
న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రమాదవశాత్తు యువకుడు మంజీర నదిలో మునిగి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్‌ఐ సుభాష్ కథనం ప్రకారం మనూర్‌కు చెందిన మారుతి కుమారుడు పండరి(16) అదే గ్రామానికి చెందిన సాయిల్ కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి మంజీర నదికి స్నానానికి వచ్చాడు. ఇద్దరూ స్నానానికి నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు పండరి నీటిలోకి జారిపోయాడు.
దీంతో మిత్రుడు శ్రీనివాస్ భయపడి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇది గమనించిన ఇరుగు పొరుగు వారు పండరిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా పండరి ఆచూకీ లభించలేదు. సుమారు రెండు గంటల తర్వాత పండరి శవమై లభించాడు. మృతుడి తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించారు. మృతుడి తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సుభాష్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment