కరాటే పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు
తల్లాడ ఖమ్మం : వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6న జరిగిన రాష్ట్ర స్థాయి షోటోకాన్ కరాటే చాంపియన్ షిఫ్‌లో స్థానిక యూనివర్సల్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుపొందారు. గురు షోటోకాన్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీల్లో స్పారింగ్ విభాగంలో జే.విజయ్, డి.నవీణ్, ఎన్.తరుణ్, బి.అయ్యప్ప, డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుపొందారు.
నాగ చైతన్య, బి.కల్యాణి, డి.వరుణ్, కిషోర్, ప్రజ్ఞాన్, ఆదిత్య ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. కటాస్ విభాగంలో డి.ఉపారాణి, పావని, నాగచరణ్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. కె.మణికంఠ, జే.ముఖేష్, ఎన్.రామ్‌చరణ్, డి.త్రినాగ్‌రెడ్డి, ప్రజ్ఞాన్ ఆదిత్య, బి.రేవంత్, జే.ఉపేందర్ ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకాలను సాధించారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీ.కే.ప్రసన్నన్, డైరెక్టర్ టీ.కే.మేరిసోఫియా, ప్రిన్సిపాల్ జి.రవికాంత్, రాము, ప్రసాద్, యోహాన్, యాకోబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment