
లక్ష్మణ్ మృతదేహం,గాయాలు చూపుతున్న తోలెం విజయ్‌కుమార్
సాక్షి, ఠికరకగూడెం(ఖమ్మం) : తాను ఇష్టపడుతున్న మహిళకు, తనకు ఆమె సోదరుడు అడ్డొస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన కరకగూడెం మండలంలో కలకలం రేపింది. ఏడూళ్ల బయ్యారం సీఐ రమేష్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని కౌలూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు అదే గ్రామానికి చెందిన పర్శిక అర్జున్ వరుసకు బావ అవుతాడు. ఆమె సోదరుడు మలకం లక్ష్మణ్(35) పినపాక మండలం ఉలవచెలక గ్రామంలో నివాసం ఉంటాడు. లక్ష్మణ్ అప్పుడప్పుడు తన సోదరి ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. ఇది ఇష్టంలేని అర్జున్ లక్ష్మణ్‌పై పగ పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం సోదరి ఇంటికి తన మిత్రుడు అదే మండలం చినరాజుపేట గ్రామానికి చెందిన తోలెం విజయ్‌కుమార్‌తో కలిసి వచ్చాడు. భోజనం చేసి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో కాపు కాసుకుని ఉన్న అర్జున్ కత్తితో.. లక్ష్మణ్, అతని స్నేహితుడిపై దాడి చేసి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు స్థానికులు వారిని రాయనపేట వరకు ఆటోలో తరలించి, అక్కడి నుంచి 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన లక్ష్మణ్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య మలకం రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఘటనలో గాయపడిన విజయ్‌కుమార్ చికిత్స పొందుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment