సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం మంజీర నగర్‌కు చెందిన బాలరాజు సోలంకి (40) డెంగీతో మృతి చెందారు. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరం, అస్వస్థతకు గురయ్యారని అతని బంధువులు తెలిపారు. అయితే సంగారెడ్డిలోని పలు ప్రవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. శనివారం ఉదయం చికిత్సి పొందుతూ మృతి చెందాడు. డెంగీతోనే మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారని వారు తెలిపారు.