కుమారి, పిల్లల మృతిపై వీడిన మిస్టరీ.. నర్సు సోనీతో కలిసి ప్రవీణ్‌.. | Suspense Behind The Khammam Car Accident Case Was Resolved, More Details Inside | Sakshi
Sakshi News home page

కుమారి, పిల్లల మృతిపై వీడిన మిస్టరీ.. నర్సు సోనీతో కలిసి ప్రవీణ్‌..

Published Sun, Jul 14 2024 6:25 PM | Last Updated on Sun, Jul 14 2024 7:09 PM

Suspense Over On Khammam Car Accident Case

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని రఘునాపాలెం మండలం హర్యా తండా వద్ద జరిగిన కారు ప్రమాదంపై మిస్టరీ వీడింది. భర్తే.. భార్య, పిల్లలను చంపి కారు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. మరో యువతితో వివాహేతర సంబంధం కారణంగానే వారి ప్లాన్‌ ప్రకారం హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు(భర్త)ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు.

కాగా, ఈ ఘటనపై ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ‘మే 28వ తేదీన ఓ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిథ, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ప్రమాదానికి గురైన కారులో ఓ ఇంజెక్షన్ సిరంజీని గుర్తించాం. నిందితుడు ప్రవీణ్(భర్త) ఇంజెక్షన్ ఇచ్చిన  తర్వాత చనిపోయిన శరీరంలో ఉంటుందా? ఉండదా? అని గూగుల్ సెర్చ్ చేశాడు.

హైదరాబాద్‌ జర్మన్ టైన్ అనే ఆసుపత్రిలో ప్రవీణ్‌ పని చేస్తున్నాడు. అక్కడ సోనీ అనే నర్సుతో ప్రవీణ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్న భార్య కుమారిని చంపేయాలని అనుకుని కాల్షియం ఇంజెక్షన్‌తో పాటు అనస్థీషియా ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు. పోస్ట్ మార్టం రిపోర్టులో మణికట్టు దగ్గర ఒక మార్కు ఉంది అది మ్యాచ్ అయ్యింది.

పిల్లల నోరు, ముక్కు మూసి వేసి హత్య చేశాడు. అర్ధగంట అక్కడే టైమ్ పాస్ చేసి, ఆ తర్వాత హరియా తండా వద్ద ఆక్సిడెంట్ అయినట్లుగా చిత్రీకరించాడు. ఈ మర్డర్‌ కేసులో నర్సు సోనీ కూడా హత్యకు ప్రేరేపించినట్టు గుర్తించాం. సోనిపై కూడా కేసు నమోదు చేశాం. త్వరలో ఆమెను కూడా అరెస్ట్‌ చేస్తాం’ అని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement