మిట్టపల్లి సమీపంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఎండిన చెట్లు
సత్తుపల్లి : ఖమ్మం–సత్తుపల్లి వరకు రాష్ట్రీయ రహ దారి పక్కన వందల సంఖ్యలో పెద్దపెద్ద వృక్షాలు ఎండిపోయి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి గాలిదుమారానికే విరిగి పడే పరిస్థితిలో ఆ చెట్లు ఉన్నాయి. అసలే వర్షాకాలం అయి నందున ఎప్పుడు చెట్లు పడిపోతాయోనని ప్రయా ణికులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే పలుమార్లు విరిగిపడిన చెట్లతో గంటల తరబడి ట్రాఫి క్ జామ్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ రహదారిపై గంటకు 500లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపాటి అంతరా యం కలిగిన ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు పడా ల్సి వస్తోంది. గత వారంలో వైరా బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ కావడంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
కూలేందుకు సిద్ధంగా ఉన్న వృక్షాలు...:
- ∙తనికెళ్ల వద్ద ఎండిపోయిన చెట్లు విరగటానికి సిద్ధంగా ఉన్నాయి..
- ∙వైరా శివారులోని పాఠశాల వద్ద చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
- ∙తల్లాడ–పినపాక సమీపంలో చెట్లు ఎండిపోయిన ఉన్నాయి.
- ∙తల్లాడ మండలం మిట్టపల్లి శివారులోని చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
- ∙కల్లూరు–హనుమన్‌తండా–కొత్తనారాయణపురం గ్రామాల మధ్య చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
- ∙పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద చెట్లు ఎండిపోయిన ఉన్నాయి.
- ∙వి.ఎం.బంజరు శివారులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
- ∙పెనుబల్లి మండాలపాడులో చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
- ∙కొత్తలంకపల్లి–కిష్టారం మధ్యలో చెట్లు ఎండిపోయి ఉన్నాయి.
ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఈఈ హేమలతను వివరణ కోరగా ఎండిపోయిన చెట్లను తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ఎండిపోయిన చెట్లను తొలగిస్తాం. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment