలకబత్తిని రవి, సురేష్, దామళ్ల నవీన్, గుడివాడ సాయిలను సంప్రదించి తమ ప్లాన్ చెప్పాడు. అందరూ కలిసి వెళ్లి ఏలువారిగూడెం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్ద వ్యాన్ని నిలిపివేశారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ రూ. 80 వేలు డిమాండ్ చేశారు. దీంతో వ్యాన్ డ్రైవర్ ఓనర్ కృష్ణకు విషయం వివరించడంతో.. ఆయన వచ్చి రూ.3 వేలు ఇవ్వజూపి బేరమాడసాగాడు. మరోవైపు అసలు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన ఖమ్మం టాస్క్‌ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోడ నరేష్, నాగరాజు, చిలకబత్తిని రవి, సురేష్లను అదుపులోకి తీసుకున్నారు. దామళ్ల నవీన్, గుడివాడ సాయి అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. కాగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌తో పాటు నలుగురు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. బియ్యం వ్యాపారి ఎక్కిరాల కృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యాపారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఎన్నికల్లో ఓడించాడని టీఆర్ఎస్ నేత హత్య
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో సంచలనం సృష్టించిన బ్రహ్మళకుంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలతోనే ఏటుకూరి నరసింహారావును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు హతమార్చినట్లు కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ తెలిపారు. ఈ హత్యకు సంబంధించి గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 10న బ్రహ్మళకుంటకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు ఏటుకూరి నరసింహారావు(50) వ్యక్తిగత పనులపై వెళ్లి తాళ్ళపెంట వైపు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యలో మరో ద్విచక్రవాహనంపై నిందితులు బాణోతు గోపి, బాణోతు వెంకటేశ్వరరావు వచ్చి కర్రలతో కొట్టి హతమార్చారు. గత జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా తమ ఓటమికి నరసింహారావు కారణమని భావించి, బాణోతు బీమా కుటుంబ సభ్యులు నరసింహారావు ఇంటికి వెళ్లి మాకు మద్దతు ఇస్తానని చెప్పి మోసం చేశావని, తమకు రూ.30 లక్షలు ఎన్నికల ఖర్చు అయ్యిందని, ఆ డబ్బు పోవడానికి, ఓడిపోవడానికి కారణం తననేనంటూ నరసింహారావును ఇంటి వద్దే తిట్టి బెదిరించారు. ఈ విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లినప్పటికీ ఇరు వర్గాలు రాజీ పడ్డారు. పంచాయతీ వ్యవహారాల్లో నరసింహారావు, ప్రస్తుత సర్పంచ్‌తో కలిసి పనిచేస్తుండటంతో బీమా కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. నరసింహారావును హతమార్చాలని, అతని స్నేహితులు బాణోతు వెంకటేశ్వరరావు, అజ్మీర రవీంద్ర, బాణోతు కృష్ణ, సోదరుడు బాణోతు మోహన్, తండ్రి బాణోతు బీమా మాట్లాడుకుని పథకం రూపొందించారు. ఒంటరిగా వస్తుండటంతో.. సెప్టెంబర్ 10న ఒంటరిగా కొత్తూరు నుంచి బ్రహ్మళకుంట ఇంటికి తిరిగి వస్తున్న నరసింహారావును గోపి కర్రతో వెనుక నుంచి తలపై కొట్టాడు. దీంతో నరసింహారావు బండిపై నుంచి కింద పడి, తనను ఏం చేయవద్దని బతిమిలాడినప్పటికీ గోపితో పాటు అతని మిత్రుడు వెంకటేశ్వరరావు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టి, నరసింహారావు మృతి చెందాడని నిర్ధారించుకున్నాకా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముగ్గులపోటీ వద్ద ప్రత్యక్షం.. నరసింహారావును హతమార్చిన గోపి, వెంకటేశ్వరరావు ఇళ్లకు వెళ్లి బట్టలు మార్చుకుని ఏమీ తెలియనట్లు గ్రామంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీ వద్దకు వెళ్లి కొంతసేపు గడిపారు. తరువాత పోలీసుల రంగ ప్రవేశంతో కనిపించకుండాపోయారు. సీఐ రవికుమార్, ఎస్ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్ఐ ఏ శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నరసింహారావుది హత్యగా ప్రాథమింగా నిర్ధారించి, విచారణ చేపట్టారు. ఈ విచారణలో నరసింహారావు హత్యలో మొత్తం ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు పోలీసుల నిగ్గుతేల్చినట్లు ఏసీపీ వెంకటేష్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా బ్రహ్మళకుంట బాణోతు గోపి, ఏ2గా బాణోతు వెంకటేశ్వరరావు, ఏ3 బాణోతు బీమా, ఏ4 బాణోతు మోహన్, ఏ5 అజ్మీర రవీంద్ర, ఏ6 బాణోతు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు బాణోతు వెంకటేశ్వరరావు సోదరి వాంకుడోతు మంగ్గమ్మపై సైతం సాక్ష్యాధారాలు మాయం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆరుగురు నిందితులను గురువారం సత్తుపల్లి కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసును చేధించిన సీఐ రవికుమార్‌ను, ఎస్ఐ తోట నాగరాజు, ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్‌ను అభినందించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు.. బ్రహ్మళకుంట గ్రామంలో రాబోయే రోజుల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’
కారేపల్లి: చేసేది గంజాయి రవాణా.. పైకి కనిపించేది కొబ్బరిబొండాల తరలింపు.. అక్రమార్కుల దొంగ తెలివితేటలు ఎంతలా ఉన్నాయంటే వింటే ఆశ్యర్యం కలగక మానదు. ఎంత దొంగ తెలివి ప్రదర్శించినా విధి వారి గుట్టును రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కారేపల్లి మండలం గాంధీపురం రైల్వేస్టేషన్‌కు సమీపంలో కొబ్బరిబొండాల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో అందు లోని గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల నుంచి (ఏపీ 28వై 4823) బొలెరో ట్రాలీలో ఇల్లందు మీదు గా ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి తరలిస్తుం డగా శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోనో, లేదా మద్యం మత్తులో నో రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఉంటా డని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను వాహనాన్ని, గంజాయి ప్యాకెట్లను వదిలేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లవారు జామున కొంత మంది వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థాలానికి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్న, తహశీల్దార్ సీహెచ్ స్వామి చేరుకుని పంచనామా నిర్వహించారు. 137 గంజాయి పాకెట్లు–2.46 క్వింటాళ్లు.. అనంతరం సీఐ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక(ఆర్సీ ప్రకారం) కు చెందిన బొలెరో వాహనం ఒడిశా రాష్ట్రం నుంచి హైదారాబాద్ వైపు ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుందని, 137 గంజాయి ప్యాకెట్లను గుర్తించామని, ఒక్కో ప్యాకెట్ 1.8 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.38 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మండలంలో రెండోసారి.. కారేపల్లి మండలంలో సింగరేణి ఓసీ–2 వద్ద ఖమ్మం–ఇల్లందు ప్రధాన రహదారిపై 2017 డిసెంబర్ 4వ అర్ధరాత్రి కారేపల్లి పోలీసులు, టాస్క్ఫోర్సు సంయుక్తంగా గంజాయితో వెళ్లుతున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. అందులో సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
సాక్షి, ఏన్కూరు: సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మరో కుమారుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ సంఘటన మండల పరిధిలోని కేసుపల్లి సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... కేసుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాంబాబు(40) తన ఇద్దరు కుమారులు వినోద్, విష్ణు(12)లను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సరుకుల కొనుగోలుకు ఏన్కూరు వచ్చాడు. సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ద్విచక్రవాహనంపై తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో తూతకలింగన్నపేట సమీపంలో సాగర్ కాల్వలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు కేసుపల్లి నుంచి ట్రాక్టర్ బయలుదేరింది. గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వచ్చే ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో రాంబాబు చిన్న కుమారుడు విష్ణు(12) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలపాలయిన రాంబాబును ఏన్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాంబాబు మృతి చెందాడు. రాంబాబు పెద్ద కుమారుడు వినోద్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కుమారుడు, భర్త మృతి చెందడంతో పద్మ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రమాదం నుంచి బయటపడిన వినోద్.. తండ్రి, తమ్ముడి మృతదేహాల మీద పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలానికి ఎస్హెచ్ఓ కోటేశ్వరరావు, సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సాక్షి, పెనుబల్లి: పెనుబల్లి మండలం బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణ హత్య రాజకీయ కక్షతోనే అని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. కొట్టి, హతమార్చే ప్రాంతంలో తప్పించుకోవడానికి వీలులేని బ్రిడ్జి వద్దనున్న చెరకు తోట పరిసరాలను దుండగులు ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని బ్రహ్మళకుంటలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు ఏటుకూరి నరసింహారావు దారుణహత్య రాజకీయ కక్షతోనే జరిగి ఉంటుందని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తాళ్ళపెంట నుంచి బ్రహ్మళకుంటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరసింహారావును మార్గంమధ్యలో బ్రిడ్జి సమీపంలో చెరకు తోట వద్ద రోడ్డుపై కాపు కాసి కర్రలతో తలపై, నుదురు, మొహంపై తీవ్రంగా గాయపరిచి హతమార్చారు. పక్కా ప్రణాళికతో.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఏటుకూరి నరసింహారావు (50) వెళ్తున్న విషయాన్ని తాళ్లపెంటలో ఉన్న రైతులు ఫోన్ ద్వారా దుండగులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. నరసింహారావును కొట్టి, హతమార్చేందుకు... తప్పించుకోవడానికి ఎటువంటి వీలులేని బ్రిడ్జి వద్ద నున్న చెరకుతోట ప్రాంతాన్ని దుండగులు ఎంచుకున్నారు. మాటు వేసి, కర్రలతో కొట్టి హతమార్చారు. రాజకీయ హత్యగానే ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలలో ఓ వర్గానికి నరసింహారావు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం విజయం సాధించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రత్యర్థి వర్గం హత్యకు పాల్పడి ఉంటుందని నరసింహారావు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మళకుంటకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు స్థానికంగా అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు నరసింహారావు మృతదేహం, సంఘటనా స్థలం వద్ద పడిఉన్న నరసింహారావు ద్విచక్రవాహనం మంగళవారం రాత్రి హత్యకు గురైన నరసింహారావు మృతదేహాన్ని బుధవారం ఉదయం వరకు సంఘటనా స్థలంలోనే ఉంచి పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ఖమ్మం నుంచి వచ్చిన క్లూస్ టీం , డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించాక మృతదేహాన్ని పెనుబల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం సందర్భంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ సలహాదారు లక్కినేని వినీల్, జెడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావులతో పాటు మండల నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసు రక్షణలో బ్రహ్మళకుంట తరలించి, శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా దహన సంస్కారాలు నిర్వహించేలా పర్యవేక్షించారు. విచారణ.. కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేష్ , సత్తుపల్లి రూరల్ సీఐ టి. రవికుమార్, ఎస్సై తోట నాగరాజుల ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. హత్యకు ఉపయోగించిన కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో అనుమానితులు ఏటుకూరి నరసింహారావు హత్యతో సంబంధం ఉన్న అనుమానంతో ఆరుగురు వ్యక్తులను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. తాళ్ళపెంటకు చెందిన ఓ మహిళను, ఓ వ్యక్తిని , బ్రహ్మళకుంటకు చెందిన నలుగురు వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఎస్సై తోట నాగరాజు తెలిపారు. -
ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్ మృతి
సాక్షి ఖమ్మం : అర్ధరాత్రి 1.20 గంటల సమయం.. రాష్ట్రీయ రహదారి.. వాహనాలు రోడ్డుపై వేగంగా వెళ్తున్నాయి.. ఒకేసారి పెద్ద శబ్దం.. ఆ సమయంలో పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూశారు. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని ఉన్నాయి. రెండు బస్సుల డ్రైవర్లు బస్సుల క్యాబిన్లో ఇరుక్కుపోయి కనిపించారు. అప్పటికే ఒక డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెంది ఉన్నాడు. మరో బస్సులో ఉన్న డ్రైవర్ మూలుగుతూ కనిపించాడు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుల హాహాకారాలు. ఏం జరిగిందోనని ప్రయాణికులు పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. ఈ ఘటన ఖమ్మంరూరల్ మండలం తల్లంపాడు గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటలకు చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన డీలక్స్ బస్సు తాండూరు నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట వెళ్తోంది. ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తోంది. ఈ రెండు బస్సులు మార్గమధ్యలో తల్లంపాడు ఊరి చివర ఉన్న మూల మలుపు వద్ద అతివేగంతో వచ్చి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏలూరు డిపో బస్సు డ్రైవర్ కిరణ్(40) బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. పొట్టకు, తలకు, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తాండూరు డిపో బస్సు డ్రైవర్ జంగయ్య కూడా బస్సు క్యాబిన్లో ఇరుక్కుని తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉన్నాడు. రెండు బస్సుల్లో ఉన్న 90 మంది ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. కానీ, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అందులో ఓ మహిళా ప్రయాణికురాలికి తలకు గాయం కావడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలం పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు జరిగిన ఘటన చూసిన వెంటనే గ్రామస్తులను నిద్ర నుంచి లేపి ప్రమాదస్థలానికి తీసుకువచ్చారు. ఈలోపు కొందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు జంగయ్యను, మృతి చెందిన కిరణ్ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న జంగయ్యను వెంటనే 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదాలకు నిలయం.. తల్లంపాడు గ్రామ శివారు మూలమలుపు అంటేనే తెలిసిన వారు అక్కడకు రాగానే జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ మూలమలుపు వద్ద దగ్గరకు వచ్చే వరకు కూడా రెండు వాహనాల డ్రైవర్లకు ఎదురుగా వాహనం వస్తున్నట్లు అర్థంకాదు. ఈ రహదారిలో ఎక్కువ సార్లు ప్రయాణం చేసిన వారికి కొద్దిగా తెలిసి ఉంటుంది. కొత్తవారు మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనురెప్ప పాటులో ఘోర ప్రమాదాల్లో ఇరుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పదేళ్ల కిందట ఇదే మూలమలుపులో ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు ఇదే తరహాలో క్యాబిన్లలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల కిందట డీసీఎం వ్యాన్ లారీ ఇదే స్థలం మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనగా వ్యాన్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కపోయి మృతి చెందాడు. ఈరెండు ప్రమాదాలు అర్ధరాత్రి సమయంలోనే జరగడం గమనార్హం. అనంతరం రెండు ద్విచక్రవాహనాలు కూడా ఇక్కడే ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. రెండేళ్ల కిందట కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఇదే మూలమలుపులో ఆర్టీసీ బస్సు ఢీకొనగా ఆటోలో ఉన్న ఇద్దరు కూలీల పొట్టలోకి బస్సు ముందు భాగంలో ఉన్న ఇనుప రాడ్లు దూసుకెళ్లి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక చిన్నాచితకా ఘటనలు స్వల్ప ప్రమదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు ప్రమదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని ఖమ్మం, జంగారెడ్డిగూడెం డిపోల ఆర్టీసీ అధికారులు సందర్శించి క్రేన్లతో రెండు బస్సులను వేరు చేశారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి ప్రమాదాలకు నిలయమైన ఈ మూమలుపు వద్ద కనీసం స్పీడు బ్రేకర్లు కూడా లేకపోవడంతో వాహనాలు వేగం తగ్గించకుండా వచ్చి ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే అవకాశంలేక ఢీకొంటున్నాయి. అయితే స్పీడ్ బ్రేకర్లు ఉం టే అక్కడకు రాగానే వాహనాలు కొద్దిగా వేగం తగ్గించి నడుపుతారని, ప్రమాదం జరిగినా తీవ్రత తగ్గుతుందని తద్వారా ప్రాణ నష్టం కూడా ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మూలమలుపు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. డ్రైవర్ జంగయ్యపై కేసు తల్లంపాడు బస్సు ప్ర మాదంలో మృతి చెంది న డ్రైవర్ కిరణ్‌కుమార్(38)ది పశ్చిమగోదా వరి జిల్లా లింగపాలెం మండలం తోచెలకరాయుడుపాలెం గ్రామం. ఆయన అవివాహితు డు. గాయపడిన వారు చింతలపూడికి చెందిన గంటి విజయ్‌కుమార్, ఖానాపురానికి చెందిన రాంకోటి, కె.నర్సింహులు తాండురుకు రజిత, బి.షాబోర్ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ జంగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. -
చెరువులోకి దూసుకెళ్లిన కారు..
సాక్షి, ఆళ్లపల్లి: ప్రమాదవశాత్తు చెరువులో కారు దూసుకెళ్లి బోల్తా పడి ఇద్దరు యువకులు మృత్యువాతకు గురైన సంఘటన ఆదివారం ఆళ్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన అరెం రాజబాబు (26), సీతారాంపురం గ్రామానికి చెందిన పాయం రవి (35) అవివాహితులు. ఇరువురు తమ స్నేహితుడు బట్టు సారయ్యను కారులో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇప్పనపల్లిలో దింపి తిరిగి వస్తున్న సమయంలో అతివేగం కారణంగా ఆళ్లపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద అదుపుతప్పి మొద్దుల చెరువులో బోల్తా పడి డోర్లు లాక్ పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న పాదచారులు చెరువులో బోల్తా పడి ఉన్న కారుని గుర్తించి స్థానికులకు సమాచారం అందించారు. అరెం రాజబాబు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని రాజకీయాలకు ఆకర్షితుడై గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి, మండల పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీ పదవికి పోటీచేశాడు. పాయం రవి ఉన్నత చదువులు చదుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వీరిరువురి మృతితో మైలారం, సీతారాంపురం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎండీ.జలాల్ సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: సాబీర్ పాషా సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతిచెందిన గిరిజన యువకుల కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆళ్లపల్లికి చెందిన ఆరెం రాజబాబు, పాయం రవి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మృతుల కుటుంబ సభ్యులను సాబీర్‌పాషా పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో మహిళా సమాఖ్య నాయకురాళ్లు ఈసం రమాదేవి, మేది ని లక్ష్మి, రత్నకుమారి, ఐవైఎప్ నాయకులు నదీప్, హఫీజ్ సుబ్బారావు తదితరులున్నారు. -
పగ పెంచుకొని.. కత్తితో దాడి
సాక్షి, ఠికరకగూడెం(ఖమ్మం) : తాను ఇష్టపడుతున్న మహిళకు, తనకు ఆమె సోదరుడు అడ్డొస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన కరకగూడెం మండలంలో కలకలం రేపింది. ఏడూళ్ల బయ్యారం సీఐ రమేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కౌలూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే గ్రామానికి చెందిన పర్శిక అర్జున్ వరుసకు బావ అవుతాడు. ఆమె సోదరుడు మలకం లక్ష్మణ్(35) పినపాక మండలం ఉలవచెలక గ్రామంలో నివాసం ఉంటాడు. లక్ష్మణ్ అప్పుడప్పుడు తన సోదరి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఇది ఇష్టంలేని అర్జున్ లక్ష్మణ్‌పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం సోదరి ఇంటికి తన మిత్రుడు అదే మండలం చినరాజుపేట గ్రామానికి చెందిన తోలెం విజయ్‌కుమార్‌తో కలిసి వచ్చాడు. భోజనం చేసి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కాపు కాసుకుని ఉన్న అర్జున్ కత్తితో.. లక్ష్మణ్, అతని స్నేహితుడిపై దాడి చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు స్థానికులు వారిని రాయనపేట వరకు ఆటోలో తరలించి, అక్కడి నుంచి 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన లక్ష్మణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య మలకం రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఘటనలో గాయపడిన విజయ్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు. -
మలుపు తిరుగుతున్న శ్రీనివాస్ మృతి కేసు
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : ఖమ్మంలోని సీసీఎస్ పోలీసులు విచారణ పేరుతో సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ (18) అలియాస్ బన్ను అనే పాతనేరస్తుడిని ధర్డ్ డీగ్రీ పేరుతో చిత్రహింసలకు గురిచేయడంతోనే మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు గురువారం ఆరోపించిన విషయం విదితమే. అయితే ఇప్పటివరకు శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన ఆ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్య తీసుకోకపోవటంపై పలు విమర్శలు వినపడుతున్నాయి. శ్రీనివాస్ మృతిచెందిన రోజు కొంతమంది పోలీస్ సిబ్బంది దగ్గరుండి హడావుడి చేసి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించేవరకు తమపై ఒత్తిడి తెచ్చారని శ్రీనివాస్ తల్లి ఆరోపించింది. పెళ్లి కాని యువకుడు కాబట్టి తమ సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని మట్టిలో పూడ్చిపెడతామని అయితే తమపై పోలీసులు ఒత్తిడి చేసి ఖననం చేయించారని ఆమె ఆరోపించింది. శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాస్‌పై కొంతకాలంగా క్షక్ష్య కట్టాడని ఎందుకంటే శ్రీనివాస్ ఆ కానిస్టేబుల్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ఓ దొంగతనం కేసులో పోలీస్ అధికారులకు చెప్పటం వల్లే దానిని మనసులో పెట్టుకొని ఈవిధంగా తమ కొడుకును పొట్టన పెట్టుకున్నాడని ఆమె వాపోయింది. వాస్తవానికి శ్రీనివాస్ దొంగతనాలు మానివేసి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడని, ఆ ఆటోను కూడా గతంలో మంచిగా బతకాలని ఓ సీఐ ఇప్పించారని శ్రీనివాస్ కుటంబ సభ్యులు తెలిపారు. తమపై పోలీసుల ఒత్తిడి ఉందని కూడా వారు పేర్కొన్నారు. -
దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...
సాక్షి, ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కావటి తేజస్విని హత్య కేసులో నిందితుడు బొల్లెదు నితిన్‌ను వీఎంబంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం పెడుతుందన్న కోపంతో యువతిని హత్య చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కల్లూరు ఏసీపీ వెంకటేష్ శుక్రవారం రాత్రి వీఎంబంజర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సత్తుపల్లికి చెందిన బొల్లెదు నితిన్, పెనుబల్లి మండలం, కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్వినిని మూడేళ్లుగా సత్తుపల్లిలో డిప్లొమా చదువుతున్న రోజుల నుంచి ప్రేమిస్తున్నాడని, మూడు నెలలుగా నితిన్ ఫోన్ చేసినప్పటికీ తేజస్విని సరిగ్గా మాట్లాడటం లేదని, వేరే వాళ్లతో మాట్లాడుతుందనే అనుమానంతో, పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. కుప్పెనకుంట్లలోని తేజస్విని ఇంటి వద్దకు వెళ్లి ఆమెతో మాయమాటలు చెప్పి, మాట్లాడాలని ఇంటి వెనుక నుంచి తీసుకెళ్లి, ద్విచక్రవాహనంపై టేకులపల్లి వెళ్లి, అక్కడి నుంచి ముందుగా అనుకున్న నిర్మానుష్య ప్రదేశం కొత్తలంకపల్లి గుట్టల వద్దకు తీసుకువెళ్లి, మాట్లాడే పేరుతో పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ.. జేబులో కర్చీఫ్‌ను తీసి, తేజస్విని మెడకు బిగించి, చేతితో నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు.ముందుగానే పెట్రోల్ కూడా తీసుకుని వెళ్లినప్పటికీ, రోడ్డు మీద వాహనాలు తిరుగుతుండటంతో బయపడి తేజస్విని మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. కేవలం ప్రేమోన్మాదంతోనే తేజస్విని హత్య చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. హత్య అనంతరం ద్విచక్రవాహనాన్ని అక్కడి దగ్గర్లో పొదల్లో పడేసి, ఏమీ ఎరుగనట్లు బస్సు ఎక్కి ఖమ్మంలోని ప్రైవేటు హాస్టల్‌కు వెళ్లాడు. తేజస్విని తండ్రి కావటి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఇతర మార్గాల ద్వారా విచారణ చేపట్టినట్లు శుక్రవారం లంకపల్లి పొదల వద్ద ఉన్న బండి కోసం వచ్చి, అది తీస్తుండగా పోలీసులు గుర్తించి, నిందితుడు బొల్లెద్దు నితిన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం తానే చేసినట్లు విచారణలో నితిన్ వెల్లడించినట్లు ఏసీపీ తెలిపారు. తనను దూరం చేస్తూ, మాట్లాడటం లేదని, తనను పెళ్లి చేసుకుంటుందో లేదోనని, తనకు దక్కనిది, వేరే వారికి దక్కకూడదనే అక్కస్సుతోనే తేజస్వినిని హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. కేసును చేధించిన ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్‌ను, ఎస్ఐ తోట నాగరాజును, సత్తుపల్లి రూరల్ సీఐ రవికుమార్, సత్తుపల్లి సీఐ సురేష్లను అభినందిస్తున్నట్లు, వారికి రివార్డులు అందేలా చూస్తానన్నారు. -
ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష
సాక్షి, కొత్తగూడెం(అన్నపురెడ్డిపల్లి) : అటవీశాఖ, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేరం రుజువు కావడంతో మొత్తం 24 మందికి సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం 3వ అదనపు కోర్టులో గురువారం తీర్పువెలువడింది. 2015 సంవత్సరానికి పూర్వం అన్నపురెడ్డి మండలం మర్రిగూడెం గ్రామ పరిసర అటవీభూముల్లో స్థానిక గిరిజనులు పోడు సాగుచేసుకున్నారు. ఆ భూములు అటవీశాఖవి కావడంతో ఆ శాఖ ఉద్యోగులు 2015 సం వత్సరంలో మొక్కల పెంపకం చేపట్టారు. కాగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్క లు నాటారంటూ స్థానికులు సుమారు 500 మంది న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో అటవీశాఖ ఉద్యోగులను అడ్డుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుమేరకు పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర నేరారోపణతో కేసు నమోదయింది. న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు ఎస్కే ఉమర్, కాక మహేశ్లతోపాటు మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 22 మంది ఉన్నారు. ఇటీవల ఈ కేసులో సుమారు 14 మంది సాక్షులను న్యాయమూర్తి దేవీమానస విచారించారు. నేరం రుజువైనం దున సంవత్సరం జైలుశిక్ష, ఒక్కొ్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది ఫణికుమార్ వాదించగా లైజన్ ఆఫీసర్ వీరబాబు సహకరించారు. -
మోసాలు.. అప్పులతో జల్సాలు..చివరికి..
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి) : మోసాలు.. అప్పులతో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్న మోసగాడ్ని వలపన్ని పట్టుకుని నడి సెంటర్లో కట్టేసిన సంఘటన సత్తుపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన చిట్టూరి రాజేష్ ఏడేళ్ల క్రితం పినపాక మండలం వచ్చి నర్సరీ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో నర్సరీ మొక్కలకు వచ్చిన పినపాక మండలం మంగతోగుకు చెందిన బాడిశ పార్వతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నాడు. పార్వతి తండ్రి ముత్తయ్య ఇటీవలే పదవీ విరమణ చేయటంతో వచ్చిన రూ.10లక్షల్లో రూ.5 లక్షలు నర్సరీ వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని తీసుకున్నాడు. శ్రీరామ్ చిట్‌ఫండ్‌లో పల్సర్ మోటారు సైకిల్‌ను ముత్తయ్య పూచీకత్తుతో తీసుకున్నాడు. దీనికి వాయిదాలను కూడా చెల్లించటం లేదు. అప్పులు చేసి.. పరారీలో.. చిట్టూరి రాజేష్ నర్సంపేట, పినపాకలో అప్పులు చేసి పరారీలో ఉన్నాడు. అప్పులిచ్చిన వాళ్లందరు బాడిశ పార్వతి వద్ద మొర పెట్టుకుంటున్నారు. బాడిశ పార్వతి చిట్టూరు రాజేష్ గురించి వాకబు చేయగా.. ముందే పెళ్లి అయిందని తెలిసింది. మోసగాడి ఆటను కట్టించాలని ఫోన్లో తరచూ సంభాషిస్తూ ఎక్కడ ఉన్నాడో కనుక్కుంది. రాజేష్ ఆ ప్రాంతంలో అప్పులు ఎక్కువ అయ్యాయని.. మీ నాన్న వద్ద ఉన్న రూ. 5 లక్షలు పట్టుకొని రా.. ఇద్దరం కలిసి నర్సరీ పెడదామంటూ నమ్మబలికాడు. సరే వస్తానని చెప్పి.. రాజేష్‌కు అప్పులు ఇచ్చిన వాళ్లందరిని పిలుచుకొని సత్తుపల్లి వచ్చింది. పార్వతిని చూసిన రాజేష్ దగ్గరకు వచ్చి అప్పుల వాళ్లను చూసి పల్సర్ మోటారుసైకిల్‌పై పారిపోతుండటంతో అందరు పట్టుకొని సత్తుపల్లి బస్టాండ్ రింగ్ సెంటర్లోని బోస్‌బొమ్మ విగ్రహం రైలింగ్‌కు కట్టేశారు. ఇంతలో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజేష్‌పై ఏడూళ్లబయ్యారం, పినపాక, నర్సంపేట పోలీస్స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉండటంతో సత్తుపల్లి పట్టణ సీఐ టి.సురేష్ అక్కడి ఎస్హెచ్ఓలతో మాట్లాడి కానిస్టేబుళ్లను ఇచ్చి పంపించారు. -
ఆదర్శనగర్‌లో భారీ చోరీ
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్‌లో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని నగదు, బంగారం, వెండిని దొంగలు దోచుకువెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన బుద్ధ వెంకటేశ్వర్లు సింగరేణి ఉద్యోగి. తోటి కార్మికుడికి దెబ్బ తగలడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వెంకటేశ్వర్లు భార్య కొత్తగూడెంలో చదువుతున్న తన కూతరు వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంటి ముందు తలుపు గొళ్లెం తొలగించేందుకు తలుపును కొద్దిభాగం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. మధ్య గదిలో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.50 వేల నగదును, 8 తులాల బంగారం, 1 కేజీ వెండిని దోచుకెళ్లారు. తెల్లవారు జామున హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు అక్కడి పరిస్థితిని చూసి హతాశుడయ్యాడు. నివాసంలోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న మొత్తాన్ని దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ పరిశీలించి క్లూస్ టీంకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది నమూనాలను సేకరించగా, పోలీసులు విచారణ చేపట్టారు. -
భర్త ఇంటి ముందు వివాహిత నిరసన
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లిటౌన్) : మాయమాటలు చెప్పి ప్రేమపెళ్లి చేసుకొని ఉడాయించాడని ఓ మహిళ భర్త ఇంటి ముందు నిరసన దీక్షకు దిగిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామానికి చెందిన బాణోతు పద్మజ 2017లో సత్తుపల్లిలో ఇంటర్ చదివేటప్పుడు.. సత్తుపల్లిలోని శ్రీనివాసా టాకీస్‌రోడ్‌లోని షేక్ ఖుర్షీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. హైదరాబాద్‌లో చదువుకునేందుకు వెళ్లి ఇరువురు కలిసి తిరిగారు. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పద్మజను మతమార్పిడి చేయించాడు. ఇరువైపుల పెద్దలకు తెలియకుండానే హైదరాబాద్‌లోని మోతినగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత కొన్నిరోజులు హాస్టల్లో ఉండమని చెప్పి.. కాపురం పెట్టేందుకు ఆమె వద్ద నుంచి పొలం అమ్ముకొని వచ్చిన రూ.15 లక్షలను తీసుకొని సత్తుపల్లి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించటం లేదని వాపోయింది. మతం మారటంతో తన కుటుంబ సభ్యులు కూడా తనను ఇంటికి రానివ్వటంలేదని కన్నీళ్లు పెట్టింది. దీంతో సోమవారం నేరుగా సత్తుపల్లిలోని అతని ఇంటికి వచ్చింది. దీంతో ఖుర్షీద్ కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదంటూ దూషించటంతో ఆమె ఇంటి ముందే నిరసనకు దిగింది. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.సురేష్ తెలిపారు. -
ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి..
సాక్షి, ఖమ్మం : నగరంలోని ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనగర్‌కాలనీలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు కత్తితో మహిళను బెదిరించి మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం.. జవ్వాది హనుమంతురావు అనే వ్యక్తి శ్రీనగర్‌కాలనీలోని రోడ్‌నంబర్–3లో నివాసం ఉంటున్నాడు. అదే రోడ్డులో ఇంటికి కొంత దూరంలో మిల్క్ పార్లర్ నడుపుతున్నాడు. రోజులాగే ఆదివారం కూడా దుకాణానికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య కృష్ణకుమారి వంట పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అగంతకుడు గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. నోరుమూసి మెడపై కత్తి పెట్టి మెడలో బంగారం గొలుసు లాక్కున్నాడు. గోల చేస్తే చంపుతానని బెదిరించి పక్కనే ఉన్న క్లాత్‌ను నోటికి కట్టి గోడ దూకి పరారయ్యాడు. హఠత్పారిణామంతో షాక్‌కు గురైన కృష్ణకుమారి కొద్ది సేపటికి తెరుకోని కేకలు వేసింది. స్థానికులు వచ్చేసరికే దొంగ ఉడాయించాడు. పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతంలో.. ఆదివారం సెలవు దినంతో అంతా ఇంటిపట్టున ఉన్న సమయంలో చోరీ జరగడం చర్చానీయాంశంగా మారింది. అగంతకుడు ఇంతకుముందు చూసి న వ్యక్తిలాగే ఉన్నాడని బాధితురాలు తెలిపింది. 7 తులాల గొలుసు అపహరించాడని వాపోయింది. సుమారు 2.5 లక్షల విలువ ఉంటుందని అంచనా. సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి పరిసరాలను పరిశీలించారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం అదే ప్రాంతంలో ఓ టీచర్ ఇంట్లో రాత్రి వేళ చోరీ ప్రయత్నం జరిగింది. టీచర్ గుర్తించి కేకలు వేయడంతో అగంతకుడు పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. -
ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడి అరెస్టు
సాక్షి, కొత్తగూడెం : సీపీఐ(ఎంఎల్ న్యూడెమోక్రసీ) అజ్ఞాత దళ సభ్యుడిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చింతకుంట గ్రామ శివారు ఫారెస్టు ఏరియాలో ఎన్డీ పార్టీ అజ్ఞాత దళాలు సంచరిస్తున్నారనే సమాచారంతో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ, స్పెషల్ పార్టీ సిబ్బంది కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆజాద్ దళానికి చెందిన, కొత్తగూడెం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి మూల్గుగూడెం పాలవాగు వాస్తవ్యుడు మడివి రమేష్ అలియాస్ రవి తారస పడటంతో అదుపులోకి తీసుకున్నారు. రమేష్ వద్ద కంట్రీమెడ్ తుపాకితో పాటు కిట్‌బ్యాగు లభించినట్లు చెప్పారు. దళ కమాండర్ ఆజాద్, దళ సభ్యులు శ్యామ్, ఇతరులు తప్పించుకున్నారని వివరించారు. రమేష్ గత రెండేళ్ల నుంచి దళంలో తిరుగుతూ, గుండాల, కొమరారం ప్రాంతాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడని, ఇప్పటి వరకు ఇతను గుండాలలో పోలీసుల మీద దాడి, అక్రమ వసూళ్లు తదితర నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. అరెస్టు చేసిన రమేష్‌ను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వివరించారు. అజ్ఞాత దళ సభ్యులు ఆయుధాలు వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ ఎస్ఎం అలీ, సీఐ గోపి, ఎస్ఐ నరేష్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. -
పూజ చేస్తామంటూ వచ్చి..
సాక్షి, ఖమ్మం(రఘునాథపాలెం) : మండలంలోని చింతగుర్తి గ్రామంలో మంగళవారం పూజల పేరుతో ఓ ఇంట్లో ఉన్న హోం థియేటర్ సెట్‌ను తీసుకొని పారిపోతున్న ముగ్గురు యువకులను గ్రామ పొలిమేర వద్ద అటకాయించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఖమ్మంరూరల్ మండలం సత్యనారాయణపురానికి చెందిన ముగ్గురు యువకులు సాధు వేషాలు వేసుకోని చింతగుర్తి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ పూజలు చేస్తామంటూ వెళ్లారు. ఈక్రమంలో గ్రామంలో అప్పారావు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో అప్పారావు కొడుకు, భార్య ఉన్నారు. కొడుకు పాపయ్యతో మాటలు కలిపిన యువకులు ‘నీకు ఉద్యోగం వస్తుంది కానీ..ఓ అడ్డంకి ఉంది. పూజలు చేస్తే తొలుగుతుంది’ అని నమ్మించారు. అదే సమయంలో తల్లి పక్కింటికి వెళ్లింది. ఒంటరిగి ఉన్న అతడిని నమ్మబలికించి చేతిలో తీర్థం పోసి, చేతికి తాయత్తు కట్టి దీనికి రూ.6 వేలు ఇవ్వాలని కోరారు. పాపయ్య తన వద్ద అంత డబ్బులేదని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు ఇవ్వాలని సాధు వేషంలో ఉన్న యువకులు కోరి, హోం థియేటర్‌ను తీసుకోని అక్కడి నుంచి ఉడాయించారు. అదే సమయంలో పాపయ్యతల్లి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని చుట్టుపక్కల వారికి తెలపగా గ్రామానికి చెందిన పెంట్యాల శ్రీను అనే వ్యక్తి పాపయ్యను తీసుకొని ద్విచక్రవాహనంపై వేపకుంట్ల వైపు వెళ్లి అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు పారిపోగా ఓకడిని పట్టుకున్నారు. అతడిని, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని గ్రామంలోకి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఏఏస్ఐ దానియేలు గ్రామానికి చేరుకొని ఆ యువకుడుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తర్వాత ముగ్గురు యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి మైనర్లు కావడంతో తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలిసింది. -
దూసుకొచ్చిన మృత్యువు..
సత్తుపల్లి(ఖమ్మం) : ఆదివాసీ సదస్సుల్లో పాల్గొందామని రామగోవిందాపురం నుంచి సత్తుపల్లికి ట్రాక్టర్లో బయల్దేరగా..మృత్యువు మరో వాహనం రూపంలో దూసుకొచ్చింది. దినసరి కూలీలు, నిరుపేదల బతుకుల్లో చీకట్లు నింపింది. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమరం భీం విగ్రహావిష్కరణ, ప్రదర్శన, బహిరంగసభలో పాల్గొనేందుకు మండలం లోని రామగోవిందాపురం నుంచి సుమారు 30 మంది ట్రాక్టర్లో ఉదయం 10 గంటల సమయంలో బయల్దేరారు. పది నిమిషాల్లోనే వీరు బేతుపల్లి–తాళ్లమడ గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారిపైకి చేరుకుని సత్తుపల్లి వైపునకు వస్తుండగా..కంటెయినర్ లారీ ఓవర్టేక్ చేయబోయి..ట్రాక్టర్‌కు తగలడంతో ట్రక్కు పడిపోయింది. 19 మంది తీవ్రంగా గాయపడగా..క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం, ఆటోల్లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి సరియం వెంకటేశ్వర్లు(40), ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కణితి లక్ష్మయ్య(45) చనిపోయారు. ఈ ప్రమాదంతో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో సీఐ టి.సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ట్రాక్టర్ ట్రక్కును పక్కకు జరిపించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఢీ కొట్టిన కంటెయినర్ లారీ తప్పించుకొని వెళ్లిపోవడంతో పెనుబల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రి, కిమ్స్‌లో క్షతగాత్రులు.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి అంబులెన్స్‌లలో తరలించారు. అక్కడ ఉచితంగా వైద్య సహాయం చేశారు. వాసం కాంతమ్మ తలకు, నడుముకు, రేలా వెంకట దానయ్య తలకు తీవ్రగాయమై చెవుల్లో నుంచి రక్తం కారింది. తాటి సుకన్య, తాటిపర్తి అచ్చమ్మ, కణితి వీరభద్రం, బేతి శివకు తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులైన సరియం మురారి, కోలా రాంబాబు, ఇటుక తిరుపతమ్మ, రేలా వరలక్ష్మి, రాములు, రాజు, సిద్దిన ఆదామ్మ, సరియం ఇం దు, సరియం నందు, సిద్ధిని గంగులు, వాసం నాగలక్ష్మిలకు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతీదేవి తెలిపారు. పరామర్శించిన నామా, సండ్ర, పొంగులేటి.. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి తరలించి మెరుగై చికిత్స అంది స్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయ మి చ్చి, పంపించారు. క్షతగాత్రులకు జరుగుతున్న వైద్యసేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రు. సరియం వెంకటేశ్వర్లు, కణితి లక్ష్మయ్య మృ తదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరివెంట కోటగిరి సుధాకర్, దొడ్డా శంకర్రావు, మందపాటి ముత్తారెడ్డి, ఎస్కె మౌలాలీ, ఎండి కమల్‌పాషా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిశాక ఖమ్మం నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు చేరుకున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. రామ గోవిందాపురంలో విషాద ఛాయలు.. సత్తుపల్లి మండలం రామగోవిందాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు, క్షతగాత్రులందరూ బంధువర్గం కావడంతో గ్రామం కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువుల రోదనలు, ఆర్తనాదాలతో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రి దద్దరిల్లింది. ఆదివాసీ దినోత్సవానికి వచ్చిన గిరిపుత్రులు ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దవాఖానా ప్రాంగణం కిటకిటలాడింది. ఇదే ప్రమాదంలో ట్రాలీ బోల్తా.. కాగా ట్రాక్టర్‌ను కంటెయినర్ లారీ ఢీ కొనగానే తొట్టి పడిపోగా, ట్రాక్టర్ ఇంజిన్ వేగంగా వెళ్లి ముందు వెళుతున్న ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ట్రాలీ ఎగిరి పక్కనే ఉన్న వరిపొల్లాల్లో పడింది. ఈ ప్రమాదంలో ఆటో దెబ్బతినగా దీనిలో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. -
ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్
సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్ యాక్షన్ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు. న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్ క్యాడర్ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మహిళ దొంగ అరెస్టు!
సాక్షి, ఖమ్మం క్రైం : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలుగా ఖమ్మం నగరంలో చోరీలు చేస్తూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా దొంగను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆమె వద్ద నుంచి రూ.8.33,400ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయి గూడేనికి చెందిన శీలం నిర్మల సవరాలు అమ్ముతూ జీవిస్తూ అదేవిధంగా దొంగతనాలకు అలవాటు పడింది. దీంతో ఖమ్మం నగరంలో 2015 నుంచి దొంగతనాలు చేయటం ప్రారంభించింది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.... సవరాలు అమ్మే నిర్మల నగరంలో సవరాలు అమ్ముతా అంటూ వీధుల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొనేది. ఎవరూ లేని సమయం చూసి తాళం పగులగొట్టి ఇంట్లో జొరబడి బంగారం, వెండి, నగదు దోచుకొని పోయేది. 2015 నుంచి ఇప్పటి వరకు 15 ఇళ్లలో చోరీలు చేసింది. పోలీసులు ఇది బయట నుంచి వచ్చి చేస్తున్న ముఠా సభ్యులని, లేదా దొంగతనాలలో ఆరితేరిన వారి పనిగా భావించటంతో ఆమె మరింత సులువుగా దొంగతనాలు చేయటం ప్రారంభించింది. అలా పోలీసుల కళ్లుగప్పి నాలుగు సంవతర్సాల నుంచి దొంగతనాలు చేస్తోంది. ఇలా చిక్కింది.. నిర్మల భర్త పోచయ్య గతంలో దొంగతనాలు చేసేవాడు. పోలీసుల నిఘా పెరగటంతో పోచ య్య దొంగతనాలు మానేసి తన భార్య చేత దొంగతనాలు చేయించటం ప్రారంభించాడు. అయితే పోలీసుల కళ్లుగప్పటానికి అతను పోలీసులకు పలు సమాచారాలు అందజేసేవాడు. దీంతో పోలీసులకు నిర్మలపై అనుమానం రాలేదు. ఇటీవల రోటరీనగర్‌లో ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడినప్పుడు ఒక ఇంట్లో సీసీ కెమెరాలో నిర్మల చోరీకి పాల్పడి వెళుతున్న దృశ్యాలు పోలీసులకు లభ్యం అయ్యాయి. దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ఆమెను గాంధీచౌక్ ప్రాంతంలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా వ్యవహారం అంతా బయటపడింది. ఆమె వద్ద నుంచి 255 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మల ఇంట్లో సుమారు లక్ష రూపాయల విలువ గల మంచం, ఇతర విలువైన వస్తువులు చూసి పోలీసులు అవాక్కయినట్లు తెలిసింది. పోలీసులకు రివార్డులు మహిళా దొంగను పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ జహంగీర్, నగర ఏసీపీ వెంకట్రావ్, సీఐలు షుకూర్, నరేందర్, సాయిరమణ, రమేష్, వసంతకుమార్, ఏఎస్ఐ కృష్ణారావు, హెడ్‌కానిస్టేబుళ్లు లతీఫ్, వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు హరీష్, నాగేశ్వరరావు, మంగత్యా, అమీర్, నరేష్, జమలయ్య, నాగేశ్వరరావుకు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు మురళీధర్, పూజ తదితరులు పాల్గొన్నారు. -
అదునుచూసి హతమార్చారు..
సాక్షి, ఖమ్మం(ఇల్లెందు) : నిన్నటి వరకు ఎన్డీ నేత మధు జైళ్లో.. అదే స్థాయిలో ఉన్న లింగన్న తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ విస్తరణకు సన్నద్ధమవుతున్న వేళ అదును చూసి హతమార్చారని అనుకుంటున్నారు. 2012లో ఎన్డీలో సంభవించిన చీలిక రెండు వర్గాలకు తీరని నష్టంగా మారింది. 2016 నుంచి అగ్రనేతలంగా వరుస అరెస్టుల పర్వం జరిగింది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న గోపీ నుంచి మొదలుకొని విజయ్, రమేష్ వరకు జనజీవనంలో ఉన్న మధు, ఐలయ్య వరకు అంతా అరెస్టు అయిన నేతలే. అయితే పోలీసులు మాత్రం వీరు రెండో దఫా అజ్ఞాతంలోకి వెళ్లటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న వారందరినీ లేకుండా చేయాలనే లక్ష్యంలో పోలీసులు వరుస అరెస్టులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న నేతలు మళ్లీ అడివి బాట పడుతుండటంతో ఒక వైపు పీడీ యాక్టులు పెట్టి జైళ్ల పాలు చేయటం, మరొక వైపు భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎన్కౌంటర్లకు తెరలేపారనే ప్రచారం జరుగుతోంది. లింగన్న ఎన్కౌంటర్ లాంటి సంఘటనలు ఎన్డీకి కొత్త కాకపోయినప్పటికీ ఈ ఎన్కౌంటర్ ఆ గ్రూపుల్లోని అజ్ఞాత నేతలకు ఒక సంకేతంగా చూపించేందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. లింగన్న లాంటి ఓ కీలక నేతను కోల్పోవడటం ఎన్డీకి కోలుకోలేని దెబ్బగా అభివర్ణిస్తున్నారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో... సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి ప్రజలతో సత్సం బంధాలు కలిగి ప్రజల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలను సునాయాసంగా ప్రజాకోర్టుల ద్వారా పరిష్కరించి అందరినీ మెప్పించి పంపించే నేతను కోల్పోవడం తీరని లోటుగా భావిస్తున్నారు. సిద్ధాంత, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న ఎన్డీకి ఈ తరుణంలో లింగన్నను ఎన్కౌంటర్ రూపంలో కోల్పోవటం కొంత నష్టమేనని చెప్పవచ్చు. 2017 డిసెంబబర్ 7న రఘునాథపాలెం వద్ద అరెస్టు అయిన లింగన్న కొద్ది కాలం జైలు జీవితం గడిపి బయటకు వచ్చి ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో మధు రెండో దఫా హైదరాబాద్‌లో అరెస్టు కావటంతో సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు రావటం తమకు ప్రతికూల పరిస్థితి ఎదురు కావటంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఎంపీటీసీ ఎన్నికల ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. గుండాల మండంలో మెజార్టీ ఎంపీటీసీలను కైవసం చేసుకుని ఎంపీపీని, జెడ్పీటీసీ నిలబెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్ పుంజుకుంటుదని అంతా భావించారు, కానీ ఎంపీపీ, జెడ్పీటీసీ చేజారటం, ఎన్డీ ఖాతాలో జమ కావటం లింగన్న కృషేనని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో లింగన్న ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌కు ముందు.. తర్వాత ఏమైంది...? ఇదిలా ఉండగా ఎన్‌కౌంటర్‌కు ముందు ఎన్‌కౌంటర్‌కు తర్వాత ఏమి జరిగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కటం లేదు. ఎన్‌కౌంటర్‌కు ముందు అక్కడ ఏమి జరిగింది.. ఎన్ని గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది.. ఎన్ని రోజుల నుంచి ఆ ప్రదేశంలో విడిది పొందారు.. అన్ని రోజులు ఒకే ప్రదేశంలో విడిది పొందటానికి గల కారణాలు ఏమిటి, అక్కడ విడిది పొందిన సమాచారం ఎంత మందికి తెలుసు, ఆ ప్రదేశం అంత సేఫ్ కానిది అయినా అన్ని రోజులు ఎందుకు అక్కడే విడిది పొందినట్లు, ఎన్కౌంటర్ సమయంలో ఆ స్థలంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు, ఎన్కౌంటర్ తర్వాత వారంతా ఎటు వెళ్లారు.. ఇంకా గాయపడిన సభ్యులు ఉన్నారా.. వారంతా ఎన్డీ కంట్రోల్లోకి వచ్చి ఆ రోజు జరిగిన సంఘటన పూర్వాపరాలు వెల్లడించారా లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. రఘునాథపాలెంలో అరెస్టుకు పూర్వమే లింగన్న లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగిన క్రమంలోనే అరెస్టు అయి ఆరు నెలల వరకు ఇంటివద్దనే ఉండి రెండో దఫా అడవిబాట ఎందుకు పట్టాడు.. లింగన్న ఎన్‌కౌంటర్‌పై ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. బాటన్న దళంలో సభ్యుడిగా చేరిన లింగన్న 22 ఏళ్ల కాలంలో జిల్లా కార్యదర్శి, రీజియన్ కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. -
ర్యాగింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్
సత్తుపల్లిటౌన్: విద్యాసంస్థల్లో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ హెచ్చరించారు. సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ర్యాగింగ్ యాక్ట్ కేసులో ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం మూడుగంటల సమయంలో కొత్తూరు మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని అదే కళాశాలలో చదువుతున్న జూనియర్ విద్యార్థి శివగణేష్‌ను సీనియర్ విద్యార్థులు ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితం చితకబాదారు. బాధితుడు శివగణేష్ సీనియర్ విద్యార్ధి అఫ్రీద్‌కు ఫేస్బుక్లో మెస్సేజ్ పెట్టడంతో దానిని ఆసరాగా చేసుకొని అఫ్రీద్ తన మిత్రులు సాయికిరణ్, మణితేజలతో కలిసి దాడి చేశాడు. ఈ సంఘటను సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియలో కూడా అప్లోడ్ చేశారు. బాధితుడు శివగణేష్ సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న అఫ్రీద్, సాయికిరణ్, మణితేజలను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీపీ వెంకటేష్ తెలిపారు. విద్యార్థుల్లో సత్ప్రవర్తనతో కూడిన మార్పు తెచ్చేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. సమాజంలో నూటికి తొంబైతొమ్మిది శాతం మంది మంచి ప్రవర్తన కలిగిన వారే ఉంటారని.. వీరికి మాత్రమే ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉంటుందన్నారు. డ్రంక్‌అండ్‌డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో సీఐ టి.సురేష్, ఎస్సై నారాయణరెడ్డి, ఏఎస్సై బాలస్వామి ఉన్నారు. -
ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడని విద్యార్థిపై దాడి
సత్తుపల్లి: జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి కలకలం సృష్టించింది. ఫేస్బుక్లో కామెంట్ చేశాడని జూనియర్‌ను లాక్కెళ్లి పాడుబడిన ఇంట్లో చితక బాదిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం దాడి చేసి, సెల్ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. మంగళవారం వీడియో వైరల్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనకళ్ల గ్రామానికి చెందిన వలకట్ల శివగణేష్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కొత్తూరు మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నెల రోజుల క్రితం తన మిత్రుడనుకుని ఎస్కె అఫ్రీద్‌ను ఫేస్బుక్ మెసెంజర్లో చిన్న కామెంట్ చేశాడు.దీనిపై అఫ్రీద్, శివగణేష్ తీవ్రపదజాలంతో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత తనమిత్రుడు అఫ్రీద్, ఫేస్బుక్లో కామెంట్ చేసిన అఫ్రీద్ ఒక్కరుకారని తెలుసుకున్న శివగణేష్.. ఎస్కె అఫ్రీద్‌కు క్షమించమంటూ మళ్లీ పోస్టు చేశాడు. అయినా కనికరించకుండా శివగణేష్‌పై దాడి చేశారు. దాడి చేసిన ఎస్కె అఫ్రీద్(అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి), ఎస్.సాయికిరణ్(ఖమ్మం), వి.మణితేజ(సత్తుపల్లి మండలం రేజర్ల) అదే కళాశాలలో డిప్లొమా ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతున్నారు. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దాడి పెద్దపల్లి నుంచి వి.శివగణేష్ కళాశాలకు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం సత్తుపల్లి వచ్చాడు. ఆలస్యం కావటంతో బయట మిత్రుని గదిలోనే ఉన్నాడు. అదేరోజు శివగణేష్ బయట కన్పించటంతో ఎస్కె అఫ్రీద్ మిత్రులైన ఎస్.సాయికిరణ్, వి.మణితేజలతో పాటు మరికొంత మందితో కలిసి శివగణేష్ నోరుమూసి కళాశాల సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. శివగణేష్ ఆర్తనాదాలు చేస్తున్నా వదలకుండా.. దుర్భాషలాడుతూ కాళ్లు, చేతులు, కర్రలతో ఇష్టం వచ్చినట్టు.. ఈడ్చి.. ఈడ్చి.. కొట్టడం చూపరులను కలిచివేస్తోంది. ఈ వీడియో దృశ్యాలు కళాశాల వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో వైరల్‌గా మారి విషయం బహిర్గతమైంది. పోలీసులకు ఫిర్యాదు.. శివగణేష్‌పై సీనియర్ విద్యార్థుల దాడి చేసిన విషయం మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చలసాని హరికృష్ణకు మంగళవారం సాయంత్రం తెలిసింది. బాధిత విద్యార్థి శివగణేష్ నుంచి వివరాల తెలుసుకుని దాడిచేసిన విద్యార్థులైన ఎస్కె అఫ్రీద్, వి.మణితేజ, ఎస్.సాయికిరణ్‌లను విచారించి, వీడియో క్లిప్‌ను జత చేసి కళాశాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బందితో సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు పంపించటంతో దాడి ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లిలో ఉన్న తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది ఫోన్ చేసి చెప్పటంతో విషయం తెలిసిందని బాధితుని తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. సీనియర్ విద్యార్థులు దాడి చేసిన విషయాన్ని శివగణేష్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మళ్లీ ఎక్కడ దాడి చేస్తారోనని భయంతో చెప్పలేదని కనీళ్ల పర్యంతమయ్యాడు. దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనా స్థలాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ సురేష్ బుధవారం సందర్శించారు. దాడికి వాడిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఏదైన మత్తు పదార్థం తీసుకొని దాడికి పాల్పడ్డారేమోనని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కళాశాలలో ఘటనను చూసిన విద్యార్థులను పిలిచి ఎలా జరిగిందో విచారించారు. శివగణేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు శివగణేష్ శరీరంపై ఉన్న గాయాలను పరీక్షించారు. విచారణ నిర్వహిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీఐ టి.సురేష్ తెలిపారు. -
గొర్రెలు చనిపోయాయని ఐపీ పెట్టిన వ్యక్తి
ఖమ్మంలీగల్: ఖమ్మంఅర్బన్ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పేరం వెంకటరమణ శుక్రవారం ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రూ.12.80 లక్షలకు దివాలా పిటిషన్ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఫిర్యా ది తన గ్రామంలో గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ గొర్రెలకు కొన్ని రోజుల తర్వాత జబ్బు వచ్చి చనిపోయాయి. ఈ గొర్రెలను అధిక రేటుకు కొనుగోలు చేశాడు. ఈ గొర్రెలను కొనుగోలు చేయడానికి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని కొనుగోలు చేశాడు. ఈ గొర్రెలు చనిపోవడంతో అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మొత్తం 16 మందిని ప్రతివాదులుగా చూసిస్తూ రూ.12.80లక్షలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో తన న్యాయవాది బీశ రమేష్, జి.వీరభద్రం ద్వారా దివాలా పిటిషన్ దాఖలు చేశారు. -
మదర్సాకు చేరిన పిల్లలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని సఫాయిబస్తీకి చెందిన మదర్సా నిర్వాహకుడు అరెస్టు కావడంతో, పోలీసులు అప్పటి నుంచి నిర్వాహకుడికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు. బుధవారం సఫాయిబస్తీ మదర్సాను పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తనిఖీలు చేసి అనంతరం అందులో ఉర్దూ నేర్చుకుంటున్న పిల్లలను, కొత్తగూడెంలోని శ్రీసత్యసాయి అనాథ శరణలయానికి తరలించారు. ఈ క్రమంలో ముస్లిం మతపెద్దలు ఐసీడీఎస్ అధికారులు, పోలీసులతో చర్చలు జరిపి పిల్లల బాధ్యతను తీసుకుంటామని, ఆగస్టు 1వ తేదిన పిల్లల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెడతామని, ఈలోగా బిహార్‌లోని పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని రప్పిస్తామని వివరించారు. దీంతో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, మతపెద్దలతో లెటర్ రాయించుకొని పిల్లలను తిరిగి మదర్సాకు పంపించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ హరికుమారి, సీఐ కుమారస్వామి, ఎల్‌పివో శివకుమారి, కేర్ టేకర్ వినోద్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
మత మార్పిడి చేసిన మదర్సా నిర్వాహకుల అరెస్ట్
అశ్వారావుపేట: మతమార్పిడి, లైంగిక దాడులకు పాల్పడుతున్న ముగ్గరు వ్యక్తులను పాల్వంచ డీఎస్పీ మధుసూదన్‌రావు బుధవారం అరెస్టు చేసి సత్తుపల్లి కోర్టుకు రిమాండ్ చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే వలీఅహ్మద్ అశ్వారావుపేటలోని ఏఎస్‌ఆర్‌నగర్‌లో మదర్సా నిర్వహిస్తున్నాడు. దీనిని ‘ద రియల్ మెస్సేజ్ సెంటర్ మదర్సా ఈ దావత్ హక్’ పేరుతో 2010లో మేడిపల్లిలో ప్రారంభించారు. ఆ తర్వాత 2011లో అశ్వారావుపేటకు మార్చారు. ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపి 2018లో ఖమ్మంలోని రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ నుంచి 116 నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించారు. నిరుపేద దూదేకుల కులానికి చెందిన పిల్లలకు ఉర్దూ, అరబిక్ నేర్పడం, చెడు అలవాట్లకు బానిసలైన వారిని మార్చడం, అన్ని మతాలసారం ఒక్కటేనని చెప్పి దేశ సమైక్యతను పెంపొందించడం ఈ మదర్సా స్థాపన లక్ష్యమని రిజిస్ట్రేషన్ కోసం పొందు పర్చిన పత్రాల్లో పేర్కొన్నారు. కానీ, ఈ మదర్సా నిర్వాహకుడు ఎస్కే వలీ.. తన పెద్దకొడుకు ఎస్కే అబ్దుల్ రజాక్, తన బావమరిది ఎస్కే జానీతో కలిసి సాయం కోసం వచ్చే గిరిజన మహిళలతో మతమార్పిడి చేయించడం, వారిపై లైంగికదాడి చేయడం, మదర్సాలో చదివే పిల్లలకు బాల్య వివాహాలు చేయడం, మతమార్పిడి చేసిన వారి ఫొటోలను ఉపయోగించి ఇతర గ్రామాల్లోని మసీదుల వద్ద పెద్దమొత్తంలో చందాలు వసూలు చేయడం లాంటి పనులు చేశారు. ఈ చందాలతో ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇప్పటి వరకు 13 మంది హిందువులను ముస్లింలుగా మార్చాడు. వారిలో 8 మంది గిరిజనులు. గోదావరిఖని గ్రామానికి చెందిన ఎండీ మున్నా కుమార్తె (మైనర్)కు ఎస్కే వలీ బలవంతంగా వివాహం చేశాడని, అతడి కొడుకు అబ్దుల్ రజాక్ లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయగా దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఎం.అబ్బయ్య, ఎస్ఐలు వేల్పల వెంకటేశ్వరావు, మధుప్రసాద్ ఉన్నారు. -
అత్తను చంపిన కోడలు అరెస్ట్
పాల్వంచ: కొడుకు ప్రేమ వివాహం చేసుకుని తీసుకొచ్చిన కోడలికి, అత్తకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారికి కూతురు పుట్టడంతో వారసుడు పుట్టలేదంటు సూటిపోటీ మాటలతో తిడుతుండటంతో తట్టుకోలేక క్షణికావేశంలో రోకలిబండతో అత్త తల పగులగొట్టి హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేశ్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన స్థానిక ఇందిరాకాలనీలో మైల కనకతార (53) కోడలు చైతన్య చేతిలో హత్యకు గురైంది. కనకతార భర్త సింగరేణి ఉద్యోగి. కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురి వివాహాలు జరిగాయి. కనకతార తన చిన్న కొడుకు నాగరాజు కుటుంబంతో కలిసి ఉంటోంది. నాగరాజు గతంలో చైతన్యను ప్రేమ వివాహాం చేసుకుని తీసుకొచ్చాడు. వారికి ఒక కూతురు కూడా ఉంది. నాగరాజు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఇక్కడి ఇంట్లో కనకతార, చైతన్య కలిసి ఉంటున్నారు. అయితే అత్త తన కొడుకుని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకున్నావు? ఆడపిల్లను కన్నావు? అంటూ వేధిస్తుండటంతో వారి మధ్య తరచూ మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత ఆదివారం మధ్యాహ్నం గొడవ జరగడంతో కోడలు చైతన్య అత్త కనకతారను రోకలి బండతో తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. దీంతో పోలీసులు కోడలిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె హత్య చేసినట్లు తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ ముత్యం రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ మానవ సంబంధాలను మెరుగు పర్చుకోవాలి తప్ప, వాటిని పాడుచేసుకోవద్దని, క్షణికావేశంతో హంతకులుగా మారొద్దని తెలిపారు. చిన్న చిన్న తాగాదాలు ప్రతి కుటుంబాల్లో సహజమని, ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్‌కు వస్తే కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. -
టీఆర్ఎస్కు మావోయిస్టుల హెచ్చరిక
సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్బీ పోలీసులు ఇన్ఫార్మర్గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు. అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్ పిలుపునిచ్చారు. -
ఏసీబీకి చిక్కిన ఐఐటీ టాప్ ర్యాంకర్
సత్తుపల్లి: ఏసీబీకి అవినీతి జలగ చిక్కింది.. సత్తుపల్లి బస్టాండ్‌లో లంచం తీసుకొని బస్సు ఎక్కుతుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకోవటంతో జనంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కిటకిటలాడుతున్న బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం సివిల్ దుస్తుల్లో ఏసీబీ అధికారులు లంచగొండిని పట్టుకొని తీసుకెళ్తుంటే ప్రజలు వింతగా చూశారు. రెండు నెలల వ్యవధిలో సత్తుపల్లిలో రెండోసారి ఏసీబీ అధికారులు దాడులు, అరెస్ట్‌లు చేయటం చర్చనీయాంశమైంది. మార్చి 27న సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ వీఆర్వో పద్దం వెంగళరావు పట్టుబడిన విషయం విదితమే. ఎలా పట్టుకున్నారంటే.. దమ్మపేట నీటపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న పంది నర్సింహారావు మిషన్ కాకతీయ చెరువుల బిల్లుల చెల్లింపుల్లో లంచం అడగడంతో కాంట్రాక్టర్ వెంకట్రామయ్య రూ.10వేలు తీసుకొని ఏఈఈకి ఫోన్ చేశాడు. సత్తుపల్లి బస్టాండ్‌లో ఉన్నాను.. వచ్చి డబ్బులు ఇవ్వండి అని చెప్పటంతో అతని వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్సీ ప్రతాప్(వరంగల్), సీఐలు ఎస్వీ రమణమూర్తి, బి.ప్రవీణ్, పి.వెంకట్లు దాడి చేసి ఇరిగేషన్ ఏఈఈ నర్సింహారావును పట్టుకున్నారు. అక్కడి నుంచి సత్తుపల్లి ఆర్అండ్బీ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ చేశారు. ఏసీబీ ట్రాప్‌లో చిక్కుకున్న వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పంది నర్సింహారావు ఐఐటీలో టాప్ ర్యాంకర్. రెండేళ్ల క్రితమే ఉద్యోగంలో చేరాడు. అసలు విషయం ఏమిటంటే.. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన వెంకట్రామయ్య భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలోని కారం లక్ష్మీకుంట రూ.15 లక్షలు, పట్వారిగూడెంలోని కారం కన్నప్పకుంట రూ.16 లక్షల విలువైన రెండు చెరువులను 2017లో మిషన్ కాకతీయ మూడవవిడతలో ఆన్లైన్ ద్వారా టెండర్ దక్కించుకున్నాడు. 2018లో పార్టు బిల్లు కింద రెండు చెరువులకు కలిపి రూ.14.10 లక్షలను చెల్లించారు. మిగిలిన ఫైనల్ బిల్లు చేసేందుకు ఏడాది నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. పనులు చేసేటప్పుడు కూడా ప్రతిపాదనలో లేని పనులను కూడా చేయించారు. బిల్లులు చెల్లించమంటే లంచం కావాలంటూ డిమాండ్ చేస్తుండటంతో డబ్బులన్నీ పనులకే ఖర్చు పెట్టాను.. మీరు బిల్లు చేయండి.. డబ్బులు ఇచ్చేస్తానంటూ విన్నవించుకున్నా ఫలితం కన్పించలేదు. రూ.15వేలు ఇస్తేనే బిల్లు చేస్తామని ఏఈఈ తిప్పుతుండగా భరించలేక హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అక్కడ నుంచి ఖమ్మం ఏసీబీ కార్యాలయానికి కేసును రిఫర్ చేయటంతో ఏసీబీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. -
ముఖం చూపలేక మృత్యు ఒడికి
సాక్షి, రఘునాథపాలెం: అతడికి, ఆమెకు వేర్వేరుగా కుటుంబాలున్నాయి. పిల్లలు ఉన్నారు. కానీ..వివాహేతర సంబంధం కారణంగా అన్నీ మరిచి, కొన్నిరోజులు ఎటో పారిపోయి తిరిగి వచ్చిన వారికి ఇంటికెళ్లేందుకు ముఖం చెల్లలేదు. సమాజం చీదరించుకుంటుందని జంకారు. చివరికి చావాలని పురుగులమందు తాగి ఒకరు ప్రాణాలు వీడగా, సదరు మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. రఘునాథపాలెంకు చెందిన ఇస్లావత్ వీరన్న(30) సుతారీ పని చేస్తూ..కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుతారీ పనులప్పుడు ఏడాది క్రితం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన ఒక వివాహిత ఫర్జానతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా..చివరికి వారి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఫర్జానాకు కూడా భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈక్రమంలో 10 రోజులు క్రితం వీరిద్దరూ వారి కుటుంబాలను వదిలేసి ఎటో పారిపోయారు. గురువారం అర్ధరాత్రి వీరన్న గ్రామం అయిన రఘునాథపాలెం వచ్చారు. ఊరిలోకి వెళ్లడానికి ముఖం లేక ఎటు వెళ్లాలో అర్థంగాక ఊరి సరిహద్దునే ఉన్న చెరువు గట్టుపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరు పురుగుల మందు తాగి అక్కడే పడిపోయారు. తెల్లవారు జాము సమయంలో చెరువు గట్టుపై అరుపులు వినపడడంతో సమీపంలోని వారు వెళ్లి చూడగా..ఇద్దరూ చావు బతుకుల మధ్య నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా..శుక్రవారం వీరన్న మృతి చెందాడు. ఫర్జానా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వీరన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఫర్జానా అదృశ్యం అయినట్లు కుటుంబసభ్యులు 10రోజుల క్రితమే అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..వారు ఆమె వద్దకు చేరుకున్నారు. -
మైనర్‌పై అత్యాచారం కేసులో జైలు
ఖమ్మంలీగల్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో అశ్వారావుపేట మండలం నెమలిపేట గ్రామానికి చెందిన పాయమ్ వెంకన్నబాబుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. కిడ్నాప్ చేసినందుకు 5 సంవత్సరాలు, రూ.5వేల జరిమానా, అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి వి.బాలభాస్కరరావు గురువారం తీర్పుచెప్పారు. బాధితుల సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2014, జూన్ 3న రాత్రి సమయంలో బాధితురాలు ఇంటి ముందు పడుకుంది. అర్ధరాత్రి లేచిచూడగా.. బాధితురాలు కనపడక పోవడంతో ఫిర్యాది అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితునికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొండపల్లి జగన్మోహన్రావు వాదించారు. కోర్టు కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, లైజన్ఆఫీసర్ జి.ముత్తయ్య, హోంగార్డు ఎండి.అయూబ్ సహకరించారు. -
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..
వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్ అమ్మా..కొట్టకే..నొప్పెడుతోందమ్మా అంటూ ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లారో ఎంతగా..వెక్కివెక్కి ఏడ్చారో పాపం వీపంతా వాతల మయంచెంపలు, మోచేతులు చర్మం ఊడి..గాయాలైన ఆ చిన్నారులు..ఆ పసికూనలు బిక్కుబిక్కు మంటున్నారు. కన్నతల్లి అనైతిక చేష్టలతో రోజూ నరకం చూసి కదిలిస్తే..బోరున విలపిస్తున్నారు. కొత్తగూడెంఅర్బన్: నవ మాసాలు మోసిన కన్న తల్లే కూతుళ్ల పట్ల కాసాయిలా మారింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే సాకుతో చిన్నారులను చిత్రహింలకు గురి చేసింది. ఈ విషయం ఆమె సోదరుడికి(పిల్లల మేనమామ) తెలియడంతో నిర్వాకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాలిలా..కొత్తగూడెం పట్టణంలోని బొగ్గు గని ప్రాంతమైన రుద్రంపూర్‌కు చెందిన గౌడ్స్ ఓం ప్రకాశ్ మూడు నెలల క్రితం మృతి చెందాడు. అతడి భార్య రూప, కూతుళ్లయిన 8 సంవత్సరాల హేమశ్రీ, ఐదేళ్ల శ్రీప్రియ ఉన్నారు. రూపకు అప్పటికే గౌతంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే భర్త చనిపోయిన తర్వాత వీరిరువురి బంధం బలపడింది. ఈ క్రమంలో కూతుళ్లు హేమశ్రీ, శ్రీప్రియ అడ్డుగా ఉన్నారనే కారణంతో రూప వారిని ప్రతిరోజూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఒళ్లంతా వాతలు పెట్టింది. ముఖంపైనా తీవ్రంగా గాయపర్చింది. చిన్నారుల ఒళ్లంతా గాయాలే కనిపించడంతో ఈ విషయం రూప సోదరుడు ఉర్సు కుమార్‌కు తెలిసింది. కుమార్ బుధవారం రూప ఇంటికి వెళ్లి పిల్లలను ఆరా తీయగా నిజం బయటపడింది. చిన్నారులు జరిగిన విషయమంతా వివరించారు. దీంతో కుమార్ ఇద్దరు పిల్లలను తీసుకుని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కుమారస్వామి రూపను స్టేషన్‌కు పిలిపించి విచారించగా తన కూతుళ్లను గాయపర్చింది, చిత్రహింసల పాలు చేసింది నిజమేనని అంగీకరించింది. ఆమెపై ఎస్సై కేసు నమోదు చేశారు. -
భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు?
టేకులపల్లి: మండలంలోని తావుర్యాతండాలో మద్యం మత్తులో నిద్రిస్తున్న వ్యక్తిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన జరిగింది. వివాహేతర సంబంధం వల్లనే హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తావుర్యా తండాకు చెందిన దారావత్ నందు (25)కి అదే గ్రామానికి చెందిన సుప్రియతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సిద్దు (3), అజయ్ (ఒకటిన్నర) ఉన్నారు. నందు కొత్తగూడెంలోని ఓ షాపులో పనిచేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. సుప్రియ కొత్తగూడెంలో టైలరింగ్ నేర్చుకునేందుకు వెళ్తోంది. ఈ క్రమంలో టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన గుగులోత్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అనుమానించిన భర్త నందు భార్యను మందలించాడు. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు వారాల క్రితమే ఇంట్లో భర్తతో గొడవపెట్టుకుని సుప్రియ పుట్టింటికి వెళ్లింది. మృతుడి తల్లి లక్ష్మి, అన్న దేవా సుప్రియ పుట్టింటికి వెళ్లి నచ్చజెప్పి భర్త దగ్గరకు పంపించారు. గురువారం ఉదయం కొత్తగూడేనికి పనికి వెళ్లిన నందు రాత్రి 9 గంటల తరువాత ఇంటికొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం సేవించి నందు నిద్రపోయాడు. శుక్రవారం ఉదయం సుప్రియ అన్న సుమన్ మృతుడి అన్న దేవాకు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో స్పృహ కోల్పోయి ఉన్నాడని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తొంతుకు తీగతో నులిమి చనిపోయి ఉన్నాడు. గురువారం రాత్రి సుప్రియ ప్రియుడు కృష్ణ మరికొందరితో వచ్చి నిద్రిస్తున్న నందు గొంతు నులిమి హత్య చేసినట్లు చర్చించుకుంటున్నారు. తన కుమారుడిని సుప్రియ, ప్రియుడు కృష్ణ, మరి కొందరు కలిసి హత్య చేశారని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మడిపల్లి నాగరాజు, ఎస్ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్ప గించారు. మృతుడి భార్య సుప్రియ, ప్రియుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
నగరంలో దొంగలు హల్చల్
ఖమ్మం నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడి లక్షలాది రూపాయల విలువ చేసే సొత్తును ఎత్తుకు పోతున్నారు. తాళం వేసి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీనికి తోడు పోలీసు పెల్రోలింగ్ కొరవడటంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై ప్రత్యేక కథనం.. ఖమ్మంక్రైం: నెల రోజులుగా ఖమ్మం నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం çపగులగొట్టి ఇళ్లలో ఉన్న సొత్తును అపహరించుకుపోతున్నారు. నెల రోజుల్లో లక్షలాది రూపాయల సొత్తు దోచుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేసవికాలం కావటంతో ప్రజలు శుభకార్యాలు, విహార యాత్రలకు వెళుతుంటారు. దీన్ని అదునుగా చూసుకుని చాకచక్యంగా ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి తేలికగా దొంగతనాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వారిపై అనుమానాలు.. ఖమ్మం నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దొంగల ముఠా విడిపోయి రెక్కీ చేస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట లేదా జనం రద్దీలేని సమయంలో తాళం పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో వరుస ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. ప్రజలకు సైతం అనుమానాలు రాకుండా తమవద్ద ఉన్న వస్తువులతో తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం శబ్దం రాకుండా చోరీలు చేస్తున్నారంటే దొంగతనాలు చేయటంలో వారు ఎంత నేర్పరులో ఇట్టే అర్థమవుతుంది. బయట ప్రాంతాల నుంచి వచ్చి చోరీలకు పాల్పడే వీరు గొళ్లెం కటింగ్, గ్రిల్స్కటింగ్, హాథర్ ఓల్ ద్వారా చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభం నుంచి ముగిసేంతవరకు ఈ దొంగతనాలు చేస్తుంటారని తెలుస్తోంది. హాథర్ ఓల్ అంటే లోపలి నుంచి గొళ్లెం వేసి ఉన్న ఇంటికి తమ వద్ద వున్న హాథర్ ద్వారా ఓల్ చేసి లోపలికి జొరబడతారు. నీళ్లుపోసి ఓల్ చేస్తుంటే శబ్దం రాదని పోలీసులు పేర్కొంటున్నారు. పార్థీ, హవాయి, రాజస్థాన్ గ్యాంగ్‌లపై అనుమానాలు వరుస దొంగతనాలను బయట ప్రాంతాలకు చెందిన పార్థీ, హవాయి, రాజస్థాన్ గ్యాంగ్‌ల పనే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరంగల్‌లో ఇదే తరహాలో దొంగతనాలు జరగటంతో అక్కడ పోలీసులకు సీసీ పుటేజీ లభ్యమైంది. దొంగలు రాజస్థాన్‌కు చెందిన వారు అని తేలింది. అక్కడ నుంచి ఖమ్మం పోలీసులకు సీసీ పుటేజీలు లభించటంతో ఇక్కడ వున్న సీసీ పుటేజీలలో వారు, వీరు ఒక్కరేనేమోనని గుర్తిస్తున్నారు. కొత్తగూడెం ప్రాంతంలో సైతం అక్కడక్కడ దొంగతనాలు జరుగుతుండటంతో ఈ గ్యాంగ్ ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. వీరు ఎక్కువగా రైల్వేస్టేషన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మాత్రమే ఎంచుకుంటారు. దొంగతనం చేసిన వెంటనే గ్యాంగ్ విడిపోయి రైలు ఎక్కి వెళ్లిపోతారని తెలుస్తోంది. మొదట తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు, సరిహద్దుల్లో ఉండే ప్రాంతాల ఇళ్లను రెక్కీ నిర్వహించి ఎంచుకొంటారు. కుక్కలు ఉండే ఇళ్లకు మాత్రం వీరు చోరీలకు ఎంచుకోరు. కదలికలు తెలిసి పోతాయని దొంగతనాలు చేయరు. అదేవిధంగా వేసవి కాలంలో చల్లటి గాలి కోసం ఆరుబయట పడుకొంటారు. దీంతో ఇంటి యజమానులకు శబ్దం రాకుండా జొరబడతారు. ఒకవేళ ఇంట్లో ఎవరైనా వుంటే వారిని కొట్టి కట్టేసి దోపిడీకి పాల్పడుతుంటారు. సీసీ కెమెరాలు ఎక్కడ.. జిల్లా వ్యాప్తంగా అమర్చిన సుమారు 125 సీసీ కెమెరాలలో సగానికి పైగా పనిచేయటం లేదని విశ్వసనీయ సమాచారం. ఈదురుగాలులతో పాటు, కొన్నింటిలో సాంకేతిక లోపం తలెత్తటంతో సీసీ కెమెరాలు పనిచేయటంలేదని పోలీసులు చెబుతున్నారు. వీటిని త్వరలోనే బాగు చేయించటం జరుగుతుందని చెబుతున్నారు. సీసీ మెమెరాలు పనిచేయకపోవటం వల్ల దొంగలను పోలీసులు గుర్తించ లేకపోతున్నారు. కొరవడిన పోలీసుల పెట్రోలింగ్ నగరంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడుతున్నా పోలీసు పెట్రోలింగ్ నిఘా కొరవడటంతో దొంగలు అలుసుగా తీసుకొని చోరీలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు స్పందించటంలేదని, ప్రభుత్వం అత్యాధునిక వాహనాలు సమకూర్చినా వాటిని రోడ్లపై òపెట్టుకొని కాలక్షేపం చేయటం తప్పా పెట్రోలింగ్ చేయటం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందితో పాటు, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ఉన్నా దొంగలను మాత్రం పట్టుకోవటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయటకపోవటం కూడా దొంగలకు కలిసొస్తుందని పలువురు అంటున్నారు నేరస్తులపై సరైన అవగాహన లేకపోవటం ఇప్పుడు ఉన్న క్రైం సిబ్బందికి నేరస్తులపై సరైన అవగాహన లేకపోవటం వల్ల చోరీలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో క్రైంతో పాటు ఐడీ పార్టీలలో పనిచేసి ఇప్పుడు వేరే ప్రాంతాలలో పనిచేస్తున్నవారికి నేరస్తులు, దొంగతనాలపై అవగాహన వుండేది. ప్రసుత్తం పనిచేస్తున్న వారికి సరైన అవగాహన లేకపోవటంతో పాటు జైలు జీవితం గడిపి వచ్చేవారిపై ఆరాతీయలేకపోవటం, ప్రతిరోజూ వారి కదలికలను పసిగట్టలేకపోవడం కూడా దొంగతనాలు పెరగటానికి కారణం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పనిచేస్తున్న వారికి పక్క జిల్లాలో పనిచేసే పోలీసులతో పరిచయాలు లేకపోవటంతో దొంగల ఆచూకీ కనుక్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు వాడే అత్యాధునిక టెక్నాలజీపై చాలామంది పోలీసులకు అవగాహన లేదని తెలుస్తోంది. దీనికితోడు పై అధికారుల నుంచి సరైన హామీలు లేకపోవటంతో కష్టపడి దొంగల ఆచూకీ తెలుసుకొని పట్టుకోవడానికి వెళితే తీరా అక్కడ రక్షణ లేకపోవడంతో పాటు ఖర్చులను తమ జేబులో నుంచే పెట్టుకోవాల్సి పరిస్థితి ఎదురవుతుండటంతో చాలా మంది సిబ్బంది తమకు ఎందుకులే అని సరి పెట్టుకొంటున్నారు. జిల్లాలో 25 చోరీ కేసులు నమోదు నెల రోజుల్లో జిల్లాలో 25 కేసులు నమోదు కాగా, సుమారు 30 లక్షల రూపాయల విలువగల సొత్తును దొంగలు అపహరించుకుపోయారు. ఒక్క మే నెలలోనే ఈ కేసులు నమోదు కావటంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగతనాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన చోరీల వివరాలు ఖమ్మం టూటౌన్ ప్రాంతంలోని చైతన్యనగర్, రాపర్తినగర్ ప్రాంతంలో చోరీ చేశారు. త్రీటౌన్ ప్రాంతంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి సుమారు రూ.8 లక్షల సొత్తు ఎత్తుకెళ్లారు. వన్‌టౌన్ ప్రాంతంలో బోనకల్ క్రాస్‌రోడ్, ముస్తఫానగర్, ప్రాంతాలలో చోరీలు చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీలో వరుస చోరీలకు పాల్పడ్డారు. సత్తుపల్లి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడ్డారు. వైరా ప్రాంతంలో కూడా చోరీలు చేశారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ స్పందించి వరుసగా చోటు చేసుకొంటున్న చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. చోరీలు అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం.. వరసుగా జరుగుతున్న చోరీలు అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా వరుసగా ఎన్నికలు రావటంతో సిబ్బంది బందోబస్తులో బిజీగా ఉండటంతో దొంగలు చోరీలు చేస్తున్నారు. చోరీలను ఆరికట్టేందుకు అన్ని ప్రాంతాలలో ప్రతి రోజూ రాత్రి ఒక ఎస్ఐ, ఏఎస్ఐ అధ్వర్యంలో పెట్రోలింగ్ చేయటానికి నిర్ణయంచాం. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి బ్లూకోర్ట్ టీమ్‌తో పాటు పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరుగుతాయి. వరుసగా చోరీలు చేస్తున్న సంఘటనలో ఒకబ్యాచ్ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్ ద్వారా వారి వివరాలను సేకరిస్తున్నాం. మాకున్న సమాచారం ప్రకారం చోరీలు రెండు ముఠాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఒక బ్యాచ్ ఇక్కడది కాగా, మరొక బ్యాచ్ బయట నుంచి వచ్చారని తెలుస్తోంది. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నాం. ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్ -
వ్యక్తి దారుణ హత్య
అశ్వాపురం: అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఓ వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. మృతదేహం పూర్తిగా పాడై కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో మృతి చెందిన వ్యక్తిని ఐదు రోజుల కిందట హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల కథనంప ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇద్దరు గొర్లు, మేకల వ్యాపారులు ఐదు రోజుల కిందట అశ్వాపురం మండలం అమ్మగారిపల్లికి వచ్చారు. నాలుగు రోజుల కిందట రాత్రి ఇద్దరు కలిసి అతిగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరిలో ఒకరు హత్యకు గురయ్యారు. వారు కూర్చొని మద్యం సేవించిన ప్రాంతంలో పగిలి ఉన్న బీరు సీసా, ఒక మొద్దుపై రక్తపు మరకలు ఉన్నాయి. ఒక కర్రతో కొట్టినట్టు కర్రకు కూడా రక్తం మరకలు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి మృతదేహాన్ని ఈడ్చుకు వెళ్లి వాగులో పడేసినట్లు ఉండటంతో పోలీసులు హత్య జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇద్దరిలో మరో వ్యక్తి వెంటనే తమ ఊరు జగ్గయ్యపేట వెళ్లాడు. ఆ ఊర్లో మృతుడి బంధువులు, స్థానికులు ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావు? అతను ఏడి అని నిలదీశారు. దీంతో ఆ వ్యక్తి జగ్గయ్యపేట పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పాడు. జగ్గయ్యపేట పోలీసులు అశ్వాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అశ్వాపురం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ సిబ్బందితో ఆ వ్యక్తిని తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని, ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి పూర్తి వివరా>లు సేకరించారు. అమ్మగారిపల్లి వీఆర్ఓ కృష్ణవేణి పంచనామా నిర్వహించారు. మృతదేహానికి ఘటనా స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మృతుడిని హత్య చేసినట్టుగా భావిస్తున్నామని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అశ్వాపురం సీఐ బొల్లం రమేశ్ విలేకరులకు తెలిపారు. -
ఆరిన ఆశాదీపాలు
బూర్గంపాడు: రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది. కుటుంబ ఆశాదీపాలు ఆరిపోవటంతో ఆ రెండు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. బాగా చదువుకుని తమ కుటుంబాలకు ఆసరా అవుతారునుకున్న కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం ఆ కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు విలపిస్తున్న తీరును చూసి అందరి కళ్లు చెమర్చాయి. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆర్టీసీ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతిచెందిన ఘటన మంగళవారం బూర్గంపాడు మార్కెట్‌యార్డు వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బూర్గంపాడులోని గౌతమీపురం కాలనీకి చెందిన బర్ల బిందుకుమార్ (21), గంగపురి సాయికిరణ్(18) మంగళవారం మధ్యాహ్నం బూర్గంపాడు మెయిన్‌సెంటర్ నుంచి గౌతమిపురానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మోటార్‌సైకిల్‌పై ఉన్న బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్ అక్కడికక్కడే మృతిచెందారు. భద్రాచలం నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ ఫోన్ చేయటంతో వీరు మోటార్‌సైకిల్‌పై బూర్గంపాడు బస్టాండ్ సెంటర్‌కు వచ్చారు. అక్కడ కొద్దిసేపు స్నేహితుడితో మాట్లాడిన అనంతరం స్నేహితుడి బుల్లెట్ వాహ నం తీసుకుని గౌతమిపురం వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపక్కన మట్టి ఉండటంతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమం లో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను వెంటనే బూర్గంపాడు సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యు లు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరణంలోను వీడని స్నేహం.. బర్ల బిందుకుమార్, గంగపురి సాయికిరణ్ కులా లు వేరైనా అన్నదమ్ముల్లా్ల కలిసి మెలిసి ఉంటారు. ఒకే కాలనీకి చెందిన వీరు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులు. పాల్వంచలో బీటెక్ చదువుతున్న బర్ల బిందుకుమార్ బాగా చదివి కుటుంబానికి ఆసరాగా ఉండాలని చెబుతుండేవాడు. అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న గంగపురి సాయికిరణ్ తమ తల్లిదండ్రులకు ఒక్కడే కొడు కు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు అతడిని కష్టపడి చదివిస్తున్నారు. ఇరువురి మరణం ఆ కుటుంబాలను తీవ్ర విషాదంలో నింపింది. బర్ల వెంకటరత్నం, స్వరూపల రెండవ కుమారుడు బర్ల బిందుకుమార్. తాపీ పనులు, కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటరత్నం దంపతులు పిల్లలను చదివించేందుకు బాగా కష్టపడుతున్నారు. తమ ముగ్గురు పిల్లలు ప్రవీణ్‌కుమార్, బిందుకుమార్, వేణుచంద్లను వారు కష్టపడి చదివిస్తున్నారు. బీటెక్ చదువుతున్న బిందుకుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణణాతీతం. అదేవిధంగా గౌతమిపురం కాలనీకి చెం దిన గంగపురి చిన్నవెంకటి, చంద్రకళ దంపతుల కుమారుడు సాయికిరణ్. తమ కుమార్తె రమాదేవికి వివాహం చేసిన చిన్నవెంకటి దంపతులు తమ ఆశలన్నీ సాయికిరణ్‌పై పెట్టుకున్నారు. స్థానిక మార్కెట్ యార్డులో చిన్నవెంకటి హమాలీగా పనిచేస్తున్నాడు. చంద్రకళ స్థానికంగా కూలీ పనులు చేస్తుంది. తమ ఆశలదీపం కొడుకు సాయికిరణ్‌ను కష్టపడి చదివిస్తున్నారు. కొడుకు రోడ్డుప్రమాదంలో మరణించాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. సాయికిరణ్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంక టప్పయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపల వేటలో మత్స్యకారుడి దుర్మరణం
తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడు గ్రామంలోని ఏనెగచెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చేపల వేట చేస్తూ తెప్పపై నుంచి పడిపోయి వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చెన్నబోయిన రామకృష్ణ(38) గురువారం ఉదయం తోటి మత్స్యకారులతో కలిసి తెప్ప సహాయంతో చేపల వేట చేసేందుకు ఏనిగచెరువుకి వెళ్లాడు. వలను సరిచేసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. ఇదే క్రమంలో వలలో కాళ్లు చిక్కుకుని బయటకు వెళ్లే మార్గం లేక నీటిలో మునిగిపోయి మృతిచెందాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి మత్స్యకారులు అతడి కోసం చెరువులో గాలింపు చేపట్టగా వలలో చిక్కుకుని విగతజీవిగా మారిన రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో శవాన్ని వెలికితీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. రెక్కాడితే కానీ..డొక్కాడని రామకృష్ణకు భార్య ఎల్లమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేపల వేటకు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు ఓర వెంకటేశ్వర్లు సందర్శించి నివాళులర్పించారు. రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. సర్పంచ్ రామసహాయం హరితారెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకార్మికుడు రామకృష్ణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కిరాతక భర్తలు..
భార్యలను ప్రేమగా చూసుకోవాల్సిన ఆ భర్తలు కిరాతకంగా మారారు. ఒకరు వివాహేతర సంబంధం నెరపుతుందనే అనుమానంతో భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టి హతమార్చాడు. మరొకరు అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తుండటంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే తమ కూతురుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలు ఉభయ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నాయి.. పాల్వంచ: అనుమానం ఆమె పాలిట శాపమైంది.. భార్య వివాహేతర సంబంధం నెరుపుతుందని కక్ష పెంచుకుని కొంత కాలంగా వేధిస్తూ చివరికి ఆమెను హతమార్చిన సంఘటన పాల్వంచ మండలంలో చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్ వివరించారు. పట్టణంలోని సీతారాంపట్నం ఏరియా చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కందుకూరి శివ 15 సంవత్సరాల క్రితం భద్రాచలానికి చెందిన మేనకోడలు అరుణ (32)ను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు వారి సంసారం సాఫీగా సాగింది. సంవత్సర కాలంగా భార్య అరుణను అనుమానించడం మొదలు పెట్టాడు. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్నావంటూ వేధిస్తున్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా చేశారు. అయినా మార్పు రాలేదనే కక్షతో రగిలిపోయాడు. గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో భార్య నిద్రిస్తుండగా కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తల, ముఖం తీవ్రంగా పగిలి రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే శివ పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ మడత రమేష్, ఎస్ఐ ముత్యం రమేష్ సందర్శించారు. శివ అంబేడ్కర్ సెంటర్ వద్ద ఉన్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లి పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు, ఉన్నారు. వరకట్న వేధింపులకు మహిళ బలి కారేపల్లి: వరకట్న వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధర్మారంతండా గ్రామానికి చెందిన బారోతు మాలు కుమార్తె స్వాతిబాయి (22)కి, దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్యా శ్రీనివాస్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కాగా భర్త శ్రీనివాస్‌కు వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ స్వాతిబాయిని అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు. దీనిపై ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో గతంలో పంచాయతీలు జరిగాయి. అయినా తీరు మార్చు కోని శ్రీనివాస్ అదనపు కట్నం తీసుకురావాలని గురువారం రాత్రి గొడవ పడటంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వాతి ఇంట్లోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే హతమార్చాడు.. కుటుంబ సభ్యులు భర్తే స్వాతిని కొట్టి చంపాడని, ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతురాలి తండ్రి బారోతు మాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్ఐ కృష్ణప్రసాద్రావు కేసు నమోదు చేయగా, సింగరేణి తహసీల్దార్ సీహెచ్ స్వామి పంచనామా నిర్వహించారు. ఈ కేసు విషయమై ఖమ్మం రూరల్ ఏసీపీ రామోజీ రమేష్ దర్యాప్తు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన మెప్మా డీఎంసీ
ఖమ్మంటౌన్: ఖమ్మం జిల్లా మెప్మా డీఎంసీ(డిస్ట్రిక్ట్ మెషిన్ కోఆర్డినేటర్) మన్నేపల్లి కమలశ్రీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కింది. మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్పీ) నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం నగరంలోని మెప్మా కార్యాలయంలో తన సీటు వద్దనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గత కొన్ని సంవత్సరాలుగా డీఎంసీపై అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఆగడాలు హెచ్చుమీరడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. నగరంలోని గొల్లగూడెం శాంతి సమాఖ్య సంఘానికి చెందిన ధనలక్ష్మి రిసోర్స్ పర్సన్‌గా గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుండగా..ఆమె విద్యార్హత విషయంలో సదరు అధికారి లంచం డిమాండ్ చేయడంతో..విసిగి వేసారి ఏసీబీకి పట్టించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకు నెలకు రూ.4 వేలు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించగా..కనీస విద్యార్హత పదో తరగతి చేసింది. ఈ క్రమంలో కొందరు ఆ మేరకు సర్టిఫికెట్లు లేనివారుండగా..ధనలక్ష్మి పదో తరగతి పాస్ కాకపోవడంతో గత కొంత కాలంగా ఆర్పీగా విధుల నుంచి తొలగిస్తానంటూ డీఎంసీ బెదిరింపులకు పాల్పడుతోంది. అయితే ప్రస్తుతం పనిచేసే వారికి టెన్త్ పూర్తి చేయాడానికి కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆర్పీ ధనలక్ష్మి మరోమారు వెళ్లి డీఎంసీ కమలశ్రీని కలిసి బతిమాలడంతో రూ.50వేలు ఇవ్వాలని ఒప్పదం చేసుకున్నారు. అంత డబ్బు చెల్లించలేనని నిర్ణయించుకున్న ధనలక్ష్మి ఏసీబీ ఆధికారులను ఆశ్రయించింది. దీంతో వారి సూచనలతో గురువారం రూ.40 వేలను ముందస్తుగా తీసుకెళ్లిన ధనలక్ష్మి మరో ఆర్పీ ఉషతో కలసి వెళ్లి మెప్మా కార్యాలయంలో తన సీట్లో కూర్చొని ఉన్న డీఎంసీ కమలశ్రీకి డబ్బు అందజేశారు. అదే సమయంలో ఏసీబీ నల్లగొండ రేంజ్ ఇన్చార్జ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక దాడి నిర్వహించి..కమలశ్రీ టేబుల్ సొరుగులో ఉన్న రూ.40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె చేతివేళ్ల అచ్చులను సేకరించారు. మెప్మాలోని పలు అంశాలపై ఏసీబీ ఆధికారులు కమలశ్రీని ప్రశ్నించారు. అనంతరం ఆమెను వీడీవోస్ కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం.. మెప్మా డీఎంసీ కమలశ్రీపై ఆర్పీ ధనలక్ష్మి మాకు ఈ నెల 6న ఫిర్యాదు చేసింది. ఆర్పీ ఉద్యోగంలో కొన సాగలంటే రూ.50 వేలు చెల్లించాల్సిందేనని వేధిస్తోం దని బాధితురాలు మా వద్దకు వచ్చి సంప్రదించింది. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏవరైనా లంచం అడిగితే సమాచారం అందించండి. కమలశ్రీ 2007 నుంచి మెప్మాలో ఉద్యోగం చేస్తోంది. 12 సంవత్సరాలుగా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బినామీల పేరుతో ఆస్తులు కూడపెట్టినట్లు కూడా ఏసీబీ ఆధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల రూ.15లక్షలతో కొత్త కారును కూడా కొనుగోలు చేసిన దానిపై కూడా విచారణ జరుపుతాం. – ఆనంద్‌కుమార్, ఏసీబీ డీఎస్పీ, నల్లగొండ రేంజ్ -
వేగంగా బజారుకు తరలిపోయి..
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇతర రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటం.. రవాణా మార్గం అనుకూలంగా ఉండటం.. ఏజెంట్లు తొందరగా లభిస్తుండటంతో మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో గంజాయిని విరివిగా పండించి, దానిని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు తరలించి, ఇక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా ముంబయి, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భద్రాచలం, చర్ల ప్రాంతాల్లో గంజాయి పట్టుబడుతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుండటం విశేషం. ముఖ్యంగా విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు కావడం, అవి లేకుండా ఉండలేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోనూ మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని తెలుస్తోంది. కాగా, ఒక్కసారిగా నాడీ మండలం ఉత్తేజితమై.. సాధారణ స్థితిలో ఉండాల్సిన మెదడు అసాధారణ స్థితిలోకి మారిపోయి.. చురుగ్గా కదలాల్సిన కళ్లు అదో రకమైన మత్తులోకి జారుకొని.. దేహమంతా ఓ మైకంలోకి వెళ్లిపోయి.. మరో లోకంలో విహరించినట్లుగా ఉండే ఆ వింత అనుభవం కోసం మెట్రోపాలిటన్లలోని యువత ఎగబడుతున్న వేళ.. ఈ మత్తు పదార్థాల వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా సాగుతోందని తెలుస్తోంది. ఖమ్మంక్రైం: ఒడిశా నుంచి దిగుమతి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని దిగుమతి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గంజాయిని ప్రత్యేకంగా ప్యాకెట్లలో భద్రపరిచి, ఆ ప్యాకెట్లలోని గంజాయిని సిగరెట్ల రూపంలో లేదా కిలోల చొప్పున విక్రయిస్తుంటారు. ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీల్లో గంజాయిని సాగు చేసి విక్రయిస్తున్నారు. దానిని ఉమ్మడి జిల్లాలో ఉన్న స్మగ్లర్లు తమ కింద ఉన్న ఏజెంట్ల ద్వారా సరఫరా చేయిస్తున్నారు. పిండిప్రోలు టు ముంబయి వయా ఔరంగాబాద్.. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం నుంచి ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని కొందరు వ్యక్తులు మహారాష్ట్రలోని ముంబయి, ఔరంగాబాద్‌కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని పలు తండాల్లో నుంచి సరఫరా అవుతున్న గంజాయిని ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ముంబయికి తరలిస్తున్నారు. ఈ గంజాయిని తెచ్చి ఆరబెట్టి, ఓ ముద్దలా తయారు చేసి, మైకా కవర్లలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా కేజీ ప్యాకెట్ నుంచి 5, 10, 20 కేజీల ప్యాకెట్లను తయారు చేసి రైళ్లలో, లారీల్లో, బస్సుల్లో తరలిస్తున్నారు. కొన్ని నెలల కిందట ఖమ్మం రైల్వేస్టేషన్లో పిండిప్రోలుకు చెందిన కొందరు వ్యక్తులు గంజాయిని ఔరంగాబాద్‌కు తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని లారీలో సూర్యాపేటకు తరలిస్తుండగా ఖమ్మంరూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి ప్యాకెట్లను వేర్వేరుగా పెట్టుకుని ఒకేసారి నలుగురు, ఐదుగురు వ్యక్తులు బయలుదేరుతారు. పోలీసులు ఒకరిని పట్టుకున్న తర్వాత గంజాయి దొరికిందనుకుని, మిగతావారిని తనిఖీ చేయకుండా వదిలేస్తున్నట్లు సమాచారం. దీనిని అవకాశంగా తీసుకుంటున్న గంజాయి స్మగ్లర్లు యథేచ్ఛగా గంజాయిని ముంబయికి తరలిస్తున్నారు. ఒడిశాలో గంజాయి నాణ్యతను బట్టి కిలో రూ.1000 నుంచి రూ.400 వరకు కొనుగోలు చేస్తారు. ఇదే గంజాయి ముంబయి మార్కెట్లో కిలో రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పలుకుతుందని సమాచారం. దీంతో అక్కడికి సూర్యాపేట మీదుగా వెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఏజెంట్లు ముంబయికి వెళ్లి సరుకును విక్రయించి వచేŠచ్ వరకు వారికి సంబంధించిన ముఖ్య వ్యక్తితో ఫోన్లో సంభాషించరని తెలుస్తోంది. ఒకవేళ వారు పోలీసులకు చిక్కితే ఈ కేసును మొత్తం వారి మీదే వేసుకొని జైలుకు వెళ్లి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో తమ వెనుక ఉన్న వ్యక్తి సమాచారం వారు చెప్పరు. ఇలా వారి మధ్య ముందే ఒప్పదం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రైళ్లలో గ్యాంగ్‌ల ద్వారా.. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని అర కిలో దగ్గర నుంచి నాలుగు కిలోల వరకు ప్రత్యేకంగా ప్యాక్ చేసి గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకొని ఖమ్మంతోపాటు వరంగల్ జిల్లాలకు గంజాయిని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వైజాగ్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి గంజాయిని సరఫరా చేసేవారు ఒకరిద్దరితోకాక సుమారు 15 నుంచి 20 మంది ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒకవేళ పోలీసుల తనిఖీలో ఒకరిద్దరు పట్టుబడినా మిగతావారు వారు చేర్చాల్సిన గమ్యస్థానాలకు గంజాయిని చేరుస్తున్నారు. కాగా, రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైజాగ్ నుంచి హెరాయిన్, బ్రౌన్‌షుగర్.. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ హార్బర్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హెరాయిన్, బ్రౌన్ షుగర్ కొన్నేళ్లుగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మోతుగూడెం మండలం డొంకరాయి వద్దకు వద్దకు ఈ హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలను వైజాగ్ హార్బర్ నుంచి స్మగ్లర్లు తీసుకొని వస్తుండేవారు. అక్కడి నుంచి సరుకును చింతూరు మండలం లక్కవరం జంక్షన్‌కు తీసుకొని రాగా, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఈ వ్యాపారం చేసేవారు. హెరాయిన్‌ను ముఖ్యంగా సిగరెట్లలో పెట్టి విక్రయిస్తుంటారని, దీనికి గాను పలువురు ఏజెంట్లను నియమించుకుంటారని తెలిసింది. ఈ మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నట్లు తెలిసినా కూడా కొందరు ఎక్సైజ్, పోలీస్ శాఖ సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వదిలేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ప్రాంతం, పెవిలియన్ గ్రౌండ్ ప్రాంతంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు తెలిసింది. పలు కళాశాలల్లో కూడా కొందరు విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యారని, వారికి కొందరు ఎప్పటి నుంచో మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారని సమాచారం. పెరిగిన గంజాయి కేసులు మూడేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి కేసులు బాగా పెరిగాయి. ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతంలో గంజాయి, మత్తు పదార్థాలకు యువకులు బానిసలయ్యారని తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండటం, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దు ఉండటంతో మత్తు పదార్థాల సరఫరాకు అనుకూలంగా మారింది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో గంజాయి సాగుకు అనుకూలంగా నేలలు ఉండటం, పోలీస్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీలు సాధారణంగా ఉండటంతో ఈ జిల్లాలో గంజాయి సరఫరా ఎక్కువగా పెరిగిందని పలువురు ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. కేసుల వివరాలు.. 2017లో.. ఖమ్మంలో మూడు కేసులు నమోదు. నలుగురు అరెస్టు. 32 కేజీల గంజాయి స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు కేసులు నమోదు. 9 మంది అరెస్టు. 796 కేజీల గంజాయి స్వా«ధీనం. 3 వాహనాలు సీజ్. 2018లో.. ఖమ్మంలో ఒక కేసు నమోదు. 194 కేజీల గంజాయి స్వాధీనం. ముగ్గురు అరెస్టు. భద్రాద్రి కొత్తగూడెంలో ఏడు కేసులు నమోదు. 26 మంది అరెస్ట్. 783 కేజీల గంజాయి స్వాధీనం 2019 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఖమ్మంలో మూడు కేసులు నమోదు. ఐదుగురు అరెస్ట్. 20 కేజీల గంజాయి స్వాధీనం. ఒక వాహనం సీజ్. ద్రాద్రి కొత్తగూడెంలో ఒక కేసు నమోదు. ఒకరి అరెస్టు. 600 కేజీల గంజాయి స్వాధీనం. ఒక వాహనం సీజ్. మూడేళ్లలో పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.కోటికి పైగా ఉంటుందని ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్–1800–42525 2523, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ 94409 02277, ఎక్సైజ్ సూపరింటెండెంట్ 94409 02278, ఎక్సైజ్ సీఐ 94409 02671, కంట్రోల్ రూం 08742–224342 నంబర్లకు సమాచారం ఇవ్వాలి. రెండు జిల్లాల్లో ఎక్సైజ్, పోలీస్ శాఖల ఆ«ధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహిస్తాం. మత్తు పదార్థాలు విక్రయించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతాం. నిరంతరం తనిఖీలు కొనసాగుతాయి. అంజన్‌రావు,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
‘బై గాయ్స్’ అంటూ ఇంజనీరింగ్ విద్యార్థి మెసేజ్..
ఖమ్మంక్రైం: తమలాగే కుమారుడు కూలి పనులు చేయకూడదని ఆ తల్లిదండ్రులు బావించారు.. స్తోమతకు మించి కుమారుడిని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు.. అప్పటివరకు చదువులో రాణించిన ఆవిద్యార్థి ఒత్తిడికి గురయ్యాడో.. ఏమో తెలియదు కాని తమ బిడ్డకు 19 ఏళ్లకే నూరేళ్లు నిండుతాయని ఊహించని ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. విషాదకరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు మండలం లింగాల గ్రామానికి చెందిన అల్లు ఆశీర్వాదం, నాగమణి దంపతుల కుమారుడు పవన్ ఇంటర్ వరకు ఖమ్మంలో చదివాడు. చదువులో కొంతమేరకు రాణిస్తుండటంతో హైదరాబాద్‌లోని సీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనేపథ్యంలో అతను మానసిక ఒత్తిడికి గురయ్యాడో, మరే ఇతర కారణాలతో కాని ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం ఖమ్మంలోని ముస్తాఫానగర్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న స్నేహితుల దగ్గరకు వచ్చాడు. ఖమ్మం వచ్చిన విషయం పవన్ తల్లిదండ్రులకు తెలియదు. ముభావంగా ఉన్నావు.. ఏమిటని స్నేహితులు అడుగగా ఏమీలేదని చెప్పాడు. గురువారం రాత్రి స్నేహితులు ఉంటున్న భవనం పక్కన ఉన్న భవంతిపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు ఒకరు గదిలోనే చదువుకొంటున్నాడు. బయటకు వెళ్లిన పవన్ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని వారు ఊహించలేదు. పవన్ భవనంపై నుంచి కిందకు దూకటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కేకలు వేయటంతో గదిలో చదువుకుంటున్న స్నేహితుడు పుల్లారావు, మరికొంత మందితో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్థానిక కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు అయిన పవన్ కొద్దిసేపు బాగానే మాట్లాడాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొన్న అతడిని బతికించటానికి కిమ్స్ డాక్టర్ గంగ రాజు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ .. తాను ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయం తీసుకొన్న పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బై గాయ్స్’, ‘థ్యాంక్యూ ఫర్ గివింగ్ మి దిస్ వండర్ఫుల్ లైఫ్’ .. అంటూ స్నేహితులకు మెసేజ్ చేశాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ తన స్నేహితులకు కూడా అనుమానం కలగకుండా ఇంగ్లిష్‌లో లేఖ రాసుకుని జేబులో పెట్టుకొన్నాడు. ఆ లేఖలో తాను చదవలేకపోతున్నానని, తనను ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివించారని, తాను తన కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలిపెట్టి వెళుతున్నానని రాసుకున్న లేఖను పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే పవన్ బాగానే చదివేవాడని.. ఎందుకు ఒత్తిడికి గురయ్యాడో తెలియటంలేదని.. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడుకాదని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. పవన్ మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పవన్ తండ్రి ఆశీర్వాదం ఫిర్యాదు మేరకు వనటౌన్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. లింగాలలో విషాదచాయలు.. కల్లూరురూరల్: ఖమ్మంలో ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ ఆత్మహత్యకు పాల్పడటంతో కల్లూరు మండలం లింగాల గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న తల్లిదండ్రలు వెంటనే ఖమ్మం చేరుకుని కొనఊపిరితో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డావని అడగగా ఏమీ లేదని చెప్పి మృతి చెందాడు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. -
వీడని మిస్టరీ
ఖమ్మంక్రైం: చదువుకునేందుకు, ఉద్యోగాలు, ఇతర వృత్తుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థినులు, యువతులు, మహిళలు సాయంత్రం ఇంటికొచ్చే వరకు ఆ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు గుండెల్లో దడదడే. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీçపూర్లో అదృశ్యమైన బాలికలు, యువతుల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ప్రజల్లో వణుకుపుడుతోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు, పోలీస్స్టేషన్లలో నమోదైన చాలా కేసులకు పరిష్కారం దొరకని పరిస్థితి. తమ పిల్లలు తప్పిపోయారా.. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. ఇప్పుడు వారు ఎక్కడున్నారనే విషయాలను తెలుసుకోలేక ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ఇక వర్కింగ్ హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థినులు, యువతులకు ఎంతవరకు భద్రత ఉంది..? ప్రస్తుత పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే.. పోలీసు రికార్డులనుబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా అదృశ్యం కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చదువుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులు, యువతులు మాయమాటలు నమ్మి యువకులతో వెళ్లిన కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలిసో తెలియకో వెళ్లిన పిల్లలు ఎక్కడున్నారు.. వారి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పటికీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. మరికొందరు తమ పిల్లలు ఎక్కడున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు రూ.లక్షలు ఖర్చు పెడుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు. ఠాణా చుట్టూ ప్రదక్షిణలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డల ఆచూకీ కోసం సంబంధిత పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. కనీసం నెలలో ఐదుసార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ పిల్లల ఆచూకీ ఏమైనా లభ్యమైందా? అని అడిగి తెలుసుకుంటున్నారు. పోలీసులు దీనిపై పెదవి విరవడంతో ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చి తమ బిడ్డలను మరిచిపోలేక ఒక పక్క రోదిస్తూ.. ఎక్కడో ఒక దగ్గర ఆచూకీ లభిస్తుందేమోనని మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేసుల వివరాలిలా.. 2017–18కి సంబంధించి అదృశ్యమైన మహిళలు, యువతుల కేసులలో సగానికిపైగా పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందులో పోలీస్ శాఖ కొంతవరకు పురోగతి సాధించిందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో 2017లో 183 మంది మహిళలు అదృశ్యం కాగా.. వారిలో 170 మందిని పోలీసులు వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఇంకా మిస్టరీగా ఉన్న 13 కేసుల్లో సుమారు 16 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వారు 8 మంది ఉండగా.. మిగతా ఐదుగురు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారున్నారు. 2018లో 222 మంది అదృశ్యం కాగా.. వారిలో 178 కేసులను పోలీసులు ఛేదించారు. వీరిలో 20 మందికి పైగా 18 నుంచి 30 ఏళ్లలోపు యువతులు ఉండగా.. మిగతా వారు 30 ఏళ్లపై నుంచి 50 ఏళ్ల పై వరకు ఉన్న మహిళలు ఉన్నారు. 2019లో ఇప్పటి వరకు అదృశ్యం కేసులు నమోదు కాలేదని పోలీస్ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2019లో ఇప్పటివరకు మహిళలకు సంబంధించి 50 కేసులు నమోదయ్యాయి. వీటిలో 35 కేసులను ఛేదించగా.. 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 25 బాలికల అదృశ్యం కేసులు నమోదు కాగా.. వీటిలో 15 పరిష్కారమయ్యాయి. 10 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో యువతులు అదృశ్యమైన సంఘటనలు ఇప్పటివరకు లేవు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో మహిళలు, యువతుల అదృశ్యంపై నమోదైన అనేక కేసులను ఇప్పటికే ఛేదించాం. మహిళల అదృశ్యం జరుగుతున్న తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు నమోదైతే తక్షణమే స్పందించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తరహా కేసుల్లో అదృశ్యం కావడానికి పలు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషిస్తున్నాం. పోలీస్ శాఖ ఛేదించిన కేసుల్లో మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. అనేక సున్నితమైన అంశాలు సైతం బాలికలు, మహిళలు, యువతులు అదృశ్యం కావడంలో ప్రభావితం చేస్తున్నాయి. భవిష్యత్‌లో జిల్లాలో ఈ తరహా కేసుల్లో నిందితులుగా తేలిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. – తఫ్సీర్ ఇక్బాల్, పోలీస్ కమిషనర్, ఖమ్మం -
అంతం చూసిన వివాహేతర సంబంధం
బోనకల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని మోటమర్రి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ వేణు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చిట్టుమోదు విష్ణు భార్యతో అదే గ్రామవాసి మరీదు ఉపేంద్ర(40) గత కొంత కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం విష్ణు పోలీస్ స్టేషన్లో తన భార్యను వేధిస్తున్నాడని ఉపేంద్రపై ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా తాను బుద్ధిగా ఉంటానని చెప్పాడు. కానీ..యథావిధిగా అతను ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణు, ఉపేంద్ర వారి పొలాల వద్దకు వెళ్లారు. విష్ణు పొలంలో ఉండడాన్ని గమనించిన ఉపేంద్ర ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని పసిగట్టిన విష్ణు ఇంటికి రాగా..అప్పటికే తన ఇంట్లో భార్యతో ఉపేంద్ర ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. కల్లు గీత కత్తితో ఉపేంద్ర మెడ, కణితిపై విష్ణు దాడి చేశాడు. ఈ సంఘటనలో అక్కడిక్కడే అతను మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హత్య చేసిన తర్వాత ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్‌కు విష్ణు తన భార్యతో కలిసి వెళ్లి లొంగిపోయాడు. సీఐ వేణు మాధవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హోలీ వేడుకల్లో విషాదం
తిరుమలాయపాలెం: హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. అంతసేపు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకుని ఆనందంగా గడిపిన ఓ యువకుడు, అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని మేడిదపల్లిలో ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... మేడిదపల్లి గ్రామస్తుడు ఆమెడ మురళి(21), తన స్నేహితులైన షేక్ నజీర్, తురక నవీన్, షేక్ వహీద్‌తో కలిసి గురువారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈత కొట్టేందుకని మోటార్ సైకిళ్లపై మేడిదపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వీరు మద్యం మత్తులో ఉన్నారు. భక్త రామదాసు ప్రాజెక్ట్ కాలువలో ఎత్తిపోస్తున్న నీటి ప్రవాహం వద్దకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్నారు. ఇంతలోనే... అక్కడి సుడిగుండంలో వహిద్, నజీర్ మునిగిపోతుండడాన్ని ఆమెడ మురళి, తురక నవీన్ గమనించి అప్రమత్తమయ్యారు. వారిని గట్టిగా పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. అక్కడకు దగ్గరలోనే ఉన్న కొందరు రైతులు కూడా సాయపడ్డారు. ఈ ప్రయత్నంలో, అదే సుడి గుండంలో ఆమెడ మురళి చిక్కుకున్నాడు. ఊపిరాడక మృతిచెందాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే పెళ్లి... మేడిదపల్లి గ్రామానికి చెందిన మురళి, రెండేళ్ల క్రితమే సుబ్లేడుకు చెందిన కళ్యాణిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కొద్ది నెలలపాటు పెట్రోల్ బంకులో పనిచేశారు. వీరికి ఆరునెలల కుమారుడు ఉన్నాడు. మురళి భార్య కళ్యాణి, తల్లిదండ్రులు వెంకన్న, వెంకటమ్మ రోదన... చూపరులకు కంట తడి పెట్టించింది. -
కొన్ని గంటల్లోనే బిడ్డ పెళ్లి.. అంతలోనే...
అశ్వాపురం: కొద్ది గంటల్లో కూతురు పెళ్లి. అంతలోనే ప్రమాదం జరిగింది. ఆ తల్లి.. అనంత లోకాలకు వెళ్లిపోయింది. అశ్వాపురంలోని బుడుగుబజారులో గురువారం ఇది జరిగింది. మండలంలోని చింతార్యాల క్రాస్ రోడ్లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అశ్వాపురంలోని బుడుగుబజారుకు చెందిన కటుకూరి నాగేంద్రం(50) మృతిచెందింది. ఆమె కూతురు వివాహం, మండలంలోని మల్లెలమడుగు అబ్బాయితో మొండికుంటలోని ఫంక్షన్ హాల్లో గురువారం తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం. పెళ్లి కూతురును తీసుకుని ఆమె తల్లి నాగేంద్ర, కుటుంబీకులు, బంధువులు వేర్వేరు వాహనాలలో అశ్వాపురం నుంచి మొండికుంటకు బయల్దేరారు. మార్గమధ్యలోగల చింతిర్యాల క్రాస్ రోడ్ వద్ద నాగేంద్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. నాగేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వేరొక వాహనంలో ఉన్న పెళ్లి కూతురుకు, తన తల్లి మృతి వార్తను కుటుంబీకులు, బంధువులు తెలియనివ్వలేదు. అంతటి విషాదాన్ని దిగమింగుకుని వివాహం జరిపించారు. ఆ తరువాత కొద్ది గంటలకు ఆమెకు విషయం చెప్పారు. ఆమెతోపాటు కుటుంబీకులు, బంధువులు భోరున ఏడ్చారు. వివాహ వేడుక కళ తప్పింది. ఈ ప్రమాదంపై ఎస్సై మధు ప్రసాద్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబీకులకు అప్పగించారు. -
అనుమానంతో అంతం చేశాడు
మధిర: ఆలుమగల మధ్య అనుమానపు బీజం పడకూడదు. ఒక్కసారి పడిందంటే... మొలకెత్తుతుంది, మానువుగా మారుతుంది. అల్లకల్లోలం సృష్టిస్తుంది. అంతం చేస్తుంది. మధిర మండలం జిలుగుమాడ గ్రామంలో ఇదే జరిగింది. కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామస్తుడు కోట రాజుకు, జిలుగుమాడు గ్రామస్తురాలు వెంగళ రోజాతో 2010లో వివాహమైంది. పెళ్లి తరువాత రెండేళ్లపాటు గంపలగూడెంలోనే ఉన్నారు. ఆ తరువాత జిలుగుమాడు వచ్చారు. రోజా తల్లి వెంగళ వెంకటమ్మ ఇంట్లో ఉంటున్నారు. రాజు–రోజా దంపతులకు ఐదేళ్ల కూతురు ప్రవళిక ఉంది. పెళ్లయినప్పటి నుంచి రోజాను రాజు అనుమానిస్తున్నాడు. వారు తరచుగా గొడవ పడుతున్నారు. సుమారు పది రోజుల క్రితం, వెంకటమ్మ ఇంటి సమీపంలోనే మరో అద్దె ఇంటిలోకి ఆ దంపతులు మకాం మార్చారు. భోజనం మాత్రం వెంకటమ్మ ఇంట్లోనే చేస్తున్నారు. గురువారం రాత్రి కూడా భోజనానికి వచ్చారు. అక్కడ, ఎవరితోనో సెల్ ఫోన్లో రోజా మాట్లాడుతుండడాన్ని రాజు గమనించాడు. ఆమెను అనుమానించాడు. కోపంతో బయటకు వెళ్లాడు. వారి కుమార్తె ప్రవళిక మాత్రం అమ్మమ్మ వెంకటమ్మ ఇంట్లోనే నిద్రపోయింది. కొద్దిసేపటి తరువాత, రోజా తమ అద్దె ఇంటికి వెళ్లింది. శుక్రవారం ఉదయాన్నే ప్రవళిక, తమ ఇంటికి వెళ్లింది. మంచంపై తల్లి పడుకుని ఉంది. తండ్రి కనిపించలేదు. తల్లిని ఎంత లేపినా లేవలేదు. ఏడ్చుకుంటూ అమ్మమ్మ వెంకటమ్మ వద్దకు వెళ్లి చెప్పింది. ఆమె రోజా వద్దకు పరుగున వెళ్లింది. ఆమె శరీరంపై గాయాలున్నాయి. స్పృహలో లేదు. ఇంతలో చుట్టపక్కల వారు వచ్చారు. ఆమెను పరిశీలించారు. ఊపి ఆడడం లేదు, గుండె కొట్టుకోవడం లేదు. ప్రాణం పోయినట్టుగా నిర్థారించారు. వెంకటమ్మ పెద్ద పెట్టున రోదించింది. ‘‘నా బిడ్డను అల్లుడు అనుమానించాడు. ఆమెతో గొడవపడి, గొంతు నులిమి, పదునైన ఆయుధంతో పొడిచి చంపి పరారయ్యాడు’’ అని, మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది. టౌన్ ఎస్ఐ చంద్రమోహన్ దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఓవర్ టేక్ చేయబోయి..
పెనుబల్లి: రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక డ్రైవర్ మృతిచెందాడు. మరో డ్రైవర్‌కు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వైజాగ్ పోర్ట్ నుంచి యూరియా లోడ్‌తో సూర్యాపేట వైపు లారీ వెళుతోంది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి పవర్ ప్లాట్ ముందున్న బ్రిడ్జి వద్ద, ఎదురుగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న లారీ, మరో లారీని ఓవర్ టేక్ చేస్తూ వేగంగా వచ్చి యూరియా లోడ్ లారీని ఢీ కొంది. యూరియా లోడ్ లారీ డ్రైవర్ కట్టా రామకృష్ణ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ లారీ ముందున్న అద్దం పగిలింది. క్లీనర్ కొలిదల రాజు, క్యాబిన్ లోపలి నుంచి పగిలిన అద్దం నుంచి బయటకు ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన లారీ డ్రైవర్, క్లీనర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో స్థానికులు చేర్పించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికితరలించారు. మృతిచెందిన కట్టా రామకృష్ణది తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం చెల్లూరు గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు. యూరియా లోడ్ లారీ క్లీనర్ కొలిదల రాజు ఫిర్యాదుతో కేసును ఎస్సై తోట నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. రెండు లారీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరకగూడెం: రోడ్డు ప్రమాదంలో గ్రామీణ వైద్యుడు మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.... కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామస్తుడైన గ్రామీణ వైద్యుడు షేక్ అబ్దుల్ రహీమ్,, సహచర గ్రామీణ వైద్యుడైన గొల్లగూడెం గ్రామస్తుడు సారంగపాణి కలిసి గొల్లగూడెం నుంచి ద్విచక్ర వాహనంపై మణుగూరు వెళ్తున్నారు. కలవలనాగారం గ్రామ మూలమలుపు వద్ద వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు తీవ్ర గాయాలతో షేక్ అబ్దుల్ రహీమ్(43) రోడ్డుపై పడిపోయాడు. అక్కడికక్కడే మృతిచెందాడు. సారంగపాణికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రహీమ్‌కు భార్య షేక్ మెహబూబి, ఇద్దరు కుమార్తెలు అతహర్, ఆఫ్రీన్, ఇద్దరు కుమారులు అర్షద్, అసద్ ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ఏడూళ్ల బయ్యారం సీఐ బి.అశోక్ పరిశీలించారు. మృతుని సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సారంగపాణి పరిస్థితి విషమించినట్టు సమాచారం. -
కానోడు... కావాలనుకుని.. కట్టుకున్నోడిని చంపేసింది..
బంధం... బంధించిందని.. అనురాగం... అపహాస్యమైందని.. ఆత్మీయత... ఆవిరైందని.. అయినోడు... అదృశ్యమవాలని.. కానోడు... కావాలనుకుని.. కాళరాత్రి... కాటేసింది.. కట్టుకున్నోడు... కన్నుమూశాడు.. వైరా: ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కారణాలు ఏమైతేనేమి, వివాహ బంధం.. తనకొక ‘బంధనం’గా మారిందని, తాను ‘బందీ’నయ్యానని ఆమె భ్రమించింది. వారి మధ్యన ఒకప్పటి అనురాగం.. ఇప్పుడు అపహాస్యమైంది. ఆత్మీయత ఆవిరైంది. అయినోడిని (భర్తను) కాటికి పంపాలనుకుంది. కానోడిని (ప్రియుడిని) కావాలనుకుంది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. (కాళ)రాత్రి వేళ... ఆ ఇద్దరూ కలిసి అతడిని చంపేశారు. ఇది, గురువారం రాత్రి ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... వైరాలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్లా(30)కు, జూలూరుపాడుకు చెందిన అమీదాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సమ్రీన్(6), సమీరా(4) ఉన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలోనే షేక్ అక్బర్ ఉంటున్నాడు. ఇతడొక మెకానిక్. ఈ అక్బర్‌తో అమీదాకు కొన్నేళ్ల క్రితం పరిచయమేర్పడింది. క్రమేణా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం, ఆమె భర్త అబ్దుల్లాకు తెలిసింది. అభ్యంతరం చెప్పాడు. దీనిని ఆమె తట్టుకోలేకపోయింది. తమ మధ్య సంబంధం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు అక్బర్‌తో చెప్పింది. ఈ నెల 10వ తేదీన, ఆమె భర్త అబ్దుల్లాపై ప్రియుడు అక్బర్.. అకారణంగా దాడి చేశాడు. దీనిపై, పోలీస్ స్టేషన్లో అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తమ సంబంధానికి అబ్దుల్లా అడ్డుగా ఉన్నాడని అమీదా – అక్బర్ భావించారు, సహించలేకపోయారు. అడ్డను తొలగించాలనుకున్నారు. అబ్దుల్లాను చంపేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. గురువారం రాత్రి... అబ్దుల్లా, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్బర్ మద్యం మత్తులో అబ్దుల్లా ఇంటికి వచ్చాడు. అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆమె తన భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. దిండుతో అబ్దుల్లా మొహంపై అక్బర్ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అబ్దుల్లా మేల్కొన్నాడు. పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతడి మెడను అక్బర్ గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. కొద్దిసేపటికే, ఊపిరాడక అబ్దుల్లా ప్రాణాలొదిలాడు. అక్బర్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత, ‘‘నా భర్తకు ఏదో అయింది. కదలడం లేదు.. మెదలడం లేదు...’’, అని ఏడుస్తూ, చుట్టుపక్కల వాళ్లను అమీదా పిలిపిచింది. చంపినట్టుగా ఒప్పుకున్నారు... పోలీసులకు సమచారం వెళ్లింది. ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ ఎ.రమాకాంత్, ఎస్సై టి.నరేష్ వచ్చారు. అబ్దుల్లా గొంతుపై, శరీరంపై కమిలిన గుర్తులు కనిపించాయి. అమీదాను, స్థానికుల ను విచారించారు. అక్బర్–అమీదా మధ్య సంబం ధం బయటపడింది. అక్బర్‌ను పిలిపించారు. ఇద్దరినీ విచారించారు. ‘‘ఔను.. మేమే చంపాం’’ అని వారిద్దరూ ఒప్పుకున్నారు(ట). అబ్దులా సోదరుడు ఫరీద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు పెడితే... బతికేవాడేమో...! ‘‘తనపై అక్బర్ అకారణంగా దాడి చేశాడంటూ ఈ నెల 10న పోలీస్ స్టేషన్లో షేక్ అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తన భార్య అమీదాకు, అక్బర్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్లాకు, అక్బర్‌కు సర్దిచెప్పారు. దాడిలో అబ్దుల్లాకు గాయాలవడంతో, అక్బర్ నుంచి వెయ్యి రూపాయలను పరిహారంగా ఇప్పించి పంపించేశారు. ఆ రోజున, ఫిర్యాదు స్వీకరించి, అక్బర్‌పై చర్యలు తీసుకున్నట్టయితే... అబ్దుల్లా బతికేవాడు’’ అని, అతడి సోదరుడు, కుటుంబీకులు అంటున్నారు. ఫిర్యాదును పట్టించుకోని పోలీసుల తీరుపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆ ఇంట మిగిలింది ఆమె ఒక్కతే
చీకటి... ఏ ఇంటి ‘దీపా’న్ని ఆర్పుతుందో, ఏ కంటి ‘వెలుగు’ను కాటేస్తుందో ఎవ్వరం చెప్పలేం. మృత్యువు... ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎలా తీసుకెళుతుందో ఒక్కోసారి ఏమాత్రం ఊహించలేం. ఈ రెండూ కలిస్తే... ఘోరం జరుగుతుంది, విషాదం మిగులుతుంది, నేలకొండపల్లిలో ఇదే జరిగింది. నేలకొండపల్లి: మండల కేంద్రమైన నేలకొండపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమా దంలో ఒకే కుటుంబంలోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. తనవాళ్ల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఆమె... వారు ఇంకెప్పుడూ తిరిగి రారని, తిరిగి రాలేని లోకానికి వెళ్లారని విన్నంతనే స్పృహ కోల్పోయింది. ఏం జరిగిందంటే... నేలకొండపల్లికి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు(40), ఆయన తల్లి పాలపాటి పిచ్చమ్మ(70), కుమారులు పాలపాటి కొదండరాం(10), పాలపాటి ప్రణయ్(6) కలిసి మంగళవారం సాయంత్రం ముదిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలో శుభ కార్యానికి బైక్‌పై వెళ్లారు. ఆ వేడుక పూర్తయి, భోజనాలు చేసి, ముచ్చట్లు ముగించేసరికి అర్ధరాత్రయింది. ‘‘ఇక ‘సెలవ్’... మేము ‘వెళ్తాం’... అక్కడ ఒక్కతే (పాలపాటి వెంకటేశ్వర్లు భార్య విజయ) ఉంది. మాకోసం ఎదురుచూస్తుంటుంది...‘‘ అని, అందరితో వెంకటేశ్వర్లు చెప్పాడు. ఇంత అర్ధరాత్రి వేళ వెళ్లడం మంచిది కాదని, పొద్దున్నే వెళ్లొచ్చని బంధువులు వారించారు. పిల్లలు కూడా... ‘‘ఇంత చలిలో ఎందుకు..?’’ అన్నారు. అతడి తల్లి కూడా... ‘‘ఈ రాత్రికి ఉండిపోదామురా...’’ అంది. ఎవరు ఎంతగా చెప్పినా అతడు వినలేదు. అతడి నోటెంట ఒక్కటే మాట... ‘‘అక్కడ విజయ ఒంటరిగా ఉంది. భయపడుతుంది. మా (మన) కోసం ఎదురుచూస్తుంటుంది’’. ఈ మాట అన్నాక... ఆ ఇద్దరు పిల్లలు, అతడి తల్లి, బంధువులు ఇంకేమీ అనలేకపోయారు, ఆపలేకపోయారు. అందరికీ ‘గుడ్‌బై’ చెప్పి ఆ నలుగురూ బైక్‌పై ఆ చిమ్మచీకటిలో, వణికిస్తున్న చలిలో ఇంటికి బయల్దేరారు. వీరితోపాటు మరికొందరు బంధువులు కూడా తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ల వాహనాలు కొంచెం ముందు వెళుతున్నాయి. వాటి వెనుకగా వీళ్ల బైక్ ఉంది. ఇంకా రాలేదని... నేలకొండపల్లి – వెంకటాపురం మధ్య దూరం 10 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఎంత నెమ్మదిగా వెళ్లినా గంటలోపులోనే చేరుకోవచ్చు. కానీ, ముందు బయల్దేరిన బంధువులు గ్రామానికి చేరుకున్న గంట తరువాత కూడా పాలపాటి వెంకటేశ్వర్లు వాహనం రాలేదు. అప్పటికే, విజయలో భయాందోళన మొదలైంది. ఆ బంధువులదీ అదే పరిస్థితి. వారి మనసు కీడును శంకించింది. వెంటనే బైక్‌లపై నేలకొండపల్లి బయల్దేరారు. వాహనాల లైట్ల కాంతిలో చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్నారు. నేలకొండపల్లి సమీపంలోని చెరువు కట్ట (నక్కల తూము) వద్దకు వచ్చేసరికి... వారి గుండెలు ఒక్కసారిగా గుభేలుమన్నాయి. రోడ్డు పక్కన బైక్ పడిపోయింది. అది పూర్తిగా ధ్వంసమైంది. దానిని వెంకటేశ్వర్లుదిగా గుర్తించారు. కొంచెం దూరంలో అక్కడక్కడ విసిరేసినట్టుగా... ఆ నలుగురి మృతదేహాలు. వాళ్ల ఒంటి నిండా గాయాలు. ఆ బంధువులు ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై ఎన్.గౌతమ్ అక్కడకు చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఖమ్మం ఏసీపీ వెంకట్రావ్, కూసుమంచి సీఐ మురళి వ చ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలను తె లుసుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. గుర్తు తెలియని వాహనం ఢీకొ న్నందునే ఈ ప్రమాదం జరిగినట్టుగా అందరూ భావిస్తున్నారు. స్పృహ కోల్పోయిన విజయ... తన భర్త, ఇద్దరు పిల్లలు, అత్త... ఈ లోకాన్ని విడిచి వెళ్లారన్న వార్త చెవిన పడడంతోనే పాలపా టి వెంకటేశ్వర్లు భార్య విజయ స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఈ దుర్వార్తను బుధవారం ఉదయం వరకు ఆమెకు బంధువులు తెలియనివ్వలేదు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న తరువాత, విషయం తెలియడంతోనే దిగ్భ్రాంతితో స్పృహ కోల్పోయి పడిపోయింది. మృతదేహాలపై పడి ఆమె గుండె పగిలేలా రోదించింది. ఆ దృశ్యం... చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. ఖమ్మం నేత్ర నిధికి నేత్రాలు... పాలపాటి వెంకటేశ్వర్లు, అతడి కుమారుడు పాలపాటి కోదండరాం నేత్రాలను ఖమ్మం నేత్ర నిధికి బంధువులు ఇచ్చారు. ఖమ్మం నేత్ర నిధి కార్యదర్శి రాయపూడి అనంత పద్మనాభం సమక్షంలో నేత్రాలను వైద్య నిపుణులు సేకరించారు. పలువురు ప్రముఖుల సంతాపం నలుగురి మృతిపట్ల రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సంతాపం, విజయకు సానుభూతి తెలిపారు. పలువురి నివాళి... మృతదేహాలను ఎంపీడీఓ బి.రవికుమార్, సర్పం చ్ రాయపూడి నవీన్, ఉప సర్పంచ్ లక్కం కొండ లు, వివిధ పార్టీల నాయకులు కర్నాటి భానుప్రసాద్, జెర్రిపోతుల సత్యానారాయణ, పివి.నాగి రెడ్డి, బైరం సుందర్రావు, బీమాల శ్రీనివాసరావు సందర్శించి నివాళులర్పించారు. ఇద్దరు చిన్నారులు చదువుతున్న గౌతమ్ పాఠశాలకు యాజమాన్యం బుధవారం సెలవు ప్రకటించింది. నిండు వెలుగుల నిరుపేద కుటుంబం వీరిది నిరుపేద కుటుంబం. వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా పెయింటర్. ఆయన భార్య విజయ, తల్లి పిచ్చమ్మ... కూలీనాలీ పనులు చేస్తున్నారు. పిల్లలిద్దరూ చదువుతున్నారు. పెద్దోడు కోదండరాం– నాలుగోతరగతి. చిన్నోడు ప్రణయ్– ఎల్కేజీ. ఆర్థికంగా లేనప్పటికీ, ఉన్న దానితోనే సంతృప్తిగా, సంతోషంగా బతుకుతున్న కుటుంబం వీరిది. గత ఏడాది వరకు వీరికి స్వంత ఇల్లు కూడా లేదు. కొన్నాళ్ల కిందటే డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. ఐదుగురితో నిత్యం కళకళలాడిన ఆ ఇంటిలో ఇప్పుడు విజయ ఒక్కతే ఒంటరి పక్షిలా మిగిలింది. ఆ నలుగురి ‘చివరి’ మాటలు... ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. ‘‘ఒక్కదానివే ఉన్నావని భయపడకు’’ – భర్త వెంకటేశ్వర్లు. ‘‘అమ్మాయ్.. జాగ్రత్త. త్వరగానే వచ్చేస్తాం..’’ – అత్త పిచ్చమ్మ. ‘‘అమ్మా... బైబై...’’ – ఇద్దరు పిల్లలు. ఆ నలుగురి చివరి మాటల్లో కింది అంతరార్థం ఉందేమోనని అనిపిస్తోంది.... ‘ఇకపై ఒంటరిగా ఉండాల్సొస్తుంది. ఏమాత్రం భయపడకు’ అని, భర్త ధైర్యం చెబుతున్నాడేమో...! ‘జాగ్రత్తగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది...’ అని, అత్త దీవిస్తున్నదేమో...!! ‘అమ్మా... మేమెక్కడికీ వెళ్లలేదు. నీతోనే ఉన్నాం. రోజూ స్కూల్‌కు, బయటకు వెళ్లినప్పుడు బైబై చెబుతాముగా... ఇప్పుడూ అంతే... బైబై...’ – అని, అమ్మను ఆ పిల్లలిద్దరూ ఊరడిస్తున్నారేమో...!!! -
మాయదారి గోదారి... ముగ్గురిని మింగేసింది
బూర్గంపాడు: మూడు కుటుంబాల ఆశాదీపాలు ఆరిపోయాయి. మిత్రులతో కలసి సరదాగా బయటకు వచ్చిన ఆ ముగ్గురు యువకులను మాయదారి గోదారి మింగేసింది. వారితోపాటు వచ్చిన మరో ముగ్గురు యువకులను షాక్‌కు గురిచేసింది. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కుందురు శ్రీనివాసరెడ్డి, కారంపూడి దుర్గ శేషు, తిరుమలరెడ్డి శివారెడ్డి, గాదె విజయ్‌కుమార్‌రెడ్డి, కుందురు సతీష్‌రెడ్డి, గాదె పుల్లారెడ్డి అలియాస్ పృధ్వీరెడ్డి కలిసి శనివారం మధ్యాహ్నం బూర్గంపాడు సమీపంలోని (ఆంధ్రా ప్రాంతంలోగల) గోదావరి–కిన్నెరసాని సంగమ ప్రాంతానికి వెళ్లారు. గాదె విజయ్‌కుమార్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సరదాగా అక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు. తమ ఇళ్ల నుంచి తెచ్చిన భోజనం చేస్తున్నారు. ముందుగా భోజనం ముగించిన కుందురు శ్రీనివాసరెడ్డి (21), కారంపూడి దుర్గశేషు(24), తిరుమలరెడ్డి శివారెడ్డి (23)... సరదాగా ఈత కొడతామన్నారు. తమ సెల్ఫోన్లు, పర్సులు, దుస్తులను ఒడ్డున పెట్టి నీళ్ల లోకి దిగారు. ఒడ్డు నుంచి కొంచెం దూరం వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతూ... భయంతో ఒకరినొకరిని పట్టుకుని గట్టిగా కేకలు వేశారు. ఒడ్డున ఉన్న ఆ ముగ్గురు యువకులు పరుగు పరుగున ఒడ్డుకు వెళ్లేసరికే ఆ ముగ్గరూ మునిగిపోయారు. భయాం దోళనతో నీళ్లలోకి దిగిన ఈ ముగ్గురినీ.. అక్కడ మేకలు మేపుతున్న కాపరులు గట్టిగా వారించారు. నీటి గుండాలు ఉన్నాయని, లోపలికి వెళ్తే తిరిగి రావడం కష్టమని హెచ్చరించటంతో వెనుదిరిగారు. వెంటనే ఆ ముగ్గురి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు, కుటుంబీకులతోపాటు బూర్గంపాడు, కుక్కునూరు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మత్స్యకారులు పడవలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన ఆ ముగ్గురి యువకుల జాడ రాత్రి వరకు తెలియలేదు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతవటంతో నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో విషాదం అలుముకుంది. ఇంటి దీపాలు వీరే... కుందురు శ్రీనివాసరెడ్డి(21): సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో పర్మినెంట్ కార్మికుడిగా ఏడాదిన్నర నుంచి శిక్షణలో ఉన్నాడు. ఇతడి తండ్రి పెద్దిరెడ్డి కూడా ఐటీసీలోనే కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి తల్లిదండ్రులు పెద్దిరెడ్డి, అనసూర్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కారంపూడి దుర్గశేషు(24): కుటుంబంలో ఇతడే పెద్ద కుమారుడు. ఇతడి తండ్రి సుబ్బారావు, అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతిచెందాడు. పెద్ద కొడుకైన దుర్గశేషు పైనే కుటుంబ బాధ్యత పడింది. ఐటీసీలోని ఓ కెమికల్ సంస్థలో ఇతడు పనిచేస్తున్నాడు. ఇటీవలనే ఉద్యోగం పర్మినెంట్ అయింది. పెళ్లి కూడా కుదిరింది. మరో నెల రోజుల్లో ముహూర్తం పెట్టుకోవాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దుర్గశేషుకు తల్లి వెంకటరమణ, తమ్ముడు ఉన్నారు. తిరుమలరెడ్డి శివారెడ్డి(23): ఖమ్మంలోని ఇన్సూరెన్స్ కంపెనీలో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వరరెడ్డి, టైలర్‌గా పనిచేస్తున్నాడు. శివారెడ్డి సంపాదిస్తుండడంతో ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతోంది. నాలుగు రోజుల క్రితమే ఖమ్మం నుంచి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు మృతిచెందాడు. మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు వనపర్తి సత్యనారాయణ(53), బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేటలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమానికి వస్తున్నాడు. భద్రాచలం రోడ్‌లోని రైస్ మిల్ సమీపంలో ఇతడి వాహనాన్ని ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆగకుండా వెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.