‘హ్యాపీ’ బాధితుల ఆందోళన | 'Happy' victims Agitation | Sakshi
Sakshi News home page

‘హ్యాపీ’ బాధితుల ఆందోళన

Jul 28 2018 11:05 AM | Updated on Jul 28 2018 11:05 AM

'Happy' victims Agitation - Sakshi

సొసైటీ కార్యాలయం వద్ద పాస్‌ పుస్తకాలతో బాధితులు   

తల్లాడ ఖమ్మం : హ్యాపీ ఫ్యూచర్‌ మల్టీపర్పస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ బాధితులు శుక్రవారం తల్లాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూతపడిన తల్లాడ బ్రాంచి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత డిసెంబరు నెలలో తల్లాడ, కల్లూరులో ‘హ్యాపీ’ సొసైటీ బ్రాంచీలు ఏర్పాటయ్యాయి. తమ సంస్థకు ప్రభుత్వ గుర్తింపు (రిజిస్ట్రేషన్‌) ఉందని అక్కడి ఉద్యోగులు చెప్పారు.

తమ  సంస్థలో 90 రోజులపాటు ఆర్‌డీ కడితే ఆ తర్వాత రెట్టింపు మొత్తాన్ని లోనుగా ఇస్తామన్నారని చెప్పారు. వారం క్రితం తల్లాడ బ్రాంచి మూతపడడంతో తామంతా మోసపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement