ప్రతీకాత్మక చిత్రం
తల్లాడ : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, ఆమె మరణానికి కారణమైన యువకుడికి ఐదేళ్ల శిక్ష విధిస్తూ సత్తుపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ మారుతీదేవి సోమవారం తీర్పు చెప్పారు. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన దుద్దుకూరి చందర్‌రావు.. చప్పిడి రేణుకను ప్రేమ పేరుతో మోసం చేసి వేరే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు. దీంతో ఆమె మృతి చెందగా 2014లో కేసు నమోదైంది. విచారణ అనంతరం ఐదేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధించారు
Comments
Please login to add a commentAdd a comment