ఖమ్మం (తల్లాడ) : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో సోమవారం డెంగ్యూ జ్వరంతో అలవాల నరసింహారావు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో నరసింహారావు ఐదు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు డెంగ్యూ సోకిందని తేల్చారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోవడంతో బతికే అవకాశాలు తక్కువని వైద్యులు కుటుంబసభ్యులకు చెప్పడంతో సోమవారం ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే నరసింహారావు మృతిచెందాడు.