
సాక్షి, ఖమ్మం: జిల్లాలో వేకువ ఝామునే ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలు, ఆమె ఇద్దరు మనవరాళ్లు దారుణ హత్యకు గురయ్యారు. ఆ వృద్ధురాలి తనయుడు కనిపించకుండా పోవడంతో అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం జరిగింది. పిట్టల పిచ్చమ్మ(60), ఆమె మనవరాళ్లు నీరజ(10), ఝాన్సీ(6)లు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు చిన్నారుల తండ్రి వెంకటేశ్వర్లే ఈ హత్యలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండేళ్ల కిందట ఆ చిన్నారుల తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అయితే ఆమెను కూడా భర్తే వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని పోలీసులు వద్ద స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు యత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment