thallada
-
విషాదం: బట్టల దండెమే మృత్యుపాశమై..
సాక్షి, తల్లాడ: వానజల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసుకొచ్చి ఇంట్లో దండెంపై వేస్తుండగా.. ఇనుప తీగకు కరెంట్ ప్రసారమై..తల్లి, ఆమెను రక్షించే ప్రయత్నంలో కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బిల్లుపాడులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..డీబీ కాలనీకీ చెందిన షేక్ నసీమూన్(44) వ్యవసాయ కూలీ. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికొచ్చాక వాన జల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసి ఇంట్లోని జీ వైరు తీగపై వేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సర్వీసు వైరు పక్కనే ఉండడంతో దీని నుంచి దండేనికి కరెంట్ ప్రసారమై షాక్‌కు గురైంది. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి ఈక్రమంలో కిందపడినప్పుడు మట్టికుండకు తగిలి అది పగిలి నీళ్లు నేలపై పరుచుకున్నాయి. తల్లి కేక విని పెద్ద కుమారుడు, సుతారి పనిచేసే షేక్ సైదా(24) వచ్చి ఆమెను రక్షించేందుకు పట్టుకోగా..అతడికీ కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 15 సంవత్సరాల క్రితమే నసీమూన్ భర్త యాకుబ్, ఇప్పుడు పెద్ద కొడుకు దుర్మరణం చెందారు. ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుమారుడు, మరో కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబంలో తీవ్ర దుర్ఘటనతో బిల్లుపాడులో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని వైరా సీఐ జే.వసంత్‌కుమార్, తల్లాడ ఎస్ఐ జి.నరేష్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. -
తలకొరివి పెట్టిన కూతుళ్లు
తల్లాడ/ఖమ్మం: మండల పరిధిలోని రంగంబంజర ఘటనలో మృతి చెందిన దంపతులకు ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన మాట వినలేదని, అమెరికా వెళ్లొద్దని జగడం పెట్టుకుని ఈ నెల 3వ తేదీ తెల్లవారు జామున తన భార్య విజయలక్ష్మిని నరికి చంపి, సంక్రాంతి సుబ్రమణ్యేశ్వర్‌రావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దంపతులిద్దరూ చిన్న కుమార్తె సునీత దగ్గరకు అమెరికా వెళ్లే విషయంలో ఏకాభిప్రాయం కుదరక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. చిన్న కూతురు సునీత వచ్చే వరకు మృతదేహాలను ఖమ్మం మమత ఆసుపత్రిలో భద్రపర్చారు. ఆదివారం ఆమె రంగంబంజర చేరుకోవడంతో మృతదేహాలను ఖమ్మం నుంచి స్వగృహానికి అంబులెన్స్‌లో తరలించారు. పెద్ద కుమార్తె సరిత తండ్రికి తలకొరివి పెట్టగా, చిన్న కుమార్తె సునీత తల్లి విజయలక్ష్మికి తల కొరివి పెట్టారు. కూతుళ్లు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి : (అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త) (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య) -
భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య
సాక్షి, ఖమ్మం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను పాశవికంగా హతమార్చిన ఓ వ్యక్తి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తల్లాడ మండలం రంగం బంజర్‌కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు(65), విజయలక్ష్మి(60) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కుమార్తె ఫారిన్లో ఉండగా.. మరొకరు రామగుండంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర రావు, విజయలక్ష్మి మాత్రం సొంత ఊరిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర రావు విజయలక్ష్మిని కత్తితో నరికి చంపేశాడు. అనంతరం తాను సైతం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా భార్యాభర్తల అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా దంపతులు విగతజీవులుగా కనిపించారు. విజయలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండగా, సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆమె మృతదేహంతో పక్కనే అచేతనంగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమా లేదా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా సుబ్రహ్మణ్యేశ్వర రావు చర్యతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కూతుళ్లు ఇద్దరూ ప్రయోజకులై జీవితాల్లో స్థిరపడ్డారని, కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రులు లేని వారయ్యారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, ఖమ్మం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్ ఇరుక్కుపోయాడు. ప్రమాదం గమనించిన దగ్గరలోని గ్రామస్తులు అక్కడకు చేరుకొని డ్రైవర్ని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థిత కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
ఎన్టీఆర్ నగర్లో కార్డన్ సెర్చ్
తల్లాడ : వైరా ఏసీపీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లోని 80 మంది పోలీసులు తల్లాడ సమీపంలోని ఎన్టీఆర్ నగర్లో మంగళవారం వేకువజామున కార్డన్ సెర్చ్ చేశారు. ప్రతి ఇంటిలోని సభ్యుల ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ చేసి పత్రాలు లేని 20 బైక్‌లు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్నగర్.. ప్రభుత్వ స్థలంలో నిర్మించిందని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, వారి ఇళ్లకు ఎవరు వచ్చి పోతున్నారో పరిశీలించాలన్నారు. అపరిచితులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలా సమాచారం ఇవ్వటం వల్ల నేరస్తులను గుర్తించ వచ్చన్నారు. కార్యక్రమంలో సీఐ నాయుడు మల్లయ్యస్వామి, మధిర సీఐ శ్రీధర్, తల్లాడ, వైరా, చింతకాని, కొణిజర్ల, మధిర టౌన్, బోనకల్లు ఎస్ఐలు మేడా ప్రసాద్, టి.నరేష్, మొగిలి, ఎస్.సురేష్, తిరుపతరెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ ఖమ్మం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, వారి పాలిట శాపంగా మారిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు అన్నారు. శుక్రవారం ఏఐటీయూ సీ బస్సు ప్రచార యాత్ర ఏన్కూరు మీదుగా తల్లాడ చేరుకుంది. ఈ సందర్భంగా బీజీ.క్లెమెంట్ అధ్యక్షతన రింగ్సెంటర్లో జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్ చట్టాన్ని మారుస్తూ భవిషత్తులో పర్మినెంట్ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకుండా పైర్ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ శాశ్వత ఉద్యో గులు లేకుండా చర్యలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. బంగారు తెలంగాణ సాధి స్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికి వాగ్ధానాలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆయన హె చ్చరించారు. ఈ సందర్భంగా తల్లాడలో కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్.కరుణకుమారి, సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటీయూసీ డివిజన్ నాయుకులు నిమ్మటూ రి రామక్రిష్ణ, నల్లమోతు నరసింహరావు, టీ.వెంకటేశ్వర్రావు, తాళ్లూరి లక్ష్మీ, సుభద్ర, జయమ్మ, జే.వెంకటలక్ష్మీ, ఎం.పద్మ,సీత, కొల్లి నాగభూషణం, ఇనుపనూరి క్రిష్ణ పాల్గొన్నారు. -
కరాటేలో ‘యూనివర్సల్’కు పతకాలు
తల్లాడ ఖమ్మం : వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6న జరిగిన రాష్ట్ర స్థాయి షోటోకాన్ కరాటే చాంపియన్ షిఫ్‌లో స్థానిక యూనివర్సల్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారు. గురు షోటోకాన్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీల్లో స్పారింగ్ విభాగంలో జే.విజయ్, డి.నవీణ్, ఎన్.తరుణ్, బి.అయ్యప్ప, డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుపొందారు. నాగ చైతన్య, బి.కల్యాణి, డి.వరుణ్, కిషోర్, ప్రజ్ఞాన్, ఆదిత్య ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. కటాస్ విభాగంలో డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. కె.మణికంఠ, జే.ముఖేష్, ఎన్.రామ్‌చరణ్, డి.త్రినాగ్రెడ్డి, ప్రజ్ఞాన్ ఆదిత్య, బి.రేవంత్, జే.ఉపేందర్ ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను సాధించారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీ.కే.ప్రసన్నన్, డైరెక్టర్ టీ.కే.మేరిసోఫియా, ప్రిన్సిపాల్ జి.రవికాంత్, రాము, ప్రసాద్, యోహాన్, యాకోబు అభినందించారు. -
‘హ్యాపీ’ బాధితుల ఆందోళన
తల్లాడ ఖమ్మం : హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బాధితులు శుక్రవారం తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూతపడిన తల్లాడ బ్రాంచి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత డిసెంబరు నెలలో తల్లాడ, కల్లూరులో ‘హ్యాపీ’ సొసైటీ బ్రాంచీలు ఏర్పాటయ్యాయి. తమ సంస్థకు ప్రభుత్వ గుర్తింపు (రిజిస్ట్రేషన్) ఉందని అక్కడి ఉద్యోగులు చెప్పారు. తమ సంస్థలో 90 రోజులపాటు ఆర్డీ కడితే ఆ తర్వాత రెట్టింపు మొత్తాన్ని లోనుగా ఇస్తామన్నారని చెప్పారు. వారం క్రితం తల్లాడ బ్రాంచి మూతపడడంతో తామంతా మోసపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు. -
స్టాఫ్‌నర్సు కళావతిపై చర్యలు తీసుకోవాలి
తల్లాడ : స్టాఫ్‌నర్సు కళావతిని సస్పెండ్ చేయాలని, శిశువు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లాడ పీహెచ్సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మార్తిని పద్మ డెలివరీ అయిన తర్వాత శిశువు మృతి చెందటంతో ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వారికి రైతు సంఘం, కుర్నవల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు. శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి లేకుండా డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు కళావతిని సస్పెండ్ చేయాలన్నారు. 24 గంటలు డాక్టరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డాక్టరు ఉండి వెళ్లటం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూ టీ డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డాక్టర్లు వి. రాజ్‌కుమార్, కె.శ్రీనులతో చర్చించారు. 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు ఉండేలా నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, చల్లా నాగేశ్వరరావు, గంటల వెంకటాచారి, ఐనాల రామలింగేశ్వరరావు, కందికొండ నర్సిరెడ్డి, దగ్గుల ముత్తారెడి, జక్కుల రాములు, నెర్సుల తిరుపతిరావు, ఎల్లమ్మ, సావి త్రి పాల్గొన్నారు. -
విరిగి పడితే ప్రమాదమే!
సత్తుపల్లి : ఖమ్మం–సత్తుపల్లి వరకు రాష్ట్రీయ రహ దారి పక్కన వందల సంఖ్యలో పెద్దపెద్ద వృక్షాలు ఎండిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి గాలిదుమారానికే విరిగి పడే పరిస్థితిలో ఆ చెట్లు ఉన్నాయి. అసలే వర్షాకాలం అయి నందున ఎప్పుడు చెట్లు పడిపోతాయోనని ప్రయా ణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు విరిగిపడిన చెట్లతో గంటల తరబడి ట్రాఫి క్ జామ్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిపై గంటకు 500లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపాటి అంతరా యం కలిగిన ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. గత వారంలో వైరా బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ కావడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలు...: ∙తనికెళ్ల వద్ద ఎండిపోయిన చెట్లు విరగటానికి సిద్ధంగా ఉన్నాయి.. ∙వైరా శివారులోని పాఠశాల వద్ద చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙తల్లాడ–పినపాక సమీపంలో చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙తల్లాడ మండలం మిట్టపల్లి శివారులోని చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కల్లూరు–హనుమన్తండా–కొత్తనారాయణపురం గ్రామాల మధ్య చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద చెట్లు ఎండిపోయిన ఉన్నాయి. ∙వి.ఎం.బంజరు శివారులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙పెనుబల్లి మండాలపాడులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ∙కొత్తలంకపల్లి–కిష్టారం మధ్యలో చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఈ విషయమై ఆర్అండ్బీ ఈఈ హేమలతను వివరణ కోరగా ఎండిపోయిన చెట్లను తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగిస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు. -
ఆస్తి అమ్మైనా అప్పు తీర్చేస్తా..
తల్లాడ: తన కుమారుడు రైతుల వద్ద నుంచి మిర్చిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టినందువల్ల కోల్డ్ స్టోరేజీల్లో ఉన్న మిర్చిని విక్రయించి రైతులకు పంపిణీ చేస్తానని, మిగిలిన పైకం కూడా తన ఆస్తులను అమ్మైనా చెల్లిస్తానని అఖిల పక్షానికి జలంధర్ తండ్రి ఎస్బీ ప్రసాద్ హామీ పత్రం రాసి ఇచ్చారు. తల్లాడ శ్రీరామా, శ్రీ కృష్ణ కోల్డ్ స్టోరేజ్‌ల్లో కొంత మిర్చి తన కుమారుడు ఉంచాడని, అది విక్రయించగా మిగిలిన సొమ్మును తన స్తోమత మేరకు చెల్లిస్తానన్నారు. గత నాలుగు రోజులుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో ఐపీ వ్యాపారి జలంధర్ కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో వ్యాపారి తండ్రి దిగి వచ్చి అఖిల పక్షానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, బాధిత రైతులు గద్దె అశోక్, కొండల్రావు, కోయిన్ని వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వరరావు, పడాల లక్ష్మయ్య, నాగేంద్రబాబు, గొడుగునూరి లక్ష్మారెడ్డి, యరమల నాగార్జున్‌రెడ్డి, వేమిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రెడ్డెం రామకృష్ణ, కుప్పాల రామకోటయ్య, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జలంధర్ దిష్టిబొమ్మ దహనం
తల్లాడ ఖమ్మం : రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి ఐపీ పెట్టిన వ్యాపారి పెరంబుదూరు జలంధర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. స్థానిక జలంధర్ ఇంటి వద్ద నుంచి ప్రదర్శనగా బయలు దేరి రైతులు, రైతు సంఘం నాయకులు బస్టాండ్ సెంటర్లో దిష్టిబొమ్మన తగులబెట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, తాతా భాస్కర్‌రావు మాట్లాడారు. రూ.2.5 కోట్లకు ఐపీ పెట్టి రైతుల నోట్లో మన్ను కొట్టిన మిర్చి వ్యాపారిని అరెస్ట్ చేసి ఆయన ఆస్తులను వేలం వేసి రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జలంధర్‌ను అరెస్ట్ చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. జలంధర్‌ను ర ప్పించి రైతుల సమక్షంలో చర్చించి ఎవరికెన్ని డబ్బులు ఇవ్వాలో మొత్తం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో రోజు జలంధర్ ఇంటి వద్ద రైతులు, రైతు సంఘం నాయకులు, అఖిల పక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం అఖిలపక్షం, రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యాపారి ఇంటి ఎదుట రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాధిత రైతుల పోరాట కమిటీ కన్వీనర్ గుంటుపల్లి వెంకటయ్య, రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, బీజేపీ నాయకులు ఆపతి వెంకటరామారావు, కాంగ్రెస్ నాయకులు కాపా రామారావు, దగ్గుల రఘుపతిరెడ్డి, గోవింద్ శ్రీను, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, దర్మసోత్ ధశరధ్‌నాయక్, భూక్యా అంజయ్య, మహిళా సంఘం నాయకురాలు శీలం ఫకీరమ్మ, భాదిత రైతులు పాల్గొన్నారు. -
మిర్చి వ్యాపారిని అరెస్ట్ చేయాలని నిరాహార దీక్షలు
తల్లాడ ఖమ్మం జిల్లా : రైతులను మోసం చేసి ఐపీ పెట్టిన మిర్చి వ్యాపారి జలంధర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తల్లాడలో మిర్చి వ్యాపారి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చి వ్యాపారిని రప్పించి రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రైతు సంఘం జిల్లా నాయుకులు మాదినేని రమేష్ ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలకు వైఎస్ఆర్ సీపీ మండల కమిటీ, టీడీపీ మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో తెలంగాణా రైతు సంఘం నాయుకులు తాతా భాస్కర్‌రావు, గుంటుపల్లి వెంకటయ్య, శీలం సత్యనారాయణ రెడ్డి, భాదిత రైతులు గద్దె అశోక్, డి.కొండల్రావు, వేల్పుల యాకోబు, కె.వీరభద్రయ్య, సాయిన్ని వెంకటేశ్వర్లు, మట్టా నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఐపీ’ పెట్టిన వ్యాపారి ఇంటి ఎదుట రైతుల వంటావార్పు
తల్లాడ ఖమ్మం : ఐపీ పెట్టి, తమ నోట్లో మన్ను కొట్టాడంటూ మిర్చి వ్యాపారి జలంధర్ ఇంటి ఎదుట బాధిత రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘం ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. తల్లాడకు చెందిన జలంధర్, 114 మంది రైతుల నుంచి మిర్చిని కొన్నాడు. వారికి దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సుంది. డబ్బు చెల్లించేందుకు వాయిదాలు పెట్టాడు. నెలలతరబడి ఆ రైతులు తన చుట్టూ తిప్పించుకున్నాడు. చివరికి, రెండున్నరకోట్ల రూపాయలకు కోర్టులో ఐపీ దాఖలు చేశాడు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండుతో బాధిత రైతు లంతా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ వ్యాపారి ఇంటి ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు నిర్వహించారు. వర్షం వస్తున్నప్పటికీ లెక్కచేయలేదు. రైతు సం«ఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, సూరంపల్లి గోపాల్‌రావు, నల్లమోతు మోహన్‌రావు, ఐనాల రామలింగేశ్వర్రావు, తమ్మిశెట్టి శ్రీను పాల్గొన్నారు. బాధిత రైతు తల్లి హఠాన్మరణం తల్లాడ : మిర్చి వ్యాపారి జలంధర్ బాధితుడైన ఓ రైతు తల్లి, సోమవారం గుండెపోటుతో మృతిచెందింది. మిర్చి రైతు గొడుగునూరి లక్ష్మీరెడ్డి తల్లి వెంకట్రావమ్మ(65), తన కుమారుడికి జరిగిన మోసాని తల్చుకుని కొన్నాళ్లుగా కుమిలిపోతోంది. ఇతడికి ఆ వ్యాపారి దాదాపుగా నాలుగులక్షల రూపాయలు ఇవ్వాల్సుంది. ఆ వ్యాపారి ఐపీ పెట్టాడన్న వార్త విన్నప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో బాధపడుతోంది. సోమవారం తెల్లవారుజామున గుండె పోటుతో తన ఇంటిలోనే కన్నుమూసింది. మృతదేహాన్ని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. -
తుమ్మలకు వినతిపత్రం అందించిన సాక్షి ఈడీ..
తల్లాడ ఖమ్మం : పేద, స్థానిక విద్యార్థుల సౌలభ్యం కోసం తల్లాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని..ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు గురు వారం మంత్రులకు విన్నవించారు. దశాబ్దాల క్రితం ఇక్కడ చదువుకుని..వివిధ హోదాల్లో, తీరొక్క ప్రాంతాల్లో ఉంటున్న వారంతా..ఈ ప్రాంత విద్యార్థుల బాగు కోసం ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కొండభట్ల రామచంద్రమూర్తితో పాటు..జెడ్పీటీసీ సభ్యుడు మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి, కొండుభట్ల రాధాకృష్ణమూర్తి, డాక్టర్ వేమిశెట్టి ఉపేందర్‌రావు, బాజోజు శేషభూషణం, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, గుం టుపల్లి వెంకటయ్యలు అంతా కలిసి హైదరాబాద్‌లో ఇద్దరు మంత్రులను కలిశారు. సమస్య తీవ్రతను వివరించారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. -
తెలంగాణలో పాగా వేస్తాం
ఖమ్మంమామిళ్లగూడెం : కర్నాటక రాష్ట్రంలో బీజేపీ కచ్చితంగా గెలిచితీరుతుందని, అదే ఊపుతో తెలంగాణలోనూ పాగా వేస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. సోమవారం ఖమ్మం హర్షా హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర పథకాలు గ్రామీణ స్థాయి వరకు చేరేలా ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుంటూనే..తిరిగి బురదజల్లేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోటీ చేసినా గతంలో విఫలమయ్యారన్నారు. స్వామినాథన్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందించాలని అన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. మతపరమైన రిజర్వేషన్‌ను సీఎం కేసీఆర్ రాజకీయ ఎజెండాగా చేశారని విమర్శించారు. రైతుల బాధలు పట్టవా..? తల్లాడ : రైతుల బాధలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యగా రైతు బంధు చెక్కులను అందిస్తోందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని బీజేపీ నేత, పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ అన్నారు. తల్లాడ మండలం మల్లవరం సమీపంలో సోమవారం మార్కెట్ కమిటీ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మొక్కజొన్న బస్తాలు వందలాదిగా నిల్వ ఉన్నాయని, వారం రోజులుగా రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తున్నా కాంటాలు వేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో మునుపెన్నడూ లేదని, కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. రైతులు మధ్య దళారుల బారిన పడకుండా ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. రూ.1425 ప్రభుత్వ ధర ఉంటే దళారులు రూ.1100కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేవలం హైదరాబాద్ ప్రగతి భవన్లో కూర్చుంటే, హెలికాప్టర్లో తిరిగితే రైతు సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు తమ భాదలను దత్తాత్రేయకు విన్నవించారు. అనంతరం తల్లాడలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు సన్నే ఉధయ్‌ప్రతాప్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నాయుకులు నంబూరి రామలింగేశ్వర్రావు, ఆపతి వెంకటరామారావు, తేజావత్ బాలాజీ నాయక్, గల్లా సత్యనారాయణ, కోటమైసమ్మ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు నంబూరి కనకదుర్గ, మహిళా మోర్చా అధ్యక్షురాలు కొలిపాక శ్రీదేవి, ఉప్పల శారద పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన గాలిదుమారం
జూలూరుపాడు : గాలిదుమారం.. ఒకరి ప్రాణాన్ని బలిగొంది. జూలూరుపాడులో గాలిదుమారం కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది, డ్రైవర్ మృతిచెందాడు. ఒకరికి గాయాలయ్యాయి. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాగం మురళి(25), తన ఆటోలో తల్లాడకు చెందిన వ్యాపారి అనమోలు సర్వేశ్వరరావును ఎక్కించుకుని తల్లాడ నుంచి జూలూరుపాడు వస్తున్నాడు. జూలూరుపాడులోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరం సమీపంలోకి రాగానే ఉధృతంగా గాలి దుమారం మొదలైంది. ఆ ఆటో ఒక్కసారిగా గాలిలోకి లేచింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కకు పడిపోయింది. రోడ్డు పక్కనున్న సిమెంట్ స్తంభాన్ని మురళి తల ఢీకొంది. అతడిని స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళి అప్పటికే మృతిచెందినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. ఇతడు అవివాహితుడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యాపారి సర్వేశ్వరరావును ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. -
యువకుడికి ఐదేళ్ల జైలు
తల్లాడ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, ఆమె మరణానికి కారణమైన యువకుడికి ఐదేళ్ల శిక్ష విధిస్తూ సత్తుపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ మారుతీదేవి సోమవారం తీర్పు చెప్పారు. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దుద్దుకూరి చందర్రావు.. చప్పిడి రేణుకను ప్రేమ పేరుతో మోసం చేసి వేరే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె మృతి చెందగా 2014లో కేసు నమోదైంది. విచారణ అనంతరం ఐదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధించారు -
420 గురుస్వామి..!
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది. దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు. ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
తల్లాడ: మండలంలోని మల్లవరంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దుగ్గిదేవర అనూష(25), భర్త నరసింహారావు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనూష తండ్రి శెట్టిపల్లి క్రిష్ణయ్య, కొన్ని రోజుల క్రితం ఇద్దరికి సర్దిచెప్పాడు. అయినప్పటికీ గొడవలు సద్దుమణగలేదు. బుధవారం ఉదయం తన కుమారుడిని, కుమార్తెను తల్లాడలోని బాలభారతి పాఠశాలకు పంపించి ఇంటికి వెళ్లింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో అక్కడకక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో డ్రైవర్..పోలీస్ బస్సు బోల్తా
తల్లాడ: మండల పరిదిలోని లక్ష్మీనగర్ సమీపంలో సోమవారం పోలీస్ మినీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో ఐదుగురు పోలీస్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్న మినీబస్సు అతి వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీ కొట్టి, బోల్తా పడింది. ఎదురుగా లోయలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీస్ ఏఓ సీహెచ్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ సువర్ణబాబు, జూనియర్ అసిస్టెంట్లు పి.రాములు, ఎస్కె.అబ్బాస్, ఎండీ.ఫయాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐ మల్లయ్య స్వామి సందర్శించారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో మినీ బస్సును రోడ్డు మీద నుంచి పక్కకు తీశారు. డ్రైవర్ ఎం.జ్ఞాన సుందర్ రావు మద్యం మత్తులో ఉన్నాడని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తేలినట్లు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తల్లాడ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా ఏసీపీ ప్రసన్నకుమార్ -
సోదరుడి వరసయ్యే వ్యక్తే..
తల్లాడ (ఖమ్మం) : సోదరుడి వరసయ్యే వ్యక్తే ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాధితురాలు మనోవేదనతో పదో తరగతి పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థినిని.. అదే వీధిలోని సొంత పెదనాన్న కొడుకు, ఆటో డ్రైవర్ జుంజునూరి రాజేష్ తన తల్లిదండ్రులు ఊరికి వెళ్లినప్పుడు చెల్లెలిని ఇంట్లో పనులు చేయాలని పిలిచేవాడు. రెండు నెలల నుంచి లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. భయపడి ఆమె ఎవరికీ చెప్పకుండా మిన్నకుంది. దీనిని ఆసరా చేసుకున్న రాజేష్ పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. అయితే రాజేష్‌ను అతడి తల్లిదండ్రులను వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలసి తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రాజేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన ట్లు ఎస్సై ఆర్.భానుప్రకాష్ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే ఐదు పరీక్షలు రాసిన విద్యార్థిని సాంఘిక శాస్త్రం మొదటి పేపర్ రాయకుండానే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. -
డెంగ్యూతో వ్యక్తి మృతి
ఖమ్మం (తల్లాడ) : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో సోమవారం డెంగ్యూ జ్వరంతో అలవాల నరసింహారావు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో నరసింహారావు ఐదు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకిందని తేల్చారు. రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో బతికే అవకాశాలు తక్కువని వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పడంతో సోమవారం ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే నరసింహారావు మృతిచెందాడు. -
డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించొద్దు
తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఏపీఐఐసీ స్థలంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ లైఫ్ సెన్సైస్, వరుణ్ కంపెనీల ఆధ్వర్యంలో అన్నారుగూడెంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బుధవారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలప్పేట గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా వచ్చి అడ్డుకున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్య ప్రభావం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతారని అన్నారు. గో బ్యాక్ డ్రగ్ ఫ్యాక్టరీ అంటూ నినాదాలు చేస్తూ సభావేదిక వద్దకు వచ్చారు. తొలుత సభలోని స్థానికేతరులను బయటకు పంపించాలని పట్టుబట్టారు. ఫ్యాక్టరీ బాధిత ప్రజలకే మాట్లాడే ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు అధికారులు అంగీకరించడంతో వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడారు. అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే ఆ కాలుష్యం పది కిలోమీటర్ల పరిధిలో ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ముఖ్యంగా నాలుగు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఈ ప్రాంతంలో కాటన్ పార్క్ పేరుతో భూములు సేకరించి డ్రగ్ ఫ్యాక్టరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు గోవింద్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులకు అవసరమైన జిన్నింగ్ మిల్ నిర్మిస్తామని చెప్పి రైతుల నుంచి 48 ఎకరాలు సేకరిస్తే చివరకు అది రైతులకు నష్టం కలిగించేదిగా తయారైందని అన్నారు. భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోక పోవటంతో దివాళా తీశారన్నారు. సీపీఎం డివిజన్ కమిటీ సభ్యులు దొడ్డా శ్రీనువాసరావు మాట్లాడుతూ అన్నారుగూడెంలో డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కాళ్లవాపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే భయంలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు ఉపయోగపడే మిల్లుని నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రజల నిరసనల మధ్య ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం అసంపూర్తిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసనాయక్, కాలుష్య నియంత్రణ ఈఈ ఎం.నారాయణ, తహశీల్దార్ టి.సుదర్శన్‌రావు, ఈఓఆర్డీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.