ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం | RTC Bus And Lorry Accident In Khammam | Sakshi
Sakshi News home page

బస్సులో 30 మంది : తప్పిన పెను ప్రమాదం

Published Sat, Aug 29 2020 4:52 PM | Last Updated on Sat, Aug 29 2020 8:27 PM

RTC Bus And Lorry Accident In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సు డ్రైవర్ క్యాబిన్‌ ఇరుక్కుపోయాడు. ప్రమాదం గమనించిన దగ్గరలోని గ్రామస్తులు అక్కడకు చేరుకొని డ్రైవర్‌ని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ పరిస్థిత కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement