
తలకొరివి పెడుతున్న కుమార్తెలు
తల్లాడ/ఖమ్మం: మండల పరిధిలోని రంగంబంజర ఘటనలో మృతి చెందిన దంపతులకు ఆదివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన మాట వినలేదని, అమెరికా వెళ్లొద్దని జగడం పెట్టుకుని ఈ నెల 3వ తేదీ తెల్లవారు జామున తన భార్య విజయలక్ష్మిని నరికి చంపి, సంక్రాంతి సుబ్రమణ్యేశ్వర్‌రావు అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దంపతులిద్దరూ చిన్న కుమార్తె సునీత దగ్గరకు అమెరికా వెళ్లే విషయంలో ఏకాభిప్రాయం కుదరక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
చిన్న కూతురు సునీత వచ్చే వరకు మృతదేహాలను ఖమ్మం మమత ఆసుపత్రిలో భద్రపర్చారు. ఆదివారం ఆమె రంగంబంజర చేరుకోవడంతో మృతదేహాలను ఖమ్మం నుంచి స్వగృహానికి అంబులెన్స్‌లో తరలించారు. పెద్ద కుమార్తె సరిత తండ్రికి తలకొరివి పెట్టగా, చిన్న కుమార్తె సునీత తల్లి విజయలక్ష్మికి తల కొరివి పెట్టారు. కూతుళ్లు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
చదవండి : (అమెరికా వెళ్తానన్న భార్య.. హత్య చేసిన భర్త)
(భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment